English | Telugu

ముచ్చటగా మూడు సినిమాలు.. ఎవరి అదృష్టం ఎలా ఉందో?

లాక్ డౌన్ తర్వాత సినిమా థియేటర్లకు కలెక్షన్స్ తగ్గాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో ముఖ్యమైన సినిమా, మరెంతో గొప్ప సినిమా అయితే తప్ప ఆడియన్స్ థియేటర్స్ మొహం చూడడం లేదు. ఇదిలా ఉంటే మరో పక్క ఓటీటీ ఫార్మాట్ థియేటర్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది. ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించడానికి మేకర్స్ నానా తిప్పలు పడుతున్నారు. ఈ విషయంలో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరికొందరు చేతులెత్తేస్తున్నారు. కలెక్షన్ల పరంగా ప్రతి వారం సినిమాలకు అగ్నిపరీక్షే అవుతోంది. ఈమధ్యకాలంలో చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈవారం మరో మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
అందులో మొదటి సినిమా వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందిన 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'గరుడవేగ' ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో చేసిన 'ది ఘోస్ట్' ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. 'గద్దలకొండ గణేష్' తర్వాత వచ్చిన 'ఎఫ్3, గని' చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న 'గాండీవధారి అర్జున' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
హీరో కార్తికేయ కెరీర్ లో చెప్పుకోదగ్గ పెద్ద హిట్ 'ఆర్ ఎక్స్ 100'. ఈ సినిమా తర్వాత అతనికి సరైన హిట్ రాలేదనే చెప్పాలి. తాజాగా అతను హీరోగా నటించిన 'బెదురులంక 2012' చిత్రంపైనే హోప్స్ పెట్టుకున్నాడు కార్తికేయ. యుగాంతం కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా కొత్త పాయింట్ తో రూపొందడం, విలేజ్ డ్రామా, హ్యూమన్ ఎమోషన్స్ హైలైట్ గా ఉండడంతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి కూడా మంచి స్పందన రావడంతో సినిమాపై బజ్ ఉంది.
పై రెండు సినిమాల మధ్యలో ఓ డబ్బింగ్ సినిమా కూడా వచ్చి చేరింది. అదే 'కింగ్ ఆఫ్ కొత్త'. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా పూర్తి మాస్ జోనర్ లో రూపొందింది. దుల్కర్ అనగానే లవ్ స్టోరీసే గుర్తొస్తాయి. ఇటీవలికాలంలో కనులు 'కనులను దోచాయంటే, సీతారామం' వంటి హిట్ సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న దుల్కర్ ఈ సినిమాలో ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ కథపై అతనికి ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాకి తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు దుల్కర్. మరి అతని నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందో లేదో చూడాలి. ఇలా ఈ వారం విడుదలవతుున్న మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ లో ఉండడంతో ఈసారి థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడే అవకాశం కనిపిస్తోంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.