'జిలేబి' పబ్లిక్ టాక్.. 'నువ్వు నాకు నచ్చావ్' దర్శకుడు బాగానే నవ్వించాడు
'స్వయంవరం', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి'.. ఇలా ఒక దశలో వరుస విజయాలతో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు దర్శకుడు కె. విజయ భాస్కర్. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత ఆయన మెగాఫోన్ పట్టి 'జిలేబి' అనే మూవీ తీశారు.