English | Telugu
చిరంజీవి 157 రిలీజ్ డేట్ ప్లానింగ్
Updated : Oct 8, 2023
మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏడాది మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. రీసెంట్‌గా ఆగస్ట్‌లో వచ్చిన బోళా శంకర్ డిజాస్టర్‌గా నిలిచింది. జయాపజయాలు గురించి పట్టించుకునే స్టేజ్‌ను ఆయన ఎప్పుడో దాటేశారు. ఇప్పుడు రెండు సినిమాలను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఒకటేమో ఆయన కుమార్తె సుష్మిత నిర్మాణంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా బోళా శంకర్ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో వెనక్కి వెళ్లింది. అదే సమయంలో బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో లేట్‌గా అనౌన్స్ చేసిన సినిమాను ఇప్పుడు ట్రాక్ ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు మెగాస్టార్.
ఇటీవల చిరంజీవి మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు పూర్తిగా రెస్ట్‌లో ఉంటున్నారు. చాలా ముఖ్యమైన విషయాలైతే తప్ప బయటకు రావటం లేదు. నవంబర్‌లో ఆయన పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధిస్తారని అంటున్నారు. అంటే నవంబర్ నుంచే మెగా 157 స్టార్ట్ అవుతుందని సినీ సర్కిల్స్ అంటున్నాయి. నవంబర్ నుంచి పెద్దగా గ్యాప్స్ తీసుకోకుండా ఫిబ్రవరి నాటికంతా షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్లానింగ్ జరిగింది. సోషియో ఫాంటసీ మూవీ కావటంతో విఎఫ్ఎక్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అందువల్ల ఆరు నెలల పాటు గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. 2025 సంక్రాంతికి మెగా 157ను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా కూడా సోషియో ఫాంటసీ మూవీగానే రూపొంది చిరంజీవి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మెగా 157లో ముగ్గురు హీరోయిన్స్ నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సుష్మిత నిర్మాణంలో చిరంజీవి చేయబోతున్న సినిమా ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.