లీడర్ మల్లిగా సుహాస్.. రేంజ్ మరింత పెరిగేనా!
'కలర్ ఫొటో', 'రైటర్ పద్మభూషణ్' వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రతిభ గల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఈ క్రమంలోనే.. సుహాస్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా వస్తోంది. అదే.. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు.