వలంటీర్ల పై రచ్చ.. తెలుగుదేశంకు లాభించిందా?

పవన్ కల్యాణ్ వలంటీర్లపై  చేసిన వ్యాఖ్యలు రాజకీయ హీట్ ను విపరీతంగా పెంచేశాయి. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల రచ్చ.. జనసేన, వైసీపీల మధ్య మాటల రణాన్ని పీక్స్ కు తీసుకు వెళ్లింది. ముఖ్యమంత్రి జగన్ కూడా హోదాను తగ్గించుకుని మరీ బూతు పురాణాన్ని విప్పేశారు. మొత్తంగా ఏపీలో రాజకీయ వాతావరణం అంతా జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోయింది. దీంతో పొలిటికల్ ఫైట్  జనసేన, వైసీపీల మధ్యే అన్నట్లుగా సీన్ మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ను తగ్గించేందుకు బీజేపీ అనుసరించిన వ్యూహమే ఇక్కడ ఆ పార్టీ ప్రోత్సాహంతో, ప్రమేయంతో జగన్ అనుసరించి తెలుగుదేశం పెద్దగా వార్తలలో నిలవకుండా నియంత్రించేందుకు అమలు చేశారని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి పై నుంచి చూసే వారికి కూడా నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం, వైసీపీల మధ్యే పోరు అన్నట్లుగా ఉన్న వాతావరణం పవన్ కల్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్రలో భాగంగా స్వరం పెంచి అధికార పార్టీపై విమర్శల దాడిని, వేడినీ పెంచారో అప్పటి నుంచీ సీన్ మొత్తం పవన్ వర్సెస్ జగన్ అన్నట్లుగా మారిపోయింది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విమర్శలతో మొదలు పెట్టి.. వాలంటీర్లపై వ్యాఖ్యల దాకా పవన్ అధికార వైసీపీని, జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేసి పొలిటికల్ మైలేజ్ సంపాదించేశారని అనిపించే పరిస్థితి నెలకొంది. పవన్ కల్యాణ్, జగన్ ల మాటల యుద్ధం వెనుక ఉన్నది బీజేపీ వ్యూహమన్నది పరిశీలకుల విశ్లేషణ కాగా, ఆ వ్యూహం కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం వెనుకబడిందన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని వైసీపీ, జనసేన వర్గాలే చెబుతున్నాయి. పొలిటికల్ హీట్ పెరిగేలా జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే.. ఆ రచ్చలో వేలు పెట్టకుండా తెలుగుదేశం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం అవుతోందని  అంటున్నారు. ఎ న్నికలలో సత్ఫలితాలు సాధించేందుకు మిగిలిన అన్నివిషయాల కంటే అత్యంత ప్రధానమైనది క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం అయ్యే చర్యలు చేపట్టడమేనన్నది అందిరికీ తెలిసిన విషయమే. అయితే తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో పడేయాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ ఆ పనిని వదిలేసి తమ ప్రధాన ప్రత్యర్థి జనసేన మాత్రమేనని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతూ వ్యూహాలను అమలు చేస్తున్నది. ఈ వ్యూహాలకు బీజేపీ అన్ని విధాలుగా అండదండలు అందించడమే కాకుండా.. తన మిత్ర పక్షమైన జనసేనను కూడా ఆ వ్యూహంలో భాగం చేసింది. అలా చేయడం ద్వారా తెలుగుదేశంను దెబ్బకొట్టగలిగామని సంబరపడుతోంది. అయితే వాస్తవానికి వాలంటీర్లపై రాజకీయ రచ్చ తెలుగుదేశం పార్టీకే లాభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన, వైసీపీ శ్రేణుల నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తులుగుదేశం పార్టీని విస్మరించి వైసీపీ చేస్తున్న విమర్శల ఆస్త్రాలన్నీ తెలుగుదేశం చాపకింద నీరులా విస్తరించేందుకు, క్షేత్రస్థాయిలో బలపడేందుకు దోహదపడుతోందని చెబుతున్నారు. 

తెలంగాణ బిజెపీ నేతలతో కీలక సమావేశం

తెలంగాణలో బిజెపీ అధ్యక్షుడి మార్పు తర్వాత ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేంద్ర నాయకత్వం కార్యకర్తల్లో జోష్ నింపడానికి సిద్దమైంది. నిన్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటన అధిష్టానానికి చురకలు అంటించే విధంగా ఉండటంతో శనివారం బిజెపి నేతలతో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. శనివారం ఉదయం బీజేపీ నేతలతో రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌లు ప్రకాశ్ జవదేకర్, సహా ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతనికి తీసుకోవాల్సిన చర్యలపై నేతల నుంచి అభిప్రాయాన్ని సేకరించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతల సూచనలు, సలహాలను ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ తీసుకుంటున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ జడ్పీ చైర్మన్స్, మాజీ మేయర్స్, పార్టీలో రిటర్ మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులు హాజరయ్యారు. మరికాసేపట్లో సమావేశనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.

మోడీని టార్గెట్ చేస్తూ సిద్ద రామయ్య అస్త్రాలు

 ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల వల్లే రాష్ట్రాలు దివాళా తీస్తున్నాయంటూ మోడీ సర్కార్ చేస్తున్న ప్రచారాన్ని విమర్శలను బీజేపీ యేతర పార్టీలు తప్పుపడుతున్నాయి. మోడీ విధానాల కారణంగానే రాష్ట్రాలు దివాళా బాట పడుతున్నాయని ఎదురు దాడికి దిగుతున్నాయి. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల ఆదాయాన్ని కుదించేసే విధానాలను మోడీ సర్కార్ అవలంబిస్తోందని దుయ్యబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రీతిన మోడీ సర్కార్ పై విరుచుకుపడింది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య  మోడీని టార్గెట్ చేస్తూ అస్త్రాలను సంధించారు.  దేశం దివాళా తీసింది రాష్ట్రాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో కాదని, ప్రధాని నరేంద్రమోదీ చేసిన అప్పులతోనే అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్థికమంత్రి హోదాలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎం సిద్దరామయ్య విధానపరిషత్‌లో సమగ్ర వివరణ ఇచ్చారు. శుక్రవారం కార్యకలాపాల చివరిరోజు బడ్జెట్‌పై ముఖ్యమంత్రి రెండున్నర గంటలకుపైగా ప్రసంగించారు. ప్రతిపక్ష సభ్యులు లేక, ప్రశ్నించేవారు లేక ఉత్సాహమే లేదన్నారు. రాష్ట్రంలో మూడున్నరేళ్ల బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో తొమ్మిదేళ్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనపై ప్రతి అంశంలోనూ విరుచుకుపడుతూ వచ్చారు. సోషలిజానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. వారికి నిప్పు పెట్టడమే పని అన్నారు. ప్రజల జేబు నుంచి చాకచక్యంగా డబ్బులు దోచేయడంలో వారే ప్రముఖులన్నారు. ప్రజా సమస్యలపై సభలో ప్రతిపక్ష సభ్యులు నిలదీయాలని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలన్నారు. కానీ ప్రతిపక్షనేతను ఎంపిక చేయడంలో విఫలమైన బీజేపీ సభకు గైర్హాజరైందన్నారు. బడ్జెట్‌పై పరిషత్‌లో 15మంది సభ్యులు మాట్లాడితే అందులో 10 మంది కాంగ్రె్‌సవారే ఉన్నారని, ఇరువురు బీజేపీ, ముగ్గురు జేడీఎస్‌ సభ్యులు ఉన్నారన్నారు. అందులోనూ జేడీఎస్‌ మరితిబ్బేగౌడ, బీజేపీ విశ్వనాథ్‌ సాంకేతికంగా మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతున్నారన్నారు. బడ్జెట్‌లో చర్చించి పేదలకు అనుకూలమయ్యే సలహాలు ఇవ్వడం ప్రతిపక్షాల బాధ్యత అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అప్పులు చేసి దివాళా తీయించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదు గ్యారెంటీలు ప్రకటిస్తే దివాళా తీస్తుందని ప్రధాని ఆరోపించారన్నారు. 2014-15 నాటికి కేంద్రం చేసిన అప్పులు రూ.5.31 లక్షల కోట్లు కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పులను తొమ్మిదేళ్లలో రూ.17 లక్షల కోట్లకు పెంచారన్నారు. దీన్నిబట్టి 11.8 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఇది మోదీ సాధన అని, దేశానికి కానుక అన్నారు. కర్ణాటకలో 2018 వరకు 2.45 లక్షల కోట్లు అప్పుగా ఉండేదని, గత ఐదేళ్లలో 5.71 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 2013 - 18 మధ్యకాలంలో 1.16 లక్షల కోట్లు అప్పు చేశామని, ఇటీవల బీజేపీ 2.30 లక్షలకోట్లు అప్పు చేసిందన్నారు. అయినా ఎక్కడా అభివృద్ధి అమలు చేయలేదన్నారు. ప్రధానమంత్రి కార్పొరేట్‌ బిజినెస్‌ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి తగ్గించారని, తద్వారా ఏటా 2 లక్షల కోట్లు కేంద్రానికి నష్టమన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్‌ దిగ్గజాలకు 12 లక్షల కోట్ల రుణమాఫీ చేశారన్నారు. పేదలు, రైతులు, కార్మికులు, రైతు కూలీలకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ధరలు ఆకాశాన్నంటాయి నిత్యావసర ధరలు పెరిగేందుకు మూలకారణమైన పెట్రోల్‌ ఉత్పత్తులు, వంట గ్యాస్‌ ధరలను అమాంతంగా పెంచారని సీఎం సిద్దరామయ్య అన్నారు. 2011-12లో బ్యారెల్‌ ముడిచమురు 125.45 డాలర్లుగా ఉండేదని, అప్పుడు పెట్రోల్‌ రూ.45గా ఉండేదని 2016లో రూ.46.17 డాలర్లకు తగ్గిందని ప్రస్తుతం 79 డాలర్లుగా ఉందని అయినా పెట్రోల్‌ లీటరు రూ.102గా ఉందన్నారు. ఎక్సైజ్‌ డ్యూటీని భారీగా విధించడంతోనే సామాన్యులకు కష్టం వచ్చిందన్నారు. దేశంలో సెస్సు, సర్‌ చార్జీలు కర్ణాటక నుంచి అత్యధికంగా కేంద్రానికి వెళ్తున్నా రాష్ట్రవాటా ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కర్ణాటకకు నిరంతరంగా అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రానికి రూ.5,495 కోట్లు రాకుండా రాష్ట్రం నుంచి ఎంపీగా కొనసాగుతున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అడ్డుకున్నారని ఆరోపించారు. 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఒక్కరూ రాష్ట్ర వాటా గురించి పార్లమెంటులో లేవనెత్తలేదని, ప్రధాని వద్ద ప్రస్తావించలేదన్నారు. డబుల్‌ ఇంజన్‌ కాస్త ట్రబుల్‌ ఇంజన్‌గా మారి డబ్బా ఇంజన్‌ అయిందని ఎద్దేవా చేశారు. గ్యారెంటీలతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతను ఇస్తున్నామన్నారు. గృహజ్యోతి ద్వారా విద్యుత్‌ బిల్లుల ఆదా, శక్తి గ్యారెంటీ ద్వారా ఉచిత ప్రయాణం, గృహ లక్ష్మి ద్వారా నిత్యావసర వస్తువుల ధరలకు కొంత ఉపశమనం, అన్నభాగ్య ద్వారా 4.42 కోట్ల మంది కడుపు నింపుకొనే సౌలభ్యం కల్పించామన్నారు. గ్యారెంటీలు అమలు చేయడం ద్వారా పేద వర్గాల వద్ద నగదు బదిలీ అవుతుంటుందని, తద్వారా జీడీపీ పెరుగుతుందన్నారు.

