English | Telugu
పవన్ కొడుకుపై కామెంట్స్..ఇచ్చిపడేసిన రేణూ దేశాయ్
Updated : Aug 23, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ విడిపోయారు. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వారు బిజీగా ముందుకు సాగుతున్నారు. అయితే వీరికి పుట్టిన పిల్లల్లో అకీరా నందన్ ఇప్పుడు పెద్దవాడు అవుతున్నాడు. తన సినీ ఎంట్రీ కోసం యావత్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. తాజాగా రేణూ దేశాయ్, అకీరా నందన్ కలిసి యూరప్ లో ఉన్నారు. అంటే వారేమైనా ట్రిప్ కి వెళ్లారనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే అకీరా నందన్, సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు మనవడు అక్కడ ఫిల్మ్ స్కూల్ లో చేరారు. ఈ విషయంపై పవన్ అభిమానులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం ఉంటుందని వారు పేర్కొన్నారు.
అకీరా నందన్ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ కావటంపై ఓ నెటిజన్ సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ ని ఓ ప్రశ్న వేశాడు. అదేంటంటే వారసులకు సినీ ఇండస్ట్రీలో సులభంగా అవకాశాలు వచ్చేస్తాయి. కానీ ఇదెంత వరకు కరెక్ట్ అని? అయితే రేణు సైతం తనదైన స్టైల్లో సదరు నెటిజన్ ప్రశ్నకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిపడేసింది. ''అంబానీ తన కంపెనీని తన వాళ్లకు కాకుండా బయటి వ్యక్తులకు ఇవ్వటం కరెక్ట్ అంటారా? ఇండస్ట్రీలోకి వారసులు సులభంగానే ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వారసులు రావటం గొప్ప కాదు. టాలెంట్ ఆధారంగానే స్టార్స్ అవుతారు. వాళ్లు ఏమాత్రం విఫలమైనా దారుణంగా ట్రోల్స్ చేయటానికి జాలి కూడా చూపించరు'' అని ఆమె పేర్కొన్నారు. ఏ కళ కూడా సులభంగా రాదని చెప్పిన రేణూ దేశాయ్ అకీరా కావాలని అనుకోవటం లేదని, తను పియానో ఎంతో కష్టపడి నేర్చకుంటున్నాడని కూడా తెలిపారు. తను సినిమాల్లోకి రాక ముందు ఇలా విమర్శలు చేయటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.