English | Telugu

'చారి 111'లో  కొత్త తరహా స్పై గా వెన్నెల కిశోర్

ఎక్కువ సంఖ్యలో కమెడియన్స్‌ వున్న ఇండస్ట్రీ టాలీవుడ్‌ మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంతమంది కమెడియన్స్‌ ఉన్నా ఎవరి టైమింగ్‌ వారిది, ఎవరి బాడీ లాంగ్వేజ్‌ వారిది. అందర్నీ ఆదరించే తెలుగు ప్రేక్షకులు హాస్యప్రియులనే చెప్పాలి. ‘వెన్నెల’ చిత్రంతో నటుడిగా పరిచయమైన కిశోర్‌ ఆ తర్వాత వెన్నెలని తన ఇంటిపేరుగా మార్చుకొని ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. కమెడియన్‌గానే కాదు, కొన్ని సీరియస్‌ క్యారెక్టర్స్‌ని కూడా అద్భుతంగా పోషించి ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎంతోమంది కమెడియన్స్‌ హీరోలుగా నటించారు. అందులో కొంతమంది సక్సెస్‌ అయ్యారు. కొంతమంది హీరోలుగా నటించి ఆ తర్వాత మళ్ళీ కమెడియన్స్‌గానే కెరీర్‌ని కొనసాగించారు.
తాజాగా ఇప్పుడు వెన్నెల కిశోర్‌ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. టిజి కీర్తికుమార్‌ దర్శత్వంలో బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోని నిర్మిస్తున్న ‘చారి 111’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు వెన్నెల కిశోర్‌. సంయుక్తా విశ్వనాథన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బుధవారం ఈ సినిమాకి సంబంధించి ఎనౌన్స్‌మెంట్‌తోపాటు కాన్సెప్ట్‌ టీజర్‌ను కూడా విడుదల చేశారు. స్పై జోనర్‌లో ‘చారి 111‘ చాలా కొత్తగా ఉంటుందని, ఈ కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని, ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌ ఎంతో సంతృప్తికరంగా ఉందని నిర్మాత అదితి సోని తెలిపారు.