వైసీపీకి షాక్ తెలుగుదేశం గూటికి యార్లగడ్డ.. ముహూర్తం ఖరారు?

వైసీపీకి  జిల్లాల వారీగా నేతలు షాకులిస్తున్నారు. ఇప్పటికే బహిష్కృత ఎమ్మెల్యేలు గంపగుత్తగా టీడీపీ జెండా కిందకి వెళ్తుంటే మొన్న ఉత్తరాంధ్ర నుండి విశాఖ జిల్లా అధ్యక్షుడే పార్టీకి గుడ్ బై చెప్పేశాడు. ఇక ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా  నుండి మరో షాక్ సిద్దమవుతున్నది. రాజధాని అమరావతికి అటు కృష్ణా, ఇటు గుంటూరు ఉమ్మడి జిల్లాలు ఈసారి ఎన్నికలకు ఎంతో కీలకం అన్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల పుణ్యమా అని ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో ఈసారి వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది ఎప్పటి నుండో రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాలో చాలా మంది నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఇప్పుడు గన్నవరం వైసీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు దారి చూపించేలా ఉన్నారు. యార్లగడ్డ వైసీపీని వీడి సైకిలెక్కేందుకు సిద్దమైనట్లు ఇక్కడ రాజకీయ వర్గాలు గట్టిగా చెప్తున్నారు. నిజానికి చాలా కాలంగా యార్లగడ్డ పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఆయన పార్టీ మారలేదు. వైసీపీ అధిష్టానం తనకు ఏదైనా హామీ ఇస్తుందేమో అని చాలాకాలంగా ఎదురు చూశారు. కానీ, అటు సీఎం జగన్ నుండి కానీ, వైసీపీ పెద్దల నుండి కానీ యార్లగడ్డ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెలలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఎంటర్ కాబోతుంది. దీంతో అప్పుడే యార్లగడ్డ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు చెప్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేసి తన సత్తా చాటుకోవాలని యార్లగడ్డ సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇందుకు తగ్గట్లే తాజాగా యార్లగడ్డ తన అనుచరులతో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని చర్చలు జరిపినట్లు తెలిసింది.  అమెరికాలో పలు బిజినెస్‌లు చేసే యార్లగడ్డని వైసీపీ పనిగట్టుకొని 2019 ఎన్నికల సమయంలో  పార్టీలోకి తెచ్చుకుంది. అప్పుడు తెలుగుదేశం నుండి గన్నవరం బరిలో ఉన్న వల్లభనేని వంశీని ఓడించాలని యార్లగడ్డని గన్నవరం బరిలో నిలబెట్టి భారీగా ఖర్చు పెట్టించారు. కానీ  తెలుగుదేశంకు గట్టి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలవలేకపోయింది. అయితే  ఎన్నిక‌లు అయ్యాక‌ రెండు మూడు నెలలకే వంశీ టీడీపీని విడిచి వైసీపీ పంచ‌న చేరారు. అధికారికంగా పార్టీ కండువా క‌ప్పుకోక‌పోయినా వంశీ వైసీపీకి అనుబంధంగానే కొన‌సాగుతున్నారు. అప్పటి నుండి  అమెరికా నుండి తీసుకొచ్చి ఖర్చు పెట్టించిన యార్లగడ్డను వైసీపీ పక్కన పెట్టేసింది. ఆది నుంచి ఇక్క‌డ వైసీపీని డెవ‌ల‌ప్ చేసిన యార్లగడ్డను కాదని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ త‌ర‌ఫున వంశీ ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నట్లు తెలుస్తుంది.  దీంతో కొంతకాలంగా వంశీపై బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్న యార్లగడ్డ.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ ఎమ్మెల్యే వంశీకి వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పుడు వైసీపీని వీడి పసుపు సైన్యంలో చేరనున్నారు. దీంతో ఉమ్మడి కృష్ణాలో ముమ్మర చర్చ జరుగుతుంది. యార్లగడ్డ టీడీపీలో చేరితే వల్లభనేని వంశీ ఇక గన్నవరంపై ఆశలు వదులుకోవాల్సిందే అనే ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ఆర్ధికంగా బలంగా ఉన్న యార్లగడ్డ ఏది ఏమైనా ఈసారి వంశీని ఓడించాలని బలంగా నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలలో కూడా వంశీకి గట్టి పోటీ ఇచ్చారు. కానీ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో వంశీ గెలిచారు. అయితే, ఈసారి రాజధాని అంశం, ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు యార్లగడ్డపై సానుభూతి కూడా తోడవనుంది. ఈ క్రమంలో వంశీకి ఈసారి గన్నవరంలో ఎదురీత తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ గాక గతంలో  మొత్తం తెలుగుదేశం గంపగుత్తగా వంశీ వెనుక నిలబడింది. ఇప్పుడు వైసీపీ శ్రేణులు గన్నవరంలో వంశీకి మద్దతు ఇచ్చే పరిస్థితులు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు. 

విద్యుత్ బిల్లులపై నాడు ప్రవచనాలు.. నేడు బాదుడే బాదుడు!

అక్కల్లారా, అవ్వల్లారా.. మీ తమ్ముడు, మీ మనవడి ప్రభుత్వం వస్తుంది.. కరెంట్ బిల్లులు పూర్తిగా తగ్గిస్తా. చెల్లమ్మా వింటున్నావా.. ఆ దేవుని దయతో వచ్చేది మన ప్రభుత్వమే, తాతా వింటున్నావా.. మీ అందరి దీవెనలతో మీ మనవడి ప్రభుత్వం వస్తుంది. ఉప్పు పప్పు నుండి కరెంట్ బిల్లుల వరకూ అన్నీ ఫ్రీ ఫ్రీ. ఇదీ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఫ్యాన్ చేత పట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి చెప్పిన మాటలు. ఇక సీఎంగా జగన్ ప్రమాణస్వీకార వేదికపై కూడా ఇవే వల్లె వేసి చెప్పారు. కరెంట్ బిల్లుల విషయంలో విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి, విద్యుత్ చార్జీలను పూర్తిగా తగ్గిస్తానని చెప్పారు. ఈ ప్రమాణస్వీకారంలో తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో జగన్  ఈ ప్రకటన చేశారు. దీంతో ప్రజలు జగన్ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు.  మాట తప్పడు.. మడమ తిప్పడు అనుకున్న జగన్.. బిల్లులు తగ్గించడం దేవుడెరుగు ఏడాది తిరిగేసరికి ఆ బిల్లులను రెట్టింపు చేయడం మొదలు పెట్టి మడమ తిప్పడమే కాదు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి వెన్ను చూపారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా బాదుడే బాదుడు కనిపిస్తున్నది. ఎన్నికలకు ముందు గల్లీ గల్లీ తిరిగి చెప్పిన ఆ అవ్వా తాతా ఎటుపోయారో.. మాట ఇచ్చిన అక్క చెల్లెళ్ళను ఏం చేశారో కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో నిత్యావసర ధరలు చూస్తే కొండెక్కి కూర్చున్నాయి. విద్యుత్ బిల్లులు ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయి. రేషన్ డోర్ డెలివరీ అని కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి బళ్ళు, వాటిలో ఇద్దరు మనుషులను పెట్టిన సంగతి తెలిసిందే. పావలా కోడికి ముప్పావలా మసాలా పెట్టినట్లు ఈ డోర్ డెలివరీ రేషన్ రాలేదు.. అంతకు ముందు రేషన్ లో వచ్చే సరుకులు రావట్లేదు.  ఇక కరెంట్ బిల్లుల విషయానికి వస్తే నెలనెలా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులతో పోలిస్తే.. జగన్ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు వంద శాతం పైనే పెంచుకుంటూ వచ్చారు. పైగా ఈ ఏడాదిలో ఇది 200 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంతకు ముందు రెండు నెలలకి ఒకసారి రూ.200 బిల్లులు వచ్చేవారికి ఇప్పుడు నెలకి రూ.400 వరకూ వచ్చి నడ్డి విరుగుతోంది. రెండు నెలలకి ఒకసారి బిల్లులు ఇస్తే ఈ మొత్తం భారీగా కనిపిస్తుందనే నెల నెలకి రీడింగ్ తీసి బిల్లులు చేతిలో పెడుతున్నారు. పైగా ఈ బిల్లులకు తోడు సర్ చార్జీలనీ, సర్దుబాటు చార్జీలనీ, అదనపు చార్జీలనీ, ట్రూ అప్ చార్జీలనీ, పవర్ పర్చేజ్ చార్జీలనీ ఎలా కావాలంటే అలా కలుపుకొని ప్రజల నడ్డి విరుస్తున్నారు.  తొలిసారి బిల్లులు పెంచే సమయంలో ప్రభుత్వం త‌క్కువ విద్యుత్ ను వినియోగించే వారిపై ఎలాంటి భారం ప‌డ‌ద‌ని చెప్పింది. కానీ మూడేళ్ళలో శ్లాబ్ ల వారీగా భారీగా ధ‌ర‌లు పెంచేసి జ‌నాన్ని పిండేశారు. ఇదేంటని అధికారులను ప్రశ్నించినా.. వినియోగించిన విద్యుత్ కు సంబంధించిన శ్లాబ్ ల వారీగా పెరిగిన బిల్లులే వేశాం.. క‌ట్టి తీరాల్సిందేన‌ని స‌మాధానాలు వస్తున్నాయి. గత మూడేళ్ళలో ఐదు సార్లు విద్యుత్ బిల్లులు పెంచగా.. తాజాగా ఈ ఏడాది మే నెలలో కూడా మరోసారి భారం వేశారు. ఇంధన సర్దుబాటు పేరిట యూనిట్ కు 40 పైసల వంతున మే నెల నుండి బిల్లుతో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఈ వసూళ్లు ఒక్కో స్లాబ్ లో ఒక్కోలా పెరుగుతూ పోతూ ఉండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు రూ.600 విద్యుత్ బిల్లయితే మరో రూ.500 చార్జీలను కలిపి ప్రజలపై భారం మోపుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఎంతలా బాదేస్తుందో చూడండి అంటూ ప్రజలు తమ విద్యుత్ బిల్లులను సోషల్ మీడియాలో పెడుతూ బాదుడే బాదుడు అంటూ జగన్ మీద ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల బిల్లుల మోతకు ప్రభుత్వం చార్జీలు తోడై వినియోగదారులు కుదేలౌతున్నారు. కరెంటు బిల్లంటేనే షాక్ కొట్టినట్లు కొయ్యబారిపోతున్నారు. ఏపీ ప్రజలకు విద్యుత్ బాదుడు ను జగన్ సర్కార్ ఐదు రకాలుగా బాదేస్తోంద. ఫిక్సెడ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, విద్యుత్ డ్యూటీ,  ట్రూఆప్ చార్జీలు (1136), ఇంధన సర్దుబాటు (ఎఫ్ పీపిసీఏ చార్జీలు (52021), ఇంధన  సర్దుబాటు (ఎఫ్ పిపి సిఏ చార్జీలు) (42023) ఇందులో  ఫిక్స్ డ్  చార్జీలు అంటే మన ఇంటికి కరెంటు రావటానికి  లైన్లు, సబ్‌ స్టేషన్లు , ట్రాన్స్‌ ఫార్మర్లు వగైరా వేయాలి.  వాటికి చేసిన ఖర్చును వసూలు చేయడాన్ని ఫిక్స్‌డ్‌ చార్జీలు అంటారు.  మన ఇంటికి కనెక్షన్‌ తీసుకునేటప్పుడు 2 కేవీ, 4 కేవి, 5 కేవి  అలా మన అవసరాన్ని బట్టి తీసుకుంటాము. ఒక కేవి కి రు.10లు చొప్పున ఎన్ని కేవీ లోడు ఉంటే అన్ని 10లు వసూలు చేస్తున్నారు. ఇవి ఎల్లప్పుడూ కొనసాగుతాయి.   కరెంటు లైన్లు వేసి ఎప్పుడో 30 ఏళ్లకు పైగా అయిన ప్రాంతాలలో కూడా ఇప్పుడు ఈ చార్జీలు  వసూలు చేస్తున్నారు.  అలాగే కస్టమర్‌ చార్జీలు అంటే  మన ఇంటికి కరెంటు సప్లై చేసినందుకు వేసే చార్జీలు. ఇవి  మనం నెలలో వాడుకునే యూనిట్ల శ్లాబును బట్టి రు25,రు.30,రు.45,రు.50,రు.55లు గా ఉన్నది. ఇక  విద్యుత్ డ్యూటీ  అంటే మనం విద్యుత్‌ వాడుకున్నందుకు  ప్రభుత్వానికి కట్టే పన్ను. ఇది యూనిట్‌ కు  6 పైసలు వసూలు చేస్తున్నారు. షాపులకు అయితే యూనిట్‌కు 1 రూపాయి వసూలు చేస్తున్నారు.    ట్రూ అప్‌ చార్జీలు అంటే 2014 నుండి 2019 వరకు వాడిన విద్యుత్‌ పై రు.3,013 కోట్ల రూపాయలు ప్రజలనుండి 36 నెలలో వసూలు చేయబోతున్నారు. అవే మనకు బిల్లులో  True-Up Charges (11/36) పేరుతో ఉన్నాయి. ఆనాడు అంటే 2014 నుండి 2019 వరకు మనం వాడిన యూనిట్లకు యూనిట్‌ కు 0.22 పైసల చొప్పున వసూలు చేస్తున్నారు.   వీటిని ఆగస్టు 2022 నుండి జులై 2025 వరకు వసూలు చేస్తారు.  ఆతర్వాత 2019 నుండి 2021 వరకు వసూలు చేస్తారు. ఇక ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges) అంటే  2021-2022 ఆర్థిక సంవత్సరానికి వాడిన కరెంటుకు ఇప్పుడు వసూలు చేస్తున్నారు.  అవే మనకు ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో (FPPCA charges (5/2021)   బిల్లులో ఉన్నాయి. ఆనాడు మనం వాడిన కరెంటుకు యూనిట్‌కు ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు 0.20 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. జులై నుండి సెప్టెంబరు వరకు యూనిట్‌కు 0.63 పైసలు, అక్టోబర్‌ నుండి డిశంబరు వరకు యూనిట్‌కు 0.57 పైసలు, జనవరి నుండి మార్చివరకు యూనిట్‌కు 0.66 పైసలు చొప్పున వసూలు చేస్తారు.  ఈ వసూళ్ళు అయిన అనంతరం   2022-2023 ఆర్థిక సంవత్సరానికి తర్వాత వసూలు చేస్తారు.  ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges) అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సం అంటే 2023-2024 లో వాడిన కరెంటుకు ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అవే మనకు ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges (4/2023 )) పేరుతో బిల్లులో ఉన్నాయి. ఇవి ఇక మీదట ప్రతి నెలా కొన సాగుతాయి.

ఉండవల్లి శ్రీదేవి.. నాలుగు నెలల మౌనం వీడినట్లేనా?

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రత్యక్షమయ్యారు. దాదాపు నాలుగు నెలల తర్వాత... అది కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ సందర్శిస్తున్న సమయంలో ఆయనతో ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పార్టీ మార్పుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని తెలిపారు. అలాగే చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మాట్లాడిట్లు ఈ సందర్బంగా వెల్లడించారు. కానీ దాదాపు నాలుగు నెలల పాటు ఎవరికీ కనిపించకుండా ఉండడంతో.. ఉండవల్లి శ్రీదేవి ఏమయ్యారన్న ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది.  ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క టీడీపీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ బరిలో దిగారు. అయితే ఆమె అనూహ్యంగా గెలుపోందడంతో.. అధికార ఫ్యాన్ పార్టీ అధిష్టానం... అదే పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు... కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామ్‌నారాయణ రెడ్డి కాగా.. మరొకరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.  నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. సస్పెన్షన్ వేటు కొద్ది రోజులకు తెలుగుదేశం పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. అలాగే  సదరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో క్రియాశీలంగా రాజకీయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ శ్రీదేవి మాత్రం తనపై సస్పెన్షన్ వేటు పడిన వెంటనే.. ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేసి.. ఆ తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఎవరికీ కనిపించకుండా గాయబ్ అయిపోయారు.  మరోవైపు ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోందని.. ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఎక్కడా కనిపించకుండా ఉన్నారనీ ఆమె నియోజకవర్గమైన తాడికొండలో ఓ సందేహమైతే వ్యక్తమవుతూ వస్తుంది. అలాంటి వేళ..  ఆగస్ట్ 10న ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ వద్ద ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి శ్రీదేవి దంపతులు రావడంతో.. ప్రజలకు ఓ క్లారిటీ అయితే వచ్చేసినట్లు అయింది.  చంద్రబాబుతో భేటీ అనంతరం.. పార్టీ మార్పుపై త్వరలో ఓ క్లారిటీ ఇస్తానని ఆమె స్వయంగా ప్రకటించడంతో.. సైకిల్ పార్టీలో చేరతారనే ఓ ప్రచారం అయితే తాడికొండ నియోజకవర్గంలో ఊపందుకొంది. ఓ వేళ ఆమె పసుపు పార్టీలో చేరితే.. ఆమెకు మళ్లీ తాడికొండ సీటే ఇస్తారా? లేకుంటే రాష్ట్రంలో మరో నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపుతారా? అదీఇదీ కాకుంటే.. సైకిల్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని.. పార్టీ అధికారంలోకి వస్తే.. కీలక పదవి ఇస్తామనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉందా? అనే ఓ ప్రచారం సైతం పోటిలికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

అలిపిరి నడక మార్గంలో చిన్నారిని బలితీసుకున్న చిరుత

తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రత గాలిలో దీపంగా మారింది. తరచుగా ఆ మార్గంలో వన్యమృగాల సంచారాన్ని గుర్తించినప్పటికీ అవసరమైన భద్రతా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం టీటీడీ ఘోరంగా విఫలమౌతున్నది. ఇప్పటి వరకూ పలు సంఘటనల్లో వన్యమృగాల దాడిలో భక్తుల గాయపడిన సంఘటనలు చూశాం కానీ తాజాగా చిరుతపులి దాడిలో ఓ ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది.   అలిపిరినడక మార్గంలో వెళ్తుండగా ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. తిరుమలకు వెళ్తుండగా చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడకదారిలో వెడుతున్న ఓ కుటుంబం బిడ్డను కోల్పోవడం అంత్యంత విషాదం    నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అలిపిరి నడకమార్గం ద్వారా  కొండపైకి బయలుదేరింది. అర్థరాత్రికి కొంచం ముందు అంటే రాత్రి పదకొండు గంటల సమయానికి  ఆ కుటుంబం లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకుంది.   ఆ సమయంలోనే వారి ఆరేళ్ల పాప లక్షిత కనిపించకుండా పోయింది. కంగారుపడిన కుటుంబం ఆమె కోసం ఆ ప్రాంతం అంతా గాలించింది. ఫలితం లేకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేఇశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తరువాత అడవిలో గాలింపు చేపట్టారు.  ఫారెస్టు సిబ్బంది సహకారంతో అడవిలో గాలింపు చేపట్టగా చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలో ఆ చిన్నారి మరణించిందని నిర్ధారించారు.  తిరుమల నడకదారిలో చిరుత దాడులు దాదాపుగా నిత్యకృత్యమయ్యాయి. ఈ ఏడాది జూన్ 23న కూడా ఇటువంి సంఘటనే జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కు చెందిన కుటుంబం నడకదారిలో శ్రీవారి కొండపైకి వెడుతుండగా ఏడో మైలు రాయి వద్ద చిరుత  దాడి చేసి వారి ఐదేళ్ల కుమారుడు కౌశిక్ ను నోట  కరచుకుని అడవిలోకి పారిపోయింది. అయితే కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత భయపడి కౌశిక్ ను వదిలేసి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన కౌశిక్ ఆ తరువాత ఆస్పత్రిలో కోలుకున్నాడు.   ఈ సంఘటన తరువాత టీటీడీ అధికారులు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు పలు జాగ్రత్తలు సూచించారు. గుంపులుగా వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.  అలాగే భక్తుల భద్రత కోసం అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామనీ చెప్పారు. అయితే అవేమీ పెద్దగా ఫలితమివ్వలేదని తాజా ఘటన ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటికైనా అలిపిరి నడక మార్గంలో  పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

విపక్ష నేతల ప్రసంగాల స్క్రిప్టు కూడా పోలీసులే డిసైడ్ చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏమైనా మాట్లా డొచ్చు.. ఎక్కడికైనాన వెళ్లొచ్చు. అదే విపక్ష నాయకుల దగ్గరకు వచ్చేసరికి  వారెక్కడ పర్యటించాలో , వారే దారిలో వెళ్లాలో ప్రభుత్వం లేదా పోలీసులు.. వాస్తవానికి ప్రభుత్వమే పోలీసు వ్యవస్థను శాసిస్తోంది. ప్రభుత్వం ఏం చెబితే పోలీసు వ్యవస్థ అదే చేస్తున్న దుస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపించే కొద్దీ ఇక విపక్ష నేతలు ఏం మాట్లాడాలో కూడా  పోలీసులే చెప్పే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు పర్యటన సందర్భంగా గానీ, తాజాగా పవన్ కల్యాణ్ వారాహీయాత్రలో భాగంగా విశాఖలో జరిగిన సంఘటనలు చూస్తే రానున్న రోజులలో అదే జరుగుతుందని అనిపించక మానదు.  పవన్ యాత్ర రోడ్డుకు ఎటు వైపు వెళ్లాలో.. ఆయన వెంట ఎంత మంది ప్రజలు ఉండాలో ఇత్యాది విషయాలన్నిటినీ పోలీసులే నిర్ణయించేశారు. ఇక సముద్ర తీర ప్రాంతమైన రిషి కొండలో జగన్ వినా మరెవ్వరూ ఉండటానికి వీల్లేదంటూ కండీషన్ పెట్టారు. ఈ మేరకు పవన్ కు నోటీసులూ జారీ చేశారు. ఆయన రోడ్డు కు ఎడమవైపు మాత్రమే పర్యటించాలనీ, కుడివైపునకు వెళ్లకూడదనీ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అసలు ఆయన విశాఖలో రోడ్ షో చేయడానికే వీళ్లేదనీ, నేరుగా సభావేదిక వద్దకు వెళ్లి ప్రసంగించి వెళ్లిపోవాలనీ హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో విపక్షాల  మూవ్ మెంట్ ను నియంత్రించి.. నియంత్రించి అనేమిటి అసలు లేకుండా చేసి.. ప్రభుత్వ వ్యతిరేక గళాలు ప్రజలకు చేరకుండా చేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ రాష్ట్రాన్ని ఆంక్షల చట్రంలో బిగించేందుకు ప్రయత్నిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన నిలుచున్న స్టూల్, ఆయన కోసం ఉన్న ప్రచార రథాలను సీజ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అలాగే  గతంలో చంద్రబాబు అనపర్తి, కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరునూ ప్రస్తావిస్తున్నారు. రానున్న రోజులలో విపక్ష నేతలు మాట్లాడాల్సిన ప్రసంగం స్క్రిప్టును కూడా పోలీసులో, సకల  శాఖల మంత్రో రాసి అదే చదవాలని ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. 

ప్రాజెక్టులు పడక.. అభివృద్ధి మునక.. జగన్ హయాంలో జరిగిందిదేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలోని కొత్తూరులో ముగిసింది. కొత్తూరులో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. ఆ జనవాహిని పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడు కోసం జనం కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారని అనిపించక మానదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    జనసందోహాన్ని చూస్తే  ముఖ్యమంత్రికి గుండె ఆగిపోతుందేమోనని చంద్రబాబు అన్నారంటూ తెలుగుదేశం అంచనాలకు మించి ఆ సభకు జనం హాజరయ్యారని ఇట్లే అవగతమౌతుంది. అయితే పరిశీలకులు మాత్రం అధికారంలోని జగన్ సర్కార్ పై చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ ఏకకాలంలో చేస్తున్న ముప్పేట దాడితో ఇప్పటికే వైసీపీ గుండె శ్వాస ఆగిపోయినట్లుగా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు, విసురుతున్న సవాళ్లకు అధికారం పార్టీ నుంచి ఎటువంటి  సమాధానం రావడం లేదు. ఎంత సేపూ విమర్శలకు సాహానం ఇవ్వకుండా, సవాళ్లకు స్పందించకుండా ఎదుటి వారి పై దూషణలతో సరిపుచ్చేయడమంటే.. విపక్ష నేతలు ప్రస్తావిస్తున్న సమస్యలు, సవాళ్లకు వారి వద్ద జవాబు లేదని భావించాల్సి వస్తోందని అంటున్నారు.  పుంగనూరులో చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. పోలీసులు మాత్రం చంద్రబాబు సహా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారు. అక్కడితో ఆగకుండా కోనసీమలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ  జగన్ తెలుగుదేశం వాళ్లు అధికారంలోకి వస్తే తనను ఖతం చేస్తానంటున్నారంటూ జనం ముందు దీన స్వరంతో ఆవేదన వ్యక్తం  చేశారు. ఒక వైపు చంద్రబాబు తన యాత్ర ద్వారా రాష్ట్రంలో జగన్ హయాంలో ప్రాజెక్టులు ఎలా పడకేశాయో, రైతులు ఎలా నష్టపోయారో వివరిస్తుంటే.. వాటికి సమాధానాలు చెప్పడం మాని  ఆరోపణలు, విమర్శలు, దూషణలకే ముఖ్యమంత్రి పరిమితం కావడం ద్వారా.. ఈ నాలుగేళ్లలో త  ప్రగతి, అభివృద్ధి విషయంలో తన ప్రభుత్వం చేసింది ఇదీ అని చెప్పుకోవడానికేమీ లేదని పరోక్షంగా అంగీకరించడమేనని పరిశీలకులు అంటున్నారు.  

