స్పీడ్ న్యూస్ 3
posted on Jul 21, 2023 @ 2:30PM
కడెం ప్రాజెక్టుకు భారీగా నీరు
31. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం ఉదయం ప్రాజెక్టుకు చెందిన తొమ్మిది వరద గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి నీటిని వదిలారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695. 500 అడుగులు ఉంది.
.......................................................................................................................................
ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆస్తుల వేలం
32. వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. అయితే వాటిని చెల్లించలేదు. ఈ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీదారుడిగా ఉన్నారు.
.........................................................................................................................................................
టమాటాల చోరీపై పుణె పీఎస్ లో ఫిర్యాదు
33. తన టమాటాలు ఎవరో చోరీ చేశారంటూ పూణె పోలీసు స్టేషన్ లో ఓ రైతు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్రలోని పింపర్‌ఖేడ్ గ్రామానికి చెందిన రైతు రెండెకరాల పొలంలో టమాటా వేశాడు. వాటిని విక్రయించేందుకు ఓ ఆటోలో లోడ్ చేశాడు. తెల్లారి చూస్తే ఆటోలో టమాటాలు చోరీ కి గురయ్యాయి.
.............................................................................................................................................................
రాజస్థాన్ లో ఇక మృతదేహాలతో నిరసనకు దిగితే జైలు
34. రాజస్థాన్‌లో మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే ఇక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఇందుకోసం గెహ్లాట్ సర్కార్ రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023 చట్టాన్ని తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా మృతదేహాన్ని నిరసన కోసం ఉపయోగిస్తే శిక్ష తప్పదు.
.................................................................................................................................................
చీతాల మృతిపై సుప్రీం ఆందోళన
35. కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారించిన సుప్రీం చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని కునో నేషనల్ పార్క్ లో నే ఎందుకు ఉంచారని నిలదీసింది.
...........................................................................................................................................................
ఇన్ఫార్మర్ల నెపంతో ఐదుగురిని చంపేసిన నక్సల్స్
36.జార్ఖండ్‌లో నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. లతేహార్ జిల్లాలోని నెటార్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో ఐదుగురు వ్యక్తులను కొట్టి చంపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
.......................................................................................................................................................
కేంద్ర నిఘా సంస్దల చేత దర్యాప్తు: పవన్ కు పేర్ని సవాల్
37.ఏపీలో వాలంటీర్ల డేటా చౌర్యం విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు తీసుకువెడతానన్న జనసేనాని పవన్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మోడీ, ఫాలతో నిజంగానే అంత సాన్నిహిత్యం ఉంటే కేంద్ర నిఘా సంస్థల చేత దర్యాప్తు చేయించు కోవాలన్నారు.
........................................................................................................................................................
అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగు
38. భారత సంతతికి చెందిన ఒక విద్యార్థిని పిగుడుపాటుకు గురైంది. పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థిని మృత్యుతో పోరాడుతోంది. ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైంది. ప్రస్తుతం ఆమె కోమాలో ఉందని చెబుతున్నారు.
...................................................................................................................................................
అధికారులు అప్రమత్తం : తలసాని
39. భారీవర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను నగరంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంటనే స్పందించి అవసరమైన సేవలను అందించాలన్నారు.
....................................................................................................................................................
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వదర ఉధృతి
40. గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఈ ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరుకుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 32.4 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దిగువకు 7,46,758 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
.................................................................................................................................................
టమాటాల కోసం తోపులాట
41. విశాఖలోని రైతుబజార్‌లో టమాటాల కోసం జనం బారులు తీరారు. దీంతో జనాలను నియంత్రించడం కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే టమాటాల కోసం జనం ఎగబడటంతో పోలీసుల సమక్షంలోనే తోపులాట చోటు చేసుకుంది.
...............................................................................................................................................................
మణిపూర్ హింసాకాండపై చర్చకు విపక్షాల పట్టు
42. మణిపూర్ హింసాకాండపై చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్‌లోని మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో ‘ఇండియా’ కూటమి నేతలు పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభలో వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టింది.
............................................................................................................................................................
ఓపెన్ కాస్ట్ లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
43. భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
.............................................................................................................................................................
జంట జలాశయాల్లోకి భారీగా ఇన్ ఫ్లో
44. ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్‌కు ఇన్‌ఫ్లో 1100 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్‌కు 1,200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
............................................................................................................................................................
ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
45. యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రుద్రవెల్లి వద్ద కాజ్‌వేపైనీరు ప్రవహిస్తుండటంతో పోచంపల్లి-బీబీనగర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
.............................................................................................................................................................
వరద సహాయక చర్యలపై సీఎస్ కు సీఎం దిశానిర్దేశం
46. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు.
...............................................................................................................................................................
చంచల్ గూడ మహిళా జైలులో సౌకర్యాలపై నివేదిక: హై కోర్టు ఆదేశాలు
47.చంచల్‌గూడ మహిళల జైలులో వసతులపై నివేదిక సమర్పించాలంటూ అమికస్ క్యూరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సౌకర్యాలు లేక మహిళా ఖైదీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ గతేడాది అందిన లేఖను సుమోటోగా స్వీకరించింది. విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.
.........................................................................................................................................................
ఇంటింటి ఓట్ల పరిశీలనకు వలంటీర్లను దూరంగా ఉంచాలి
48. రాష్ట్రంలో నేటి నుంచి నెల రోజులపాటు జరగనున్న ఓటర్ల ఇంటింటి పరిశీలనకు వాలంటీర్లనుదూరంగా ఉంచాలని టీడీపీ, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్‌ను కోరాయి. దొంగఓట్లు చేర్చడం, విపక్షాల ఓట్లు తొలగించడం ద్వారా వైసీపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించాయి.
..........................................................................................................................................................
మహిళల ఆత్మగౌరవ నిరశన
49. విజయవాడ ధర్నా చౌక్‌లో తెలుగుదేశం నాయకురాలు వంగలపూడి అనిత అనిత ఆధ్వర్యంలో తెలుగు మహిళలు నిరసన దీక్షకు దిగారు. రాష్ట్రంలో మహిళలకు వైసీపీ ప్రభుత్వం కనీస రక్షణ కల్పించలేకపోతోందంటూ మహిళల ఆత్మ గౌరవ దీక్ష పేరిట నిరసన చేపట్టారు.
.........................................................................................................................................
మణిపూర్ పై మోడీ మాట్లాడాలి
50. మణిపూర్‌లో హింసాకాండపై పార్లమెంటులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల ఆగ్రహం వ్యక్తం చేయడం సరిపోదంటూ ట్వీట్ చేశారు.