English | Telugu
అలాంటి అభిమానులు నాకొద్దంటున్న జగపతిబాబు!
Updated : Oct 8, 2023
హీరో, హీరోయిన్ లకే కాదు విలన్లకి ఫ్యాన్స్ ఉంటారు. అవును నిజమే.. సోను సూద్ సినిమాలల్లో విలన్ రోల్స్ ఎక్కువ చేస్తాడు. కానీ బయట మంచి పనులు చేస్తూ అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే కోవలోకి జగపతి బాబు చేరాడు.
తొంభైల్లో అతని సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫాదర్ రోల్స్, గెస్ట్ రోల్ ఇలా మెల్లి మెల్లిగా విలన్ రోల్స్ చేశాడు. ఇక నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవలో ఇతని నటనకి ఇండస్ట్రీతో పాటు అందరు ప్రశంసలు కురిపించారనే చెప్పాలి. జగపతి బాబు తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నాడు జగపతి బాబు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించాడు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరు గాంచినా కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు. ఉదాహరణకు గాయం, అంతఃపురం, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో అతను పోషించిన పాత్రలు విలక్షణంగా కనిపిస్తాయి.
జగపతిబాబు తన యాక్టింగ్ తో వేలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు. అయితే అందరు ఇతడిని జగ్గుభాయ్ అంటారు. అయితే తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు జగ్గు భాయ్. ఇప్పుడు తాజాగా తన అభిమానులని ఉద్దేశించి ఒక పోస్ట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ పోస్ట్ లో ఏం ఉందంటే.. " నా అభిమానులు నా ఎదుగుదలకి ముఖ్య కారణంగా భావించాను. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైపోయింది. నన్ను ఇబ్బంది పెట్డే పరిస్థితికి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయిన బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే.. ఇక నుండి నా అభిమాన సంఘాలకి, ట్రస్ట్ కి ఎలాంటి సంబంధం లేదు. విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేనెప్పుడు తోడుగా ఉంటాను... జీవించండి, నన్ను జీవించనివ్వండి" అంటూ నా అభిమానులకి మనవి అనే టైటిల్ తో చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.