English | Telugu

లైగ‌ర్ బ్యూటీని చేసుకోవాలంటే... ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే!

లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండేని చేసుకోబోయే వ్య‌క్తికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలుసా? ఇప్ప‌టిదాకా ఎవ‌రికీ తెలియ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. ఇప్పుడు ఆవిడే స్వ‌యంగా చెప్పేసింది కాబ‌ట్టి తెలుసుకోవ‌డం బెట‌ర్‌. అన‌న్య చెప్పిన లిస్టును విన్న‌వాళ్లంద‌రూ, ఏవండోయ్ ఆదిత్య రాయ్ క‌పూర్‌గారూ ఇది విన్నారా అంటూ కామెంట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అన‌న్య పాండే మాట్లాడుతూ ``నాకు కాబోయే వాడి కోసం పెద్ద చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అత‌ను చాలా ద‌య‌గ‌ల వాడై ఉండాలి. ప్రేమ‌గా చూసుకోవాలి. మా నాన్న‌లాగా స‌ర‌దాగా ఉండాలి. నా దృష్టిలో మా నాన్న ది బెస్ట్ ప‌ర్స‌న్‌. అందుకే రాబోయే వ్య‌క్తి కూడా మా నాన్న‌లాంటివాడై ఉండాలి. అంత‌కు మించి నేను ఇంకేమీ కోరుకోను`` అని అన్నారు. ఆదిత్య రాయ్ క‌పూర్‌తో అన‌న్య పాండే డేటింగ్ చేస్తున్నార‌నే వార్త‌లు ఎప్ప‌టి నుంచో వ‌స్తున్నాయి. అయితే అవేమీ త‌న ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేయ‌వ‌ని అంటున్నారు అన‌న్య పాండే. లాస్ట్ ఇయ‌ర్ ఒక్క రిలీజ్ కూడా లేదు ఈ మేడ‌మ్‌కి.

ప్రొఫెష‌న‌ల్‌గా వ‌రుస‌గా ప్రాజెక్టులు ఉంటే, జ‌నాల‌కు ప‌ర్స‌న‌ల్ లైఫ్ మీద పెద్ద ఫోక‌స్ ఉండ‌దని, త‌న కెరీర్‌లో లాస్ట్ ఇయ‌ర్ రిలీజులు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఎక్కువ‌గా టార్గెట్ చేశార‌ని అన‌న్య పాండే ఫీలింగ్. ఇదే విష‌యాన్ని చెబుతూ ``మాట్లాడుకోవ‌డానికి ఏ విష‌యాలూ లేన‌ప్పుడే నేనేం చేస్తున్నాను, ఎటెళ్తున్నాను, ఎవరితో ఉన్నాను అనే వాటి మీద దృష్టి పెడుతుంటారు జ‌నాలు. అదే వ‌రుస‌గా నా ప్రాజెక్టులు ఉంటే, వాటి గురించి రాయ‌డానికి స‌రిపోతుంది`` అని అన్నారు. ఇటీవ‌ల ఆదిత్యరాయ‌కపూర్‌తో క‌లిసి పోర్చుగ‌ల్ వెళ్లొచ్చారు అన‌న్య‌.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.