బియ్యం బాబోయ్ బియ్యం.. అమెరికాలో ఎన్నారైల గాభరా

బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం  విధించిన నిషేధం అమెరికాలోని ఎన్నారైల పై తీవ్ర ప్రభావం చూపింది.  రా రిటైల్‌ ధరలనునియంత్రించి దేశీయంగా సరఫరాను పెంచడానికి భారత ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తే.. ఆ ప్రభావం ఒక్క సారిగా అమెరికాలో  నివసిస్తున్న ఎన్నారైలపై పడింది. ఇక్కడ ఇలా నిషేధ ప్రకటన వెలువడిందో లేదో.. అమెరికాలోని ఎన్నారైలు బియ్యం కోసం దుకాణాల ముందు బారులు తీరారు. ఒక్క సారిగా భారత స్టోర్ట్స్ వద్ద రద్దీ పెరగడంతో తోపులాటలు సైతం జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాకుండా భారత్ లో నిషేధం ప్రకటేన వెలువడగానే డిమాండ్ ను ఊహించిన వ్యాపారులు అమెరికాలో బియ్యం ధరలను ఒక్క సారిగా పెంచేశారు. ఈ మేరకు  ఆయా దుకాణాల వద్ద బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే వాస్తవానికి  భారత్ నిషేధం విధించినది బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను మాత్రమే.  బాస్మతి బియ్యం ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఎగుమతి అయ్యే బియ్యంలో బాస్మతీ బియ్యానిదే అధిక వాటా.  బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు పాతిక శాతం మించి ఉండవు.  బాస్మతీ బియ్యం ఎగుమతుల విషయంలో ఎటువంటి ఆంక్షలూ లేవని భారత ప్రభుత్వం స్పష్టం చేసినా అమెరికాలోని ఎన్నారైల్లో ఈ స్థాయిలో ఆందోళన వ్యక్తమౌతుండటం విశేషం. అసలు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడానికి ముందుగానే.. భారత్ నుంచి అటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాతో ఎన్నారైలు పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్లే ప్రస్తుతం అమెరికాలో బియ్యానికి కొరత ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఇండియాలో బియ్యం ఎగుమతులపై నిషేధం ప్రకటన అమెరికాలోని ఇండియన్లలో గాభరా పెంచింది. అదే సమయంలో అక్కడ బియ్యం ధరలకు ఒక్క సారిగా రెక్కలు రావడానికి కారణమైంది. 

 తెలుగు రాష్ట్రాలకు తొలగని వరుణ గండం

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లో లెవల్‌ వంతెనలపై వరదనీరు పొంగి పోర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల్లోకి ఎగువ నుంచి పెద్దమొత్తంలో వరద పొటెత్తుతున్న కారణంగా ఆ ప్రాజెక్టుల పరిస్థితి టెన్షన్‌గా మారుతోంది. అయితే గోదావరి నది మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే మళ్లీ వర్ష సూచన. కాగా.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కారణం క్యుములోనింబస్ మేఘాలు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు చాలా ఫాస్ట్‌గా కదులుతూ ఉంటాయి. వీటి వల్ల ఇంకో ఇబ్బంది ఏంటంటే.. ఉరుములు, మెరుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పిడుగు పాటుకు అవకాశం ఎక్కువ. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే భారత వాతావరణ విభాగం  మరో పిడుగులాంటి వార్తను అందించింది. తెలుగు రాష్ట్రాలకు హై అలెర్ట్ ప్రకటించింది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 24న మరో అల్ప పీడనం పొంచి ఉందని తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ జారీ చేసిన అలెర్ట్ లకు సంబంధించి అవగాహనా చాలామందికి ఉండదు.  ప్రస్తుతానికి ఆరెంజ్, రెడ్, యెల్లో, గ్రీన్ అలర్ట్ లను వాతావరణ శాఖ జారీ చేస్తోంది. ఈ అలర్ట్ లను 1875వ సంవత్సరంలో బ్రిటీష్ పాలకులు తొలుత  జారీ చేశారు.ఇలాంటి  సూచనలు బట్టే ప్రజలు అప్రమత్తమవుతారు.   ఎల్లో అలర్ట్ అంటే... ఈ రంగు వాతావరణాన్ని 'చూడండి' అని చెబుతుంది మరియు నిర్వాహకులను 'అప్‌డేట్ అవ్వండి' అని పిలుస్తుంది. ఇది వాతావరణ మార్పులతో ముడిపడి ఉంది, ఇది ప్రస్తుతం తక్కువ హానిని కలిగిస్తుంది కానీ ప్రభావం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఉరుములు, భారీ వర్షాలు, బలమైన గాలులు, వేడి లేదా శీతల అలలు, మరియు సముద్రపు  విపత్కర పరిస్థితులు వంటి అంశాలు హెచ్చరికకు దారితీస్తాయి. ఆరెంజ్ అలెర్ట్  ఇది చాలా భారీ వర్షపాతం, తీవ్రమైన వేడి లేదా చలిగాలులు లేదా ప్రభావవంతమైన తుఫాను వచ్చినప్పుడు ఇటువంటి హెచ్చరికలు జారీ చేయబడతాయి. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి.  వారి ప్రాంతం ఈ హెచ్చరిక కేటగిరీ కిందకు వస్తే బయటకు వెళ్లే ముందు బాగా ప్లాన్ చేసుకోవాలి.  రెడ్ అలర్ట్ అంటే... రెడ్ అలెర్ట్ అనగానే జాగ్రత్తగా ఉండండి అని అర్థం. లేదా సంసిద్దంగా ఉండండి అని అర్థం.  గ్రీన్ అలెర్ట్ అంటే.. ఇది 'హెచ్చరిక లేదు'ని సూచిస్తుంది ఎటువంటి 'చర్య అవసరం లేదు' అని అర్థం. రోజులు  ఆహ్లాదకరంగా గడుస్తాయి.  ఈ ప్రాంతంలోన రోజువారీ జీవితంలో వాతావరణ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది.  హైదరాబాద్ లో మరో ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ  హెచ్చరించింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వర్షానికి అవకాశముందని, ఈ మూడు జిల్లాల ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జలమండలి తాగునీటి సరఫరా, నాణ్యతపై దృష్టి సారించింది. నగరంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది.  మరో రెండు రోజుల్లో అల్పపీడనం పొంచి ఉండటంతో తెలంగాణా సర్కార్ అప్రమత్తమైంది. అధికారులకు మంత్రి తలసాని ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల వర్షాలకే ఉభయ రాష్ట్రాలు అతలాకుతలం కావడంతో పాలకులు మరింత అప్రమత్తమయ్యారు.  హుస్సేన్ సాగర్ కు భారీ వరద నీరు వస్తోందని, ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు. భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ ను దాటింది. ఫుల్ ట్యాంక్ లెవ‌ల్ సామ‌ర్థ్యం 513.45 మీట‌ర్లు కాగా, 514.75 మీట‌ర్లను దాటింది. దీంతో దిగువ‌కు నీరు విడుద‌ల చేస్తున్నారు.

రైల్వే స్టేషన్లలో రూ.20 నాణ్యమైన భోజనం

జనరల్‌ బోగీల్లోని ప్రయాణికుల కోసం తక్కువ ధరకే భోజనం, తాగునీటిని అందించే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. నాలుగు స్టేషన్ల పరిధిలో దీనిని ఇప్పటికే అమలులోకి తీసుకు వచ్చింది.    తొలి దశలో హైదరాబాద్‌, విజయవాడ, గుంతకల్‌, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. ఆయా స్టేషన్లలో  రూ.20, రూ.50కే నాణ్యమైన ఆహారం లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. ఇందులో భోజనాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి క్యాటగరిలో   7పూరీలతో పాటు ఆలు కూర, పచ్చడిని  ఇరవై రూపాయలకే అందిస్తారు. ఇక రెండో క్యాటగిరీలో అన్నం,  చిడీ,ఛోలే-కుల్చే,ఛోలే-భటూరే,పావ్‌ భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని ఎంచుకోవచ్చు.దీని ధరను  50 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే 200 మిల్లీలీటర్ల ప్యాకేజ్డ్‌ వాటర్‌ గ్లాసులను ఆయా కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచుతారు.  

స్పీడ్ న్యూస్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 1. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది.  ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నభక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయటి వరకూ క్యూలైన్ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ............................................................................................................................................................ కాంగ్రెస్ లో  గ్రూపు తగాదాలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం   2. కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలున్నాయంటూ బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయిందన్న పొంగులేటి ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పారు. ......................................................................................................................................................... మోకాలి నొప్పికి రాహుల్ ఆయుర్వేద చికిత్స   3. మోకాలి సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. గురువారం  కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంత్యక్రియల్లో పాల్గొన్న తరువాత  శుక్రవారం ఆయన మళపురం జిల్లా కొట్టకల్‌లోని ఆర్య వైద్యశాలను సందర్శించారు. ............................................................................................................................................. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి 4. ప్రకాశం జిల్లా   కొనంకిలో  ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు మరణించారు. మరొకరు గాయపడ్డారు.  పాల ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ............................................................................................................................................... ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు: వెలగపూడి 5. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని పేర్కొన్నారు.  శాఖ కలెక్టర్, రిటర్నింగ్ అధికారితో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లపై ఆయన ఆ లేఖలో ఆరోపణలు చేశారు.  ....................................................................................................................................................... మహా, గుజరాత్ లకు రెడ్ అలర్ట్ 6.దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే రానున్న ఐదు రోజుల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ ఈ రోజు పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ..................................................................................................................................................... సొంత ప్రభుత్వంపై విమర్శలు.. కేబినెట్ నుంచి బర్త్ రఫ్ 7. రాజస్థాన్ లో మహిళలకు భద్రత కరవైందంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేసిన  మంత్రి రాజేంద్ర గూడా ను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి పదవి నుంచి తొలగించారు.  మణిపూర్ హింసాకాండను రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తే బదులు సొంత ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని  రాజేంద్రగూడ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ...................................................................................................................................................... వైసీపీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం కరవు: తోట 8.   వైసీపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్  ఏపీ  అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నిప్పులు కురిపించారు. వైసీపీ  పాలనలో సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.  ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ అవతరించిందన్నారు. ................................................................................................................................................... మళ్లీ ప్రమాద స్థాయిని దాటిని యమనానది ప్రవాహం 9.యమునా నది నీటిమట్టం నిన్న మరోసారి 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటడంతో వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో పునరావాస చర్యలను ఢిల్లీ యంత్రాంగం ముమ్మరం చేసింది.  మరింత ఆలస్యమయ్యాయి.  య‌మునా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నది పోటెత్తుతున్నది.   ..................................................................................................................................................... ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై కోర్టు తీర్పు రిజర్వ్ 10. అమరావతి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.  ఇరు వర్గాల వాదనలు ముగియటంతో తీర్పు రిజర్వ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.

