English | Telugu
అజిత్‌తో లైకాకి పడటం లేదా?
Updated : Aug 22, 2023
అజిత్ హీరోగా విడాముయర్చి సినిమాను అనౌన్స్ చేసింది లైకా ప్రొడక్షన్స్. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తారు. తునివు సక్సెస్ తర్వాత అజిత్ నటించనున్న సినిమా విడా ముయర్చి. ఈ సినిమా అనౌన్స్ మెంట్ తప్ప, ఇప్పటిదాకా ఇంకే అఫిషియల్ న్యూస్ రాలేదు. ఈ నేపథ్యంలో అజిత్‌కీ, లైకా ప్రొడక్షన్స్ కీ మధ్య సంబంధాలు బాగోలేవనే టాక్ నడుస్తోంది కోలీవుడ్‌లో. విడా ముయర్చి సినిమా నుంచి లైకా ప్రొడక్షన్స్ తప్పుకునే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నది చెన్నైలో ప్రచారంలో ఉన్న వార్త. షూటింగ్ షెడ్యూల్స్ లో డిలే జరుగుతుండటం లైకా ప్రొడక్షన్స్ కి నచ్చడం లేదట. అందువల్లనే వాళ్లు తప్పుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. రానున్న నెలల్లో కూడా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయకపోతే, లైకా మరో ఆలోచన లేకుండా ప్రాజెక్ట్ ని షెల్వ్ చేస్తుందనేది వైరల్ న్యూస్.
లైకా ప్రొడక్షన్స్ ఇంతకు ముందు అజిత్‌తో తునివు అనే సినిమా చేసింది. ఆ వెంటనే విఘ్నేష్ శివన్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే విఘ్నేష్ చెప్పిన కాన్సెప్ట్ లైకా ప్రొడక్షన్స్ కి నచ్చలేదు. అందుకే అతనికి బదులుగా, మగిళ్ తిరుమేనిని తీసుకున్నారు. త్వరలోనే షూటింగ్ ఉంటుందని కూడా అన్నారు. హీరోయిన్‌గా త్రిష పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆల్రెడీ అజిత్ త్రిష కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఈ సినిమాలోనూ కలిసి చేస్తే ఇది ఐదో సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు. మధ్యలో త్రిష డ్రాప్ అయ్యారనే వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యాయి. అన్నీ ఇప్పుడు ప్రచారంలో ఉన్న విషయాలేగానీ, విడాముయర్చి గురించి అజిత్ తరఫునగానీ, లైకా తరఫునగానీ, మగిళ్ తిరుమేని తరఫు నుంచిగానీ ఎలాంటి అఫిషియల్ అప్‌డేట్స్ ఇటీవలి కాలంలో లేవు.