English | Telugu

అజిత్‌తో లైకాకి ప‌డ‌టం లేదా?

అజిత్ హీరోగా విడాముయ‌ర్చి సినిమాను అనౌన్స్ చేసింది లైకా ప్రొడ‌క్ష‌న్స్. ఈ సినిమాకు మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. తునివు స‌క్సెస్ త‌ర్వాత అజిత్ న‌టించ‌నున్న సినిమా విడా ముయ‌ర్చి. ఈ సినిమా అనౌన్స్ మెంట్ త‌ప్ప, ఇప్ప‌టిదాకా ఇంకే అఫిషియ‌ల్ న్యూస్ రాలేదు. ఈ నేప‌థ్యంలో అజిత్‌కీ, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కీ మ‌ధ్య సంబంధాలు బాగోలేవ‌నే టాక్ న‌డుస్తోంది కోలీవుడ్‌లో. విడా ముయ‌ర్చి సినిమా నుంచి లైకా ప్రొడ‌క్ష‌న్స్ త‌ప్పుకునే ఛాన్సులు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌న్న‌ది చెన్నైలో ప్ర‌చారంలో ఉన్న వార్త‌. షూటింగ్ షెడ్యూల్స్ లో డిలే జ‌రుగుతుండ‌టం లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి న‌చ్చ‌డం లేద‌ట‌. అందువ‌ల్ల‌నే వాళ్లు త‌ప్పుకుంటున్నార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. రానున్న నెల‌ల్లో కూడా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయ‌క‌పోతే, లైకా మ‌రో ఆలోచ‌న లేకుండా ప్రాజెక్ట్ ని షెల్వ్ చేస్తుంద‌నేది వైర‌ల్ న్యూస్‌.

పవన్ కళ్యాణ్‌తో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన సాక్షి వైద్య‌!

ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ డాల్ సాక్షి వైద్య‌. ఈ అమ్మ‌డు ఎన్నో ఆశ‌ల‌తో చేసిన ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌టంతో అమ్మ‌డు నిరాశ‌కు లోనైంది. అదే స‌మ‌యంలో వ‌రుణ్ తేజ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు మూవీ గాండీవ‌ధారి అర్జున నుంచి పిలుపు రావటం న‌టించ‌టం జ‌రిగిపోయాయి. ఇప్పుడీ సినిమా ఆగ‌స్ట్ 25న రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఈ డిల్లీ బ్యూటీ ఏం చేయ‌నుందా? అనే అనుమానాలు చాలానే వ‌చ్చాయి. అయితే వాట‌న్నింటికీ ఆమె రీసెంట్ ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చింది. ఆస‌క్తిక‌ర‌మై విష‌య‌మేమంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్, హరీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు చెప్పింది.

చ‌తుర్వేదాల‌పై సూర్యతో సినిమా!

డిఫ‌రెంట్ సినిమాల‌ను ఎంచుకుని అందుకు అనుగుణంగా త‌న లుక్‌ను మార్చుకుంటూ ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లోనూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న అతి కొద్ది మంది సౌత్ హీరోల్లో సూర్య ఒక‌రు. ఇప్ప‌టికే కంగువా వంటి పీరియాడిక్ మూవీలో ఆయ‌న బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా ఇప్ప‌టికే ఆయ‌న లైన‌ప్‌లో చాలా సినిమాలున్నాయి. అయితే ఈ లిస్టులో మ‌రో సినిమా కూడా చేర‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాను మ‌న టాలీవుడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

యోగి, స‌న్యాసి క‌నిపిస్తే... ట్రోల‌ర్స్‌కి ర‌జినీకాంత్ షాక్‌

సూప‌ర్ స్టార్ అంటే సూప‌ర్ స్టారే అని అంటున్నారు ఆయ‌న అభిమానులు. ఎందుకంటే ర‌జినీకాంత్ మాట‌ల్లో ఓ సెన్సాఫ్ హ్యుమ‌ర్ ఉంటుంది. ఆయ‌న ఏది మాట్లాడినా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడేస్తారు. త‌న‌కు అవ‌గాహ‌న లేక‌పోతే లేద‌ని కూడా ఓపెన్‌గానే అంటారు. ఆయ‌న‌పై రీసెంట్‌గా ట్రోలింగ్ జ‌రిగింది. అందుకు కార‌ణం ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌ట‌మే. దీనికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రాగానే ర‌జినీకాంత్ బీజేపీ పార్టీ స‌పోర్ట‌ర్ అని, త‌న‌కంటే చిన్న‌వాడైన వ్య‌క్తి కాళ్ల‌కు ఎందుకు న‌మ‌స్కారం చేశావ‌ని ... అలా ఇలా అంటూ చాలానే కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ సంద‌ర్భంలో ఆయ‌నేమీ మాట్లాడ‌లేదు.

సీక్వెల్ గురించి హాట్ అప్‌డేట్ ఇచ్చిన ‘గాడ్‌ఫాద‌ర్’ డైర‌క్ట‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సినిమా గాడ్‌ఫాద‌ర్‌. మ‌ల‌యాళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన లూసిఫ‌ర్ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కింది. ఈ సినిమాకు మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులోనూ మంచి పేరే వ‌చ్చింది గాడ్‌ఫాద‌ర్ సినిమాకు. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌, స‌ల్మాన్‌ఖాన్‌, స‌త్య‌దేవ్‌తో డీసెంట్‌గా తీశార‌ని అంద‌రూ మెచ్చుకున్నారు. క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా అంద‌రూ హ్యాపీనే. ఈ సినిమా త‌ర్వాత మోహ‌న్‌రాజా నెక్స్ట్ ఏం చేస్తార‌ని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న నెక్స్ట్ గురించి హాట్ అప్‌డేట్ ఇచ్చేశారు మోహ‌న్ రాజా. త‌న సోద‌రుడు జ‌యం ర‌వి హీరోగా త‌మిళంలో త‌ని ఒరువ‌న్ సినిమాను తెర‌కెక్కించారు మోహ‌న్ రాజా. జ‌యం ర‌వికి జోడీగా ఆ సినిమాలో న‌య‌న‌తార న‌టించారు.

‘భోళా శంక‌ర్’ ఫ్లాప్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ రియాక్ష‌న్‌

అభిమానులు ముద్దుగా రౌడీ స్టార్ అని పిలుచుకునే విజ‌య్ దేవ‌ర‌కొండ రానున్న సెప్టెంబ‌ర్ 1న ఖుషి సినిమాతో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. స‌మంత తెలుగు ప్రమోష‌న్స్ వ‌ర‌కు చేసేసి అమెరికా వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఖుషి ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ అంత‌టినీ విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్ర‌మే చూసుకుంటూ వ‌స్తున్నారు. తాజాగా ఆయ‌న త‌మిళ‌నాడులో త‌న సినిమా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంటున్నారు. అక్క‌డ మీడియా జైల‌ర్ గురించి ప్ర‌శ్నించిన‌ప్పుడు ప‌నిలో ప‌నిగా చిరంజీవి భోళా శంక‌ర్ విడుద‌లై ఫ్లాప్ అయ్యింది. దానికి ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయితే చిరంజీవికి మ‌ద్దుతుగా రౌడీ స్టార్ మాట్లాడిన మాట‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

‘సామజవరగమన’ వివాదం.. కౌన్సిల్ ని ఆశ్రయించిన నిర్మాత

రీసెంట్ గా విడుదలైన ఘన విజయం సాధించిన చిన్న చిత్రాల్లో 'సామజవరగమన' ఒకటి. శ్రీవిష్ణు, రెబా మోనిక జంటగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్ దండ నిర్మించిన ఈ సినిమాకు ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అనీల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరించారు. సినిమా రిలీజ్ తర్వాత వివాదం అల్లుకోవటం కొస మెరుపు. సినిమా నిర్మాత అయిన రాజేష్ దండ తనకు ఉత్తరాంధ్ర ఏరియాలో సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ కలెకన్స్ ను ఇవ్వలేదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను ఆశ్రయించారు. ముందుగా రాజేష్ దండ, వైజాగ్ అసోసియేషన్ ను సంప్రదించారు. అయితే తనకు న్యాయం జరగటం లేదని భావించి ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు.

పుట్టినరోజు సందర్భంగా మెగాభిమానులకు ‘చిరు’ కానుక?

ఎంత టాలెంట్ వున్నా సినిమా రంగంలో హీరోగా నిలదొక్కుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందునా ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా హీరోగా సక్సెస్ అవ్వడం అసాధ్యమనే చెప్పాలి.  అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా దిగ్గజాలుగా చెప్పబడే కొందరు హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో మెరుపుతీగలా వచ్చి మాస్ హీరోకి, కమర్షియల్ హీరోకి కొత్త అర్థం చెప్పారు చిరంజీవి. ప్రాణం ఖరీదు చిత్రంతో పరిచయమైన చిరంజీవి 45 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, మరెన్నో బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు. కమర్షియల్ సినిమా అంటే ఇదీ అని తన సినిమా కలెక్షన్లతోప్రూవ్ చేసారు. కేవలం స్వయంకృషితో హీరోగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన మెగాస్టార్ ఎంతోమందికి  ఆదర్శం.