వివేకా హత్యకు ముందే వైఎస్ కుటుంబంలో కోల్డ్ వార్?!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి  స్వయానా సోదరుడు, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఎన్నో మలుపులు తిరగాలో అన్నీ తిరుగుతున్నది. ఈ హత్య జరిగి ఐదేళ్లు కావస్తున్నా.. ఇదిగో వీళ్ళు ఈ హత్య చేసింది అని తేలలేదు. అయితే, విచారణ జరిగిన తీరు, సీబీఐ ఇచ్చిన వాంగ్మూలాలు, సొంత కుటుంబ సభ్యులే ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ కేసులో నేరస్తులు ఎవరో బాహ్య ప్రపంచానికి ఎప్పుడో చెప్పేశాయి. ఇక మిగిలింది ఈ కిరాతకమైన హత్య కేసులో చట్టప్రకారం న్యాయస్థానాలే దోషులను శిక్షించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా ఎప్పటికప్పుడో ఇదిగో అదిగో అని వాయిదా పడుతూ వస్తుంది. కారణం ఏంటన్నది తెలియదు కానీ.. సీబీఐ ఈ కేసు విచారణను ఎప్పుడో ముగించాల్సి ఉండగా.. ఇప్పటికీ ఇంకా తేల్చడం లేదు.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ తాను నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను గత నెల 30వ తేదీన కోర్టుకు సమర్పించింది. దాదాపు 145 పేజీల చార్జి షీట్ ను కోర్టు విచారణకు స్వీకరించడంతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల, ఆయన ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం, వైసీపీ కీలక నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్ కూడా ఈ సాక్షుల జాబితాలో ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే, ఈ కేసులో సాక్షిగా గత ఏడాది అక్టోబర్ 7న వైఎస్ షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో 259వ సాక్షిగా షర్మిల వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసింది. వాంగ్మూలంలో షర్మిల నా వద్ద ఆధారాలు లేవు కానీ.. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందని.. ఈ హత్యకు కుటుంబ ఆర్ధిక అంశాలు కారణం కాదని.. ఆవినాష్ కుటుంబానికి.. వివేకా వ్యతిరేకంగా ఉండటమే హత్యకి కారణం కావచ్చని.. వారి దారికి వివేకా అడ్డువస్తున్నాడని హత్య చేసి ఉండవచ్చని షర్మిల పేర్కొన్నారు.  అంతే కాదు, కుటుంబంలో అందరం బాగున్నట్లు బయటకి కనిపించినా లోపల కోల్డ్ వార్ నడిచేదని షర్మిల సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం కూడా షర్మిల సీబీఐకి వివరించారని అంటున్నారు. హత్యకు కొన్ని నెలల ముందే వివేకా బెంగుళూరులో షర్మిల నివాసానికి వెళ్లగా.. కడప ఎంపీగా పోటీ చేయాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టారని.. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయకూడదని వివేకా గట్టిగా కోరుకున్నారని.. అవినాష్ కు ఎంపీ టికెట్ రాకుండా జగన్మోహనరెడ్డిని ఒప్పిద్దామని బాబాయ్ తనతో చెప్పారని.. అలాగే జగన్ కు వ్యతిరేకంగా కూడా వెళ్లే ఉద్దేశం తనకు లేదని.. ఈ విషయంలో మీరు కూడా జగన్ కు చెప్పాలని తన చిన్నాన్న తనను కోరినట్లు షర్మిల వాంగ్మూలంలో పేర్కొన్నారు.  అయితే, ఆ తర్వాత కడప ఎంపీ టికెట్ విషయంపై చిన్నాన్న తమపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారని.. కానీ ఆ సమయంలో తామేమీ చెప్పలేకపోయామని.. అప్పటికి ఇంకా టికెట్ల ఖరారు కూడా కాలేదని.. తీరా ఆ సమయానికి ఆయన్ను లేకుండా చేశారని షర్మిల పేర్కొన్నట్లు తెలుస్తున్నది. షర్మిల చెప్పిన దాని ప్రకారం చూస్తే వివేకా హత్యకేసులో వైసీపీ నేతలు చెప్పినట్లు ఆర్ధిక కారణాలు, ఆయన రెండో వివాహం, ఫ్యాక్షన్ పగలు లేనే లేవని స్ఫష్టమవుతుంది. ఒక్క కడప ఎంపీ టికెట్ చుట్టూనే ఈ హత్యకేసు తిరుగుతున్నది.  దీంతో పాటు హత్య జరిగిన సమయంలో జగన్  హైదరాబాద్ లోటస్ పాండ్ లో మ్యానిఫెస్టోపై చర్చిస్తుండగా  అవినాష్ రెడ్డే ఈ విషయాన్ని వాళ్లకు చేరవేశారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ విశ్రాంత సీఎస్ అజేయ కల్లం, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్‌లు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అవినాష్ చిన్నాన్న ఇక లేరనే విషయాన్ని మాత్రమే జగన్ కు చెప్పారని, బాత్ రూమ్, బెడ్ రూమ్ లో రక్తం ఉందనే విషయాన్ని మాత్రమే చెప్పారని పేర్కొన్నారు. హత్య జరిగిందని కానీ.. ఎవరో చేశారని కానీ అవినాష్ జగన్ తో చెప్పినట్లు ఎవరూ వాంగ్మూలంలో పేర్కొనలేదు. దీని ప్రకారం ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే విషయం స్పష్టమవుతుంది.

ఫస్ట్రేషన్ పీక్స్.. సీఎం నోట బూతుల పంచాంగం!

ప్రజలలో వ్యతిరేకత తెలిసి ఫ్రస్టేషన్ ఫీలవుతున్నారో.. లేక ఇప్పుడు రాజకీయం అంటే ఇదే అనుకుంటున్నారో కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో తన స్థాయి మరచి ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తున్నారు. గత నాలుగేళ్లలో వైసీపీ కోటరీలో కొడాలి నానీ, రోజా లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నోటి వెంట వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయ్యారని ప్రత్యక్షంగా జగనే రంగంలోకి దిగినట్లు అనిపిస్తుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ప్రత్యర్థులపై అమ్మాయిలు, పెళ్లిళ్లు, కాపురాలు, కడుపులు, దౌర్భాగ్యులు, నీచులు వంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే  రాజకీయాలు ఈ స్థాయిలో దిగజారిపోయాయా అనిపిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ఇంటర్వ్యూ చేసిన ఒక విలేఖరి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు గురించిన ప్రస్తావన చేస్తూ ఏకవచనంలో మాట్లాడారు. వెంటనే కాసు బ్రహ్మానందరెడ్డి ఆ విలేకరిని తీవ్రంగా మందలించారు. అలాగే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డీ కూడా రాజకీయ ప్రత్యర్థులైనా పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకునే వారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలూ తప్ప వ్యక్తిత్వ హననానికి పాల్పడే మాటలు వారి నోటి నుంచి మచ్చుకైనా ఎన్నడూ రాలేదు.  అయితే జగన్  అటువంటి రాజకీయ విలువలు, సంస్కారానికి తిలోదకాలిచ్చేశారా అన్నట్లుగా ఆయన మాటలు, ప్రసంగాలు ఉంటున్నాయి. ఇక విషయానికి వస్తే.. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన సీఎం.. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడతారని ఎవరైనా భావిస్తారు. తన కార్యకలాపాలకు ప్రత్యర్ధులు అడ్డు వస్తున్నారని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టడం సహజం. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కార్యక్రమం ఏదైనా.. ఎదుట ఎవరు ఉన్నా తన స్థాయిని తానే తగ్గించేసుకునేలా అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారు.   వెంకటగిరిలో సీఎం జగన్ ‘వైఎస్‌ఆర్‌ నేతన్న హస్తం’ పథకం కింద ఆర్థికసాయాన్ని విడుదల చేశారు. ఈ సభలో మాట్లాడిన జగన్.. వాలంటీర్లపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత చంద్రబాబే అని.. పదేళ్లుగా చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్‌ వాలంటీర్‌ గా పనిచేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు, క్యారెక్టర్‌ లేని వాళ్లంతా వాలంటీర్ల గురించి మాట్లాడతారా అని ధ్వజమెత్తారు. వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత చంద్రబాబేనని.. నటన, మాటలు మాత్రమే దత్తపుత్రుడివని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా  ఆయన శృతి మించారు.   దత్తపుత్రుడికి అమ్మాయిలను లోబర్చుకుని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం..  వదిలేయడం చేస్తాడని.. మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్లీ వదిలేయడం అలవాటన్నారు. 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్‌పూల్‌లో డ్యాన్స్ చేస్తూ మందుతాగుతూ మరొకరు ఉంటారని అన్నారు. ఇది లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగా కనిపిస్తుంది. అంతటితో ఆగని జగన్..   అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలని ఇంకో దౌర్భాగ్యుడు అంటాడని నందమూరి బాలకృష్ణపై సెటైర్లు వేశారు. ఇక, 75 ఏళ్ల వయసొచ్చినా చంద్రబాబుకి సిగ్గులేదని, బావమరిది నువ్వు సినిమాల్లోనే చేశావు, నేను నిజ జీవితంలో చేశానంటూ చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన అని చంద్రబాబునాయుడిపై కూడా వ్యాఖ్యలు చేశారు.  జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం, మంత్రులను చూసైనా వైసీపీ నేతలు బుద్ది తెచ్చుకోవాలని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మరికొందరైతే రానున్న ఎన్నికలలో ఫలితాలేంటో జగన్ మోహన్ రెడ్డికి తెలిసిపోయిందని.. అందుకే ఫ్రస్టేషన్ లో  బూతులు లంకించుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. ఇక జనసేన కార్యకర్తలైతే జగన్ తాత, ముత్తాల దగ్గర నుండి రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ జాబితా అంతా బయటపెట్టి మరీ విమర్శిస్తున్నారు.   టీడీపీ నేతలైతే జగన్ వ్యాఖ్యలను మతి స్థిమితం లేని వ్యాఖ్యలుగా కొట్టి పారేస్తున్నారు. జగన్ బూతుల పంచాంగం  ఎంతవరకూ వెళ్తుందో.. ఇంకెంత దిగజారుడు వ్యాఖ్యలు వినాల్సి వస్తుందో చూడాలి మరి.

