తెలంగాణ బిజెపీ నేతలతో కీలక సమావేశం
posted on Jul 22, 2023 @ 12:40PM
తెలంగాణలో బిజెపీ అధ్యక్షుడి మార్పు తర్వాత ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేంద్ర నాయకత్వం కార్యకర్తల్లో జోష్ నింపడానికి సిద్దమైంది. నిన్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటన అధిష్టానానికి చురకలు అంటించే విధంగా ఉండటంతో శనివారం బిజెపి నేతలతో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. శనివారం ఉదయం బీజేపీ నేతలతో రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌లు ప్రకాశ్ జవదేకర్, సహా ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతనికి తీసుకోవాల్సిన చర్యలపై నేతల నుంచి అభిప్రాయాన్ని సేకరించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతల సూచనలు, సలహాలను ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ తీసుకుంటున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ జడ్పీ చైర్మన్స్, మాజీ మేయర్స్, పార్టీలో రిటర్ మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులు హాజరయ్యారు. మరికాసేపట్లో సమావేశనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.