English | Telugu

నిత్యమీనన్ మాస్టర్ పీస్ టీజర్ ఎలా ఉందంటే!

ప్రేక్షకుల అభిరుచిని బట్టి కొత్త కంటెంట్ తో సినిమాల కథలని తీసుకొస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు వెండితెర మీద కంటే ఓటిటిల మీద వచ్చే సినిమాలకి, వెబ్ సిరీస్ లకి ఇప్పుడు క్రేజ్ ఉంది. దానిని వినియోగించుకుంటు ఓటిటి వేదికపై క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామాలు  అలరిస్తున్నాయి. అలాంటి కొత్త కథతో నిత్యమీనన్ నటించిన 'మాస్టర్ పీస్' టీజర్ విడుదలైంది. కాగా ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఒక ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కించిన ఈ మాస్టర్ పీస్.. ఫన్, ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్నట్టుగా టీజర్ చూస్తుంటే తెలుస్తుంది.

వ‌రుణ్ తేజ్‌కు అంత స్టామినా ఉందా?

టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. హీరోల‌ను కొత్త‌గా చూపిస్తూనే భారీ బ‌డ్జెట్‌ల‌తో సినిమాలు చేయ‌టానికి మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు రెడీ అయిపోతున్నారు. అయితే దీని కార‌ణంగా ఒక్కోసారి బ‌డ్జెట్ ప‌రిమితులు దాటి పోతుంది. స‌రే ఇప్పుడు ఓటీటీ మార్కెట్ బావుంది. మ‌న మేక‌ర్స్‌కు మంచి అమౌంటే వ‌స్తుంది. మ‌రి మిగిలిన అమౌంట్ థియేట్రిక‌ల్ ర‌న్ రూపంలో రావాల్సిందే. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ గుర్తు పెట్టుకుని సినిమా చేస్తే మంచిదే. ఏ మాత్రం తేడా కొట్టినా నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌ష్టాల‌ను చ‌వి చూడాల్సిందే. అఖిల్.. ఏజెంట్, చిరంజీవి.. భోళా శంక‌ర్ సినిమాల విష‌యంలో ఈ విష‌యం స్పష్ట‌మైంది.

ఎన్టీఆర్‌తో మోక్ష‌జ్ఞ‌.. ఫొటో వైర‌ల్‌

నంద‌మూరి న‌ట వార‌సులు ఒకే ఫ్రేమ్‌లోక‌నిపిస్తే ఎలా ఉంటుంది. అభిమానుల‌కు పండ‌గేన‌ని చెప్పాలి. ఇప్పుడ‌దే జ‌రుగుతుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఒకే ఫొటోలో క‌నిపిస్తున్నారు. ఆదివారం హైద‌రాబాద్‌లో ఉండే నంద‌మూరి సుహాసిని కుమారుడు వివాహం జ‌రిగింది. ఈ వేడుక‌కి ఫ్యామిలీ అంతా హాజ‌రైంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌, మోక్ష‌జ్ఞ‌, క‌ళ్యాణ్ రామ్‌లు సెంట‌రాఫ్ ది ఎట్రాక్ష‌న్ అయ్యారు. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి బాల‌కృష్ణ కూడా హాజ‌ర‌య్యారు. బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్  కూడా క‌లుసుకున్న‌వీడియో కూడా వైర‌ల్ అవుతుంది. దీంతో పాటు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌, మోక్ష‌జ్ఞ క‌లిసి ఉన్న ఫొటో కూడా వైర‌ల్ అవుతుంది.

‘గుంటూరు కారం’ రిలీజ్ డేట్‌పై మ‌హేష్ క్లారిటీ

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై కొత్త షెడ్యూల్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఇంకా సినిమా షూటింగ్ 80 రోజుల మేర‌కు పూర్తి చేయాల్సి ఉంద‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌. దీంతో సినిమా షూటింగ్‌ను ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఎప్పుడు పూర్త‌వుతాయో అనే దానిపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో సందేహాలు మొద‌ల‌య్యాయి. దీంతో కొంద‌రు ‘గుంటూరు కారం’ సినిమా రాబోయే సంక్రాంతికి కూడా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంద‌రూ అంటున్నారు. నెట్టింట జోరుగా వినిపిస్తోన్న ఈ వార్త‌ల‌పై మేక‌ర్స్ ఏమీ రియాక్ట్ కావ‌టం లేదు.