మా బాబాయ్ ని చంపింది మా వాళ్లే.. షర్మిల సాక్ష్యం

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో సీబీఐ జగన్ సోదరి షర్మిలను సాక్షిగా సీబీఐ పేర్కొంది. ఈ మేరకు ఆమెను ఈ కేసులో 259వ సాక్షిగా చేరుస్తూ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ వాంగ్మూలం ఇచ్చింది. కాగా ఈ కేసులో షర్మిల గత ఏడాది అక్టోబర్ లో  ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి  ఏపీ సీఎం జగన్ అరాచకాలను రాష్ట్ర ప్రజలే కాదు.. సోంత కుటుంబీకులు కూడా భరించ లేకపోతున్నారు.  సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో తన తండి హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదంటూ వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీంను ఆశ్రయించి తెలంగాణకు మార్పించుకున్న సంగతి తెలిసిందే. అలాగే సొంత చెల్లి షర్మిల,  తల్లి  విజయమ్మ కూడా   జగన్ తో  పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఆయనకు దూరంగా పొరుగు రాష్ట్రం తెలంగాణలో గడుపుతున్నారు. జగన్ పార్టీకి గౌరవాధ్యక్షురాలి పదవికి హోదాకీ రాజీనామా చేసి మరీ తల్లి విజయమ్మ కుమార్తె వద్దకు తెలంగాణకు వెళ్లి పోయారు. ఆ తరువాత ఏదో అవసరం ఉండి అమరావతి వెళ్లినా జగన్ నివాసానికి కూడా విజయమ్మ వెళ్ల లేదు. ఇక అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని తండ్రి ఆశయాల సాధన కోసం అంటూ తన రాజకీయాలు తాను చేసుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా సోదరుడు జగన్ తీరుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా. మొత్తం మీద సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ కు సొంత కుటుంబ సభ్యులూ దూరం అయ్యారన్నది నిష్టురంగా వినిపించినా కాదనలేని సత్యం. ఇక సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పని గట్టుకుని ఢిల్లీకి వెళ్లి మరీ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో ఆమె ఏపీ ప్రభుత్వం, అన్న జగన్, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీప బంధువు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఏం చెబుతున్నారో దానికి పూర్తి విరుద్ధంగా చెప్పారు. వివేకా హత్య వెనుక ఉన్నది రాజకీయ కారణాలేనని కుండబద్దలు కొట్టేశారు.   తమ కుటుంబంలో జరిగిన అత్యంత దారుణ, విషాద  ఘటన బాబాయ్ వివేకా హత్యేనని షర్మిల చెప్పారు. ఆయనను హత్య చేసిన వారెవరో తెలియాలనీ, వారికి శిక్ష పడాలనీ అన్నారు.  కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని, అది వాస్తవమని, అందులో ఎలాంటి సందేహాలకూ తావులేదనీ విస్పష్టంగా చెప్పారు.  ఆమె తన వాంగ్మూలం ద్వారా ఈ హత్య వెనుక అవినాష్ ఉన్నారని  పరోక్షంగానైనా స్పష్టంగానే చెప్పారు. వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అడుగడుగునా దర్యాప్తును అడ్డుకుంటున్నారనీ అన్న షర్మిల తన సోదరి సునీతకు న్యాయం జరగాలన్నారు.   ఈ హత్య కేసు దర్యాప్తు ఏపీలో అయితే నిష్పాక్షికంగా జరగదన్న ఆమె అభిప్రాయంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించడం.. సుప్రీం కోర్టుకు కూడా అదే నివేదించడం తో తెలంగాణకు మారిన తరువాత ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని అంతా భావించారు. షర్మిల వాంగ్మూలం నేపథ్యంలో అవినాష్ పై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరింది కూడా. అయితే సీబీఐ తెలంగాణకు కేసు విచారణ బదలీ అయ్యాకా.. లాజికల్ ఎండ్ దిశగా దర్యాప్తును వేగవంతం చేసిందన్న భావన అందరిలో కలిగింది. అయితే కారణాలేమిటన్నది తెలియదు కానీ దర్యాప్తునకు గడువు ముగింపునకు వచ్చిన సమయంలో సీబీఐ ఒక్క సారిగా చేతులెత్తేసిన విధంగా వ్యవహరించింది. అన్నిటి కంటే ముఖ్యంగా అవినాష్ అరెస్టు విషయంలో సీబీఐ ఆయనతో దాగుడుమూతలాడిందే తప్ప అరెస్టు చేయడానికి ముందుకు సాగలేదు. చివరాఖరికి కోర్టుల రక్షణ కూడా లేని సందర్భంలో కూడా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా.. ఆయనకు ముందస్తు బెయిలు వచ్చే విధంగా వ్యవహరించిందని న్యాయ నిపుణుులు కూడా అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో  అలాగే ఈ ఛార్జిషీట్లో వివేకా హత్యకు కుట్ర పన్నింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డే అన్న విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్లలోనూ వీరి పేర్లు పేర్కొన్నా ఈసారి వీరిని ఏ 7, ఏ8లుగా పేర్కొంది. ఇక 259వ సాక్షిగా షర్మిలను చేర్చడమే ప్రాధాన్యత సంతరించుకుంది.  దర్యాప్తు ముగింపు గడువు తీరిపోవడంతో సీబీఐ ఇప్పటి వరకూ తన దర్యాప్తు వివరాలను చార్జిషిట్ ద్వారా కోర్టుకు సమర్పించి చేతులు దులిపేసుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

విశ్వ నగరం గోడు వినే వారేరీ?

వానొస్తే అందరికీ ఆనందమే కొంచెం ఎక్కువగా వాన కురిస్తే కొంత అసౌకర్యం  అయినా ఓకే, కానీ హైదరాబాద్  నగరవాసులకు వానంటే భయం. కొద్ది పాటి భారీ వర్షం అంటే వణుకు. అదే అతి భారీ వర్షం అంటే పై ప్రాణాలు పైనే పోతాయి. కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచినట్లుగా పెద్దలు పిల్లలను ఇంటి నుంచి కదల నివ్వరు. ఆఫీసులకు వెళ్లే వారు , పనులపై వెళ్లే వారు , ప్రయాణాలు చేసే వాళ్లు తమ పనులు  వాయిదా వేసుకుంటారు.  ఇది విశ్వనగర జీవికి అలవాటైం పోయింది. లేకపోతే ఏ హోర్డింగో   పైన  పడుతుంది. లేదా తవ్వి వదిలేసిన కాలువలు మింగేస్తాయి. ఇక మూతలు లేని మ్యాన్ హోల్స్  ఎటూ ఉండనే ఉన్నాయి. అప్పుడెప్పుడో 115 యేళ్ల క్రింద మూసీ పొంగి వేల మంది చనిపోయారు. అడపాదడపా అలాంటివి వరదలు హైదరాబాద్ ను పలకరిస్తూనే ఉన్నాయి. 1908 వరదల అనుభవంతో నిజాం ప్రభుత్వం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించి నగరానికి ముప్పును నివారించింది. 1908లో దాదాపు 15 వేల మందిని పొట్టన పెట్టుకున్న   మూసీ భారీ వరద చరిత్రలో నిలబడిపోయింది. 2000 సంవత్సరంలో వచ్చిన భారీ వర్షాలు  వందమంది ప్రాణాలు బలిగొంది. 30 వేలకు  పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అప్పుడు జియోలాజికల్ సర్వే ఆప్ ఇండియా చేసిన ప్రతి పాదనలు కార్యరూపం దాల్చలేదు. దీని ఫలితంగా 2016,2020 లలో హైదరాబాద్ భారీ వరదలను ఎదుర్కోవల్సి వచ్చింది.  తాజాగా కురిసిన భారీ వర్షాలు వరదలను సృష్టించకపోయినా నగర జీవితాలను అతలాకుతలం చేసిందనే చెప్పాలి. ఇందుకు కారణాలు అన్వేషిస్తే జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రణాళికల్లేని కార్యక్రమాలు, సహజ నీటి మార్గాల మూసివేత, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అత్యాశ, వీటికి తోడు నగర వాసుల బాధ్యతా రాహిత్యం కూడా కారణాలుగా కనిపిస్తాయి. దీనికి  కష్ట సమయాలలో  చేతులెత్తేసే నగర పోలీస్ విభాగం తోడవుతుంది.  వందేళ్లకు ముందే నగరాన్ని రక్షించడానికి నిజాంలు రిజర్వాయర్లు కట్టారు. 1996లో చంద్ర బాబు 111 జీవోను  తెచ్చి రిజర్వాయర్లను  తద్వారా హైదరాబాద్ నగరాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. తరువాతి ప్రభుత్వాలు జీవో నెంబర్ 111 అమలులో ఉన్న 84 గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలకు అనుమతి నిచ్చి నగరాన్ని వరదల నగరంగా మార్చారు. ప్రస్తుత పరిణామాలకు గతంలో చేసిన తప్పులే  కారణమని చెప్పక తప్పదు.  అయితే విశ్వ నగరాన్ని ప్రజల నగరంగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.  వర్షాలు రానప్పుడు  కూడా నగర జీవితం నరకమే అనేది నిత్య సత్యం.  విశ్వ నగరం అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో  70శాతం రోడ్లు అన్యాక్రాంతమై ఉంటాయి. 100 అడుగుల రోడ్డు ఉన్నా ప్రజలు 30 అడుగులలోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఉంటుంది. పబ్లిక్ రోడ్డును పార్కింగ్ స్థలాలుగా  వాడుకుంటున్న వాణిజ్య సముదాయాలు , రోడ్డుపై అనుమతులు లేకుండా  వెలుస్తున్న తిను బండారాల దుకాణాలు నగర జీవికి నరకమే చూపిస్తున్నాయి. చలానాలు  వేయడానికి లేదా  వసూలు చేయడానికి  ఆసక్తి చూపించే  నగర పోలీసు విభాగం ట్రాఫిక్ జాంలపై దృష్టి సారించలేవు. నగరాన్ని వరదలు పదేళ్లకోసారి ముంచెత్తుతుంటే ట్రాఫిక్ సమస్య ప్రతి రోజూ ఆ పని  చేస్తూనే ఉంది.

