English | Telugu

యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు సామాజిక సృహ కలిగిన సినిమా 'గంజామ్'

ఏవిఆర్ ఆర్ట్స్, ఏ.యు & ఐ బ్యానర్స్ పై హీరో త్రిగున్ నటించిన సినిమా గంజామ్. రత్నాజీ నిర్మాత. సురేష్ కుమార్ ఆకిరి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. చిత్ర యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హీరో త్రిగున్ మాట్లాడుతూ... "నేను చేసున్న 23వ సినిమా గంజామ్. నన్ను ఎప్పుడూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు వారికి నా ప్రేత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడికో వెళుతోంది అందులో మేము ఉన్నామని సంతోషంగా ఉంది. మా సినిమా నిర్మాత రత్నజీ గారికి , రఘు కుంచె గారికి అందరూ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరికి కృతజ్ఞతలు. త్వరలో విడుదల కాబోతున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

రఘుకుంచె మాట్లాడుతూ... "సినిమా మీద ప్రేమతో డబ్బు ను సినిమాల్లో పెట్టి గంజామ్ సినిమాను నిర్మించారు నిర్మాత రత్నాజీ గారు. దర్శకుడు సురేష్ గంజాయి మీద చాలా రీసెర్చ్ చేసి సురేష్ ఈ సినిమాను దర్శకత్వం వహించారు. ఎనర్జీ ఉన్న హీరో త్రిగున్ ఈ సినిమాతో మరింత మంచి పేరు తెచ్చుకుంటారు. కథ బలం ఉన్న సినిమాలను ఆడియన్స్ తప్పకుండా ఆధరిస్తారు. గంజామ్ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు.

నిర్మాత రత్నజీ మాట్లాడుతూ... "ఒక మంచి ప్రయత్నం మా గంజామ్ సినిమా. మా ఈ ప్రయత్నాన్ని అందరూ స్వాగతిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూన్నాను" అన్నారు.

డైరెక్టర్ సురేష్ ఏ.కె.ఆర్ మాట్లాడుతూ... "నిర్మాత రత్నాజీ గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలు. హీరో త్రిగన్ గారు చాలా మెచ్యూరిటీతో నటించారు, ఆయనకు ఈ సినిమా మరో మంచి హిట్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. యాక్షన్ , ఎంటర్టైనర్ తో పాటు సామాజిక సృహ కలిగిన సినిమా గంజామ్. రఘు కుంచె గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. త్వరలో విడుదల కానున్న గంజామ్ సినిమా అందరిని ఆలోచింపజేసే సినిమా అవుతుంది" అని తెలిపారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.