English | Telugu

నేను చనిపోలేదు...ఇదంతా ఫేక్ న్యూస్...ఇలాంటివి రాయొద్దు అంటూ సన ఫైర్

సీనియర్ నటి షానూర్ సనా బేగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించింది. వెండితెరపై సన సపోర్టింగ్ రోల్స్, తల్లి పాత్రలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు దాదాపు అన్ని సూపర్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపైనా, బుల్లితెర పైనా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సనా. మొదట, ఆమె నాగార్జున సూపర్ హిట్ చిత్రం 'నిన్నే పెళ్లాడతా'తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు సనా తన కెరీర్‌ను విజయవంతంగా నడిపించుకుంటూ వస్తోంది. అంతేకాదు బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘చక్రవాకం’ సీరియల్‌లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన "సిరి సిరి మువ్వలు" సీరియల్‌లో సన కథానాయికగా నటించింది. ఇటీవల, ఆమె యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించి ప్రేక్షకులకు తన అప్‌డేట్‌లను అందిస్తోంది. సనా తన కొడుకును సీరియల్ యాక్టర్ సమీరాకు ఇచ్చి పెళ్లి పెళ్లి చేసింది. ఇక ఈ అత్తా కోడళ్ళిద్దరూ తమ యూట్యూబ్ ఛానెల్‌లో మహిళలకు ఉపయోగకరమైన ఐడియాస్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు.

అలాంటి సన మీద రీసెంట్ కొన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఆమె సూసైడ్ చేసుకుంది అని. దీనిపై సన స్పందించింది.."నేను సూసైడ్ చేసుకుని చనిపోలేదు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇదంతా ఫేక్ న్యూస్..కొన్ని యూట్యూబ్ చానెల్స్ బతికున్న వాళ్ళను చంపేసి రేటింగ్స్ కోసం ట్రై చేస్తున్నాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయొచ్చు కానీ నాకు ఇదంతా టైం వేస్ట్ పని..ఐనా రేటింగ్ రావాలంటే మమ్మల్ని ఇలా చిత్రీకరించొద్దు..కష్టపడి ఏదో ఒకటి చేయండి. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం వలన ఫామిలీలో అందరూ బాధపడతారు. చెడు చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వార్తలు రాయకండి...అలాగే ఎవరూ కూడా నమ్మకండి" అంటూ సన తన యూట్యూబ్ వీడియో ద్వారా అసలు విషయాన్నీ బయట పెట్టారు.