మద్యం అమ్మకాలతో 30 వేల కోట్ల అక్రమార్జన.. పవన్ ఆరోపణకు సమాధానం చెప్పు జగన్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  మద్యం అమ్మకాల్లో నేరుగా వైసీపీ అగ్ర నేతకే లాభం చేకూరుతోందంటూ చేసిన విమర్శలను ఖండించేందుకు ఆ పార్టీ నేతలెవరూ సాహసించని పరిస్థితిని చూస్తుంటే పవన్ వి కేవలం ఆరోపణలు మాత్రమే కాదన్న నిర్ధారణకు రావలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. మద్యం అమ్మకాలలో ప్రభుత్వ  పెద్దలు అక్రమంగా 30 వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారంటూ జనసేనాని చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  మద్యం అమ్మకాలలో డిజిటల్ ట్రాన్సాక్షన్ కు అవకాశం లేకుండా చేసి కేవలం నగదు చెల్లించే మద్యం కొనుగోలు చేయాలన్న షరతునకు వెనుక ఉన్న కారణం ఇదేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. విమర్శలకు తలొగ్గి డిజిటల్ చెల్లింపులకు కూడా ఓకే  అని ప్రభుత్వం చెప్పినా.. వాస్తవంగా మాత్రం ఏపీలోని మద్యం దుకాణాలలో కనీస శాతంలో కూడా నగదు లావాదేవీలకు అవకాశం లేని పరిస్థితే ఉంది. అక్రమంగా సొమ్ములు వెనకేసుకోవడానికే మద్యం అమ్మకాలలో నగదు  చెల్లింపులను మాత్రమే అనుమతిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు లెక్కలతో సహా పవన్ కల్యాణ్ మద్యంలో వైసీపీ పెద్దల అక్రమార్జన  ఏ స్థాయిలో ఉందో చెప్పడంతో..  జనం విస్తుపోతున్నారు. నల్ల ధనాన్ని వెలికి తీయడమే లక్ష్యం అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ.. ఆ దారిలో ఎన్ని అడగులు వేశారో కచ్చితంగా చెప్పలేం కానీ, నల్ల ధనాన్ని అరికట్టడానికి అంటూ ఆయన పెద్ద నోట్లను రద్దు చేశారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే పారదర్శకత ఉంటుందని దానిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.  దేశ వ్యాప్తంగా దాదాపుగా లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరిగే పరిస్థితి వచ్చింది. ఏపీలో అదీ ఒక్క మద్యం అమ్మకాల విషయంలో మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒక అంటరాని వ్యవహారంగా పరిగణింపబడుతోంది.  ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని పక్కదారి పట్టించడానికే నగదు లావాదేవీలు మాత్రమే అంటూ మద్యం విధానాన్ని జగన్ అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లధనంపై ఉక్కు పాదం అంటూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రసంగాలు చేస్తూ.. తన హయాంలో అక్రమార్జనకు తావులేకుండా పోయిందని ఘనంగా చెప్పుకునే ప్రధాని మోడీ.. ఏపీలో మద్యం అమ్మకాలలో జరుగుతున్న అడ్డగోలు అక్రమాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.  అయితే ఇక్కడ పవన్ మాత్రం కేంద్రంలోని మోడీ సర్కార్ ను ప్రశ్నించడం లేదు... ఆయన ద్వంద్వ ప్రమాణాలను వేలెత్తి చూపడం లేదు. పైపైచ్చు ఆయన సహకారంతోనే అంటే కేంద్రం సహకారంతోనే జగన్ ఆటకట్టిస్తానంటున్నారు. సరే అది పక్కన పెడితే.. మద్యం విధానం కారణంగా ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టడం లేదనీ, ఒక్క రూపాయి కూడా అక్రమార్జనకు అవకాశం లేదనీ వైసీపీ గట్టిగా చెప్పలేకపోతోంది. అలా చెబితే నగదు లావాదేవీలను ఎందుకు అంగీకరించడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు కనుకనే పవన్ అయినా, మరెవరైనా సరే ప్రభుత్వ అవినీతిపై విమర్శలు గుప్పించినా, ప్రశ్నించినా లైట్ తీసుకుని వదిలేస్తోంది.  ఇక జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ హయాంలో కొత్త పరిశ్రమలు రావడం మాట అటుంచి.. ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయనీ, జగన్ విధానాల కారణంగా రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం లేకపోగా.. పొరుగు రాష్ట్రాలు బ్రహ్మాండంగా లబ్ధి పొందుతున్నాయనీ సోదాహరణంగా వివరిస్తున్నారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో పని చేస్తున్న పరిశ్రమలు కూడా విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శనమంటూ అమరరాజా బ్యాటరీ పరిశ్రమను ఉదహరిస్తున్నారు. లూలూ పరిశ్రమ ఏపీలో వ్యాపారం చేయలేమంటూ పారిపోవడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   

పవన్‌ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు

దాడులు, కేసులతో తనను వ్యతిరేకించే గళాలను అణచివేయాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నట్లు ఉన్నారు. నిన్న చంద్రబాబు పర్యటనలో జరిగిన ఘర్షణలను ఆసరా చేసుకుని ఆయనపై కేసు నమోదు చేసి ఎ1గా పేర్కొన్న సంఘటన తాజాగా ఉండగానే.. ఇప్పుడు విశాఖ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం (ఆగస్టు 10) జరిగిన సభలో పవన్‌ కల్యాణ్‌ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్‌ కల్యాణ్‌కు  బహిరంగ సభలో పవన్‌ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్‌ ఇలా వ్యవహరించి ఉండకూడదని  పేర్కొంటూ నోటీసులు అందించారు.  అసలు పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అడగడుగునా ఆంక్షలు విధించిన పోలీసులు.. ఇప్పుడు పవన్ కు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇవ్వడం విశేషం. గతంలో వాడు వీడు అంటూ వైసీపీ మంత్రులు చేసిన ప్రసంగాలకు సంబంధించి ఎటువంటి చర్యా తీసుకోని పోలీసులు ఇప్పుడు పవన్ కల్యాణ్ కు మాత్రం ఆయన ఎలా మాట్లాడవలసి ఉందంటూ హితోక్తులు చెబుతూ నోటీసులు అందించడాన్ని జనసైనికులు తప్పుపడుతున్నారు. అదలా ఉంటే వారాహి యాత్రలో భాగంగా రుషికొండ ప్రాంతంలో జనసేనాని పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. విశాఖలోని  జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతింబోమని పోలీసులు స్పష్టం చేశారు. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ నుంచి కేవలం పవన్‌ వాహనాన్ని మాత్రమే  అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.  రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్‌ వెళ్లాలన్నారు. కావాలంటే పవన్‌ కల్యాణ్‌ గీతం యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పోలీసులు అవకాశం ఇచ్చారు. 

ధీమా తగ్గింది.. స్వరం మారింది.. బేలతనం బైటపడింది!

నాలుగేళ్లలో మన ప్రభుత్వ పాలన చూడండి.. మళ్ళీ ఓటేయాలా వద్దా మీరే నిర్ణయించుకోండి. ఈసారి గట్టిగా కొడతాం.. 175కి 175 కొడదాం. అందరూ కలిసినా నా వెంట్రుక కూడా పీకలేరు.. ఇవీ  నిన్న మొన్నటి వరకూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుండి వచ్చిన మాటలు.. ప్రగల్భాలు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను.. ఎక్కడ వీలయితే అక్కడ వ్యక్తిగతంగా దూషణల పర్వానికి దిగడం,  ముసలోడు, పనైపోయిందని చంద్రబాబును ఎగతాళి చేయడం.. పవన్ పెళ్లిళ్లపై కామెంట్లు చేయడంతో ఈ మధ్య వరకూ సీఎం జగన్ సభలు సాగిపోయేవి. కానీ, ఇప్పుడు జగన్ టోన్ మారింది. మాటలలో  ధీమా పోయి, బేలతనం బయటపడుతోంది.  నిన్న మొన్నటి వరకూ గట్టిగా కొడదాం అన్న ఆ నోటి నుండే ఇప్పుడు వాళ్లంతా కలిసి నన్ను కొడతా అంటున్నారు.. మీరే నన్ను ఆదుకోండని ప్రజలను వేడుకుంటున్నారు. నా పాలన చూసి మరోసారి నాకు ఓట్లేయండని కోరిన జగన్.. ఇప్పుడు టీడీపీకి అధికారం వస్తే తనను చంపేస్తారని  వాపోతున్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమంతో   సున్నా వడ్డీ కింద  ఎన్ని నిధులు విడుదల చేస్తున్నారో కానీ.. ఈ సభకు మాత్రం కోట్లలోనే ఖర్చు పెట్టారని ఆ ఏర్పాట్లూ, హంగామా చూస్తే అర్ధమౌతుంది. బటన్ నొక్కి జగన్ ఎంత విడుదల చేశారో కానీ.. ఈ కార్యక్రమం పబ్లిసిటీకి మాత్రం భారీగానే ఖర్చు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలు, వెన్నుపోటులే గుర్తొస్తాయి తప్పితే.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని విమర్శించారు. బాబు కోసం ఆయన దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నాడని పవన్ కళ్యాణ్ పైనా విమర్శలు గుప్పించారు. అయితే, ఆ మాటలు చెప్పిన అదే సభలో జగన్  తన గొంతు మార్చి మాట్లాడారు. ప్రతిపక్షాలకు అధికారం ఇస్తే తనను మట్టుబెడతానంటున్నారని గొంతు తగ్గించి  గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ముగ్గురూ (చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్) ఒక్కో చోట సభలు నిర్వహించారని.. అధికారం ఇస్తే ఎవరినీ వదలమంటూ హెచ్చరిస్తున్నారని.. అధికారంలోకి వస్తే తన అంతు చూస్తారని బెదిరించారని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. గిట్టని వారిని మట్టు బెడతామంటున్నారని, అందుకే వాళ్ళు అధికారం కోరుకుంటున్నారనీ.. ఏకంగా తనకు నరకాన్ని చూపిస్తామంటున్నారని తనదైన శైలిలో హావభావాలను పలికించారు. ప్రతిపక్షాలు ప్రజలను బెదిరిస్తున్నాయని చెప్తూనే.. తనను చంపుతామని బెదిరిస్తున్నారని ప్రజలకు దీన వదనంతో  చెప్పుకున్నారు. దీంతో సహజంగానే జగన్ అమలాపురం ప్రసంగం మరోసారి విస్తృత చర్చకు దారి తీసింది.  జగన్ అమలాపురం ప్రసంగాన్ని చూస్తే మరోసారి జగన్నాటకం మొదలైపోయిందా అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.  సానుభూతి డ్రామాను పలికించడంలో జగన్ కు జగనే సాటి.  తన తండ్రి వైఎస్ మరణం నుండి వివేకా మరణం వరకూ.. తన అవినీతి కేసుల నుండి కోడికత్తి కేసు వరకూ కాదేదీ సానుభూతికి అనర్హం అన్నట్లుగా అన్నిటినీ తనకు అనుకూలంగా మలచుకోవడంలో జగన్ మార్క్ జగన్ కి ఉంది. ఇప్పుడు ఇది కాస్తా ఆయన ప్రసంగాలలోకి వచ్చి చేరింది.  నిన్న మొన్నటి వరకూ గంభీరాలు పోయిన ఆయన గొంతు  ఒక్కసారిగా డౌన్ అయి  వేడికోళ్లకు, అభ్యర్థనలకు దిగిపోయింది. తనను చంపుతామని బెదిరిస్తున్నారని ప్రజలకు మోర పెట్టుకొనే పరిస్థితికి వచ్చిందంటే ఇది సానుభూతి డ్రామా కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే గతంలో ఆయనకు సానుభూతి వర్కౌట్ కావడానికి  అప్పుడు ప్రతిపక్షంలో ఉండటమే కారణం.  ఇప్పుడు ఆయనదే అధికారం. నాలుగేళ్లుగా అధికారం చెలాయిస్తున్నారు. పైగా ఈ నాలుగేళ్లలో ఆయన తన విధానాలను వ్యతిరేకించిన ఎందరికి ఎలా నరకం చూపించారో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. కరోనా సమయంలో వైద్యులకు మాస్కులు ఇవ్వాలన్నందుకు డాక్టర్ ను పిచ్చివాడిగా ముద్ర వేసి నడిరోడ్డుపై పోలీసుల చేత కొట్టించారు. ఆపరేషన్ జరిగి విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అచ్చెంనాయుడిని ఇంటి నుంచి బలవంతంగా తీసుకువచ్చి వేల మైళ్లు తిప్పారు. తన విధానాలను విమర్శించిన పాపానికి సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజు  ఎన్ని రకాలుగా వేధింపులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. అటువంటి జగన్ ఇప్పుడు అధికారం దూరమౌతున్న సంకేతాలు వచ్చాయనేసరికి సానుభూతి డ్రామాకు తెరతీశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరి సరికొత్త పాత్ర డ్రామా వైసీపీకి ఏమేరకైనా కలిసొస్తుందేమో చూడాలి!

పవన్, అంబటి, రేణూ దేశాయ్.. తెగే వరకూ లాగితే వైసీపీకి మూల్యం తప్పదు!

ఏపీలో ఇప్పుడున్న పొలిటికల్ హ్యపెనింగ్స్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందని, ఆ పాత్రలో నటించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన డాన్స్ గతంలో సంక్రాంతి సంబరాల్లో మంత్రి రాంబాబు చేసిన డాన్సును పోలి ఉందన్నది ఆరోపణ. ముందుగా బ్రో సినిమాలో డాన్స్ క్లిప్పులు సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో మీడియా ముందుకొచ్చిన అంబటి రాంబాబు నాటి నుంచి నేటి వరకూ  నుండి ఈ విషయంపై ఇప్పటికే నాలుగైదు మీడియా సమావేశాలు పెట్టి మరీ తీవ్రంగా మండిపడ్డారు. బ్రో సినిమా కలెక్షన్ల నుండి పవన్ కళ్యాణ్ సినిమాకు తీసుకొనే రెమ్యునరేషన్ వరకూ ఎన్ని మాట్లాడాలో అన్నీ మాట్లాడారు. మరికొందరు వైసీపీ నేతలు కూడా తోడై పవన్ కళ్యాణ్ ను విమర్శించడమే ఒక ఉద్యమంలా పెట్టుకున్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే.. ఇరిగేషన్ శాఖకు మంత్రిగా ఉన్న అంబటి బ్రో సినిమా మీదనే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పై విమర్శల యుద్ధమే చేసినా చల్లబడని అంబటి.. ఏకంగా పవన్ కళ్యాణ్ మీద నాలుగైదు సినిమాలు, వెబ్ సిరీస్ లు తీస్తానని కూడా ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయ్ సీన్ లోకి వచ్చారు. ఇటీవల బ్రో సన్నివేశాల వల్ల వివాదం చెలరేగిందని, దీని వల్ల పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, పిల్లలు సహా వ్యక్తిగత విషయాలపై సినిమా తీస్తామని కొందరు అంటున్నారని రేణు దేశాయ్ చెప్పారు. ఒక తల్లిగా తాను రిక్వెస్ట్ చేస్తున్నానని, రాజకీయంగా.. వృత్తిపరంగా ఏ విషయాల్లోనైనా పిల్లలను మాత్రం అందులోకి లాగొద్దని ఆమె అన్నారు.  ఫిల్మ్ ఫ్యామిలీలో పిల్లలు పుట్టారు.. వాళ్ల తండ్రి (పవన్ కల్యాణ్) రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పిల్లలు అయినందున వారిపై దృష్టి ఉంటుంది. కానీ వారు ఇంకా పిల్లలు. రాజకీయాలతో వారికి ఏం సంబంధం, అందుకే ఒక తల్లిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్, సపోర్టర్స్ ఎవరైనా పిల్లలను ఈ విషయాల్లోకి లాగొద్దు. నా పిల్లలనే కాదు.. ఏ రాజకీయ నాయకుడి పిల్లలైనా, యాక్టర్   పిల్లలైనా వారిని ఇలాంటి విషయాల్లో లాగొద్దు అని రేణు దేశాయ్ కోరారు. ఇక, రాజకీయ, సామాజిక విషయాల్లో మొదటి నుంచి పవన్ కల్యాణ్‍కు తాను మద్దతునిస్తూనే ఉన్నానని విస్పష్టంగా పేర్కొన్న   రేణూ దేశాయ్,  ఆయన సమాజానికి మంచి చేసేందుకే పని చేస్తున్నారని తాను నమ్ముతున్నాననన్నారు. సమాజానికి మంచి చేసేందుకే ఆయన పని చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఆయన మనీ మైండెడ్ కాదు. ఆయనకు డబ్బు అంటే ఆసక్తి లేదు. ఎప్పుడూ సమాజానికి మంచి చేయాలని అనుకుంటుంటారు  అని పేర్కొన్నారు. తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి రాజకీయంగా పవన్‍కు సపోర్ట్ చేశానని, చేస్తూనే ఉంటానని కూడా రేణు దేశాయ్ స్పష్టం చేశారు. రేణూ దేశాయ్ వ్యాఖ్యలపై కూడా స్పందించిన మంత్రి అంబటి.. అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం చర్చకు దారి తీసింది. నిజానికి అంబటి రాంబాబు ఈ వ్యవహారంలో అవసరానికి మించి స్పందిస్తున్నారు. బ్రో సినిమాలో పృథ్వీ డాన్స్ కామెడీగా ఉందే తప్ప కించపరిచినట్లు లేదు. పోనీ ఒకవేళ తనకి బాధ అనిపిస్తే ఒకసారి మీడియా ముఖంగా నాలుగు విమర్శలు చేసి వదిలేయాల్సింది. కానీ, మంత్రిగా తన బాధ్యతల మీద కంటే బ్రో సినిమా కలెక్షన్లు, పవన్ పారితోషకం లెక్కలు చెప్పడం మంత్రిగా ఆయన స్థాయికి తగదు. ఆ విషయం జనానికి కూడా అర్ధమౌతుంది. అంబటి సినిమా థియేటర్లో టికెట్లు అమ్ముతున్నాడా అంటూ సోషల్ మీడియాలో  ఇప్పటికే భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. పైగా అదేదో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు ఏకంగా సినిమాలు, సిరీస్ లు తీస్తానని చెప్పడంతో ఆయనపై ట్రోల్స్ మరింత జోరందుకుంటున్నాయి.  ఇక ఇప్పుడు రేణుదేశాయ్ స్పందనకు కూడా  ఆదరాబాదరాగా  రిప్లై ఇవ్వడంపై  కూడా నెటిజన్లకు సెటైర్లు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలకి సత్వర ప్రతిస్పందన ఉండదు, ఆయన శాఖకు సంబంధించి విపక్ష నేత సూటి ప్రశ్నలు గుప్పిస్తుంటే నోరు పెగలదు కానీ..  సినిమాలు, టికెట్ల గురించి మాట్లాడడానికి, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి గంటల తరబడి ప్రసంగాలు చేయడానికీ మాత్రం ఎక్కడ లేని తీరికా ఉంటుందా అంటూ నిలదీస్తున్నారు.  మంత్రి పదవిలో ఉండి తన శాఖ గురించి   ప్రెస్ మీట్ లో పది నిముషాలు మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేని మంత్రి అంబటి.. అంటూ ఫైరౌతున్నారు.   రాజకీయాలు వ్యక్తిగతంగానే పరిమితం కావాలి కానీ కుటుంబాల జోలికి వద్దని చెప్పిన రేణు దేశాయ్ మద్దతు పెరుగుతున్నది.  ఆమె అడిగిన దానిలో న్యాయం ఉందని.. అంబటి దానికి కూడా వెటకారంగా స్పందించి తన స్థాయిని తానే మరింత దిగజార్చుకున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇంతటితో అయినా ఈ వ్యవరాహాన్ని వైసీపీ నేతలు వదిలేస్తే మంచిది. లేకపోతే వైసీపీకి మరింత నష్టం తప్పదని  హెచ్చరిస్తున్నారు.

రాంగోపాలవర్మ వ్యూహం.. కేసిఆర్ అభిమానుల ఆగ్రహం!

ఏదో వివాదం తో నిత్యం వార్తల్లో వుండే  డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై   బి ఆర్ ఎస్ కార్యకర్తలకు , కే సి అర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగింది. ఒకప్పుడు హిట్ సినిమాలు తీసి ట్రెండ్ సెట్ చేసిన వర్మ ఇప్పుడు కేవలం... ఒక పార్టీమీద బురద చల్లేందుకు , యువ నాయకుడి మెప్పు కోసం పనిచేస్తున్నారు. గత ఎఎన్నికల సమయంలో  లక్ష్మీస్ ఎన్టీఆర్ , కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ తో రెండు సినిమాలు తీశారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పేరును  తరువాత ఆ సినిమా పేరును అమ్మ రాజ్యంలో కడపరెడ్లు అని మార్చి విడుదల చేశారు. ఈ రెండు సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ మీద కూడా ఓ సినిమా తీశారు. అది విడుదల కాలేదనుకోండి.. సరే ఈ సినిమాలు తీసి నందుకు  వైసీపీ నుండి ముడుపులు తీసుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న రాంగోపాల్ వర్మ ఇప్పుడు  మళ్లీ  ఎన్నికల సమయం దగ్గరపడుతుంగా మరో రెండు సినిమాలను అనౌన్స్ చేసాడు.. వాటిలో ఒకటైన   వ్యూహం అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ షూటింగ్  కు సంబంధించినన వీడియో ఒకటి సోషల్ మీడియా లో దర్శనమిచ్చింది.. ఆ వీడియో లీక్ అయ్యిందా.? లేక పుబ్లిసిటీ కోసం తానే లీక్ చేయించాడో  తెలియదు కానీ.. ఈ వీడియో చుసిన దగ్గర నుండి  బిఆర్ఎస్ కార్యకర్తలు వర్మ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.   ముఖ్యమంత్రి కే సి అర్ ని అవమానించేలా ఆయన  పాత్రను ఆర్జీవీ  మలిచారని  బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.  పొట్టిగా వుండే జగన్ క్యారెక్టర్ ని పొడుగుగా వుండే ఆర్టిస్ట్ తో చేయిస్తూ... మంచి హైట్ తో , బక్కపలచగా వుండే కే సి ఆర్ పాత్రకు పొట్టిగా జోకర్ లా వుండే ఆర్టిస్ట్ ను ఎంచుకోవడంపై మండి పడుతున్నారు. జగన్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయటానికి మిగతా పాత్రలన్నీ డీగ్రేడ్ చేస్తున్నాడంటూ ఫైరౌతున్నారు.  వర్మ సినిమా రిలీజ్ తర్వాత తమ నాయకుడ్ని అవమానించినట్టు ఒక్క సన్నివేశం వున్నా రాంగోపాల్ వర్మ అంతుచూస్తాం అంటూ కేసీఆర్ అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఈ షూటింగ్ వీడియో, బీఆర్ఎస్ నేతల ఆగ్రహం ఇప్పుటు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

జయ ప్రదకు జైలు

అలనాటి హీరోయిన్ జయప్రదకు జైలు శిక్ష పడటం సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కేసులో ఆమెకు ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.  చెన్నైలోని రాయపేటలో జయప్రదకు చెందిన థియేటర్ కార్మికుల కేసులో ఈ తీర్పు వెలువరించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది. జయ ప్రద అసలు పేరు లలితారాణి రావ్.  సీనియర్ హీరోయిన్ జయ ప్రద గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె 1974లోనే భూమి కోసం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. తెలుగు, తమిళ,హిందీ, కన్నడ, మళయాళ, బెంగాల్  చిత్రాల్లో ఆమె నటించింది. 70వ, 80వ దశకంలో ఓ వెలుగు వెలిగారు. అగ్ర నటులతో హీరోయిన్ గా చేశారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు.  కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు జయ ప్రద రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీలో చేరారు. అనేక బాలివుడ్ చిత్రాల్లో నటించిన జయ ప్రదను ఉత్త రాదిన కూడా అభిమానులను ఏర్పరచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఆమె సమాజ్ వాది పార్టీ తరపున గెలిచారు. రెండు పర్యాయాలు అదే నియోజక వర్గం నుంచి గెలుపొందారు. చెన్నైలోని రాయపేటలో మాజీ ఎంపీ జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ థియేటర్ ను నడిపించారు. ప్రారంభంలో బాగానే నడిచినా తర్వాతి కాలంలో థియేటర్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో థియేటర్ ను బంద్ చేశారు. థియేటర్ లో పనిచేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీనిపై ఇటు కార్మికులు, అటు కార్పొరేషన్ ఎగ్మూరు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని, ఆ మొత్తం వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని వివరిస్తూ కోర్టులో మూడు పిటిషన్లను కూడా దాఖలు చేశారు. అయితే, కోర్టు ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాయర్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని కేసును కొనసాగించింది.  ప్రస్తుతం జయప్రద... ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే కామెడీ షోలో జడ్జ్ గా పాల్గొంటున్నారు. ఆమె చాలా కాలం తర్వాత బుల్లితెరపై కనిపించడంతో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఈ తీర్పుతో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.

వైసీపీ నుంచి వలసల వరద.. గేట్లెత్తేసినట్లేనా?

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆశావహులు పార్టీలు మారడం అత్యంత సహజమైన అంశం. అయితే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే నేతల పార్టీల మార్పు భారీగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే వచ్చిన కొన్ని సర్వేల ఫలితాలు, ప్రతిపక్ష నేతల రోడ్ షోలకు సభలకు తండోపతండాలు వస్తున్న జనాలను చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో క్లియర్ కట్ గా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఈసారి వైసీపీ నుండి భారీగా వలసలు ఉండడం గ్యారంటీగా కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో పడకేసిన అభివృద్ధితో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉండగా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారని . ఒక్కసారి ఎన్నికల మూడ్ మొదలైతే వీరంతా పొలోమని వలసలు మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.  వైసీపీ నుండి బహిష్కరణకు గురైన నలుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరడం ఖరారైనట్లే. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి ఇప్పటికే సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలవగా నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర బాధ్యతలను కూడా చూసుకున్నారు. ఇ దే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొనగా.. మేకపాటి ఈసారి టీడీపీ నుండి ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా లోకేష్ ప్రకటించారు. మరోవైపు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ నేతలతో టచ్ లోనే ఉన్నారు. కాగా, ఇప్పుడు తాజాగా మరో బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏకంగా గుంటూరు నుండి ఉత్తరాంధ్రకి వెళ్లి మరీ చంద్రబాబును కలిసిన శ్రీదేవి లోకేష్ పాదయాత్ర తన నియోజకవర్గంలోకి వచ్చే సమయానికి తన కార్యాచరణ ప్రకటిస్తానని కూడా చెప్పారు. కాగా వైసీపీ ఈ నలుగురు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు సందర్భంగా ఇంకా ఇటువంటి వారు 56 మంది వరకూ ఉన్నారని పార్టీ వర్గాలలోనే గట్టిగా చర్చ జరిగింది. కచ్చితంగా సంఖ్య ఇదీ అని చెప్పకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో అసంతృప్తుల గురించి ప్రస్తావించారు. సరే వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురి దారి తెలుగుదేశం పార్టీ వైపే అని తేలిపోయింది. ఇక ఇప్పుడు పార్టీలో అసంతృప్తులుగా ఉన్నారని చెబుతున్న మిగిలిన 56 మంది పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్నారు. వారంతా కూడా పార్టీని వీడటం ఖాయమేనా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారి  వైసీపీకి భారీ ఝలక్ తప్పేలా లేదు. ఇప్పటికే టీడీపీలో ఉన్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నారాయణలతో పాటు ఇప్పుడు సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తోడైతే జిల్లాలో  వై ఎట్ లీస్ట్ వన్ సీట్ అన్న పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికలలో ఈ జిల్లాలో పది పది స్థానాలలో వైసీపీ విజయం సాధించింది.   కావలి నుండి బీద రవిచంద్ర తన సతీమణిని రంగంలోకి దింపనుండడం.. సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ పై అసంతృప్తితో ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆయనను దూరం పెట్టడం అన్నీ వెరసి ఇక్కడ ఈసారి టీడీపీ ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీకి దగ్గరైన ముగ్గురితో పాటు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన సిద్దా రాఘవరావు, ఆయన తనయుడు సుధీర్, మరో నేత కదిరి బాబురావు ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వచ్ాచరు. వారు ఇక కండువా కప్పుకోవడమే తరువాయి అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కలిపిన కందుకూరు నుండి ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉండగా అసలు జిల్లాకే పెద్దన్నయ్య పాత్ర పోషించిన బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీయే పొమ్మనలేకపోగ బెట్టడంతో ఆయనా ఆంటీ ముట్టనట్లే ఉంటున్నారు. గిద్దలూరు ఆనం రాంబాబుకు అధిష్టానమే టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా ఇచ్చినా ఆయన గెలిచే పరిస్థితి లేదని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. చీరాల నుండి ఆమంచి తన సోదరుడిని ఇప్పటికే జనసేనకు పంపగా.. తాను కూడా సరైన సమయం కోసం చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీనియర్ నేత కరణం బలరాం మళ్ళీ టీడీపీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నట్లు జిల్లా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇక, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలలో అయితే వైసీపీ నుండి భారీగా వికెట్లు పడడం గ్యారంటీగా కనిపిస్తున్నది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లాంటి వారే ఈ మధ్య పత్తా లేకుండా పోగా.. ఉండవల్లి శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టీడీపీకి టచ్ లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారితో సహా మరో ఏడెనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఉత్తరాంధ్ర నుండి కూడా ఈసారి భారీగా వలసలు ఉండే అవకాశం ఉంది. శ్రీవాణి, అప్పల నాయుడు, అప్పల నరసయ్య, వీరభద్రస్వామి, గొల్ల బాబురావు, ఉమా శంకర్ గణేష్ ఇలా చాలా పేర్లు వలసల జాబితాలో వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి అవంతి పార్టీ జంప్ చేసినా ఆశ్చర్యం లేదన్నది ఉత్తరాంధ్ర రాజకీయాలలో ఆసక్తికరంగా వినిపిస్తున్న మాట.

