English | Telugu
బర్త్ డే గిఫ్ట్.. వెరైటీ టైటిల్ తో వస్తున్న కింగ్
Updated : Aug 22, 2023
దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత 'ది ఘోస్ట్' వంటి డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు. అయితే తమ అభిమాన హీరో సినిమా ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతోంది? అనే విషయంలో అభిమానులు రకరకాల ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. ఇప్పుడా సస్పెన్స్ ని క్లియర్ చేయబోతున్నారు కింగ్ నాగార్జున. ఆగస్టు 29న తన 64వ పుట్టినరోజు జరుపుకోబోతున్న నాగార్జున అదే రోజున తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు. ఆ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వివరాలతో కూడిన షార్ట్ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ సినిమా టైటల్ ని కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకి 'నా సామిరంగా'అనే టైటిల్ నుకన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. కొత్త సినిమా విశేషాల కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులకు నిజంగా ఇది కింగ్ నాగార్జున ఇస్తున్న గిఫ్ట్ అనే చెప్పాలి.