అమరావతి వినాశనానికి జగన్ మరో ఎత్తు?!

ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతిని చంద్రబాబు తరతరాలకు సంపద సృష్టించే వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మించాలనుకుని ఇప్పటికే అక్కడ అందుకు అవసరమైన  ప్రాధమిక సౌకర్యాల కల్పన కూడా చేశారు. ముందుగా తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేసి అక్కడ నుండే పరిపాలనా సాగిస్తూ శాశ్వత భవనాల నిర్మాణాన్ని కూడా మొదలు పెట్టారు. శాశ్వత భవనాలు కూడా కొన్ని యాభై శాతం పైన నిర్మాణం జరగగా.. మరికొన్ని ప్రాధమిక దశలో ఉన్నాయి. అయితే, ఇప్పుడున్న జగన్ సర్కార్ ఆ భవనాలను ఎక్కడివక్కడ వదిలేసి రాజధాని నిర్మాణంపై చేతులెత్తేసింది. అంతేకాదు ఇప్పుడు అక్కడ పరిపాలనా భవనాలను కాకుండా నివాస గృహాలను నిర్మించాలని, అది కూడా రాజధానేతర ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నది.  ఇప్పటికే ఆర్ 5 జోన్ లో ఈ ఇళ్లకు స్థలాల పట్టాలు ఇస్తూ జీవో  కూడా జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ అనుమతుల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. జగన్ ప్రభుత్వం ఇచ్చే పట్టాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని.. తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోర్టు హక్కు లబ్థిదారులకు ఉండదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  కోర్టు పరిధిలో ఉన్న ఈ గృహాల నిర్మాణ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేంద్రాన్ని అనుమతి కోరగా.. కేంద్రం కూడా రాష్ట్రం అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చేసింది.  ఆర్ 5 జోన్ లో కట్టాలని భావిస్తున్న 47 వేల ఇళ్లకు కేంద్రంలోని సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీలో అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో ఇళ్ళు నిర్మించేందుకు రూ. 710 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చివరి నిముషంలో రాజధాని ప్రాంతంలో కొందరు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు అందరికీ నోటీసులు జారీచేసి.. ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయటం కోసమే సుప్రింకోర్టు అనుమతిచ్చిందా లేకపోతే ఇళ్ళు నిర్మించుకోవచ్చని కూడా చెప్పిందా అన్నది తేలుస్తామని హైకోర్టు చెప్పింది. దాంతో కేంద్రం మంజూరుచేసిన ఇళ్ళ నిర్మాణాల ప్రక్రియ ఆగిపోయింది.  అయితే, ఏది ఏమైనా రాజధాని అమరావతిలో గృహ నిర్మాణాలు చేపట్టి దానిని రాజధానికి అడ్డంకిగా చెప్పాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్.. ఇప్పుడు దాని కోసం మరో ఎత్తు వేసినట్లు తెలుస్తున్నది. ఒకవైపు కోర్టులు ఇళ్ల నిర్మాణం వద్దని వారిస్తున్నా.. వచ్చే ఎన్నికల్లోపు 50 వేల ఇళ్ళని అక్కడ నిర్మించేయాలన్నది జగన్ పట్దుదల. అందుకే ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ముందు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సీఆర్డీయే రు. 72 కోట్లతో పనులు మొదలుపెట్టింది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులైన నైబర్ హూడ్ స్కూల్స్, ఈ హెల్త్ సెంటర్లు, అంగన్ వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుతో పాటు మొక్కలు నాటే పనులు, కాలనీలుగా విభజించి రోడ్లు, కాల్వలు, వీధి దీపాల కోసం స్తంభాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఈనెల 24న భూమి పూజ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. కానీ, ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే మరోవైపు ప్రభుత్వం మొండిగా ఈ తరహా ఏర్పాట్లను చేయడం అర్ధంకాని అంశం. రేపు కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఏమిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. పరిపాలన, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం అభివృద్ధి పేరిట రైతుల వద్ద తీసుకున్న భూములలో ఇలా ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి వీలు లేదని కోర్టు తీర్పు వస్తే.. ఇప్పుడు ఈ మౌలిక సదుపాయాల కోసం వెచ్చించిన నిధులన్నీ బూడిద పాలే అవుతాయి. అయితే, రేపు కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు రాజధానిలో యాభై వేల ఇళ్లకు శంకుస్థాపన చేసి అమరావతి నడిబొడ్డున పేదల ఇల్లు నిర్మించాలనన్నది జగన్ ప్రణాళికగా కనిపిస్తుంది. మరి ఈ మొండి వైఖరి వలన ఎవరికి లాభమో ఆ జగన్ మోహన్ రెడ్డికే తెలియాల్సి ఉంది.

మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ?

వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తెలంగాణను దాటి మహారాష్ట్రలో కేసీఆర్ దూకుడు పెంచారు. మహారాష్ట్రలో ఇప్పటికే పలు భారీ బహిరంగసభలను నిర్వహించారు. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఇంకోవైపు పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని చెపుతున్నారు. నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం. మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తే జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీ ఆధారిత ఏజెన్సీ నేతృత్వంలో కేసీఆర్ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. మెదక్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మహరాష్ట్ర  నుంచి మెదక్ లోక  సభ  నుంచి పోటీ చేయవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

