English | Telugu

ఆ సినిమా ఫ్లాప్‌ అయినా సాక్షికి ప్లస్‌ అయింది

సినిమా రంగంలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ తమలోని టాలెంట్‌ కంటే అదృష్టాన్నే ఎక్కువ నమ్ముతారు. అదే నిజమని చాలా సందర్భాల్లో ప్రూవ్‌ అయింది కూడా. జయాపజయాలతో సంబంధం లేకుండా వరసగా అవకాశాలు అందిపుచ్చుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. అయితే అది అందరి విషయంలో జరగాలని లేదు. ఇటీవలికాలంలో అలాంటి అదృష్టం హీరోయిన్‌ సాక్షివైద్యకి దక్కింది. అఖిల్‌ అక్కినేని హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అనిల్‌ సుంకర నిర్మించిన ‘ఏజెంట్‌’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో అఖిల్‌కి, సురేందర్‌రెడ్డికి బ్రేక్‌ పడిరది. ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్‌ చెయ్యలేదు. కానీ, సాక్షి వైద్య మాత్రం దానికి భిన్నంగా చాలా సినిమాలు సైన్‌ చేస్తోంది. ఏజెంట్‌ సినిమా ప్రొడక్షన్‌ లో ఉన్నప్పుడే వరుణ్‌ తేజ్‌ సినిమా ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా ఈ వారమే రిలీజ్‌ కాబోతోంది. ఈలోపే మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది.

సాయితేజ్‌ హీరోగా నటించే కొత్త సినిమాలో సాక్షి హీరోయిన్‌గా ఓకే అయింది. ఇటీవలే ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. అలాగే పవన్‌కళ్యాణ్‌, హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందే ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రంలోనూ సాక్షి హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా తెలియజేస్తూ పవన్‌కళ్యాణ్‌ సినిమాలో నన్ను హీరోయిన్‌గా తీసుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఈ సినిమాలో నాతోపాటు శ్రీలీల కూడా నటిస్తోంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే రవితేజ హీరోగా నటించే కొత్త సినిమాలో సాక్షి హీరోయిన్‌గా బుక్‌ అయింది.