వరల్డ్ కప్ జట్టులో హైదరాబాద్ కుర్రోడు?

అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్  తరువాత  హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రికెటర్లు పెద్దగా కనిపించరు. ఒక వేళ అడపాదడపా ఒకరిద్దరికి చాన్స్ వచ్చినా అది ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది తప్ప వారికి పెద్దగా గుర్తింపు కూడా రాలేదు. ఇక అంబటి రాయుడు ఉన్నా అతని కెరీర్ మొత్తం వివాదాలతోనే సరిపోయింది. అర్హత ఉండి కూడా వివాదాల కారణంగానే వరల్డ్ కప్ కు అవకాశం లేకుండా పోయిందని అంటారు. అందుకు అలిగి ఆయన క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా సత్తాచాటే సామర్థ్యం హైదరాబాద్ కుర్రోడు తిలక్ లో ఉందని, ధోనీ లాంటి ఫినిషర్, సెహ్వాగ్ లాంటి అగ్రెసివ్ నెస్, కోహ్లీ లాంటి క్లాస్ తిలక్ లో ఉన్నాయనీ క్రీడా పండితులు చెబుతున్నారు. టి20లలో అరంగేట్రంలోనే విండీస్ పై తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు తిలక్. అలాంటి తిలక్ కు ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్ కు ఎంపిక అయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా భారత క్రికెట్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ.  వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో తొలి సారిగా ఇండియన్ క్యాప్ ధరించిన తిలక్ వర్మ  మూడు వన్డేలలోనూ వరుసగా 39, 51, 49 నాటౌట్‌ స్కోర్లతో  కీలక ఇన్నింగ్స్ ఆడాడు.   మూడు మ్యాచ్‌ల్లోనూ జ‌ట్టు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు క్రీజులోకి వచ్చి జట్టును ఆదుకున్నాడు. 20 ఏళ్ల వ‌య‌సులోనే  బ్యాటింగ్ లో అతడు చూపుతున్న ప్రతిభ, పరిణితి టాక్ ఆప్ ది క్రికెట్ గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే మరో రెండు నెలలలో వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆ వరల్డ్ కప్ కు ఇండియా తరఫున ఆడే ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలక్టర్లు ఒక అంచనాకు వచ్చేసి ఉన్నాయి. అయితే జట్టు ఎంపిక విషయంలో తిలక్ వర్మ పేరును పరిశీలించకుండా ఉండే పరిస్థితి లేదని మాజీలు గట్టిగా చెబుతున్నారు.  వెస్టిండీస్‌తో టీ20ల్లో తిల‌క్ వ‌ర్మ ఆట చూసిన తరువాత ఇండియన్ క్రికెట్ కు మరో స్టార్ లభించాడని అర్ధమైపోయిందని మాజీ క్రికెటర్ వ‌సీం జాఫ‌ర్ అన్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌కు కోసం టీమ్ఇండియా తరఫున ఆడే ఆటగాళ్లలో తిలక్ వర్మ కచ్చితంగా ఒకడిగా ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.  టి 20లలో రాణించినంత మాత్రాన వన్డేల్లో అదరగొడతాడన్న నమ్మకం ఏముందని ప్రశ్నించే వారు సూర్యకుమార్ యాదవ్ ను ఉదాహరణగా చూపుతున్నారు. టి20ల్లో అదరగొట్టే సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో తేలిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.  అయితే తిలక్ వర్మ విషయం వేరనీ, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో తిలక్ వ‌ర్మ‌కు అద్భుత‌మైన గ‌ణాంకాలు ఉన్నాయ‌ని, అత‌డిని వ‌న్డేల్లో ఆడిస్తే మంచి ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చున‌ని   భార‌త మాజీ చీఫ్ సెల‌క్ట‌ర్ ఎమ్ఎస్‌కే ప్ర‌సాద్ గట్టిగా చెబుతున్నారు.   లిస్ట్‌-ఏ క్రికెట్‌లో హైద‌రాబాద్ త‌రుపున 25 మ్యాచులు ఆడిన తిల‌క్ 56.18 స‌గ‌టుతో 1,236 ప‌రుగులు చేశాడు. వీటిలో ఐదు శ‌త‌కాలు, ఐదు అర్థ‌శత‌కాలు ఉన్నాయి.   వన్డేల్లో ఫినిషర్ పాత్రకు తిలక్ వర్మ కచ్చితంగా అతికినట్టుగా సరిపోతాడని, సెలక్టర్ లు అతడిని పరిగణనలోనికి తీసుకోకతప్పదని అంటున్నారు. 

 ఈటెల గజ్వేల్ నుంచే..? ప్రత్యర్థి ఎవరు?

రానున్న ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేయించాలని బిజెపి అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.అధికారికంగా తెలంగాణ బిజెపి జాబితారానప్పటికీ ముఖ్యమంత్రి కెసీఆర్ స్వంత నియోజకవర్గం  గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం   నుంచి ఈటెలను నిలబెట్టాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్టు సమాచారం.  ఈటెల బీఆర్ఎస్ ను వీడి వేరే బిజెపిలో చేరడానికి గల కారణాలను కాసేపు  పక్కన పెడితే... అసలు కేసీఆర్ కి, ఈటలకు మధ్య ఇంత దూరం ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పటికీ ఇంకా ఎవరికీ అంతుబట్టడం లేదు. ఒకప్పుడు ఈటెల కెసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. వైద్య, ఆరోగ్య శాఖ వంటి ప్రాధాన్యం ఉన్న శాఖను కేసీఆర్ ఈటెలకు కట్టబెట్టారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు గానీ సడెన్ గా మంత్రిపదవి నుండి తొలగించారు. ఈ పరిణామం ఈటెల వర్గీయుల్లో ఆందోళన నెలకొనేలా చేశాయి.  ఈటెల సైతం అదే స్థాయిలో  కేసీఆర్ పై యుద్ధాన్ని ప్రకటించారు.ఇది చాలా మందికి ఆశ్చర్యపరిచింది. రెండు దశాబ్దాల పాటు ఈటెల కేసీఆర్  అడుగులో అడుగు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెరాస శాసన సభా పక్ష నేతగా కూడా  ఈటెల పనిచేసారు. టిఆర్ఎస్ లో నమ్మిన బంటు ఈటెల. అటువంటిది ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపారు కెసీఆర్.  వాస్తవంగా 2019లో ఈటెల చేసిన వ్యాఖ్యలు కెసీఆర్ ను ఇబ్బందుల్లో పడేసింది. గులాబీ జెండాకు యజమానులు ఎవరూ ఉండరనే వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే యజమానులు ఈటెల నర్మగర్భంగా చెప్పారు.  టిఆర్ఎస్ పార్టీ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని పలు సందర్భాల్లోఈటెల ఆరోపించారు. కుటుంబ పార్టీగా మారిపోయిందని ఈటెల విమర్శించారు.  ఈ నేపథ్యంలో ఈటెల కుమార్తె పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. పార్టీ క్యాడర్ తో వివిధ పార్టీలకు చెందిన నేతలు పలువురు వచ్చారు.   కొందరు పనిగట్టుకుని ఈటల బలప్రదర్శనగా అభివర్ణించారు.   ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా ఈటల బాహాటంగా  కార్మికులకు మద్దతు ఇచ్చారు.  ఈటెల , కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్దానికి దిగినట్టయ్యింది.  అప్పట్నుంచి ఈటెల వచ్చే ఎన్నికలలో  కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్నగజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తూ  వచ్చారు. ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కేసీఆర్ ఉండకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

వైసీపీకి నెగటివ్ స్టార్ క్యాంపెయినర్లు అసంఖ్యాకం!

