రైల్వే స్టేషన్లలో రూ.20 నాణ్యమైన భోజనం
posted on Jul 22, 2023 @ 11:32AM
జనరల్ బోగీల్లోని ప్రయాణికుల కోసం తక్కువ ధరకే భోజనం, తాగునీటిని అందించే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. నాలుగు స్టేషన్ల పరిధిలో దీనిని ఇప్పటికే అమలులోకి తీసుకు వచ్చింది.
తొలి దశలో హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. ఆయా స్టేషన్లలో రూ.20, రూ.50కే నాణ్యమైన ఆహారం లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు.
ఇందులో భోజనాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి క్యాటగరిలో 7పూరీలతో పాటు ఆలు కూర, పచ్చడిని ఇరవై రూపాయలకే అందిస్తారు. ఇక రెండో క్యాటగిరీలో అన్నం, చిడీ,ఛోలే-కుల్చే,ఛోలే-భటూరే,పావ్ భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని ఎంచుకోవచ్చు.దీని ధరను 50 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే 200 మిల్లీలీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ గ్లాసులను ఆయా కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచుతారు.