జగనానందయ్య శిష్య పరమాణువు వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్‌లో   జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆయన తొలి, మలి కేబినెట్‌లోని మంత్రి పుంగవులు.. మంత్రులుగా హుందాగా తమ తమ శాఖల వారీగా.. శాఖ పరంగా ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకరు ఇద్దరు మంత్రులు అదీ కూడా మచ్చుకు ఒకటో రెండో  సమావేశాలు సమీక్షలు నిర్వహించడం తప్పితే శాఖ మీద పట్టు సాధించడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే  మంత్రులలో అత్యధికులు మాత్రం   ప్రెస్‌మీట్ లు పెట్టి  ప్రతిపక్ష పార్టీలపై, నాయకులపై  బండ బూతులతో విరుచుకు పడిపోవడం, తద్వారా అధినేత జగన్ మొప్పు పొందడం అన్న అంశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు  వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఇప్పుడు ఆ విషయంలో వాసిరెడ్డి పద్మ ఒక అడుగు ముందుకు వేశారని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆమె పై సెటైర్లు వేస్తున్నారు. మహిళా కమిషన్ చైర్మన్ గా ఆమె పదవిని ముఖ్యమంత్రి జగన్ ఊడబీకి చాలా కాలం అయినా ఆ విషయం కూడా తెలియకుండా  ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నానన్న భ్రమతో  వాసిరెడ్డి పద్మ ఇస్తున్న కలరింగ్ సూపర్బ్ గా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.   ఈ ఏడాది మేలో  ముఖ్యమంత్రి జగన్ ఓ రహస్య  జీవో తో  వాసిరెడ్డి పద్మ ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పదవికి ఎసరు పెట్టారనీ, అయితే ఆ విషయం ఆమెకు తెలియదో.. లేక తెలిసినా అది రహస్య జీవో కనుక మరెవరికీ తెలియదన్న ధీమాయో కానీ వాసిరెడ్డి  పద్మ మాత్రం  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్‌ హోదాలో  రౌండే టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం,   వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు  జారీ చేయడం వంటి చర్యలతో నవ్వుల పాలౌతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   అయినా పదవి ఉందో.. ఊడిందో కూడా తెలుసుకోకుండా ఇలా నోటీసులు, జీవోలు, రౌండ్ టేబుల్ సమావేశాలంటూ హడావుడి చేయడం.. ఇంకోవైపు వరుస పెట్టి నోటీసులు జారీ చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి జగనన్న పదవి పీకేసిన సంగతి  ఇంతకీ వాసిరెడ్డి పద్మకు తెలుసా? లేదా? అనే సందేహాలు సైతం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోన్నట్లు సమాచారం.  వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  మూడు నెలలకు వాసిరెడ్డి పద్మను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ పదవిలో నియమించారు. ఈ పదవిలో ఆమె ఐదేళ్ల పాటు కొనసాగనున్నారని అందుకు సంబంధించిన జీవోని  సైతం ఈ ప్రభుత్వం విడుదల చేసింది.  దీంతో అసలు  లెక్క ప్రకారం 2024 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగాల్సి ఉంది.  అయితే జగన్ సర్కారు   సైలెంట్‌గా గుట్టు చప్పుడు కాకుండా  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవీ కాలాన్ని రెండేళ్లు కుదిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 24న గెజిట్‌ ప్రచురించింది. దీని ప్రకారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ యాక్ట్ -2023 మే 2023 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా జీవోఎంఎస్ నెంబర్ 23 జారీ  చేసింది. ఈ ఏడాది మే 9వ తేదీన ఈ జీవో జారీ అయినట్లు తెలుస్తుంది. మే 15వ తేదీ నుంచి  ఇది  అమల్లోకి వస్తుందని క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది. దీంతో ఆ రోజుతో వాసిరెడ్డి పద్మ పదవి కాలం ముగిసిపోయినట్లు అయింది. అయినా ఆమె ఇవేమీ పట్టకుండా.. జగనన్న స్ట్టైల్‌లో దూసుకోపోవడం చూస్తుంటే.. గంతకు తగ్గ బొంత అనే వ్యాఖ్యలు   పోలిటికల్ సర్కిల్‌లో  వినవస్తున్నాయి. అయినా పదవి పోయిన తర్వాత.. కూడా  ఇంకా ఆ పదవిలోనే ఉన్నట్లు వాసిరెడ్డి పద్మ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతోన్నాయి. అయినా వాసిరెడ్డి పద్మ భర్త వెస్లీకి ఎమ్మెల్యే సీటు ఇస్తే.. పార్టీలోకి వస్తానన్న ఒకే ఒక్క కండిషన్‌తో  అప్పట్లో ఆమె వైసీపీలోకి  ఎంట్రీ ఇచ్చారు. ఆ క్రమంలో 2014లోనే కాదు.. 2019 ఎన్నికల్లో కూడా ఆమె భర్తకు ఎమ్మెల్యే సీటు అయితే కేటాయించలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. దానిని కాంపన్ సేట్ చేయడానికే జగన్ వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారనీ, అయితే అది కూడా  కూడా మూడునాళ్ల ముచ్చటే అయిందని పరిశీలకులు చెబుతున్నారు.   ఏదీ ఏమైనా జగన్ ప్రభుత్వంలో జగనానందయ్య శిష్యులు లెక్కలు మిక్కిలి ఉన్నారని.. వారిలో వాసిరెడ్డి పద్మ అనే ఓ శిష్యు పరమాణువుగా చేరిపోయారనే ఓ వ్యంగ్య చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

లలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి తీవ్ర అస్వస్థత

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ అటవీ , పర్యావరణ శాఖా మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని పాట్నాలోని మెడివర్సల్ ఆసుపత్రికి తరలించారు. లాలూ యాదవ్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌కు ఛాతీ నొప్పి రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం.ఆరోగ్యం క్షీణించిన వెంటనే తేజ్ ప్రతాప్‌ను పాట్నాలోని మెడివర్సల్ ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడి వైద్యులు అతడిని పరీక్షిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ బుధవారం సాయంత్రం తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. నొప్పి తీవ్రమవడంతో, అతన్ని సమీపంలోని కంకర్‌బాగ్‌లోని మెడివర్సల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

పిల్లి సైకిలెక్కేయడం ఖాయమేనా?

జగన్ ఫ్యాన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన అడుగులో అడుగు వేసిన వారు.. ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పుడు అలా దూరమయ్యే వారి జాబితాలోకి వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా చేరిపోయారా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఇప్పటికే జగన్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేసి ఊరూ వాడా చుట్టేసి జగన్ సోదరి షర్మిల, కుమారుడి అరెస్టును నిరసిస్తూ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేసిన తల్లి విజయమ్మ,  అలాగే  జగన్ అంటే ప్రాణమిచ్చే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..  ఇప్పటికే జగన్ కూ, జగన్ పార్టీకీ దూరమయ్యారు.  తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన  మాజీ మంత్రి,  వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ వైసీపీకి గుడ్ బై చెప్పేసి సైకిలెక్కేసే ప్రయత్నంలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో నడిచి, జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు ఆయన జగన్ కు, జగన్ పార్టీకీ దూరం జరుగుతున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.   రామచంద్రపురం నియోజకవర్గ టికెట్ విషయంలో  మంత్రి వేణుగోపాలకృష్ణ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లుగా ఇరువురి మధ్యా విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో  ఆ  పంచాయతీ   పార్టీ అధినేత, సీఎం  జగన్ వద్దకు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు స్వయంగా ఫోన్ చేసినా.. ఈయన స్పందించ లేదని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  జగన్‌తోపాటు ఆయన తండ్రి వైయస్సార్ అంటే అత్యంత అభిమానం ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు ఇలా.. తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధపడుతున్నారంటే.. జగన్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురి కావడమే కారణమై ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.    పిల్లి సుబాష్ చంద్రబోస్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన   సన్నాహాలు చేసుకుంటున్నారు.  ఆయన తనయుడు సూర్య ప్రకాష్‌ సైతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.  అయితే వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం వైసీపీ టికెట్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ఇస్తామంటూ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ మిథున్ రెడ్డి ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆశలపై గోదావరి నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం అంటే జులై 16న వెంకటాయపాలెంలో తన వర్గంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ మారాలంటూ పిల్లిపై ఆయన వర్గం తీవ్ర ఒత్తిడి చేసిందనీ,  అలాగే ఆ భేటీలో వచ్చే ఎన్నికల్లో వేణుగోపాలకృష్ణ ఓటమే లక్ష్యంగా పని చేయాలనే ఓ తీర్మానం సైతం చేసినట్లు తెలుస్తోంది.   అలాగే ఎన్నికలు ఖర్చుతో కూడుకొన్న పని అని .. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే..  ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో  ఆయన తెలుగదేశం గూటికి చేరితే మేలన్న భావనను కూడా పిల్లి మద్దతు దారులు ఆభేటీలో వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అప్పుడు  జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న అన్ని సామాజిక వర్గాల ఓట్లు.. గంపగుత్తగా పిల్లి  ఖాతాలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ అభిప్రాయం సైతం ఈ భేటీలో ఆయన వర్గం నుంచి వ్యక్తమైనట్లు సమాచారం. అదీకాక.. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వకపోవడం.. అలాగే జిల్లా రాజకీయాల్లో పిల్లికి సరైన ప్రాధాన్యత లేకుండా పోవడం.. ఇక కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డితో ఘర్షణ జరగడం.. అదే విధంగా గత ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ గెలుపునకు పిల్లితోపాటు ఆయన వర్గం శాయశక్తులా శ్రమించి.. అన్ని విధాల సహకరిస్తే.. ఆ తర్వాత పిల్లి సుబాష్ చంద్రబోస్‌తోపాటు ఆయన వర్గాన్ని మంత్రి అండ్ కో లెక్క చేయని పరిస్థితి వచ్చిందనే ఓ విధమైన భావనలో పిల్లితోపాటు ఆయన వర్గం ఉందని... ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మారడం సహా మరో గత్యంతరం లేదని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే సాగుతోంది.

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ గ్రేటర్ హైద్రాబాద్ లో అతి భారీగా కురుస్తున్నాయి.  గ్రేటర్ లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ  జీహెచ్ఎంసీ అధికారులను  అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నెంబర్ 9000113667ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని టోలీచౌకి మరోసారి నీటమునిగింది. నిజాం కాలనీ, మీరాజ్ కాలనీ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. టోలిచౌకి ఫ్లైఓవర్ కింద డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. విద్యా సంస్థలకు సెలవు తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విటర్ వేదికగా మెసేజ్ పెట్టారు. ‘‘భారీ వర్షాల కారణంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించారు’’ అని ట్వీట్ చేశారు.

జగన్ పర్యటన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ప్లస్ అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. శ్రీపోట్టి శ్రీరాములు జిల్లాలో  శుక్రవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంకటగిరిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ  ఇన్ ఛార్జీగా నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని గతంలోనే నియమించిన సంగతి తెలిసిందే.  మరోవైపు   2019 ఎన్నికల్లో  వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆనం రామ్‌నారాయణ రెడ్డి గెలుపొందారు. కానీ ఆ తర్వాత.. జగన్ ఆయనకు పార్టీలో   సరైన గుర్తింపు ఇవ్వలేదన్న కారణంతో  ఆనం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రావడంతో  నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని  నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆనం పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రగ్గం సిద్దం చేసుకొన్నారని  అప్పట్లోనే పార్టీ శ్రేణుల్లో విస్తృత చర్చ జరిగింది. కాగా  ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడంతో...   పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు.. ఆనం రామ్‌నారాయణ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్లితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.  దీంతో సస్పెన్షన్ వేటు పడిన నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు టీడీపీ మద్దతు ప్రకటించించిన విషయం విదితమే. మరోవైపు గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 స్థానాలు జగన్ పార్టీ ఖాతాలో పడ్డాయి. కానీ ఇప్పుడు  ఆ పరిస్థితి లేదని.. వచ్చే ఎన్నికల్లో గంపగుత్తగా 10 స్థానాలూ టీడీపీ ఖాతాలో పడినా ఆశ్చర్య పోనక్కర్లేదనే ఓ ప్రచారం సైతం నెల్లూరు జిల్లాలో సాగుతోంది.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర.. ఇటీవల నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైన ప్రజా స్పందనతో సాగింది. మరో వైపు  జిల్లాలో వైసీపీలో అసమ్మతి ఆరున్కొక్క రాగం ఆలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో  జిల్లాలో సీఎం వైయస్ జగన్.. పర్యటన ఆసక్తిరేపుతోంది. ఆయన పర్యటన పార్టీకి మరీ ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ కు ఏమైనా ప్లస్ అవుతుందా? లేదా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే సాగుతోంది. 

ఇండియా vs ఎన్డీయే!