సినిమాలు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ముఖ్యంగా మన దక్షణాదిలో అయితే ఈ అనుబంధం మరింత పెనవేసుకుపోయింది. అందునా మన తెలుగు రాష్ట్రాలలో అయితే సినిమా, రాజకీయం వేరు కాదు.. రెండూ ఒక్కటే అనేలా ఉంటుంది పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన తెలుగు దేశం పార్టీకి పునాదే సినీ గ్లామర్. తనను దేవుణ్ణి చేసి ఆరాధించిన తెలుగు ప్రజల ఋణం తీర్చుకొనే ఉద్దేశంతో తారకరాముని ఆలోచన నుంచి పుట్టిందే తెలుగు దేశం పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ తెలుగు సినీ పరిశ్రమ నుండి పుష్కలంగా సపోర్ట్ ఉంటుంది. ప్రస్తుతం టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లకు కొదువే లేదు.  సీనియర్ స్టార్ హీరో, ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఇప్పటికే  తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండగా.. మిగతా నందమూరి హీరోలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఎడమొహంగా ఉన్నారని ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకూ ఎక్కడా తనకై తాను అలా  మాట్లాడిన దాఖలాలు లేవు. పైగా తన కట్టే కాలే వరకూ తన మద్దతు తెలుగుదేశం పార్టీకే అని జూనియర్  విస్పంష్టంగా చెప్పారు కూడా. నందమూరి హీరోలు కాకుండా నారా రోహిత్ తో పాటు మరికొందరు సీనియర్ హీరోయిన్లు, సీనియర్ నటులు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు టీడీపీ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక, ఏపీలో మరో పార్టీ జనసేన పుట్టుక కూడా సినిమా ఛరిష్మాను ఆధారం చేసుకుని పుట్టిందే. భారీ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ ఈ పార్టీకి అతిపెద్ద స్టార్ కాగా.. మిగతా మెగా ఫ్యామిలీ కూడా జనసేన వెంటే నడుస్తున్నారు. కనుక జనసేనకి కూడా సినిమా పరిశ్రమ నుండి స్టార్ క్యాంపెయినర్లకు ఎలాంటి ఢోకా లేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే స్టార్ క్యాంపెయినర్లు ఎవరు అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలో సినిమా పరిశ్రమ నుండి ఎవరు వచ్చినా కండువాలు కప్పి వాళ్లనే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లుగా చూపించారు.  వీళ్ళలో కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, యాంకర్ శ్యామల లాంటి వారు ఇప్పటికే వైసీపీ గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయారు. మోహన్ బాబు, జీవితా రాజశేఖర్ పత్తా లేకుండా పోయారు. జయసుధ మరో పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతానికి వైసీపీలో ఉన్న సినీ నటులు కమెడియన్ అలీ, పోసాని కృష్ణమురళి మాత్రమే. ఈ ఇద్దరిలో అలీ ప్రచారం దేవుడెరుగు బయటకొచ్చి మాట్లాడడం కూడా తక్కువే. ఇక మిగిలింది పోసాని కృష్ణ మురళి. పోసాని ఎలా మాట్లాడినా అది కామెడీనే అవుతుంది తప్ప పట్టించుకొనే వాళ్ళే ఉండరు. ఇలా మొత్తానికి వైసీపీకి ఇప్పుడు స్టార్ క్యాంపైనర్లే లేకుండా పోయారు. ఆ మాటకొస్తే వైసీపీకి క్యాంపెయినర్లు లేకుండా పోవడం మాత్రమే కాదు.. నెగటివ్ క్యాంపెయినర్లు పెరిగిపోతున్నారు. టీడీపీ, జనసేనకు మద్దతుగా ఉన్న హీరోలు, నటులతో పాటు న్యూట్రల్ గా ఉండే సినీ నటులు కూడా వైసీపీ అంటే ఛీ కొట్టే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం తన సంక్షేమ పథకాల కోసం కోట్ల వ్యయం చేసి మరీ ఇస్తున్న ప్రకటనల కంటే..  వైసీపీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై సినిమా వాళ్ళు చేసే విమర్శలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. స్వయంగా సీఎం బటన్ నొక్కుడు కార్యక్రమాల సందర్భంగా చేస్తున్న ప్రసంగాల కంటే సినిమా వాళ్ళ విమర్శలే ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా వైసీపీకి తీరని నష్టాన్ని కలిగిస్తుంది.  నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా సినీ పరిశ్రమ నుంచి ఎవరూ కనీసం అభినందనలు కూడా తెలియజేయలేదు. దీంతో హార్ట్ అయిన సీఎం జగన్ తనదైన శైలిలో సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయలు, తెచ్చిన జీవోలు వివాదాస్పదం అయ్యాయి.  దీంతో సినీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున.. మహేష్, ప్రభాస్ తో కలిసి వెళ్లి ఒకసారి, నిర్మాతలతో మరోసారి సీఎం జగన్ని కలసి వచ్చారు. దీంతో జగన్ ఈగో శాటిస్ఫై అయిందే తప్ప సినిమా వాళ్ళేమీ జగన్ కోసం క్యూ కట్టి మద్దతు తెలిపింది లేదు.  ఆ పరిస్థితి అలానే ఉన్నా కొంచెం బెటర్ గా ఉండేదేమో కానీ, పోయి పోయి ఎన్నికల ఏడాదిలో వైసీపీ మరోసారి సినిమా వాళ్ళతో వైరం పెట్టుకుంది. పవన్ విషయంలో ఎలాంటి విమర్శలు చేసినా రజనీకాంత్, చిరంజీవి విషయంలో వైసీపీ కాస్త తగ్గి మాట్లాడాల్సింది. వైసీపీ ప్రభుత్వం జోలికే రాని రజనీని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, చిరంజీవిపై పెద్ద ఎత్తున అటాక్ చేయడం ఇప్పుడు వైసీపీకి భారీ కీడు తెచ్చిపెడుతుంది. ఒక్కొక్కరు వైసీపీ ప్రభుత్వపై విమర్శలకు దిగుతూ నెగటివ్ స్టార్ క్యాంపెయినర్లుగా మారిపోతున్నారు. ఇక వైసీపీలో ఇప్పటికే  అడపాతడపా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పోసాని కృష్ణ మురళి లాంటి వాళ్లు ఉన్నా వాళ్ల ప్రసంగాలు పార్టీకి నష్టమే చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అంటే మొత్తంగా వైసీపీలో సినీ పరిశ్రమ నుంచి పార్టీకి మద్దతుగా మాట్లాడే వారంతా స్టార్ నెగిటివ్ క్యాంపెయినర్లుగానే చెప్పవచ్చు. ఇక స్వయంగా సినీమాలతో సంబంధం లేకుండా వైసీపీ తరఫున తరచూ మీడియా ముందుకు వచ్చి దూషణల పర్వానికి తెరతీసే కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్ వంటి మాజీ మంత్రులు, మంత్రులను కూడా పరిశీలకులు స్టార్ నెగటివ్ క్యాంపెయినర్లుగానే అభివర్ణిస్తున్నారు. వీళ్లకి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న నెపంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలూ కూడా వైసీపీకి స్టార్ నెగటివ్ క్యాంపెయినర్లుగా మారిపోయారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లు కూడా వైసీపీకి స్టార్ నెగటివ్ క్యాంపెయినర్లుగా మారిపోయారు. వారు జగన్ సర్కార్ పై చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్నది. మొత్తంగా వైసీపీకి పాజిటివ్ క్యాంపెయినర్ల కంటే నెగిటివ్ స్టార్ క్యాంపెయినర్లే ఎక్కువగా ఉన్నారు. 

వల్లభనేని వంశీ.. ఈసారి క్లీన్ బౌల్డ్ ..?

రాజ‌కీయాలు  ఎప్పుడూ నల్లేరుపై నడక కాదు.. క్షణం..క్షణం రంగు మార్చుకుంటుంటాయి.  ఎప్పుడూ ఒకే ర‌కంగా ఉండే ప‌రిస్థితి లేదు. ఇదే ప‌రిస్థితి ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎదుర్కొంటున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌రిస్థితి న‌ల్లేరుపై న‌డ‌క‌గా మారిపోయింది. దీనికి కార‌ణం.. బ‌ల‌మైన టీడీపీ కేడ‌ర్ అంతా కూడా ఆయ‌న వెంటే ఉంది. ప్ర‌జ‌లు కూడా ఆయ‌న‌ను న‌మ్మారు. స్థానికంగా కూడా టీడీపీని వంశీ డెవ‌ల‌ప్ చేశారు. కేడ‌ర్‌ను పెంచుకున్నారు. యువ‌త‌లో భ‌రోసా నింపారు. దీంతో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆయ‌న అస‌లు ఎన్నిక‌ల‌ను పెద్ద సీరియ‌స్ గా కూడా తీసుకోలేదు. పరిటాల రవి దగ్గర తీసుకున్న  ట్రయినింగ్ వంశీకి ఇప్పటిదాకా బాగానే ఉపయోగపడింది. మునుపు ఆయనకు  పార్టీలోనూ ఎంతో ఇమేజ్ ఉండేది. తిరుగులేని నాయ‌కుడిగా ఆయ‌న ఒక ఊపు ఊపారు. అయితే.. ఆయ‌న కోరి కోరి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నాక వైసీపీ పంచ‌న చేరిపోయారు. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు ఇది ఆనందాన్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ.. రాజకీయంగా మాత్రం వంశీకి ఇది పూర్తి మైన‌స్ అయిపోయింద‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. త‌ట‌స్థులు కూడా వంశీని న‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని.. అనేక ఆన్‌లైన్ చానెళ్లు చేస్తున్న స‌ర్వేల్లో తేలి పోయింది. వంశీ అంటే ఎంతో గౌర‌వం ఉంద‌ని అంటున్న వారు కూడా.. ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఇప్పుడే ఏం చెప్ప‌లేం.. అని అనేస్తున్నారు. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి వంశీకి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఆయ‌నే మా ఎమ్మెల్యే అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పిన ప‌రిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. పైగా.. ఆయ‌న ఉన్న వైసీపీలోనూ.. ఆయ‌న‌కు ఎదురు గాలి వీస్తోంది. గ‌తంలో ఆయ‌న టీడీపీలో ఉంటే.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కానీ.. ఇప్పుడు వైసీపీలో ఆయ‌న‌కు అంతా వ్య‌తిరేకంగానే క‌నిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం.. అధిష్టానంకు  మాత్ర‌మే ఎటూపాలుపోని పరిస్థితి.   గ్రౌండ్ లెవెల్ లో మాత్రం.. డెబ్బై శాతం వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.  అటు యార్లగడ్డ వెంకట్రావ్ .ఇటు దుట్టా.. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న చెమ‌ట చిందించాల్సిందే అనే రాజకీయ పండితులు భావిస్తున్నారు.