English | Telugu

బాలయ్యకి రచ్చ రవి దసరా దావత్.. ఇదెక్కడి ప్రేమరా మావ!

నటసింహం నందమూరి బాలకృష్ణకి ఎందరో అభిమానులు ఉన్నారు. వారిలో సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు. కమెడియన్ రచ్చ రవికి బాలయ్య అంటే ఎంతో అభిమానం. తాజాగా 'భగవంత్ కేసరి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రచ్చ రవి స్పీచ్ కి, బాలయ్య మీద చూపించిన ప్రేమకి.. బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా ఫిదా అయ్యారు.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న వరంగల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో రచ్చ రవి స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

"నాకు రాజులు ఎలా ఉంటారో తెలీదు కానీ సినీ పరిశ్రమలో నేను చూసిన రాజు మాత్రం బాలయ్య బాబే. రాజు అంటే రాజ్యం ఉన్నోడో, బలగం ఉన్నోడో కాదు.. ధైర్యాన్ని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, శక్తిని ఇచ్చేవాడు. బాలయ్య ఉంటే ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ ధైర్యంగా ఉంటుంది. బాలయ్య మంచి మనసున్న వ్యక్తి. ఆయన నా రాముడు, నా చిన్ని కృష్ణుడు. మా అమ్మ బాలయ్యని ఇంటికి తీసుకురా తలకాయ కూర వండి పెడదాం అన్నది. బాలయ్య బాబు మన ఇంటికి వస్తాడా అన్న. మా అమ్మ బాలయ్య కోసం తలకాయ కూర, బోటీ కూర అన్నీ వండుకొని వచ్చింది. అన్నకి దసరా దావత్ నాతోనే షురూ" అంటూ రచ్చ రవి తన తల్లిదండ్రులను బాలకృష్ణ దగ్గరకు తీసుకొని వెళ్ళి, బాలయ్య కోసం ప్రత్యేకంగా వండుకొని తెచ్చిన ఫుడ్ ని అందించాడు. ఆ సమయంలో బాలయ్య ఎంతో సంతోషంగా కనిపించాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .