English | Telugu

పవన్ కొడుకుపై కామెంట్స్..ఇచ్చిపడేసిన రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ విడిపోయారు. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వారు బిజీగా ముందుకు సాగుతున్నారు. అయితే వీరికి పుట్టిన పిల్లల్లో అకీరా నందన్ ఇప్పుడు పెద్దవాడు అవుతున్నాడు. తన సినీ ఎంట్రీ కోసం యావత్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. తాజాగా రేణూ దేశాయ్, అకీరా నందన్ కలిసి యూరప్ లో ఉన్నారు. అంటే వారేమైనా ట్రిప్ కి వెళ్లారనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే అకీరా నందన్, సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు మనవడు అక్కడ ఫిల్మ్ స్కూల్ లో చేరారు. ఈ విషయంపై పవన్ అభిమానులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం ఉంటుందని వారు పేర్కొన్నారు.

అజిత్‌తో లైకాకి ప‌డ‌టం లేదా?

అజిత్ హీరోగా విడాముయ‌ర్చి సినిమాను అనౌన్స్ చేసింది లైకా ప్రొడ‌క్ష‌న్స్. ఈ సినిమాకు మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. తునివు స‌క్సెస్ త‌ర్వాత అజిత్ న‌టించ‌నున్న సినిమా విడా ముయ‌ర్చి. ఈ సినిమా అనౌన్స్ మెంట్ త‌ప్ప, ఇప్ప‌టిదాకా ఇంకే అఫిషియ‌ల్ న్యూస్ రాలేదు. ఈ నేప‌థ్యంలో అజిత్‌కీ, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కీ మ‌ధ్య సంబంధాలు బాగోలేవ‌నే టాక్ న‌డుస్తోంది కోలీవుడ్‌లో. విడా ముయ‌ర్చి సినిమా నుంచి లైకా ప్రొడ‌క్ష‌న్స్ త‌ప్పుకునే ఛాన్సులు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌న్న‌ది చెన్నైలో ప్ర‌చారంలో ఉన్న వార్త‌. షూటింగ్ షెడ్యూల్స్ లో డిలే జ‌రుగుతుండ‌టం లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి న‌చ్చ‌డం లేద‌ట‌. అందువ‌ల్ల‌నే వాళ్లు త‌ప్పుకుంటున్నార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. రానున్న నెల‌ల్లో కూడా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయ‌క‌పోతే, లైకా మ‌రో ఆలోచ‌న లేకుండా ప్రాజెక్ట్ ని షెల్వ్ చేస్తుంద‌నేది వైర‌ల్ న్యూస్‌.