దేశంలో అసలు సిసలైన ఎన్నికల వేడి మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగా.. అధికార,ప్రతిపక్షాలు ఇప్పుడే సమర శంఖం ఊదేశాయి. ప్రతిపక్షం, అధికార కూటమి రెండూ ఒకదానిపై మరొకటి పై చేయి సాధించేందుకు కొత్త నిబంధనలను రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టాయి. రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయేని ఢీ కొట్టాలని చూస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా (ఇండియన్, నేషనల్, డెవలప్‌మెంట్, ఇన్‌క్లూజివ్, అలయన్స్) పేరిట వజ్రాయుధాన్ని సిద్ధం చేసింది. స్వయంగా రాహుల్ గాంధీనే తమ కూటమికి ఐఎన్డీఐఏ పేరును సూచించారు. దీనిని కూటమి పక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తమ కూటమి పేరును ఇండియాగా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ప్రధానమంత్రి కూడా ఎన్డీయేకి న్యూ ఇండియా, డెవలప్డ్ నేషన్, యాస్పిరేషన్ ఆఫ్ ఇండియాగా కొత్త అర్ధాన్ని తెరమీదకి తెచ్చారు. కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్‌  సహా 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి సమావేశం నిర్వహించగా..  ఢిల్లీలో జరిగిన ఎన్‌డిఎ సమావేశానికి బీజేపీతో సహా 38 పార్టీలు హాజరయ్యాయి. మంత్రి అమిత్ షా ఇది తమ బలప్రదర్శన అని ముందే ప్రకటించి రాజకీయ చతురతకి తెరలేపారు. ఒకవైపు ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశం,  మరోవైపు అధికార పక్షం ఎన్డీయే సమావేశాలు జరగడాన్ని దేశ రాజకీయాలలో కీలక పరిణామాలుగా పరిశీలకులు విశ్లేషించారు. అధికార, ప్రతిపక్ష కూటములు పోటాపొటీగా బలోపేతం అవుతున్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఎవరి బలం ఎంత అనే దానిపై అప్పుడే విశ్లేషణలు జోరందుకున్నాయి. రెండు కూటములలో అంతర్గతంగా జరిగే విషయాల్ని పక్కన పెడితే ఇరు పార్లమెంట్, అసెంబ్లీల్లో ఓట్లు, సీట్లను బట్టి ఈ రెండు కూటముల బలాబలాలపై చర్చ జరుగుతున్నది. వీటి ఆధారంగా వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటముల గురించీ చర్చ జరుగుతోంది. ఇరు కూటములలోని నేతలు ప్రత్యర్థి కూటములపై సవాళ్లు విసురుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతూ రెచ్చిపోతున్నారు.  దేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మేమంతా చేతులు కలిపామని ప్రకటించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్డీయే  ఇండియాను సవాలు చేయగలదా అని  ప్రశ్నించారు. ఇప్పటి వరకూ యూపీఏ, ఎన్‌డీఏ గురించి విన్నారు.. కానీ,   బీజేపీ,  భారత్‌ను సవాలు చేయగలరా? మేము మా మాతృభూమిని ప్రేమిస్తున్నాం.. మేము దేశభక్తులం’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్దాంతాలపైనే విపక్ష కూటమి పోరాటం చేస్తున్నదని.. ఇది బీజేపీ, విపక్ష పార్టీల మధ్య యుద్ధం కాదు, దేశ ప్రజల స్వతంత్రం, స్వేచ్ఛ కోసం చేస్తున్న యుద్ధంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. అధికారం కోసం దేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎదుర్కొనే తమ పోరాటం ఎన్డీయే వర్సెస్ ఇండియాగా ఉంటుందన్నారు. ఈ కూటముల మధ్య యుద్ధం ఏ అంశంపై ఉంటుందో ప్రతిపక్ష కూటమి నేతల మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.  వాస్తవానికి మన దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండే బలమైన పార్టీలు.   అయితే ఈ రెండు కూటములలో ఉన్న పార్టీలను గమనిస్తే మాత్రం బీజేపీ వెనుక ఉన్న పార్టీలలో అత్యధిక పార్టీలు అటు పార్లమెంటులో కానీ ఇటు రాష్ట్రాల అసెంబ్లీలలో కనీ కనీస ప్రాతినిథ్యం లేనివీ, ఉన్నా ఒకటీ అరా సీట్లు కలిగినవీ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కూటమిలో అంటే ఇండియా భాగస్వామ్య పక్షంలో అయితే రాష్ట్రాలలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న బలమైన పార్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకూ వీటి మధ్య ఐక్యతా లోపం వల్ల మాత్రమే బీజేపీ గత రెండు ఎన్నికలలో విజయం సాధించగలిగిదని పరిశీలకులు అంటున్నారు. ఆ అనైక్యత మటుమాయమై విపక్షాలన్నీ ఇండియాగా ఐక్యం కావడంతో బీజేపీలో ఒకింత కంగారు ప్రారంభమైందని అంటున్నారు. ఆ ఐక్యత సాకారం అవుతోందన్న సంకేతాల నేపథ్యంలోనే బీజేపీ హడావుడిగా ఈ తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే సమావేశంతో బలప్రదర్శనకు దిగిందని అంటున్నారు. మొత్తం మీద విపక్షాలు ఐక్యతారాగం వినిపించడంతో అధికార బీజేపీలో కంగారు మొదలైందని చెప్పవచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎన్డీయే వర్సెస్ ఇండియాగా హోరాహోరీగా జరగడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. 

మ్యానిఫెస్టో లేకుండానే ఎన్నికలకు?.. కేసీఆర్ వ్యూహమేంటో?

మేనిఫెస్టో.. ఎన్నికలలో రాజకీయ పార్టీలకు అసలు సిసలైన అను అస్త్రం ఇదే. ఐదేళ్ల తమ పాలనలో ప్రజలకు చేయబోయే సంక్షేమం, రాష్ట్రానికి చేయబోయే అభివృద్ధి, తమ ప్రభుత్వ పాలసీలు, తమ ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రజలకు ఇచ్చే హామీనే మ్యానిఫెస్టో అంటారు. ఈ మ్యానిఫెస్టో కోసం రాజకీయ పార్టీలు రకరకాల ఆలోచనలు, మేధావుల నుండి సలహాలు, వ్యూహకర్తలు సూచనలను తీసుకొని సిద్ధం చేస్తుంటారు. ఈ మ్యానిఫెస్టోలో ఇచ్చే హామీలను ఎంతవరకు నెరవేరుస్తారన్నది పక్కన ఉంచితే.. ఇది సిద్ధం చేయడంలో మాత్రం రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తులు వేస్తుంటాయి. తెలంగాణ విషయానికి వస్తే గత రెండు పర్యాయాలు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజా మ్యానిఫెస్టోగా తీసుకొచ్చారు. అయితే, ఈసారి మాత్రం కొత్తగా మ్యానిఫెస్టో అనేది లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. గత రెండు పర్యాయాలలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, మరెన్నో అభివృద్ధి పనులను చేసుకుంటూ వచ్చామని.. ఇప్పుడు వాటిని కొనసాగిస్తూ వెళ్తే సరిపోతుందని, గత రెండు పర్యాయాలలో హామీలు ఇచ్చి నెరవేర్చని వాటిని వచ్చే ప్రభుత్వంలో చేస్తామని హామీ ఇస్తూ ముందుకు వెళ్లడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధిలో లోటు పాట్లుంటే సరిదిద్దుకుని మరింత మెరుగ్గా అమలు చేస్తామని చెబితే సరిపోతుందని సీఎం కేసీఆర్ సన్నిహితుల వద్ద మాట్లాడినట్లు ఓ ప్రచారం బయటకి వచ్చింది. నిజానికి గడచిన రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని కేసీఆర్ ఇంకా అమలు చేయాల్సి ఉంది.  దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇప్పటికీ నెరవేరలేదు. దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇల్లు అందాల్సిన లబ్ది దారులు ఇంకా ఎందరో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీటన్నిటినీ వచ్చే ప్రభుత్వంలో అమలు చేస్తామన్న హామీయే మ్యానిఫెస్టోగా ఉంటే సరిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు, పేదల కోసం, విద్యార్ధుల కోసం బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలను ఇచ్చేసింది. అలాగే ఉద్యమ సమయంలో చేసిన హామీలు కూడా ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. అందుకనే కొత్తగా హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తున్నది. ఇపుడు అమలవుతున్నవి అలా కొనసాగిస్తూ, అమలుకు నోచుకోని వాటిపై దృష్టిపెట్టి ప్రతిపక్షాల నుండి విమర్శలు రాకుండా చేసుకోవాలన్నది కేసీఆర్ భావనగా పరిశీలకులు చెబుతున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇందుకు ఒప్పుకుంటారా అన్నదే చూడాల్సి ఉంది. ఎన్నికలంటే మ్యానిఫెస్టో.. మ్యానిఫెస్టోతోనే ఎన్నికలు అనేలా ఉంది ఇప్పడు పరిస్థితి. అలాంటిది మ్యానిఫెస్టో లేకుండా ఎన్నికలకంటే అది ఒక విధంగా సాహసమే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే కీలకమైన హామీలను ప్రజలలోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం అనే ప్రచారాన్ని ప్రజలోకి తీసుకెళ్తున్న కాంగ్రెస్.. కర్ణాటక తరహా ప్రజా మ్యానిఫెస్టోను తెలంగాణలో కూడా ప్రకటించాలని చూస్తున్నది. ఇలాంటి సమయంలో ఇప్పుడు చేసేదే చేస్తాం.. చేయనివి ఏమైనా ఉంటే అవి కూడా చేస్తామని చెప్తే జనం నమ్మే పరిస్థితి ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హామీలను ఇచ్చుకుంటూ వెళ్తేనే రాజకీయ పార్టీలకు ఆదరణ. ఫ్రీ ఫ్రీ అంటూ ఓటర్లను ఊరిస్తేనే తమ బ్యాలెట్ బాక్సులు నిండేది. మీ కులానికి ఇది మీ మతానికి ఇది అంటూ పంచి పెడతామంటేనే వేలు మీద సిరా పడేది. అవేమీ లేకుండా ఎన్నికలంటే కిక్కు ఉండదు.. ఓట్లు రాలడం కూడా అనుమానమే. మరి కేసీఆర్ సాబ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

అంతర్గత కుమ్ములాటలపై అధిష్టానం చేతులెత్తేసిందా?

ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో నేతలకు స్వేచ్ఛ ఉండదని రాజకీయ వర్గాల భావన. జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకూ అంతటా వ్యక్తుల ద్వారానే పార్టీలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలలో అయితే ఇది వ్యక్తి పూజ, భజన వరకూ వెళ్ళింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అయితే ఈ వ్యక్తి పూజ తారాస్థాయికి చేరి కనిపించింది. మొన్నామధ్య సినీ నిర్మాత బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వైసీపీ నేతలు తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని దైవాంశ సంభూతుడిగా కీర్తించి చెట్టెక్కించేశారు. జగన్మోహన్ రెడ్డిని మనిషి రూపంలో తిరిగే దేవుడిగా కీర్తించేశారు. ఆయన్ని ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని బజారుకి లాగి ఇష్టారాజ్యంగా తిట్టిపోసేవారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేలా వైసీపీలో ఒక్కరూ అధిష్టానం పెద్దలు గీసిన గీత దాటకుండా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ వస్తే తల తీసి చేతిలో పెడతాం అనేలా ఉండేవారు వైసీపీ నేతలు. కానీ, అదంతా ఒకప్పటి మాట   గతమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి  కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతలు ఎన్ని అంటున్నా వైసీపీ నేతలు ఒక్కరూ నోరు మెదపడం లేదు. పైగా అంతర్గత కుమ్ములాటలు కూడా పెచ్చుమీరిపోయాయి. అధిష్టానం గీసిన గీతలను ఎప్పుడో దాటేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాటల కత్తులు పట్టి సొంత పార్టీ నేతల మీదనే యుద్దానికి దిగుతున్నారు. ఇక్కడా అక్కడా అని లేకుండా శ్రీకాకుళం నుండి అనంతపురం వరకూ.. చిత్తూరు నుండి కర్నూలు వరకూ.. ఈస్ట్ గోదావరి నుండి కృష్ణా వరకూ ఏ జిల్లాకి వెళ్లి చూసినా వైసీపీ నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరింది.  హద్దులు దాటితే వేటు తప్పదన్న అధిష్టానం మాటలను బంగాళాఖాతంలో కలిపేసిన నేతలు సొంత పార్టీ నేతలనే ప్రత్యర్ధులుగా మార్చుకున్నారు. అంతర్గత కుమ్ములాటలో శ్రీకాకుళం ముందుండగా.. ప్రకాశంలో నాయకులు మాకు మేమే అధిష్టానం అనే స్థాయిలో అజమాయిషీ చెలాయిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు పార్టీ తెరచాప లేని నావలా ఊగిసలాడుతున్నది. కృష్ణా, గుంటూరు నేతలు కంటికి కూడా కనిపించకుండా చాప కింద నీరులా రాజకీయం చేసుకుంటున్నారు. రాయలసీమ వైసీపీ సంచిలో నాటు బాంబు ఎప్పుడు పేలుతుందో అనేలా పరిస్థితి మారిపోయింది. విశాఖ నేతలు పార్టీ మీద నమ్మకాన్ని వదిలేసుకున్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా వైసీపీ అధిష్టానం కిక్కురుమనడం లేదు. కుమ్ములాటలు వద్దు.. చర్యలు తప్పవని స్వయంగా జగన్  చెప్పినా మేము సిద్దమే అన్నట్లు నేతలు ఉన్నారే తప్ప ఎలాంటి జంకు కనిపించడం లేదు. కుమ్ములాడుతున్న నాయకులపై చర్యలు తీసువాల్సిన అధిష్టానం.. కనీసం పన్నెత్తి కూడా వారిని మందలించడం లేదు. రెబల్స్ లాగా మారి రెచ్చిపోతున్నా శాంతం శాంతం అంటున్నదే తప్ప నియంత్రించే దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు.  మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోగా నాది నీదీ అంటూ కీచులాడుకుంటున్నా అధిష్టానం సర్దిచెప్పేందుకు కూడా ప్రయత్రించడం లేదు.  ఎంపీలను కలుపుకుపోవాల్సిన ఎమ్మెల్యేలు మేమే రాజులం మేమే మంత్రులం అనేలా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నా పార్టీ అధ్యక్షుడు కూడా చూసీ చూడనట్లే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు వారు పార్టీలో ఉంటే చాలు అనేలా సీన్ మారిపోయింది.  ఏమైనా అంటే పొరుగు పార్టీల్లోకి జంప్ చేస్తారనే భయం వైసీపీ అగ్ర నాయకత్వంలో  స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తే అధిష్టానం చేతులేత్తిసిందనే భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. 

బిజెపి చేయలేని పని కాంగ్రెస్ చేసింది

ఆలయ పవిత్రతను కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 36 వేల  దేవాలయాల్లో మెబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా దైవ దర్శనం కోసం వచ్చే వారు ప్రశాంతత కోరుకుంటారు. కానీ దేవాయాల్లో మొబైల్ ఫోన్స్ మ్రోగితే భక్తుల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇంతకు మునుపు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ సెల్ ఫోన్లను నిషేదించలేకపోయింది. ఇటీవలె కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఆలయ పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్లను నిషేదించి  అమలు చేయడం పలువురు హర్షం వెలిబుచ్చుతున్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని వారి వాదన. 

స్పీడ్ న్యూస్ 3

41.  జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి మండిపడ్డారు.  బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె  మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి  రూ.8 వేల కోట్లకు పైగా   అప్పు చేసిందన్నారు.  ........................................................................................................................................................ 42.  వరంగల్ జిల్లాలో భారీ వర్షం కారణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు క్యాంపు కార్యాలయంలో భారీ వృక్షం నేలకూలింది.  ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.   ............................................................................................................................................ 43. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల సమయంకి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25.8 అడుగులకు చేరుకుంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది.   ............................................................................................................................................. 44. ఎల్‌ సాల్వడార్‌లో భారీ భూకంపం వచ్చింది. ప దీని తీవ్రత రికార్ట్ స్కేల్ పై 6.5గా నమోదయ్యింది. వెల్లడించింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ........................................................................................................................................   45.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మళ్లీ చీకటి రోజులు వస్తాయని మంత్రి మల్లారెడ్డి  అన్నారు.  రైతు వేదిక సభలో మాట్లాడిన ఆయన  రేవంత్ రెడ్డిని  రైతు వ్యతిరేగా అభివర్ణించారు. .................................................................................................................................................. 46. ఇంటర్ కాలేజీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 60 కోట్ల రూపాయలు మంజూరు చేసినా ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యపై సమీక్ష నిర్వహించిన ఆమె  మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.  ........................................................................................................................................ 47.  60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడూ రైతులను పట్టించుకోలేదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు  ఏడాది మూడు పంటలు కావాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలనీ, మూడు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని అన్నారు.  .................................................................................................................................................. 48. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీపీఔ నారాయణ రాజకీయ బ్రోకర్ అంటూ విమర్శించారు.  ఎన్డీఏతో పవన్ కలవడం  ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రమాదకరమని హెచ్చరించారు.   ................................................................................................................................................... 49.  మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.  డయాఫ్రమ్ వాల్, డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కారణంగానే ప్రాజెక్టు ఆలస్యమౌతోందన్నారు.  ........................................................................................................................................... 50. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న మంత్రి హరీష్ రావు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాల్సిందిగా వారిని కోరారు. వ‌ర్షాలు కురుస్తున్న‌ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల  వ్యాప్తి ముప్పు ఉన్నందున సమ్మె విరమించాలని హరీష్ అన్నారు. 

ప్రతిపక్ష కూటమికి దూరమైన మజ్లిస్ 

2012లో యుపీఏకూటమి నుంచి వైదొలగిన ఎంఐఎం కు ప్రతి పక్ష కూటమిలో భాగస్వామ్యం కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.  బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమిలో ఎంఐఎం కు కనీసం ఆహ్వానం అందకపోవడం గమనార్హం. మొత్తం 24 ప్రతిపక్ష పార్టీల్లో ఎంఐఎంకు చోటు దక్కకపోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భాగ్య లక్ష్మి వివాదం కేసులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలను అరెస్ట్ చేసింది. అప్పట్లో ఎంఐఎం కేవలం 7గురు శాసనసభ్యులను మాత్రమే కలిగి ఉంది.  గత నెలలో జరిగిన ప్రతిపక్ష కూటమి పాట్నాలో సమావేశమైనప్పుడు కేవలం 16 పార్టీలను ఆహ్వానిస్తే ప్రస్తుతం మరో 8 రాజకీయ పక్షాలకు ఆహ్వానం అందింది. అయినప్పటికీ ఆహ్వానం అందకపోవడంతో ఎంఐఎం వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఇటీవలె బీఆర్ఎస్ తో స్నేహ సంబంధాలను తెంచుకున్న ఎంఐఎం బిజెపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న టాక్ వినిపిస్తుంది. ఈ కారణంగా ఆహ్వానం అందకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.  గతంలో నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేసే అసద్ ప్రస్తుతం మెతక వైఖరి ప్రదర్శించడం కారణం కావొచ్చు అని తెలుస్తోంది. 

