English | Telugu

69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డులు... ఫీల్ అవుతోన్న త‌మిళ తంబీలు

కోలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో తెలియ‌ని బాధ వ‌చ్చింది. అందుకు కార‌ణం 69వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డులే. అవార్డుల‌కు కోలీవుడ్‌కి ఉన్న లింకేంట‌నే సందేహం రాక మాన‌దు. వివ‌రాల్లోకి వెళితే.. గురువారం ప్ర‌క‌టించిన ఈ అవార్డుల వేడుక‌ల్లో తెలుగు సినిమా స‌త్తాను చాటింది. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు అవార్డుల‌ను త‌మ ఖాతాలో వేసుకున్నాయి. కానీ కోలీవుడ్ నుంచి 2021లో విడుద‌లైన జై భీమ్ సినిమాకు బెస్ట్ ఫిల్మ్‌గా అయినా లేక సూర్య‌కు ఉత్త‌మ న‌టుడిగానైనా అవార్డ్ వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఓ విభాగంలోనూ అవార్డ్ రాక‌పోవ‌టం అంద‌రికీ బాధ‌ను క‌లిగించింది...

నేష‌న‌ల్ అవార్డ్స్ .. మెగా హీరోల డామినేష‌న్‌

కేంద్ర ప్ర‌భుత్వం 2021 ఏడాదిగానూ 69వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా ఈసారి తెలుగు సినిమా హవా ఓ రేంజ్‌లో కొనసాగింది. ట్రిపుల్ ఆర్ సినిమా ఏకంగా ఆరు అవార్డుల‌ను సొంతం చేసుకోగా పుష్ప ది రైజ్ సినిమాకు రెండు, కొండ పొలం, ఉప్పెన చిత్రాల‌కు జాతీయ అవార్డులు వ‌చ్చాయి. ఈ అవార్డుల‌పై మెగా హీరోల సినిమాల‌దే డామినేష‌న్ క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంద‌ని కొంద‌రు అంటున్నారు. గ‌మ‌నిస్తే ఆర్ఆర్ఆర్‌లో రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించారు. ఈ సినిమా అయితే ఏకంగా ఆరు అవార్డుల‌ను సొంతం చేసుకుని స‌త్తా చాటింది.