English | Telugu
విజయ్‌తో జోడీ కట్టే హీరోయిన్ ఎవరు?
Updated : Aug 22, 2023
విజయ్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతార నటిస్తారా? సమంత రూత్ ప్రభు నటిస్తారా? అనే పుకార్లకు ఇప్పుడు చెక్ పడింది. ఫైనల్‌గా ప్రియాంక మోహన్ పేరు వినిపిస్తోంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన సినిమా లియో. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.
లియో తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తారు దళపతి విజయ్.
ఈ చిత్రంలో ఆయనకు జోడీగా జ్యోతిక నటిస్తారు. ఆమెతో పాటు ప్రియాంక మోహన్ కూడా కీ రోల్ చేస్తారు.
గ్యాంగ్ లీడర్, డాన్, డాక్టర్ సినిమాల నాయికగా మంచి పేరుంది ప్రియాంక మోహన్‌కి. ధనుష్ పక్కన అరుణ్ మాదేశ్వరన్ సినిమా కెప్టెన్ మిల్లర్‌లోనూ నటిస్తున్నారు ప్రియాంక మోహన్. ఈ సినిమాతో పాటు పవన్ కల్యాణ్ ఓజీలోనూ కీ రోల్ చేస్తున్నారు ప్రియాంక మోహన్.
దళపతి 68లో ప్రియాంక మోహన్ నటిస్తున్నారనే విషయం గురించి ఓపెన్ అయ్యారు వెంకట్ ప్రభు. ``నయనతార, కీర్తీ సురేష్, సమంత రూత్ ప్రభు పేర్లు వినిపించాయి. అయితే వాళ్లెవరూ ఈ సినిమాలో నటించడం లేదు. ప్రియాంక మోహన్‌ని ఫిక్స్ చేస్తున్నాం`` అని అన్నారు.
యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.