రాంగోపాలవర్మ వ్యూహం.. కేసిఆర్ అభిమానుల ఆగ్రహం!
posted on Aug 11, 2023 @ 3:44PM
ఏదో వివాదం తో నిత్యం వార్తల్లో వుండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై బి ఆర్ ఎస్ కార్యకర్తలకు , కే సి అర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగింది. ఒకప్పుడు హిట్ సినిమాలు తీసి ట్రెండ్ సెట్ చేసిన వర్మ ఇప్పుడు కేవలం... ఒక పార్టీమీద బురద చల్లేందుకు , యువ నాయకుడి మెప్పు కోసం పనిచేస్తున్నారు. గత ఎఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ , కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ తో రెండు సినిమాలు తీశారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పేరును తరువాత ఆ సినిమా పేరును అమ్మ రాజ్యంలో కడపరెడ్లు అని మార్చి విడుదల చేశారు.
ఈ రెండు సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ మీద కూడా ఓ సినిమా తీశారు. అది విడుదల కాలేదనుకోండి.. సరే ఈ సినిమాలు తీసి నందుకు వైసీపీ నుండి ముడుపులు తీసుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న రాంగోపాల్ వర్మ ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుంగా మరో రెండు సినిమాలను అనౌన్స్ చేసాడు.. వాటిలో ఒకటైన వ్యూహం అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ షూటింగ్ కు సంబంధించినన వీడియో ఒకటి సోషల్ మీడియా లో దర్శనమిచ్చింది.. ఆ వీడియో లీక్ అయ్యిందా.? లేక పుబ్లిసిటీ కోసం తానే లీక్ చేయించాడో తెలియదు కానీ.. ఈ వీడియో చుసిన దగ్గర నుండి బిఆర్ఎస్ కార్యకర్తలు వర్మ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ముఖ్యమంత్రి కే సి అర్ ని అవమానించేలా ఆయన పాత్రను ఆర్జీవీ మలిచారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పొట్టిగా వుండే జగన్ క్యారెక్టర్ ని పొడుగుగా వుండే ఆర్టిస్ట్ తో చేయిస్తూ... మంచి హైట్ తో , బక్కపలచగా వుండే కే సి ఆర్ పాత్రకు పొట్టిగా జోకర్ లా వుండే ఆర్టిస్ట్ ను ఎంచుకోవడంపై మండి పడుతున్నారు.
జగన్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయటానికి మిగతా పాత్రలన్నీ డీగ్రేడ్ చేస్తున్నాడంటూ ఫైరౌతున్నారు. వర్మ సినిమా రిలీజ్ తర్వాత తమ నాయకుడ్ని అవమానించినట్టు ఒక్క సన్నివేశం వున్నా రాంగోపాల్ వర్మ అంతుచూస్తాం అంటూ కేసీఆర్ అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఈ షూటింగ్ వీడియో, బీఆర్ఎస్ నేతల ఆగ్రహం ఇప్పుటు నెట్టింట వైరల్ అవుతున్నాయి.