స్పీడ్ న్యూస్ 2

21.  యమునా నది   మళ్లీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని నగరం ఢిల్లీ మళ్లీ జలదిగ్బంధనంలో చిక్కుకుంది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్ లలో కురుస్తున్న తాజా వర్షాల కారణంగా యమున ఉప్పొంగి ప్రవహిస్తోంది.  ................................................................................................................................................... 22. జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.   అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల   కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ............................................................................................................................................ 23. సిటీ బస్సులో చిల్లర సమస్యకు చెక్‌ పెట్టేందుకు టీఎస్‌ఆర్టీసీ  టికెట్ల కొనుగోలుకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌  విధానాన్ని తీసుకురానుంది. దీంతో కండక్టర్‌కు డబ్బు చెల్లించకుండా   నగదు రహిత టికెట్‌ కొనుగోలు చేయడానికి వీలౌతుంది.   ..................................................................................................................................... 24. తిరుమల నడకదారిలో చిరుతపులి సంచారం భక్తులను భయపెడుతోంది. తాజాగా నిన్న రాత్రి  33 వ మలుపు వద్ద చిరుత సంచారాన్నిభక్తులు గుర్తించారు.  నడకదారిన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగానే  వెళ్లాలని ఫారెస్ట్ సిబ్బంది, టీటీడీ అధికారులు  సూచిస్తున్నారు.   ........................................................................................................................................ 25. రోడ్డు ప్రమాద మరణాలలో ప్రపంచంలోనే భారత్ అగ్ర స్థానంలో ఉంది. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా  ఏటా 15 లక్షల మంది మరణిస్తున్నారు.  ఈ వివరాలను ఫిక్కీ నివేదిక వెల్లడించింది. మానవుల మరణాలలో  రోడ్డు ప్రమాదాలు 8వ స్థానంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ....................................................................................................................................... 26.శంషాబాద్ విమానాశ్రయంలో 1.7 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంలో కొందరు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరిని అరెస్టు చేశారు. ....................................................................................................................................... 27.వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ సర్కార్ ను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. ................................................................................................................................................ 28. మూడు పంటలు, 24 గంటల కరెంటు అంటూ  బీఆర్ఎస్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని వైఎస్సీర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కనీసం ఎనిమిది గంటల కరెంటు కూడా ఇవ్వలేనోళ్లు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ట్వీట్ చేశారు. ................................................................................................................................................... 29. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీయే సమావేశానికి హాజరైన పార్టీలలో కొన్ని పార్టీల పేర్లే తాను ఎన్నడూ వినలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.  ఊరూపేరూ లేని పార్టీలు ఆ మీటింగ్ కు హాజరయ్యాయని విమర్శించారు.  ................................................................................................................................ 30. ఒడిశా బాలేశ్వర్లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో  రైలు  లూప్ లైన్లో ప్రవేశించింది. అయితే లోకోపైలట్ అప్రమత్తతతో  బ్రేకులు వేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.   ................................................................................................................................................................ 31.పెద్దపల్లి జిల్లా  రంగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు దుప్పి పడిపోయింది. ఇది  గమనించిన గ్రామస్తులు   దానిని బయటకు తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు గ్రామస్తులను అభినందించారు.  ................................................................................................................................................. 32. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై చర్చించేందుకు కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రేపటి నుంచి పర్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ......................................................................................................................................................... 33. విపక్షాల ఐక్యతా సమావేశానికి వేదిక అయిన బెంగళూరులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఒక వంతెనను నిర్మించలేని వ్యక్తి దేశానికి ప్రధాని పదవికి పోటీ పడటమా అంటే వెలిసిన పోస్టర్లను బెంగళూరు నగరపాలక సంస్థ తొలగించింది. ..................................................................................................................................................   34. ర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఐదుగురు అనుమానితులను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.   ...................................................................................................................................................... 35. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా  మరో సారి ఫైర్ అయ్యారు. పవన్  దళపతి కాదు దళారి అంటూ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబు కోసం జగన్  ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.   ......................................................................................................................................... 36. మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన  కేసీఆర్‌ కానుక పథకం దరఖాస్తులకు  రేపటితో గడువు ముగియనున్నది.   నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది.   ...................................................................................................................................................   37. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు   మహారాష్ట్ర పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని   వాటేగావ్‌ లో తుకారం భావురావ్‌ సాఠే జయంతి వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. మహాలో బీఆర్ఎస్ విస్తరణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.  ............................................................................................................................................. 38. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ   దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్‌ అరెకపూడి గాంధీ అన్నారు.   హఫీజ్‌పేట్‌ డివిజన్‌కు చెందిన  పలువురు వ్యాపారులు   బీఆర్‌ఎస్‌లో  చేరిన సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.   ................................................................................................................................................... 39.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిరాయాత్ నగర్ లో ఇద్దరు మహిళల దారుణ హత్య కలకలం రేపింది.   అక్క చెల్లెళ్లయిన మగ్గిడి గంగవ్వ (62 ) ,మగ్గిడి రాజవ్వ (72 )ను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో కొట్టి హత్య చేశారు. .............................................................................................................................................. 40. ఆగస్టు 8న పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్  జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియడానికి రోజుల ముందే రద్దు చేసేందుకు  పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం... వైసీపీ మైండ్ గేమ్ ఫెయిల్!

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట వలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. 'నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్', అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే' అనే క్యాప్షన్ తో ఒంగోలులోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఇటు ఎన్టీఆర్ అభిమానులలో.. అటు టీడీపీ వర్గాలలో కలకలం రేపాయి. ఎందుకంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలోనే జరుగుతున్నది. ఆదివారం రాత్రికి కందుకూరు నియోజకవర్గం నుండి కొండేపి నియోజకవర్గంలో అడుగుపెట్టిన లోకేష్ పాదయాత్రకు ప్రకాశం జిల్లా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సమయంలోనే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ పేరిట వెలసిన ఈ ఫ్లెక్సీలు తీవ్ర దుమారం రేపాయి. సహజంగానే ఈ ఫ్లెక్సీలు ఎవరిని ఉద్దేశించి ఏర్పాటు చేశారనే తీవ్రచర్చ జరుగింది. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో టీడీపీ నేతలు తేల్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు వెలవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా సార్లు వెలిశాయి. చంద్రబాబు సభలలో కూడా ఎన్టీఆర్ పేరుతో స్లొగన్స్ వినిపించాయి. ఈ మధ్య మహానాడులో కూడా ఎన్టీఆర్ పేరిట టీడీపీ జెండాలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈసారి లోకేష్ ని రెచ్చగొట్టేలా అందులో స్లోగన్లు రాయడంతో ఇది ఇంకాస్త కలకలం రేపింది. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అనే క్యాప్షన్ లోకేష్ ని టార్గెట్ చేస్తూ రాసిందేనని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే, గతంలో లేని విధంగా ఇలా టార్గెట్ చేయడం చూస్తే ఇది ఖచ్చితంగా వైసీపీ పనేనని స్పష్టమవుతుంది. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కూడా స్పందించి స్పష్టత ఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రకాశం జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులతో ఫోన్లో సంప్రదించి చర్చలు జరిపారు. ప్రకాశం జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో రాజకీయంగా కలకలం రేపిన ఫ్లెక్సీలకు జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎటువంటి సంబంధం లేదని విస్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై తాము ఇప్పటికే రాష్ట్ర అసోసియేషన్ కు సమాచారం అందించామని.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటులో తమ హీరోకు కానీ.. అభిమానులకు కానీ ఎలాంటి సంబంధం లేదని.. ఇది ఎవరి పని అనేది కూడా  తాము బయటపెడతామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే విషయంపై మాట్లాడిన  టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే  దామచర్ల జనార్దన్.. ఒంగోలు నగరంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే  దీని వెనుక ఎవరున్నారు, ఇది ఎవరి పని అన్నది  వెలికి తీశామన్నారు.  త్రోవగుంట పరిధిలో పనిచేస్తున్న అఫ్రిది అనే వాలంటీర్, త్రోవగుంట ఒకటవ డివిజన్ అధ్యక్షుడు సాంబశివరావులు ఈ ఫ్లెక్సీల విషయంలో ప్రధాన పాత్ర పోషించినట్లు గుర్తించామన్నారు. తమకు దక్కిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అసలు ఈ విషయంపై పూర్తి ఆధారాలు తమకు లభించాయన్నారు. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో, తెలుగు తమ్ముళ్ళ దృష్టిని మరల్చేందుకు వైసీపీ పన్నిన కుట్రే ఇది అని తేల్చేశారు. ఈ ఫ్లెక్సీలను కట్టిన సాయి అనే కుర్రాడే తమకు పూర్తి విషయాలను వెల్లడించారని జనార్దన్ చెప్పారు. దీంతో ఎన్టీఆర్ పేరిట వెలసిన ఈ ఫ్లెక్సీలు వైసీపీ మైండ్ గేమ్ అని అన్ని వర్గాలకు స్పష్టత వచ్చేసింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇలాంటి మైండ్ గేమ్స్ తో టీడీపీని దెబ్బతీయాలని చూడడం కూడా కొత్తేమీ కాదు. కొడాలి నానీ, లక్ష్మి పార్వతి లాంటి వాళ్ళతో నందమూరి, నారా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు వేసిన ఎత్తులు చాలానే  ఉన్నాయి. ఇప్పుడు ఇలా వాలంటీర్ల ద్వారా కూడా వైసీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేసింది. అయితే, 24 గంటలలోనే ఇది వైసీపీ నేతల పనేనని తేలిపోవడంతో రాజకీయాల వర్గాలలో వైసీపీ నేతలు మరింత చులకనయ్యారు.

మహేశ్వరం టీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా తీగల??

మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హైదరాబాద్ మేయర్ తీగల కృష్ణారెడ్డి  కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయి. ఎ ఐసీసీ తెలంగాణ ఇన్ చార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయితే మహేశ్వరం నియోజనవర్గం టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరతానని తీగల కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. తర్వాత బిఆర్ ఎస్ లో చేరారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నియోజకవర్గం పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు. 2014లో ఇదే మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగా రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో మల్ రెడ్డి రంగా రెడ్డి కూడా ఉన్నారు. రంగా రెడ్డి జిల్లాలోని మీర్ పేట నుంచి తీగల రాజకీయ జీవితం టీడీపీ నుంచి ప్రారంభమైంది. హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గాంధీనగర్ డివిజన్ నుంచి కార్పోరేట్ గా గెలుపొంది హైద్రాబాద్ మేయర్ అయ్యారు. మేయర్ గా మంచి గుర్తింపు సంపాదించారు. 

నిధుల లేమితో ఆగిన బీసీ బంధు?

బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన బీసీ బంధు లక్షరూపాయల సాయం ఆగిపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎన్నికల సీజన్ లో తమకు ఆర్థిక సాయం అందుతుంది అని భావించిన ప్రజానీకానికి చేదు వార్తే.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం 5లక్షల 28వేల 862 అప్లికేషన్లు వచ్చాయి. క్రమసం‌‌ఖ్య ప్రకారం దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. ప్రతినెల 5వ తేదీన వెరిఫికేషన్‌ పూర్తి కానుండగా...15వ తేదీన స్థానిక ఎమ్మెల్యేలతో ప్రభుత్వం లబ్ధిదారులకు చెక్కులు అందజేయనుందని తొలుత వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. మరో వైపు ప్రతి పక్షాలు బీసీ బంధు ఎన్నికల జిమ్మిక్కు అని ఆరోపించిన సంగతి తెలిసిందే.బీసీ బంధు అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు గండిపడవచ్చని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు సమాచారం. నిధుల లేమితో పథకాన్ని ఆపే బదులు ముందే పథకాన్ని నిలుపదల చేయాలని భావించినట్లు తెలుస్తోంది

స్పీడ్ న్యూస్ 1

1.ఢిల్లీ వాసులను పాములు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదలలో పాములు కొట్టుకు వస్తుండటం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నది.   రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఓల్డ్ రైల్వే బ్రిడ్జి సమీపంలోనే ఏకంగా పాతిక పాములను పట్టుకున్నారంటే   తీవ్రత అర్ధమౌతోంది. ............................................................................................................................................... 2. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తువుల ధరలతో పాటు అడ్డగోలు పన్నులను తగ్గిస్తామని  లోకేష్ అన్నారు. .కొండపి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  జగన్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు.   .................................................................................................................................. 3.  వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీయే సమావేశంలో మాట్లాడిన ఆయన తాము విపక్షంలో ఉన్నప్పుడూ సానుకూల రాజకీయాలు చేశామే తప్ప విదేశాల నుంచి సహకారం తీసుకోలేదని చెప్పారు.   ........................................................................................................................................ 4.ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైఅట్రాసిటీ కేసు నమోదుకు  చిత్తూరు కోర్టు ఆదేశించింది. మంత్రి ఎస్సీలను అవమానించేలా మాట్లాడారంటూ చిత్తూరు జిల్లా కోర్టులో మాజీ జడ్డి రామకృష్ణ దాఖలు చేసిన ప్రైవేటు కేసుపై చిత్తూరు కేసు బీ కొత్త కోట పోలీసులకు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కేసుకు సంబంధించి విచారణ నివేదిక అందించాలని ఆదేశించింది.  .................................................................................................................................. 5.కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,   సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం అత్యవసరంగా భోపాల్ లో ల్యాండ్ అయింది. ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు వారు బెంగళూరు వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. .................................................................................................................................. 6. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన ఆయన ఇస్లామిక్ ప్రపంచానికి, ముఖ్యంగా అరబ్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేరువకావడం ఆదర్శప్రాయమన్నారు. మోడీ  విదేశాంగ విధానం బాగుందన్నారు. .................................................................................................................................. 7.   రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి తప్పించాలంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ అధిష్ఠానానికి బహిరంగ లేఖ రాశారు.  రేవంత్ రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని అవమానించారనీ, అలాగే ప్రజలను కులాల పేరుతో కించపరుస్తున్నారనీ ఆ లేఖలో ఆరోపించారు. .................................................................................................................................. 8. ప్రముఖ రచయత శ్రీరమణ కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. మిథునం,మరియు ఎన్నో కథలు,నవలల రచయిత శ్రీ శ్రీ రమణ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన రాసిన మిథునం కథ  అదే పేరుతో సినీమాగా వచ్చింది.   ................................................................................................................................... 9. హైదరాబాద్ నగరాన్ని  ముసురు కమ్మేసింది. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా జోరుగా  వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచీ కురిసిన వర్షానికి పలు తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.   ..................................................................................................................................   10.తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం అంటూ జూలై 18న శ్రీవారిని 64వేల మంది దర్శించుకున్నారు. 24 వేల 659 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  హుండీ ఆదాయం మూడు కోట్ల 6 లక్షలు వచ్చింది. .................................................................................................................................. 11. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష కూటమితోపాటు అధికార ఎన్డీయేకు సమాన దూరం పాటించాలని టీడీపీ నిర్ణయించింది.  బీఎస్పీ, బీజేడీ, జేడీఎస్, బీఆర్ఎస్,   వంటి పార్టీలు కూడా ఈ రెండు కూటములకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి.  .................................................................................................................................. 12.  టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం   వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుంది.   టీటీడీ బోర్డు నియమాకంపై సమీక్ష అనంతరం జగన్  జంగా నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. .................................................................................................................................. 13. పరువునష్టం కేసులో   సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది.  చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని  అమ్ముకుంటున్నారని  జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. 14. తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి  జిల్లాల‌ క‌లెక్ట‌ర్లు, ముఖ్య అధికారుల‌తో మాట్లాడారు. సీనియర్ అధికారులతో  టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. .................................................................................................................................. 15. ఏపీలో  పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఎన్​డీఏ పక్షాల భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయన్నారు. .................................................................................................................................. 16. ప్రయాణికులకు బీమా సదుపాయాన్ని కల్పించాలని  రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందు కోసం రైల్వే టికెట్‌ బుకింగ్‌లో  మార్పులు తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో  టికెట్‌ బుక్‌ చేసుకొనే సమయంలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం బీమా ఆప్షన్‌ ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ..................................................................................................................................   17. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  ఈ నెల 21న  బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కిషన్‌రెడ్డి  నేడు స్వదేశానికి చేరుకోనున్నారు.  .................................................................................................................................. 18. ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.  ఈనెల 24 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు.  19. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్‌ కార్డులను అందించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్డులను స్థానిక   ప్రజాప్రతినిధుల ద్వారా  లబ్ధిదారులకు అందించనున్నారు.  ...................................................................................................................................................... 20. ఏపీలో  వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది. 

