English | Telugu

పవిత్రా లోకేష్ పై నరేష్ తనయుడు కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ నటుడు వి.కె.నరేష్ ఈ మధ్య కాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగు, తమిళంతో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించిన నటి పవిత్రా లోకేష్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. తన మూడో భార్య రమ్యా రఘుపతితో తనకు పొసగటం లేదని, ఆమె తనతో కలిసి ఉండటం లేదని విడాకులకు కూడా అప్లయ్ చేసుకున్నారు. ఈ కేసు కోర్టులో ఉంది. అదే సమయంలో రమ్యా రఘుపతి మీడియాకెక్కి రచ్చ చేసింది. దానికి ప్రతిగా నరేష్, పవిత్రా లోకేష్ సైతం కౌంటర్ ఇచ్చారు. ఇలా కొన్నాళ్లు ఇరువురు మీడియాలో వార్తగా నిలిచారు. ఇప్పుడు పరిస్థితులు సైలెంట్ గానే ఉంటున్నాయి.

6 నెలల తర్వాత మాట్లాడతా..పవన్ పాలిటిక్స్ పై  విష్ణు మంచు కామెంట్స్

మెగా ఫ్యామిలీ, మంచు కుటుంబాల మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తూనే ఉంటుంది. ఒక్కోసారి అది పరిధులను కూడా దాటేస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో మీడియాకు కావాల్సినం ఫీడ్ దొరికేసినట్లే అవుతుంది. మరీ ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య నువ్వా నేనా? అనేలా మాటల యుద్ధం కూడా నడిచిన సంగతి బహిర్గత విషయమే. ఆ ఎన్నికల్లో మంచు ఫ్యామిలీదే పైచేయి అయ్యింది. తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే మోహన్ బాబు, విష్ణు కంటే మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్నమెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్నారు. రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే ఆ విషయాన్ని అవుననక చెప్పదు.