షారుఖ్‌ని ఫాలో అవుతున్న దళపతి
దళపతి విజయ్ ఇప్పుడు షారుఖ్ ఖాన్‌ని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్నారు షారుఖ్ ఖాన్. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియామణి, దీపిక పదుకోన్ కీ రోల్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7న విడుదలకు సిద్ధమవుతోంది జవాన్. ఈ సినిమా నుంచి మల్టీఫేసెటెడ్ పిక్ రిలీజ్ చేశారు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్. ఈ చిత్రంలో విజయ్ కీ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఉన్నా, లేకపోయినా, ఒక్క విషయంలో మాత్రం సీరియస్‌గా షారుఖ్ ని ఫాలో అవుతున్నారు దళపతి విజయ్. అయితే షారుఖ్‌లాగానే కమల్‌హాసన్ కూడా ప్రయత్నించారని,వాళ్లిద్దరినీ విజయ్ ఫాలో అవుతున్నారని కొందరి చర్చ.