English | Telugu

‘ఆహా’లో విశ్వక్‌సేన్‌ హోస్ట్‌గా ‘ఫ్యామిలీ ధమాకా’ రియాలిటీ షో

ఫలక్‌నుమా దాస్‌ చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌ ఆ తర్వాత హిట్‌, పాగల్‌, అశోకవనంలో అర్జునకళ్యాణం వంటి సినిమాలతో హీరోగానూ ఎదిగి యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకన్నారు. ఇప్పుడు బుల్లితెర వైపు అడుగులు వేస్తున్నారు విశ్వక్‌. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఒక కొత్త రియాలిటీ షో ‘ఫ్యామిలీ ధమాకా’ పేరుతో చేయబోతోంది. ఈ షోకి హోస్ట్‌గా విశ్వక్‌సేన్‌ వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ఆహా సంస్థ అన్‌స్టాపబుల్‌, సామ్‌జామ్‌, నెంబర్‌ 1 యారీ విత్‌ రానా వంటి రియాలిటీ షో లతో మంచి పేరునే సంపాదించుకుంది. ఇప్పుడు విశ్వక్‌సేన్‌తో చేస్తున్న ‘ఫ్యామిలీ ధమాకా’కి ఎలాంటి క్రేజ్‌ వస్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.