స్పీడ్ న్యూస్ 3

కడెం ప్రాజెక్టుకు భారీగా నీరు 31.   కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం ఉదయం  ప్రాజెక్టుకు చెందిన తొమ్మిది వరద గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి నీటిని వదిలారు.  కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695. 500 అడుగులు ఉంది. ....................................................................................................................................... ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆస్తుల వేలం 32.   వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి  ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. అయితే వాటిని చెల్లించలేదు. ఈ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీదారుడిగా ఉన్నారు. ......................................................................................................................................................... టమాటాల చోరీపై పుణె పీఎస్ లో ఫిర్యాదు 33. తన టమాటాలు ఎవరో చోరీ చేశారంటూ పూణె పోలీసు స్టేషన్ లో ఓ రైతు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్రలోని  పింపర్‌ఖేడ్‌ గ్రామానికి చెందిన రైతు రెండెకరాల పొలంలో టమాటా వేశాడు. వాటిని విక్రయించేందుకు ఓ ఆటోలో లోడ్ చేశాడు. తెల్లారి చూస్తే ఆటోలో టమాటాలు చోరీ కి గురయ్యాయి.   ............................................................................................................................................................. రాజస్థాన్ లో ఇక మృతదేహాలతో నిరసనకు దిగితే జైలు 34. రాజస్థాన్‌లో మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే ఇక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందే.  ఇందుకోసం గెహ్లాట్ సర్కార్ రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023 చట్టాన్ని తీసుకువచ్చింది.   కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా మృతదేహాన్ని నిరసన కోసం ఉపయోగిస్తే శిక్ష తప్పదు. ................................................................................................................................................. చీతాల మృతిపై సుప్రీం ఆందోళన 35.  కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది.  చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారించిన సుప్రీం చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని కునో నేషనల్ పార్క్ లో నే  ఎందుకు ఉంచారని నిలదీసింది.  ........................................................................................................................................................... ఇన్ఫార్మర్ల నెపంతో ఐదుగురిని చంపేసిన నక్సల్స్ 36.జార్ఖండ్‌లో నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. లతేహార్ జిల్లాలోని నెటార్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో ఐదుగురు వ్యక్తులను  కొట్టి చంపారు. ఈ ఘటనతో  ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. .......................................................................................................................................................  కేంద్ర నిఘా సంస్దల చేత దర్యాప్తు: పవన్ కు పేర్ని సవాల్ 37.ఏపీలో  వాలంటీర్ల డేటా చౌర్యం విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు తీసుకువెడతానన్న జనసేనాని పవన్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.  మోడీ, ఫాలతో నిజంగానే అంత సాన్నిహిత్యం ఉంటే కేంద్ర నిఘా సంస్థల చేత దర్యాప్తు చేయించు కోవాలన్నారు.   ........................................................................................................................................................ అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగు 38. భారత సంతతికి చెందిన ఒక విద్యార్థిని పిగుడుపాటుకు గురైంది.  పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడిన  విద్యార్థిని మృత్యుతో పోరాడుతోంది. ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైంది.  ప్రస్తుతం ఆమె కోమాలో ఉందని చెబుతున్నారు. ................................................................................................................................................... అధికారులు అప్రమత్తం : తలసాని 39. భారీవర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  అన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ను నగరంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంటనే స్పందించి అవసరమైన సేవలను అందించాలన్నారు. .................................................................................................................................................... ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వదర ఉధృతి 40. గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఈ ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరుకుంది.  అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 32.4 అడుగులకు చేరుకుంది.  ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దిగువకు 7,46,758 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ................................................................................................................................................. టమాటాల కోసం తోపులాట 41. విశాఖలోని రైతుబజార్‌లో టమాటాల కోసం జనం బారులు తీరారు. దీంతో జనాలను నియంత్రించడం కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే   టమాటాల కోసం  జనం ఎగబడటంతో పోలీసుల సమక్షంలోనే తోపులాట చోటు చేసుకుంది.   ............................................................................................................................................................... మణిపూర్ హింసాకాండపై చర్చకు విపక్షాల పట్టు 42. మణిపూర్ హింసాకాండపై చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుబట్టాయి.   పార్లమెంట్‌లోని మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో ‘ఇండియా’ కూటమి నేతలు  పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.  బీఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభలో వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టింది. ............................................................................................................................................................ ఓపెన్ కాస్ట్ లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి 43. భారీ వర్షాల కారణంగా  సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.  ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ............................................................................................................................................................. జంట జలాశయాల్లోకి భారీగా ఇన్ ఫ్లో 44. ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్‌కు ఇన్‌ఫ్లో 1100 క్యూసెక్కులు,  హిమాయత్ సాగర్‌కు 1,200 క్యూసెక్కుల  నీరు వచ్చి చేరుతోంది.  ............................................................................................................................................................ ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ 45. యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  రుద్రవెల్లి వద్ద కాజ్‌వేపైనీరు ప్రవహిస్తుండటంతో పోచంపల్లి-బీబీనగర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.   ............................................................................................................................................................. వరద సహాయక చర్యలపై సీఎస్ కు సీఎం దిశానిర్దేశం 46. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో   సీఎం  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి  ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు   సిద్ధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు.  ............................................................................................................................................................... చంచల్ గూడ మహిళా జైలులో సౌకర్యాలపై నివేదిక: హై కోర్టు ఆదేశాలు 47.చంచల్‌గూడ మహిళల జైలులో వసతులపై నివేదిక సమర్పించాలంటూ అమికస్‌ క్యూరీకి హైకోర్టు   ఆదేశాలు జారీ చేసింది.  సౌకర్యాలు లేక మహిళా ఖైదీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ గతేడాది అందిన లేఖను సుమోటోగా స్వీకరించింది. విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. ......................................................................................................................................................... ఇంటింటి ఓట్ల పరిశీలనకు వలంటీర్లను దూరంగా ఉంచాలి 48. రాష్ట్రంలో నేటి నుంచి నెల రోజులపాటు జరగనున్న ఓటర్ల ఇంటింటి పరిశీలనకు వాలంటీర్లనుదూరంగా ఉంచాలని టీడీపీ, ప్రతిపక్ష పార్టీలు  ఎన్నికల కమిషన్‌ను కోరాయి. దొంగఓట్లు చేర్చడం, విపక్షాల ఓట్లు తొలగించడం ద్వారా  వైసీపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించాయి.  .......................................................................................................................................................... మహిళల ఆత్మగౌరవ నిరశన 49. విజయవాడ ధర్నా చౌక్‌లో  తెలుగుదేశం నాయకురాలు వంగలపూడి అనిత  అనిత ఆధ్వర్యంలో తెలుగు మహిళలు నిరసన దీక్షకు దిగారు. రాష్ట్రంలో మహిళలకు వైసీపీ ప్రభుత్వం కనీస రక్షణ కల్పించలేకపోతోందంటూ   మహిళల ఆత్మ గౌరవ దీక్ష  పేరిట నిరసన చేపట్టారు. ......................................................................................................................................... మణిపూర్ పై మోడీ మాట్లాడాలి 50. మణిపూర్‌లో   హింసాకాండపై పార్లమెంటులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.  పార్లమెంటు వెలుపల ఆగ్రహం వ్యక్తం చేయడం సరిపోదంటూ ట్వీట్ చేశారు.

స్పీడ్ న్యూస్ 2

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 11.తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారిని 63వేల 628 మంది భక్తులు దర్శించుకున్నారు. 33 వేల 548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది. ................................................................................................................................................. కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి మృతి 12.  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే చిలుకూరి రామచంద్రారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.   ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేశారు.   రామచంద్రారెడ్డి ఆకస్మిక మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు.   ............................................................................................................................................................... భూ కంపం 13. దేశంలోని మణిపూర్, రాజస్థాన్ లలో  శుక్రవారం తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. భూమికి  20 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.  ......................................................................................................................................................... పొన్నం ప్రభాకర్ నిరసన గళం 14. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ నిరసన గళం ఎత్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన 26 మందితో ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీలో చోటు దక్కక పోవడంతో ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు.   సీనియర్ నైన తనను ఎందుకు విస్మరించారంటూ నిరసన గళం విప్పారు. .................................................................................................................................................... జైపూర్ లో వరుస భూకంపాలు 15. రాజస్థాన్ రాజధాని జైపూర్ వరుస భూకంపాలతో వణికిపోయింది. ఈ తెల్లవారుజామున 4.09 నుంచి 4.23 గంటల మధ్య భూమి మూడు సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపాల తీవ్రత 3.1 నుంచి 4.2 మధ్య నమోదైంది. వీటి వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.  ................................................................................................................................................. హైకోర్టు న్యాయమూర్తిపై సీజేఐ అసంతృప్తి 16. రైల్లో వసతులు లేక అసౌకర్యానికి లోనైన ఓ హైకోర్టు న్యాయమూర్తి రైల్వే నుంచి వివరణ కోరడంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం కల్పించే సౌకర్యాల ఆధారంగా తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్టు భావించకూడదని సూచించారు.  ................................................................................................................................................ రామడుగులో అత్యధిక వర్షపాతం 17. కరీంనగర్ జిల్లా రామడుగులో  ఈ ఉదయం  21. 35 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుఅయ్యింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక వర్షపాతం. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  ..................................................................................................................................................... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ 18. బీజేపీ తెలంగాణ  అధ్యక్షుడిగా జి. కిషన్ రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు. .................................................................................................................................................. తగ్గేదేలే: పవన్ 19. వాలంటీర్ల విషయంలో  పవన్ వ్యాఖ్యలపై కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత కూడా  వాలంటీర్ వ్యవస్థ గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని పవన్ చెబుతున్నారు.   వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుంది? అంటూ నిలదీశారు. ....................................................................................................................................................... విమర్శలు కాదు వ్యవస్థలో లోపాలు సరిదిద్దే యత్నం: పేర్ని నాని 20.  తాను వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శించానంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను పేర్నినాని ఖండించారు. తాను సర్కార్ ను విమర్శించలేదనీ,   వ్యవస్థల్లో లోపాలు సరిదిద్దే ప్రయత్నం మాత్రమే చేశాననీ వివరణ ఇచ్చారు.   ........................................................................................................................................................... వరద పరిస్థితిపై సీఎస్ శాంతి కుమారి 21.   గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రాచలం వద్ద  చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ........................................................................................................................................................ ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద వరద 22.  భారీ వర్షాల  నేపథ్యంలో  ఎడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేసారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో, ఆలయ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ...................................................................................................................................................... తెలంగాణకు భారీ వర్ష సూచన 23. తెలంగాణలో మరీ ముఖ్యంగా  ఉత్తర, దక్షిణ తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పేర్కొంది.   .................................................................................................................................................. నేటి నుంచి ఏపీలో ఓటర్ వెరిఫికేషన్ 24. ఎన్నికల కమిషన్ ఏపీలో  నేటి నుంచి నెల రోజుల పాటు  ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి ఓటర్ వెరిఫికేష్ చేపడతారు.    రాష్ట్రంలో ఓట్ల తొల‌గింపు, దొంగ ఓట్ల న‌మోదుపై  ఆరోపణల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. .................................................................................................................................................. నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ 25. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 12న నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రాజస్థాన్ లో కూడా అదే తేదీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.   ............................................................................................................................................... డీఎస్పీల బదలీలు 26. తెలంగాణలో  51 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని ఆదేశించడంతో గత పది రోజులుగా రెవెన్యూ, పోలీస్ శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి.  ............................................................................................................................................. సహాయక చర్యల్లో పాల్గొనండి 27.    రాష్ట్రంలో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు   కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయ హస్తం అందించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ పిలుపునిచ్చారు.  ముంపు ప్రాంతాలలో పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు అందించాలన్నారు.  .................................................................................................................................................... ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : హరీష్ 28. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలకు వైద్య సేవలలో ఎలాంటి అంతరాయం ఉండకూదన్నారు.  .................................................................................................................................................. రోడ్డుపైనా నాట్లు.. వినూత్న నిరసన 29.జోగులాంబ జిల్లా శల్కాపురం గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో  ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారినా పట్టించుకోవడం లేదంటూ ఆ రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన తెలిపారు.  ............................................................................................................................................................. ఆర్డినెన్స్ కేసు విస్తృత ధర్మాసనానికి 30. ఢిల్లీ ఆర్డినెన్స్ కేసును సుప్రీం త్రిసభ్య ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేసింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదలీలపై కేంద్రం ఆర్డినెన్స్ ను ఆప్ సర్కార్  సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ అరెస్టుకు రంగం సిద్ధం?!

