స్పీడ్ న్యూస్ 1
posted on Jul 21, 2023 @ 12:13PM
పవన్ కల్యాణ్ పై కేసు
1. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం అంటూ చేసిన వ్యాఖ్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధిత కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసేందుకు అనుమతిని ఇస్తూ ఏపి ప్రభుత్వ జీవో జారీ చేసింది.
......................................................................................................................................................
విపక్ష కూటమికి ఇండియా పేరుపై ఫిర్యాాదు
2. బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎపై పోటీకి 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమి పేరు ఇండియా సంగతి తెలిసిందే. ఇండియా పేరును ఉపయోగించుకోవడం సరికాదని, ఇది అక్రమ వినియోగం కిందకు వస్తుందని పేర్కొంటూ ఢిల్లీలోని బారాఖమ్బ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
...........................................................................................................................................................
కేరళ ఆర్టీసీ మహిళా కండక్టర్లకు కరాటేలో శిక్షణ
3. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేసే మహిళా కండక్టర్లకు కరాటే లో శిక్షణ ఇవ్వనున్నారు. మహిళా కండక్టర్లకు విధుల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఎదుర్కొనేందుకు వీలుగా వారికి కరాటేలో తర్ఫీదు ఇవ్వాలని కేరళ సర్కార్ నిర్ణయించింది.
...........................................................................................................................................................
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
4. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తోపాటు రాష్ట్రంలోనూ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. నిన్న రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.1 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదవరి నీటి మట్టం మరింత పెరిగి ఈ రోజు సాయంత్రానికి 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
.............................................................................................................................................................
త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ: బొత్స
5. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని, త్వరలోనే విధివిధానాలు ఖరారు అవుతాయని మంత్రి బొత్స తెలిపారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలను సంప్రదిస్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు.
....................................................................................................................................................
రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ
6. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏఐసీసీ నిన్న ప్రకటించింది. ఈ కమిటీలో భట్టి విక్రమార్క సహా 26 మంది ఉన్నారు. ముగ్గుర్ని ఎక్స్-అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. మొత్తం 29 మందికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించింది.
.............................................................................................................................................................
నేడూ రేపూ సెలవలు
7. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యా సంస్థలకు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ రెండు రోజులూ సెలవు ఇచ్చారు. ప్రయివేటు సంస్థలకు కూడా రేపు, ఎల్లుండి సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
...................................................................................................................................................
బియ్యం ఎగుమతులపై నిషేధం
8. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్ల బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది.
............................................................................................................................................................
ఖర్గేతో ఆర్ కృష్ణయ్య భేటీ
9. బీసీ బిల్లు, వెనుకబడిన వర్గాల డిమాండ్ల సాధనకు సహకరించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కోరారు. గురువారం ఆయన ఖర్గేతో భేటీ అయ్యారు. బెంగళూరులో నిర్వహించిన విపక్షాల భేటీలో జనగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
......................................................................................................................................................
భద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించిన పువ్వాడ
10. భద్రాచలం వద్ద గోదావరి వరద పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వరద పరిస్థితిని మంత్రి పువ్వాడ స్వయంగా పరిశీలించనున్నారు. శుక్రవారం ఉదయం పువ్వాడ భద్రాచలం చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించారు. వరద తగ్గుముఖం పట్టే వరకూ భద్రాచలంలోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు.