English | Telugu

ఆ మూడు చిత్రాల 'భారీ' నిడివి.. ప్రేక్షకులకు శిరో‘భారం’ కానుందా!?

ఒకప్పుడు వినోదం అంటే కేవలం సినిమానే. రాను రాను వివిధ మాధ్యమాల వల్ల వినోదానికి అవధుల్లేకుండా పోయింది. ఎలాంటి వినోదం అయినా అరచేతిలో ఇమిడిపోవడంతో జనం తమకు అందుబాటులో ఉన్న సాధనంతోనే ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇది సినిమా మీద ఎంతో ప్రభావం చూపిస్తోంది. సినిమాయే ప్రధానంగా ఉన్న రోజుల్లో ఒక్కో సినిమాను దాదాపు మూడు గంటల నిడివితో నిర్మించేవారు. ఎందుకంటే అప్పటి కథలు, కథనం ప్రేక్షకుల్ని కట్టిపడేసేవి. దానికితోడు అప్పటి ప్రేక్షకులకు ఓపిక కూడా ఎక్కువే. అందుకే సినిమా ఎంత నిడివి ఉన్నా భరించేవారు. తర్వాతి రోజుల్లో సినిమా నిడివిని రెండున్నర గంటలకు కుదించారు. ఇక ప్రస్తుతానికి వస్తే రెండు గంటలు, లేదా రెండు గంటల పది నిమిషాలకు మించి సినిమాలను భరించే ఓపిక ప్రేక్షకులకు ఉండడం లేదు. అయినా అడపా దడపా ఎక్కువ లెంగ్త్‌ ఉన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈమధ్యకాలంలో వచ్చిన కొన్ని లెంగ్తీ సినిమాలు కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి. వాటిలో ‘బేబీ’ ఒకటి. ఈ సినిమా నిడివి 2 గంటల 55 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంటల సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేశారు. అలాగే రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమా 2 గంటల 48 నిమిషాలు ఉంటుంది. తెలుగులో ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే.
రాబోయే కొన్ని సినిమాలు కూడా ఎక్కువ నిడివితో ఉండబోతున్నాయి. వాటిలో ఆగస్టు 24న విడుదలవుతున్న దుల్కర సల్మాన్‌ మూవీ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ నిడివి 2 గంటల 56 నిమిషాలు. సెప్టెంబర్‌ 1న విడుదలవుతున్న విజయ్‌ దేవరకొండ న్యూ మూవీ ‘ఖుషి’ 2 గంటల 45 నిమిషాలు. సెప్టెంబర్‌ 7న పలు భాషల్లో విడుదలవుతున్న షారూఖ్‌ ఖాన్‌ మూవీ ‘జవాన్‌’ 2 గంటల 49 నిమిషాలనిడివితో ఉండబోతోంది. ఈ మూడు సినిమాలు సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందడం విశేషం. భారీ నిడివితో వస్తున్న ఈ సినిమాలు ఆడియన్స్‌ని మెప్పిస్తాయా? లేక వారికి శిరో‘భారం’ కానున్నాయా?

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.