ఏపీలో ఇప్పుడు రాజకీయం అంతా వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని వారాహీ రెండో విడత యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల  సమాచారాన్ని వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించగా.. అప్పటి నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీ మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపగా.. ప్రభుత్వం కూడా పథకాల లబ్ది దారులకు వాయిస్ కాల్స్ చేసి వాలంటీర్లకు మద్దతు కూడగడుతున్నది.  వాలంటీర్లపై వ్యాఖ్యల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అప్పటికీ ఇప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తే.. హైదరాబాద్ నానక్ రామ్ గూడలో వాలంటీర్లు సేకరించే డేటా స్టోర్ చేస్తున్నారనే కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చారు. దాంతో ప్రభుత్వంపై అనుమానాలు మరింతగా పెరిగాయి.  కాగా, ఇప్పుడు ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వాలంటీర్లను అవమానిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పరువుకు పవన్ వ్యాఖ్యలు భంగం కలిగించేలా ఉన్నాయని వాలంటీర్లు భావిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, వాలంటీర్లపై పవన్ దురుద్దేశ పూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశారని, వాలంటీర్లలో మహిళలను కించపరిచేలా పవన్ మాట్లాడారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఒకవైపు లీగల్ యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్న జగన్ సర్కార్ పవన్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని భావిస్తూనే.. మరోవైపు పవన్ కళ్యాణ్ అరెస్టుకు కూడా  ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని  సాక్షాత్తూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఢిల్లీ ఎన్డీఏ సమావేశం ముగిసిన అనంతరం తిరిగి వచ్చిన పవన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పవన్.. వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో తనను ప్రాసిక్యూట్ చేయాలని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, జనసేన కార్యాలయానికి ఆ జీవో వచ్చిందని, ఇదే ఆ జీవో అంటూ  మీడియా ప్రతినిధులకు పవన్ జీవో కాపీని చూపించారు.  వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిస్తూ జీవో నెం.16ను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఆ జీవో ప్రకారం పవన్ పై సీఆర్పీసీ 199/4 (బి) కింద కేసులు పెట్టేందుకు అవకాశమున్నట్లు తెలుస్తున్నది. కాగా, జీవో కాపీ మీడియాకి చూపించిన పవన్.. కావాలంటే తనను అరెస్టు చేసుకోవచ్చని, చిత్రవధ కూడా చేసుకోవచ్చని జగన్ కు  సవాల్ విసిరారు. దెబ్బలు తినేందుకైనా సిద్ధమన్నారు. జైలుకు వెళ్లేందుకే కాదు తాను దేనికైనా రెడీ అని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా పవన్.. తన అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్టు అర్థమైందని, ఇదే జగన్ ప్రభుత్వ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. తాను ఒకసారి మాట అంటే ఎంత రిస్కుకైనా వెనుకాడనని, జగన్… చెబుతున్నాను కదా.. సై అంటే సై.. రెడీగా ఉన్నాను.. రా.. చూసుకుందాం అని  సవాల్ విసిరారు. దీంతో ఈ వ్యవహారంలో నిజంగానే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయి? ఈ అంశంలో కోర్టులు ఎలా స్పందించనున్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది.

స్పీడ్ న్యూస్ 1

పవన్ కల్యాణ్ పై కేసు 1. వాలంటీర్లపై   పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.  రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం అంటూ చేసిన వ్యాఖ్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధిత కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసేందుకు అనుమతిని ఇస్తూ  ఏపి ప్రభుత్వ జీవో జారీ చేసింది.     ...................................................................................................................................................... విపక్ష కూటమికి ఇండియా పేరుపై ఫిర్యాాదు 2. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎపై పోటీకి 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి   ఇండియా  కూటమి పేరు ఇండియా సంగతి తెలిసిందే.   ఇండియా పేరును ఉపయోగించుకోవడం సరికాదని, ఇది అక్రమ వినియోగం కిందకు వస్తుందని పేర్కొంటూ ఢిల్లీలోని బారాఖమ్బ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.  ........................................................................................................................................................... కేరళ ఆర్టీసీ మహిళా కండక్టర్లకు కరాటేలో శిక్షణ 3. కేరళ  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేసే మహిళా కండక్టర్లకు కరాటే లో శిక్షణ ఇవ్వనున్నారు. మహిళా కండక్టర్లకు విధుల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఎదుర్కొనేందుకు వీలుగా వారికి కరాటేలో తర్ఫీదు ఇవ్వాలని కేరళ సర్కార్ నిర్ణయించింది.   ........................................................................................................................................................... భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 4.  మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తోపాటు రాష్ట్రంలోనూ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. నిన్న రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.1 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదవరి నీటి మట్టం మరింత పెరిగి ఈ రోజు సాయంత్రానికి 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.    ............................................................................................................................................................. త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ: బొత్స 5. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని, త్వరలోనే విధివిధానాలు ఖరారు అవుతాయని మంత్రి బొత్స తెలిపారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలను  సంప్రదిస్తామని తెలిపారు.  కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. .................................................................................................................................................... రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ  6. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏఐసీసీ నిన్న ప్రకటించింది. ఈ కమిటీలో భట్టి విక్రమార్క సహా 26 మంది ఉన్నారు. ముగ్గుర్ని ఎక్స్-అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ అధిష్ఠానం  నియమించింది.  మొత్తం 29 మందికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించింది. ............................................................................................................................................................. నేడూ రేపూ సెలవలు 7. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో   విద్యా సంస్థలకు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ రెండు రోజులూ సెలవు ఇచ్చారు.   ప్రయివేటు సంస్థలకు కూడా రేపు, ఎల్లుండి సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.  ................................................................................................................................................... బియ్యం ఎగుమతులపై నిషేధం 8. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. దీనిపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌   గురువారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్ల  బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. ............................................................................................................................................................ ఖర్గేతో ఆర్ కృష్ణయ్య భేటీ 9. బీసీ బిల్లు, వెనుకబడిన వర్గాల డిమాండ్ల సాధనకు సహకరించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కోరారు. గురువారం ఆయన ఖర్గేతో భేటీ అయ్యారు.  బెంగళూరులో నిర్వహించిన విపక్షాల భేటీలో జనగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ...................................................................................................................................................... భద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించిన పువ్వాడ 10.   భద్రాచలం వద్ద గోదావరి వరద పెరగడంతో  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వరద పరిస్థితిని మంత్రి పువ్వాడ స్వయంగా పరిశీలించనున్నారు. శుక్రవారం ఉదయం  పువ్వాడ భద్రాచలం చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించారు. వరద తగ్గుముఖం పట్టే వరకూ భద్రాచలంలోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు.