English | Telugu
తెలుగులో ఫస్ట్ టైమ్.. అది ప్రభాస్ "సలార్" కి మాత్రమే సాధ్యమైంది
Updated : Aug 22, 2023
"బాహుబలి" వంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత ప్రభాస్ చేసిన "సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్" ప్రేక్షకుల్ని నిరాశపరచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేస్తున్న "సలార్" పైనే అందరి దృష్టీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన "కెజిఎఫ్" సిరీస్ తరహాలోనే "సలార్" కూడా ఒక డిఫరెంట్ జోనర్ లో ఆడియన్స్ ని థ్రిల్ చెయ్యడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్న "సలార్" కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను ఫస్ట్ టైమ్ ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు తెలుగులో ఐమాక్స్ ఫార్మాట్లో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఆ ఘనత ప్రభాస్ "సలార్" కి దక్కనుంది. వాస్తవానికి "బాహుబలి" చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చెయ్యాలని మొదట ప్లాన్ చేశారు. అయితే రిలీజ్ కి వచ్చేసరికి అది సాధ్యపడకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు మేకర్స్. అయితే "సలార్" నిర్మాతలు మాత్రం ఈసారి పక్కాగా ఐమాక్స్ ఫార్మాట్లో తమ సినిమాను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ భారీ చిత్రం భారీ స్క్రీన్ పై హల్ చల్ చేసేందుకు సిద్ధమవుతోందన్న మాట.