English | Telugu

పిల్ల మొగ్గ.. బాలయ్య గట్టిగా దింపాడు!

నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న భగవంత్ కేసరి మూవీ ట్రైలర్ వచ్చేసింది. రావటమే కాదు ట్రైలర్ ఒక లెవెల్లో ఉండి అక్టోబర్ 19 ముందు రోజు నుంచే భగవంత్ కేసరి సినిమా టిక్కెట్ల కోసం థియేటర్ ముందు అభిమానులు,ప్రేక్షకులు పడిగాపులు కాయటం ఖాయమనే సంకేతాలని కూడా ట్రైలర్ చాలా బలంగానే ఇచ్చింది. నిన్న హనుమకొండ లో రిలీజ్ అయిన ట్రైలర్ ని చూసి నందమూరి అభిమానుల ఆనందానికయితే అవధులు లేవు. ట్రైలర్ లో బాలయ్య యాక్టింగ్ గాని ఆయన నోటి వెంట వచ్చిన డైలాగ్స్ గాని ఆయన అభిమానులకి పూనకం తెప్పించాయి. అలాగే మూవీ లవర్స్ కి కూడా ట్రైలర్ బాగా నచ్చడమే కాకుండా ఖచ్చితంగా భగవంత్ కేసరి మంచి సినిమా అని అనుకునేలా చేసింది.

నువ్వు యాడున్న దమ్ముతో నిలబడాలి అప్పుడు దునియా నీ బాంచన్ అంటుంది అనే తెలంగాణ యాసలో బాలయ్య శ్రీలీల తో చెప్పే మాటతో ట్రైలర్ మొదలయ్యింది. శ్రీలీల ని ఎలాగైనా ఆర్మీ ఆఫీసర్ చెయ్యాలనే పట్టుదలతో బాలయ్య ఉన్నట్టుగా ట్రైలర్ ని ఆసాంతం చూస్తుంటే అర్ధం అవుతుంది. శ్రీలీల కి ఆర్మీ లోకి వెళ్ళడం ఇష్టం లేక పోయిన బాలయ్య ఎందుకు అంత పట్టుబడుతున్నాడు అనే క్యురాసిటి ట్రైలర్ ద్వారా ఆడియన్స్ కి కలిగింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మెయిన్ విలన్ గా కనపడిన ట్రైలర్ లో అర్జున్ రాంపాల్ తన అనుచరులతో నన్ను కొట్టే బలవంతుడ్ని ఆ భగవంతుడు కూడా తేలేడు అని అంటాడు. అప్పుడు దేవుడు ఎవరు ? దేవుడు ఎవరు? ఒక బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆ తండ్రే వంద దేవుళ్ళ లెక్క అని బాలయ్య తన స్టైల్ లో సింహం యొక్క గాండ్రింపుల డైలాగ్ చెప్పటం నిజంగా సూపర్. అలాగే బాలయ్య ఒక రౌడీ ని కొడతాడు.అపుడు ఆ రౌడీ రక్తం బాలయ్య పేస్ మీద పడుతుంది. అప్పడు బాలయ్య తన పేస్ మీద పడ్డ రౌడీ రక్తాన్ని ఆ రౌడీ చొక్కా తోనే తుడుచుకోవడం అయితే గూస్ బ్లంప్స్ తెప్పించేలా ఉంది. రేపు ధియేటర్ లో ఈ ఫైట్ కి బాలయ్య ఫాన్స్ అండ్ సినీ ప్రేక్షకులు పూనకాలు వచ్చిన వారిలా ఉగిపోవడం ఖాయం. అలాగే "చప్పుడు చేయకు పిల్ల మొగ్గ" అని విలన్ కి బాలయ్య ఇచ్చిన మాస్ వార్నింగ్ అదిరిపోయింది.

ఇంక ఈ ట్రైలర్ లో కాజల్ కూడా కనపడింది. కాజల్ బాలయ్య వైఫ్ కావచ్చు.అలాగే భగవంత్ కేసరి మూవీ బలమైన మెసేజ్ తో కూడిన మాస్ మసాలా మూవీ అని అర్ధం అవుతుంది. అలాగే ట్రైలర్ లో బాలయ్య అక్కడ క్కడ చెప్పిన ఉర్దూ మాటలకి తెలుగు ఫినిషింగ్ టచ్ డైలాగ్స్ అయితే సూపర్.. అర్జున్ రాంపాల్ బాలయ్యతో ఇది నీ అడవి కాదు ఇది నా ప్రపంచం అని అంటాడు. అప్పుడు బాలయ్య షేర్ షెహనానా సే షేరి యుత హై బుల్లి నయి బంతారే బుల్లబ్బాయ్ అని అంటాడు. రాబోయే కొన్ని ఏళ్ళ దాక బాలయ్య అభిమనుల నోటి వెంట ఆ డైలాగ్స్ మారుమోగి పోవడం ఖాయం.

అలాగే ట్రైలర్ లాస్ట్ లో ఖైది డ్రెస్ గెటప్ లో ఉన్న బాలయ్య తన లెజెండ్ మూవీలోని నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే అనే పాట పాడుతుంటే కొంత మంది ఖైదీ లు షాక్ తో చూస్తుంటే బాలయ్య వాళ్ళతో ఎలా పాడానురా అని అడిగితే వాళ్ళు డౌట్ గానే బాగా పాడావని అంటారు. అప్పడు బాలయ్య వాళ్ళతో ఎట్లున్న పాడుతా బ్రో ఐ డోంట్ కేర్ అంటాడు

ఓవరాల్ గా భగవంత్ కేసరి మూవీ ట్రైలర్ చూస్తే ఈ మూవీ బాలయ్య కెరీర్ లో ఇంకో సూపర్ హిట్ మూవీ అని అర్ధం అవుతుంది. అలాగే ట్రైలర్ లాంచ్ ఇవేంట్ లో బాలయ్య మాట్లాడినధాన్ని బట్టి ఇందులో కామెడీ కూడా ఒక రేంజ్ లో ఉందని అర్ధం అవుతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి ఫాన్స్ కి ,ప్రేక్షకులకి రేపు ధియేటర్ లో కొత్త అనుభూతిని ఇవ్వడం కోసమే ట్రైలర్ లో కామెడీ పార్ట్ చూపించలేదని అని అర్ధం అవుతుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి ప్రతి సినిమాలోను కామెడీ ఉంటుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంది. శ్రీలీల ని సేవ్ చెయ్యాలనే లక్షం గా బాలయ్య భగవంత్ కేసరి గా ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ భగవంత్ కేసరి అసలు ఎవరు ?అసలు ఆయన కథ ఏంటి ? ఎందుకు శ్రీలీల లైఫ్ కోసం ఆరాటపడు తున్నాడు? వాటన్నిటికీ సమాధానం ఈ నెల 19న తెలుస్తుంది. ఒక్కటి మాత్రం నిజం దసరా పండగ నవరాత్రులు మొత్తాన్ని జనం భగవంత్ కేసరి మూవీ ఆడే థియేటర్స్ లో చేసుకోబుతున్నారని..

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.