కల్వకుంట్ల వారసుడికి కొత్త తలనొప్పులు!

తెలంగాణ ముఖ్యమంత్రి, కారు పార్టీ అధినేత కేసీఆర్ వంశాంకురం, మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్‌ రావుకి కొత్త తలనొప్పులు మొదలైయ్యాయి. అది కూడా హైదరాబాద్ మహనగరం నడిబొడ్డు నారాయణగూడ నుంచే కావడంతో.. ఈ అంశం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.  గచ్చిబౌలి కేశవనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలను హిమాన్ష్ దత్తత తీసుకొని.. కోటి రూపాయిల నిధులు సేకరించి.. సదరు పాఠశాలను అభివృద్ధి చేయడంతో.. అదే తరహాలో తమ పాఠశాలను కూడా దత్తత తీసుకోవాలంటూ.. నారాయణ గూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఆందోళనకు దిగారు. అంతేకాదు.. తమ పాఠశాలను సైతం దత్తత తీసుకోవాలంటూ వారు విజ్జప్తి చేశారు.  అక్కడితో ఆగకుండా.. ప్రభుత్వ పాఠశాలలపైన హిమాన్ష్ అన్నయ్యకు ఉన్న శ్రద్ధ విద్యాశాఖ మంత్రికి లేదంటూ సబితా ఇంద్రరెడ్డికి విద్యార్థులు చురకలంటించేశారు. ఏఐవైఎప్, బాల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డలతో హిమాన్షు అన్నయ్య.. తమ పాఠశాలను బాగు చేయాలంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. తమ బాత్‌రూమ్ డోర్లు విరిగిపోయాయని.. పాఠశాలకు ప్లే గ్రౌండ్ కూడా లేదని.. కంప్యూటర్లు సైతం లేవని విద్యార్థలు.. తమ సమస్యలను ఈ ఆందోళనలో ఏకరువు పెట్టారు. ఈ నేపథ్యంలో తమ పాఠశాలను కూడా దత్తత తీసుకొని తాము చదువుకునేందుకు సహకరించాలంటూ హిమాన్ష్‌కు విద్యార్థులంతా ముక్కుమ్మడిగా విజ్జప్తి చేశారు.  మరోవైపు రాష్ట్రంలో 24 వేల పాఠశాలలు ఉన్నాయని.. వాటి పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉన్నాయని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపించారు. మన బస్తీ.. మన బడి పేరుతో ఈ ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన.. నిధులు మాత్రం పలువురికి పలహారంగా మారాయని వారు విమర్శించారు.      మరోవైపు సీఎం కేసీఆర్ మనవడు హిమాన్ష్ రావు.. ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని.. దానిని అభివృద్ది చేయడం.. ఆ క్రమంలో నూతనంగా తయారైన  పాఠశాల ప్రారంభ కార్యక్రమంలో.. హిమాన్ష్ మాటలకు ప్రపంచంలోని తెలుగు వారంతా ఫిదా అయిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే.  అయితే హిమాన్ష్ చేసిన ఈ చిరు ప్రయత్నంపై విమర్శలు సైతం గుప్పించి వారు తెలంగాణ సమాజంలో లేకపోలేదు. తెలంగాణ వచ్చి 9 ఏళ్లు అయిందని.. నిన్న కాక మొన్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సైతం అంగరంగ వైభవంగా నిర్వహించారని.. అలాంటి హిమాన్ష్ తాతగారి ఏలుబడిలో.. తండ్రి ప్లస్ మంత్రి కేటీఆర్ గారి హయంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఇలా ఉందంటూ సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇక హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో.. అదీ గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో.. మారుమూల ప్రాంతంలోని  ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంటుందని నెటిజన్లు ఓ విధమైన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదీకాక హిమాన్ష్ అభివద్ధి చేసిన పాఠశాల పరిస్థితి పూర్వం ఎలా ఉందో.. సాక్షాత్తూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే అతడు చెప్పిన మాటల ద్వారా తేటతెల్లమవుతోందని.. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ.. నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు.   ఓ ప్రభుత్వ పాఠశాలను ఓ ఎన్నారై లేదా ఓ ఎన్జీవో సంస్థ ఇంతలా అభివృద్ధి చేస్తే.. దానికి ఇంత హైప్ ఇస్తారా? ఇవ్వరని.. ప్రభుత్వాధినేత మనవడు కనుక హిమాన్ష్‌కు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఇంతగా ప్రచారం చేస్తున్నారనే ఓ టాక్ సైతం వైరల్ అవుతోంది.  ఏదీ ఏమైనా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబులాగా ఊరు మొత్తన్ని కాకపోయినా.. ఓ పాఠశాలను హిమాన్ష్ దత్తత తీసుకోవడం.. వల్ల ఓ మంచి పని జరిగినా.. ఆతడి తాతగారి పాలనలో గత తొమ్మిదేళ్లుగా బంగారు తెలంగాణ అంటూ తెగ గప్పాలు కొట్టుకొన్నా.... తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మాత్రం పైన పటారం..లోన లోటారం అన్న చందంగా ఉందని.. అదీకూడా కేసీఆర్ ఫ్యామిలీ ద్వారానే అది బహిర్గతమైందనే ఓ అబిప్రాయం సైతం తెలంగాణ సమాజంలో ఊపందుకోవడం గమనార్హం.

జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు!

సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు షాక్ తగిలింది. గతంలో వారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై చేసిన ఆరోపణల కేసులో వారికి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. రక్తం అందక ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి తన పేరుతో బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. అయితే ఆ బ్లడ్ బ్యాంక్ పై 2011 లో జీవిత, రాజశేఖర్ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లడ్ బ్యాంక్ పేరుతో దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అల్లు అరవింద్ అప్పట్లో కోర్టుని ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం నాడు తీర్పు వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ దంపతులకు రూ.5000 జరిమానాతో పాటు ఏడాది శిక్ష జైలు శిక్ష విధించింది. జరిమానా చెల్లించడంతో వారికి పైకోర్టుకి వెళ్లే అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది.