మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు!?

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే వారంలో ఆయన ఢిల్లీకి పయనమవనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ టూర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు.. విపరీతంగా అప్పులు చేయడం.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం.. దాడులకు దిగడం.. కేంద్ర పథకాలు.. తమ పథకాలంటూ జగన్ ప్రభుత్వం కలరింగ్ ఇవ్వడం తదితర అంశాలపై కేంద్రంలోని పెద్దలకు చంద్రబాబు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మాసంలోనే చంద్రబాబు హస్తిన బాట పట్టే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మోదీతో చంద్రబాబు భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే రానున్నది ఎన్నికల సీజన్.. దాంతో రాజకీయ సమీకరణాలు సైతం మారనున్నాయని వారు చెబుతున్నారు.  మరోవైపు ఇటీవల ఢిల్లీలో మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశమనంతరం చంద్రబాబు, మోదీ.. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరు కలిసి మాట్లాడుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లోని మీడియా పలు కథనాలను ప్రచురించింది. అయితే వీరిద్దరు ఏం చర్చించుకున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. కానీ ఇటీవల పార్టీ పాలిట్ బ్యూరో మీటింగ్‌లో చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలో మోదీతో చర్చించిన పలు అంశాలు వివరించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రధాని మోదీ ఒక్కొక్కరినీ పలకరిస్తూ తానే వద్దకు వచ్చారని చంద్రబాబు చెప్పారని.. మనం కలిసి చాలా రోజులైందని.. ఢిల్లీ రావడం లేదా? అని  చంద్రబాబును మోదీ ప్రశ్నించారట. ఢిల్లీలో తనకు పనేమీ లేదని.. అందుకే రావడం లేదని మోదీకి చంద్రబాబు సమాధానం ఇచ్చారు.   అలాగే మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని.. మనం ఒకసారి కలవాలని చంద్రబాబుతో మోదీ చెప్పారట. తాను కూడా మిమ్మల్ని కలుద్దామనుకోంటున్నట్లు ఈ సందర్బంగా మోదీతో చంద్రబాబు చెప్పారట. ఓ సారి వీలు చూసుకుని ఢిల్లీ రావాలని.. మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారమిస్తే.. నాకు అనువుగా ఉన్న సమయం చెబుతానని మోదీ.. చంద్రబాబుతో పేర్కొన్నారని ఆయన స్వయంగా చెప్పారు.    ఏదీ ఏమైనా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అయితే అధికార వైసీపీకి గుండెల్లో దడ పుట్టడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

చైనా నౌక‌ను అనుమ‌తించిన  లంక‌

చెబితే వినాలి. వినేవాడు మంచివాడు. విని పాటించేవాడు మ‌హామంచివాడు. చెప్పినా విన్న‌ట్టు న‌టించి త‌న ప‌నే చేసేవాడు చైనీయుడు. అవును ప్ర‌స్తుత అంత‌ర్జాతీయ రాజ‌కీయాల్లో చైనా అంతే మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇపుడు శ్రీ‌లంక అనేకానేక భ‌యాందోళ‌న‌ల‌తో చైనాకి త‌లొగ్గి త‌న మాటే వింటోందేమో అనిపిస్తోంది. కార‌ణం చైనా నౌక‌ను అనుమ‌తించ‌డ‌మే.  చైనా కి తలొగ్గిన శ్రీలంక  భారత్, అమెరికా ల మాటలు భేఖాతరు చేసింద‌నే అనాలి. భద్రతా పరమైన కార ణాల దృష్ట్యా చైనా షిప్ ని అనుమతించ వద్దు అని భారత్ చెప్పినా  వినకుండా శ్రీలంక అనుమతి ఇచ్చింది. తమ దేశ భద్రతను ముప్పులో పడేస్తూ చైనా నౌకను శ్రీలంక అనుమతిం చడంపై భారత్ ఇప్పు డు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.  ఆర్థిక సంక్షోభంలో కొట్టి మిట్టాడు తున్న శ్రీలంకకు భారత్ పలు రకాలుగా సహాయాన్ని అందిస్తోంది. దీనిలో భాగంగా సముద్ర భద్రతను పటిష్టం చేసేందుకు ఇటీవల సముద్ర నిఘా విమానాన్ని శ్రీలంకకు బహుమతిగా ఇచ్చింది. భారత్‌లో శిక్షణ పొందిన శ్రీలంక నావికాదళం, వైమానిక దళ సిబ్బంది ఈ  విమా నాలను నడుపుతారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇలా ఉండగా.. ఇప్పటికే శ్రీలంక కు భారీ మొత్తంలో రుణాలిచ్చిన చైనా తన మాటవినేలా ఒత్తిడి తీసుకొస్తుంది. భారత్, అమెరికా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనా నిఘా నౌక తమ దేశంలోని హంబన్ తోటా నౌకా శ్రయంలో తిష్ట వేసేందుకు శ్రీలంక అనుమతి ఇచ్చింది. ఈమేరకు హంబన్ తోటా పోర్టుకు ఆగ‌ష్టు 16న‌ చేరుకున్న డ్రాగన్ నౌకకు శ్రీలంక పోర్ట్ అధికారులు, నౌకా కంపెనీకి చెందిన చైనా అధికారులు స్వాగతం పలికారు. తొలుత చైనా నౌక ఈనెల 11వ తేదీనే చేరుకోవల్సి ఉండగా.. భారత్ భద్రతాపరమైన ఆందోళ నల నేపథ్యంలో తదుపరి సంప్రదింపులు జరిగే వరకు వాయిదా వేయాలని శ్రీలంక విదేశాంగ మంత్రి త్వ శాఖ కోరింది. చివరికి డ్రాగన్ కంట్రీ ఒత్తిడికి తలొగ్గిన శ్రీలంక చైనా నౌకకు అనుమతులు ఇచ్చింది.

బోస్ ..ఒక్క సేల్ఫీ !

ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జీవితంలో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. మ‌నం మ‌ర్చిపోయినా ఎవ‌రో ఎక్క‌డో దూరం నుంచి గుర్తుప‌ట్టి పిలిచి మాట్లాడుతూంటారు. కొంద‌రు ఏకంగా ఫోటో అంటారు, ఒక్క‌రిద్ద‌రు ఏకంగా సెల్ఫీకి మీద‌ప‌డినా ప‌డొచ్చు. చిత్రంగా  విజ‌య‌వాడ విమానాశ్ర‌యంలో దీనికి కాస్తంత భిన్నంగా జ‌రిగింది. ఒక పెద్ద అధికారి ఒక కానిస్టేబుల్‌నే సెల్ఫీ కావాల‌ని అడ‌గ‌డం! విజయవాడ విమానాశ్రయంలో హెడ్‌ కానిస్టేబుల్‌ బోస్ డ్యూటీలో ఉన్నారు. అంతలో అక్కడకు  వచ్చిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్  లక్ష్మీనారాయణ ఆయనను చూడగానే విష్‌ చేశారు. ‘బోస్‌.. ఒక్క సెల్పీ’ అని అడిగారాయ‌న‌. అంత గొప్ప వ్యక్తి తనతో సెల్ఫీ తీసుకునేందుకు అడగ్గానే  బోస్‌ షాక్‌ అయ్యారు. సరే సార్‌ అంటూ నవ్వుతూ ఇద్దరు ఓ సెల్ఫీ తీసుకున్నారు. అలా జేడీ  ఓ కానిస్టేబుల్‌తో తీసుకున్నారు.  కానిస్టేబుల్‌కి ఇంత సీనుందా  ఎలాబ్బా.. అని అక్క‌డ చాలామంది ఆశ్చ‌ర్యంగా ఇద్ద‌రినీ చూస్తుండి పోయా రు. ఇంతకీ హెడ్‌ కానిస్టేబుల్ బోస్‌ చేసిన గొప్ప పనేంటంటే.. గతంలో ఏడు నెలల చిన్నారిని బోస్‌ దత్తత తీసుకున్నాడట. ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి ప్రస్తుతం డాక్టర్‌ చదివి స్తున్నాడు. చిన్నారిని దత్తత తీసుకునేందుకు బోస్‌ను డీఐజీ పాల్‌రాజ్‌ ప్రోత్సాహించారు.  ఇలాంటి వ్యక్తితో ఫొటో దిగడాన్ని గర్వంగా భావిస్తున్నానంటూ ఫొటోతో పాటు క్యాప్షన్‌ రాసుకొచ్చారు బోస్‌. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన జేడీ లక్ష్మీనారాయణకు బోస్‌ ఆదర్శంగా నిలువడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కుమ్మరిస్తున్నా

సారువారి మాటలకూ అర్థాలె వేరులే.. అర్ధాలె వేరులే

కేసీఆర్ చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు అని ఆయన ప్రత్యర్థులు, రాజకీయ వ్యతిరేకులు అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ వ్యూహాలు కూడా ఉంటాయి. ఆయన ఏదైతే చెబుతారో దానికి అమలు చేయరు.. అమలు చేయకపోవడమే కాదు.. తన వాగ్ధాటితో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించే వారి నోళ్లు మూయించడమే కాదు..సామాన్యులు ఆయనను అలా ఎలా ప్రశ్నిస్తారు అని ఆశ్చర్య పోయేలా చేస్తారు. ప్రత్యేక తెలంగాణకు తొలి సీఎంగా దళితుడిని పీఠం ఎక్కిస్తానని ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానాన్ని, చెప్పిన మాటను కాదనీ, ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి అయ్యారు. అదేమని అడిగిన వారికి కొత్త రాష్ట్రం అనుభవజ్ణుడు అయిన ముఖ్యమంత్రి అవసరం కనుక తాను ఈ పీఠం అధిరోహించానని చెప్పారు. రాష్ట్రంలో భూమి లేని రైతులందరికీ మూడెకరాల భూమి అని వాగ్దానం చేసి ఆనక రాష్ట్రంలో పంచేందుకు అంత భూమి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇలా ఏ వాగ్దానం తీసుకున్నా కేసీఆర్ ది అదే తంతు. ఇప్పుడు తాజాగా ఆయన రాజ్ భవన్ తో ప్రగతి భవన్ కు ఉన్న అగాధాన్ని మరింత ప్రస్ఫుటంగా చాటేలా మరో సారి మాట తప్పారు. చెప్పేదొకటి.. చేసేదొకటి తన విధానమని చాటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఎట్ హోం విందు కర్యక్రమానికి గైర్హాజర్ అయ్యారు. అయితే మామూలుగా అయితే అదో విషయమూ కాదు, విశేషమూ కాదు. కానీ కేసీఆర్ ఈ కార్యక్ర్మానికి హాజరౌతున్నారని రాజ్ భవన్ కు సమాచారం అందింది. స్వయంగా ఆయనే ఈ సమాచారాన్ని పంపారు.  కానీ ఆయనీ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దాదాపు 20 నిముషాల సేపు ఆయన కోసం గవర్నర్, ఇతర ముఖ్యులు వేచి చూశారు. అప్పుడు తాపీగా కేసీఆర్ రావడం లేదనీ, ఆయన ఎట్ హోమ్ కు హాజరయ్యే కార్యక్రమం రద్దైందని సమాచారం వచ్చింది. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భాలలో రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ పేరుతో  గవర్నర్ ఇస్తూంటారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్తుంది. అందరూ పాల్గొంటూ ఉంటారు. ఇదొర సాంప్రదాయంగా వస్తూనే ఉంది. గవర్నర్‌తో అభిప్రాయభేదాలు ఉన్నా.. ఇలాంటి సందర్భంలో వాటిని పట్టించుకోకుండా హాజరవ్వడం మర్యాద.  అయితే కేసీఆర్ ఆ కనీస మర్యాదను కూడా పాటించలేదు. ఆయన గవర్నర్ ను తన చర్య ద్వారా అవమానించానని భావించి ఉండవచ్చు. కానీ వాస్తవానికి ఆయన అవమానించింది. సంప్రదాయాన్ని, వ్యవస్థను, రాజ్ భవన్ ను అని పరిశీలకులు అంటున్నారు.    

50 వసంతాల  పోస్టల్ పిన్ కోడ్

ఉత్త‌రాలు రాయ‌డం స‌రే అది స‌ర‌యిన అడ్ర‌స్‌కి చేరాలంటే పోస్ట‌ల్ పిన్‌కోడ్ వేయ‌డం కీల‌కం. అది లేకుంటే ఉత్త‌రం ఎటుపోతుందో దానికే తెలీదు. పోస్ట‌ల్ వారూ పిన్‌కోడ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని అడుగు తూంటారు. లేకుంటే అది అంద‌క‌పోయినా ప్ర‌శ్నించ‌డానికి అధికారం లేద‌న్న‌ది వారి హెచ్చ‌రిక‌. స్వ‌తంత్ర భారతదేశం 75  ఏళ్ళు పూర్తి చేసుకుంది. అలాగే పిన్ కోడ్ కూడా గోల్డెన్ జూబ్లి ని సెలెబ్రేట్ చేసుకుంటోంది. పోస్టల్ ఇండెక్స్ కోడ్ లేదా ఏరియా కోడ్ లేదా జిప్ కోడ్ అని పిలుస్తారు. పిన్ కోడ్ 1972 ఆగష్టు 15 న ప్రారంభం అయింది. దేశంలో చాలా ప్రాంతాల పేర్లు ఒకలాగే ఉండడం,చిరునామా స్థానిక బాష లో రాస్తుండడం తో అర్ధం కాక ఇబ్బంది పడేవారు.అందుకోసం అప్పటి కేంద్ర సమాచారశాకా సెక్రటరీ శ్రీ రంభికాజీ వేలంకర్ ఆరు అంకెల పిన్ ప్రేవేశపెట్టారు.  పిన్ కోడ్ లో కనిపించే ఆరు అంకెలలో మొదటిది ఏరియా జోన్ ని సూచి స్తుంది. రెండవ అంకె సబ్ జోన్ ని సూచిస్తుంది.మూడవ అంకె జిల్లా ని సూచిస్తుంది.మిగతా మూడు అంకె లు జిల్లా లో వ్యక్తిగత పోస్టల్ ఏరియా కికేటాయించ బడతాయి.పిన్ కోడ్ ని ప్రేవేశపెట్టినప్పుడు భారతదేశం 8 భౌగోళిక ప్రాంతాలుగా విభజించ బడింది. 9 వ జోన్ ఆర్మీ పోస్టల్ సర్వీస్ రిజర్వు గా ఉంచారు.నేడు దేశం లో మొత్తం 19101 పిన్ లు ఉన్నాయి. ఇందులో ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఉండదు. పిన్ కోడ్  సహాయంతో వస్తువుల పంపిణి సులభతరం గా మారింది.

మునుగోడు మండ‌లం ఇన్‌ఛార్జి సీత‌క్క‌

మునుగోడు సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవ‌డం కాంగ్రెస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అందుకు త‌గ్గ వ్యూహా లు రచిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఆత్మ‌విశ్వాసం నింపి ఉత్సాహంగా ఉర‌క‌లువేయించ‌డానికి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం (ఆగ‌ష్టు 16)నుంచి స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. రేవంత్ రెడ్డి నిర్వహించనున్న పాదయాత్ర నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఇన్ ఛార్జులను నియమించారు.  చౌటుప్పల్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి; నారాయణపూర్: బలరాం నాయక్, గండ్ర సత్యనారాయణ; మునుగోడు: సీతక్క, విజయ రామారావు; నాంపల్లి: అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి; గట్టుప్పల్: ఎస్ఏ సంపత్ కుమార్, ఆది శ్రీనివాస్; చండూరు: ఈరవత్రి అనిల్, డాక్టర్ వంశీకృష్ణ; మర్రిగూడ: చెరకు సుధాకర్, వేం నరేందర్ రెడ్డిని నియమించారు. వారంతా తమ మండలాల పరిధిలోని పార్టీ నాయకులతో సమావేశమవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలి పాయి. ఈ నెల 16న నాంపల్లి, మర్రిగూడ.. 17న ఆశావహులతో సమావేశం.. 18న మునుగోడు, చండూ రు..19న సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం ఒక మండలం, సాయంత్రం మరో మండలంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉపఎన్నికలో గెలుపు నకు అనుసరించా ల్సిన వ్యూహం, కేడర్‌ను, ప్రజాప్రతినిధులను కాపాడుకోవడం, ఎన్నిక పూర్త య్యే వరకు ప్రతి గ్రామానికి 8 మందితో ఒక కమిటీ వేయడం.. ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటి ఎజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు.. స్తంభించిన ట్రాఫిక్.. సక్సెస్ ఫుల్ గా సామూహిక జాతీయ గీత

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం (ఆగస్టు 16) ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని అన్ని కూడళ్ల వద్ద జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంతో పాటు రాష్ట్రమంతటా అన్ని ప్రధాన కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్నినిర్వహించారు. ఆబిడ్స్‌ కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా కూడళ్లలో నిమిషం పాటు అన్ని వైపులా రెడ్‌ సిగ్నళ్లు వేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.  కాగా సామూహిక జాతీయ గీతాలాప‌నలో భాగంగా సరిగ్గా 11.30 గంట‌ల‌కు నిమిషం పాటు ఎక్క‌డి మెట్రో రైలు అక్క‌డే నిలిచియాయి. జాతీయ గీతాలాప‌న అనంత‌రం మెట్రో సేవ‌లు తిరిగి ప్రారంభం అయ్యాయి. 

ప్రధానిగా అటల్ జీవి అత్యుత్తమ విధానాలు: చంద్రబాబు

ప్రధానిగా అటల్ బీహారీ వాజ్ పేయివి అత్యుత్తమ విధానాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. వాజ్ పేయి వర్థంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు ఘన నివాళులర్పించిన చంద్రబాబు ఆధునిక భారత నిర్మాణంలో వాజ్ పేయిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశ గమనాన్ని మార్చిన అత్యుత్తమ విధానాలను అవలంబించిన ప్రధానిగా వాజ్ పేయిని చంద్రబాబు అభివర్ణించారు. టెలికాం, స్వర్ణ చతుర్భుజి, ఓపెన్ స్కై పాలసీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు వంటి కీలక సంస్కరణల్లో తాను ఆయనతో కలిసి పని చేయడం తనకు ఎంతో సంతృప్తిని కలిగించిన అంశమని చంద్రబాబు పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటి ఘనతలు దేశం వాజ్ పేయి హయాంలోనే సాధించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ వాజ్ పేయి వంటి దేశ భక్తుడిని తలుచుకుని తీరాలని చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. 

అవినీతి నిరూపిస్తే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌ను.. రాజ‌గోపాల్ రెడ్డి

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేర‌గానే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మీద అవినీతి ఆరోప‌ణలు వెల్లు వెత్తుతున్నాయి. టీఆర్ఎస్ నేత, మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. జ‌గ‌దీష్ రెడ్డికి త‌న‌ను విమ‌ర్శిం చే హ‌క్కే లేద‌ని, తాహ‌త‌కు మించి మాట్లాడుతున్నార‌ని రాజ‌గోపాల్ రెడ్డి మండిప‌డ్డారు. తాను రాజ‌కీయా ల‌ను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్ప‌డిన‌ట్టు, కాంట్రాక్టులు ద‌క్కించుకున్న‌ట్టు నిరూపిస్తే ఎన్నిక‌ల్లో పోటీ చేయన‌ని అన్నారు. జ‌గ‌దీష్ రెడ్డి చెబుతున్న‌వ‌న్నీ సాక్ష్యాధారాల‌తో నిరూపించ‌గ‌లిగితే తాను రాజ‌ కీయ స‌న్యా సం తీసుకుంటాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అమిత్‌షా మీటింగ్‌పై నాయకులు, కార్యకర్తలతో సమావేశమ య్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతి అక్రమాలు, నేర చరిత్రపై త్వరలో చిట్టా విప్పితే ఆయ‌న  మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశా రు. రాజకీ యంగా ఎదుర్కోలేక తన వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీసేలా మంత్రితో పాటు, కొందరు ఆరోపణ లు చేస్తు న్నారని విమర్శించారు. మంత్రి  అయిన తర్వాత జగదీశ్‌రెడ్డి వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డా డని ఆరోపించారు.  శంషాబాద్‌లో 70 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌, నాగారంలో ఐదు ఎకరాల్లో ఇల్లు నిర్మించుకున్నాడని, బినా మీల పేరుతో కోట్ల అస్తులు కూడబెట్టుకున్నాడని ఆరోపించారు. తాను 2009 సంవత్సరం తర్వాత  ఉన్న ఆస్తు లు అమ్ముకున్నానని తెలిపారు.  35 ఏళ్ల క్రితమే తనకు కంపెనీ ఉందని, ఆ కంపెనీ సొమ్ములో కొంత పేదలకు దానం చేస్తున్నానని తెలి పారు. ప్రస్తుతం తన కుమారుడు కంపెనీ వ్యవహారాలు చూసు కుంటున్నాడని తెలిపారు.   తెలంగాణ సెంటిమెంటుతో గెలిచిన నువ్వు  సూర్యాపేట నుంచి వచ్చి ఇక్కడ  రౌడీ యిజం ప్రదర్శిస్తే మునుగోడు ప్రజలు ఊరుకోర‌ని,  సంస్కారం లేదని మాట్లాడ తావా?  అని  విమర్శిం చారు. మంత్రి వ్యవహారాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటు న్నారని చెప్పారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా విజయం మునుగోడు ప్రజలదేనన్నారు. తన రాజీనా మాతో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని, మునుగోడు ఉప ఎన్నికపైనే తెలంగాణ భవిష్యత్తు అధారపడి ఉందన్నారు. లక్ష మందితో 21న మునుగోడులో బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత చౌటుప్పల్‌-తంగడపల్లి రోడ్డును పరిశీలించారు. సమావేశంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు

ఎన్ ఆర్ ఐలు సంప‌ద సృష్టిక‌ర్త‌లు కావాలి .. చంద్ర‌బాబు

ఎన్ఆర్ఐలు సంపద సృష్టికర్తలు కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హిం చారు.  విదేశాల్లో భారతీయులు పలు రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని కొనియాడారు. పలు దేశాల అభి వృద్ధిలో తెలుగు వారి పాత్ర ఎక్కువ న్నారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఎన్‌ఆర్‌ఐలు కృషి చేయాల న్నారు.  సొంత గ్రామాల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు కృషిచేయాలన్నారు. సూచనలు, సలహాల కోసం టీడీపీ ఎన్‌ ఆర్‌ఐ సెల్‌ పనిచేస్తోందన్నారు. తమ అనుభవాలతో తెలుగు వారు మరింత ఉన్నత స్థితికి వెళ్లాల న్నారు. దేశంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని చంద్రబాబు అన్నారు తమ అనుభవాలతో తెలుగు వారు మరింత ఉన్నత స్థితికి వెళ్లాలన్నారు. దేశంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని చంద్రబాబు అన్నారు. సొంత గ్రామాల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు కృషి చేయాల న్నారు. సూచనలు, సలహాల కోసం టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ పనిచేస్తోందన్నారు. 

డీజీపీ మహేందర్ రెడ్డికి కరోనా

కరోనా మహమ్మారి పీడ ఇంకా పూర్తిగా వదల లేదు. కరోనా పెండమిక్ నుంచి ఎండమిక్ స్టేజ్ కు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించినా తెలంగాణలో ఇంకా కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజూ కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.  స్వాతంత్ర్య వజ్రోత్సవ కార్యక్రమాలలో పాలుపంచుకున్న ఆయన ఆదివారం అర్థరాత్రి వరకూ కార్యక్రమాలను పర్యవేక్షస్తూనే గడిపారు. అయితే సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనుమానంతో ఆయన కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. దానిలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ లోకి వెళ్లారు. సోమవారం ఉదయం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. ఆయన తరఫున అదనపు డీజీ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. 

సూర్యుడికీ అంతిమ ఘడియలు!?

సూర్యుడికీ అంతిమ ఘడియలు తప్పవా. సమస్త ప్రాణ కోటికీ జీవనాధారమైన సూర్యడూ నిర్వీర్యమైపోతాడా? అందుకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ ఖగోళ శాస్త్రవేత్తలు ఔననే సమాధానం ఇస్తున్నారు.  సూర్యుడికి అంతిమ ఘడియలు తప్పవన్న విషయంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. అయితే ఖంగారుపడాల్పిందేమీ లేదు. సూర్యుడి అంతిమ ఘడియలు రావడానికి ఇంకా వేల కోట్ల సంవత్సారలు పడుతుంది. ఖగోళ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం  వెయ్యి బిలియన్‌ సంవత్సరాల తరువాత సూర్యుడు ఇక అంతర్థానమైపోతాడనీ, సూర్యగ్రహం మనుగడలో ఉండదనీ యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఘంటాపథంగా చెబుతోంది.   లక్షల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో ఉండే సూర్యగ్రహంలో ఉష్ణ వాతావరణానికి కారణమైన హైడ్రోజన్‌ వాయువుల  పరిమాణం.. రానురాను తగ్గిపోతూండటమే సూర్యుగ్రహం మనుగడ కోల్సోతుందన్న ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలకు కారణం. సూర్యగ్రహం ఉగ్ర ఉష్ణానికి కారణమైన  హైడ్రోజన్‌ వాయువుల పరిమాణం తగ్గిపోతుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.       అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న గాయియా స్పేస్‌క్రాఫ్ట్‌  ఈ ఏడాది జూన్‌లో అందించిన ఈ సమాచారమే  ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.   సూర్యుడిలో ఉన్నట్లే నక్షత్రాల్లోనూ సంక్షిష్ట వాతావరణం, ద్రవ్యరాశి, ధూళివంటి పదార్థాలు ఉన్నాయని, కాలానుగుణంగా పరిణామక్రమంలో అవి నిర్వీర్యమవుతున్నట్లే సూర్యుడిలోనూ మార్పులు సంభవించి నిర్వీర్యమవ్వడం ఖాయమని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.  

మిడ్-లైఫ్ సంక్షోభంలో సూర్యుడు

ఖగోళ శాస్త్రవేత్తలు మన సూర్యుని పరిణామ గమనాన్ని నిర్దేశించారు. అంతేకాదు దాని ముగింపు తేదీనీ గుర్తించారు. సౌర మంటలు, కరోనల్ మాస్ ఎజెక్షన్లు,  సౌర తుఫానులతో  విస్ఫోటనం చెందుతున్న సూర్యుడు తన మధ్య వయస్సును దాటుతున్నాడు, ఇది 4.57 బిలియన్ సంవత్సరాలుగా అంచనా వేయ బడింది. విశ్వం అత్యంత ఖచ్చితమైన మ్యాప్‌ను రూపొందించిన ఘనత పొందిన గియా అంత రిక్ష నౌక, మన సౌర వ్యవస్థ మధ్యలో ప్రకాశించే నక్షత్రం యొక్క గత, భవిష్యత్తును వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లో గయా అంతరిక్ష నౌక విడుదల చేసిన కొత్త డేటా నుండి తాజా సమాచారం వెల్లువెత్తు తోంది. తాజా డేటాసెట్‌లో వందల మిలియన్ల నక్షత్రాల అంతర్గత లక్షణాల గురించి సమాచారం ఉంది, అవి ఎంత వేడిగా ఉన్నాయి, ఎంత పెద్దవి, అవి ఏ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఈ డేటాను ఉపయోగించి, ఖగోళ శాస్త్రవేత్తలు మన సూర్యుడిలా సారూప్య ద్రవ్యరాశి, కూర్పు ఉన్న నక్షత్రాలను గుర్తించారు, భవి ష్యత్తులో మన నక్షత్రం ఎలా అభివృద్ధి చెందబోతుందో చూశారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం, సుమారు 4.57 బిలియన్ సంవత్సరాల వయస్సుతో, సూర్యుడు ప్రస్తుతం సౌకర్య వంత మైన మధ్యవయస్సులో ఉన్నాడు, హైడ్రోజన్‌ను హీలియంలోకి కలుపుతూ సాధా రణంగా స్థిరంగా ఉంటాడు. కొత్త సౌర చక్రం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, సూర్యుడు గత వారం 17 కరో నల్ మాస్ ఎజెక్షన్‌లు , తొమ్మిది సన్‌స్పాట్ లతో విస్పోట‌మయ్యాడు. అయినప్పటికీ, భవిష్యత్తులో, హైడ్రోజన్ దాని కోర్‌లో అయిపోతుంది, ఫ్యూజన్ ప్రక్రియలో మార్పులు ప్రా రంభమవుతాయి, అది ఎర్రటి జెయింట్ స్టార్‌గా ఉబ్బి, ప్రక్రియలో దాని ఉపరితల ఉష్ణోగ్రతను తగ్గిస్తుం ది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఆసక్తి కలిగి ఉన్నారు, ఇది నక్షత్రం ఎంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది, దాని రసాయన కూర్పుపై ఆధారపడి ఉంటుం ది. ఇక్కడే గియా డేటా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రాన్స్‌లోని అబ్జర్వేటోయిర్ డి లా కోట్ డి'అజుర్‌కు చెందిన ఓర్లాగ్  క్రీవీ అంతరిక్ష నౌక అందించగల అత్యంత ఖచ్చితమైన నక్షత్ర పరిశీలనల కోసం డేటాను సేకరించి, 3000కె ,10,000కె మధ్య ఉపరి తల ఉష్ణోగ్రతలు కలిగి ఉన్న నక్షత్రాలపై దృష్టి సారించింది, ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం జీవించిన నక్షత్రాలు. గెలాక్సీ అందు వల్ల పాలపుంత చరిత్రను వెల్ల డిస్తుంది. ఖచ్చిత కొలతలతో నిజంగా స్వచ్ఛమైన నక్షత్రాల నమూనాను కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నా మ‌ని ఓర్లాగ్ వారు నమూనాను ఫిల్టర్ చేసినప్పుడు సూర్యుని వలె అదే ద్రవ్యరాశి మరియు రసాయన కూర్పు ఉన్న నక్షత్రాలను మాత్రమే చూపించారు. డేటా, విశ్లేషణల నుండి, సూర్యుడు సుమారు 8 బిలి యన్ సంవత్సరాల వయస్సులో గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంటాడని పరిశోధకులు నిర్ధారించారు, అప్పు డు అది చల్లబడుతుంది. అలాగే పరిమాణం పెరుగుతుంది, ఎర్రటి జెయింట్ స్టార్ అవుతుం ది. 1011 బిలియన్ సంవత్సరాల వయస్సు లో, సూర్యుడు తన జీవితాంతం చేరుకుంటాడు. మన స్వంత సూర్యుడిని మనం అర్థం చేసుకోకపోతే దాని గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉంటే, మన అద్భుతమై న గెలాక్సీని రూపొందించే ఇతర నక్షత్రాలను ఎలా అర్థం చేసుకోవాలని మనం ఆశించగల‌మ‌ని ఓర్లాగ్ ఒక ప్రకటనలో తెలి పారు. సూర్యుడు మసక తెల్లని మరుగుజ్జుగా మారినప్పుడు తన జీవితపు ముగింపు దశకు చేరుకుంటుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.

ఏపీ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో జగన్, చంద్రబాబు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, విపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. గవర్నర్ బిశ్వభూషన్ ఇచ్చిన ఈ తేనీటి విందు కార్యక్రమానికి సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు.   టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. ఈ ఇరువురూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత అరుదు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృతోత్సవ్ కమిటీ సమావేశానికి చంద్రబాబు హాజరైన కారణంగా జగన్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అటువంటిది గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి ఇరువురూ హాజరు కావడం సర్వత్రా ఆసక్తి నింపింది. అయితే ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ జగన్, చంద్రబాబు పరస్పరం ఎదురు పడలేదు. ఒకరిని ఒకరు పలకరించుకోలేదు.  కార్యక్రమంలో ఎవరికి కేటాయించిన టేబుల్స్ లో వారు కూర్చున్నారు.  జగన్ దంపతులు గర్నవర్ దంపతులు కూర్చున్న టేబుల్ దగ్గరే కూర్చున్నారు. చంద్రబాబు కాస్త దూరంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. కాగా, ఎట్ హోమ్ కార్యక్రమంలో చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని ఒకే టేబుల్ దగ్గర కూర్చోవడంపై తెలుగుదేశం శ్రేణుల్లో పెద్ద చర్చ జరిగింది   ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఢిల్లీ వెళ్లిన  చంద్రబాబుకు బొకే ఇవ్వడానికి కూడా నాని నిరాకరించిన సంగతి విదితమే. కాగా ఈ కార్యక్రమానికి ఏపీ సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు  హాజరయ్యారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు గవర్నర్ హరిచందన్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరినీ గవర్నర్ స్వయంగా పలకరించారు.   స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఏపీ గవర్నర్ రాజ్ భవన్ లో తేనేటీ విందు ఏర్పాటు చేశారు. కాగా, రాజకీయంగా బద్ధశత్రువులుగా ఉన్న జగన్, చంద్రబాబు ఎట్ హోమ్ కు హాజరవడం. మూడేళ్ల తర్వాత ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సర్వత్రా ఆసక్తి రేపింది.  

తెరాసకు కాల్పుల సరదా జాడ్యమేమిటో?

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీ సందర్భంగా మంత్రి శ్రీనివాస గౌడ్ గాలిలోకి కాల్పులు జరిపిన సంఘటన సృష్టించిన వివాదం సద్దుమణగక ముందే టీఆర్ఎస్వీ నాయకులు గన్ తో గాలిలో కాల్పులు జరిపిన సంఘటన సంచలనం రేపింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనేది స్పష్టం కాకపోయినా.. టీఆర్ఎస్వీ నాయకుడు ఆ కాల్పుల దృశ్యాలను తమ వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోవడంతో వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిథిలోని మీర్ ఖాన్ పేట్ గెస్ట్ హౌస్ లో ఈ సంఘటన జరిగింది. టీఆర్ఎస్వీ నాయకులు విఘ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలు గాల్లోకి కాల్పులు జరిపి, వాటిని చిత్రీకరించి తమ వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నారు.   టీఆర్ఎస్ వీ నాయకులు అంతకు ముందు గెస్ట్ హౌస్ లో వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల సంఘటన ఎప్పుడు జరిగింద. వారు కాల్చింది ఎయిర్ గన్నా?  ఒరిజినల్ గన్నా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదంతా అధికార పార్టీకి చెందిన ఓ నేత గెస్ట్ హౌస్ లో నిర్వహించిన బర్త్ డే వేడుకలో జరిగినట్టు పోలీసులు గుర్తించడమే కాకుండా, ఆ దిశగా ఆధారాలు  సేకరించారు.  కాగా శ్రీనివాసగౌడ్ గాలిలోకి కాల్పులు జరిపిన ఉదంతం సృష్టించిన వివాదం సద్దుమణగక ముందే అటువంటిదే మరో సంఘటన వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్ నేతలకు ఈ కాల్పుల సరదా జాడ్యమేమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందన్న అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. కాల్సులు జరిపిన మంత్రి శ్రీనివాసగౌడ్ తో పాటు, టీఆర్ఎస్వీ నాయకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

తుమ్మల ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య

ఖమ్మం జిల్లాలో పంద్రాగస్టు రోజు రాజకీయ కక్షలకు తెరాస నాయకుడు ఒకరు బలయ్యారు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లికి చెందిన తెరాస నాయకుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు  గురయ్యారు. తమ్మినేని కృష్ణయ్య మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు. తమ్మినేని కష్ణయ్య హత్యతో ఒక్క సారిగా సంచలనం రేపింి. సోమవారం ఉదయం జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం తమ్మినేని కృష్ణయ్య తన అనుచరుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా ముత్తేశం వద్ద వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు ఆ వాహనాన్ని ఢీ కొట్టారు. దంతో కృష్ణయ్య  రహదారి పక్కన ఉన్న కాలువలో పడిపోయారు. కింద పడిన కృష్ణయ్యపై వేటకొడవళ్లు, కత్తులతో  దాడి చేశారు. రెండు చేతులు నరికేశారు. తలపై కూడా కత్తులతో దాడి చేయడంతో కృష్ణయ్య అక్కడికక్కడే మరణించారు.   హత్యకు సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు.  కోటేశ్వరరావుకు చెందిన గ్రానైట్‌ క్వారీలోని పొక్లెయిన్‌ను తగలబెట్టారు. తెల్దారుపల్లి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కాగా.. కోటేశ్వరరావు ఆయనకు  కృష్ణయ్య శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు. హత్య ఘటనపై మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలని కోరారు.  

కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల ఇన్ చార్జ్ గా ప్రియాంకా గాంధీ

 కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం కసరత్తులు ప్రారంభించింది. పార్టీ పునరుజ్జీవనంక కోసం సంస్థాగతంలో చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.  అందులో భాగంగానే   దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి అప్పగించింది.  తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పూర్తిస్థాయి ఇన్‌ఛార్జీ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించింది.   కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.  ఆ రాష్ట్రాలలో  పార్టీలో విభేదాలు, అంతర్గత కుమ్ములాటలున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించారు. ప్రాంతీయ నాయకుల మధ్య సఖ్యతను సాధించడమే లక్ష్యంగా ప్రియాంక పని చేయనున్నారు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ లో కూడా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సెప్టెంబర్ 7 నుంచి 'భారత్ జోడో యాత్ర' చేపట్టనుంది.  కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగే ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొననున్నారు.  

రాజ్‌భ‌వ‌న్ ఎట్ హోమ్ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ డుమ్మా

తెలంగాణా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజ్‌భ‌వ‌న్ లో నిర్వ‌హించే ఎట్ హోమ్ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ గైర్హాజ‌ర‌య్యారు. కేసీఆర్ హాజ‌ర వుతార‌ని రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలకు సీఎంఓ స‌మాచారం పంపింది. కానీ ఆయ‌న వెళ్ల‌క‌పోవ‌డంతో టీఆర్ ఎస్ నాయ‌కులు, ప్ర‌తినిధులు కూడా వెళ్ల‌లేదు. ఛీఫ్ సెక్ర‌ట‌రీ సోమేశ్ కుమార్‌, హైద‌రాబాద్ సీపీ ఆనంద్‌, రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ మాత్ర‌మే హాజ‌ర య్యారు. గ‌వ‌ర్న‌ర్ , కేసీఆర్ చివ‌ర‌గా హైకోర్టు ఛీఫ్ జ‌డ్జి ఉజ్జ‌ల్ భూయాన్ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలోనే పాల్గొన్నారు. అప్పుడు మాట్లాడుకున్నారు. వారి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని అంతా అనుకున్నారు.  కాగా క‌రోనా కార‌ణ‌గా తేనేటి విందుకు హాజ రు కాలేకోతున్నాన‌ని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా పాద‌యాత్ర‌లో బిజీ గా ఉన్న తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ గ‌వ‌ర్న‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లేన‌ని తెలియ‌జేశారు. కరోన కారణం గా రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించలేదన్న‌ది తెలిసిన‌దే.  2020 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఒకే ఒక్కసారి కేసీఆర్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌కి వెళ్లారు. ఆ తర్వాత కరోనా కార ణంగా 2021లో ఆగస్ట్ 15న గానీ, జనవరి 26న గానీ ఆనవాయితీ కొనసాగలేదు. 2022 జనవరి 26న ఎట్‌హోమ్‌కి కేసీఆర్ హాజరు కాలేదు. 2020లో జరిగిన ‘ఎట్ హోమ్‌ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ తమిళిసైకి, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారానికి గత జూన్ నెలలోనే ఫుల్‌స్టాప్ పడింది. తొమ్మిది నెలలు రాజ్‌భవన్ వైపు కన్నెత్తి చూడని కేసీఆర్ హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైని ఆప్యాయంగా పలక రించారు. ఇదిలా ఉండగా, ఈ పరిణామం చోటు చేసుకున్న కొన్ని రోజుల తర్వాత సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రాకపోవచ్చని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళిసై హాజర యిన సందర్భంలో ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాజకీ యాల్లోకి రావాలన్న ఆలోచనతోనే కేసీఆర్‌ పదే పదే ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారా.. అని విలేకరులు ప్రశ్నించగా ఆమె.. ‘ ఆ అవకాశం లేదు’ అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.  ప్రజా సేవకు రాలిని. ప్రజలకు దగ్గరగా ఉండటం నా నైజం. గవర్నర్‌ అయినంత మాత్రాన రాజ్‌భవన్‌కే పరిమితం కాను. ఇతర రాష్ట్రాల గవ ర్నర్లతో నన్ను పోల్చవద్దన్నారు.  కేసీఆర్‌ ఎప్పుడూ నా సోదరుడే. నేను ఎప్పడూ ఆయనకు సోదరినేన‌ని ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైకు సహృద్భావ వాతా వరణమే ఉందని స్పష్టమవుతోంది. 

పాణ్యం సాక్షిగా బైరెడ్డి, గౌరు మ‌ధ్య ర‌గులుతోన్న విభేదాలు

ఒకే ప్రాంతం, ఒకే ఊరువారు రాజ‌కీయంగా ఎంతో ఎదిగిన‌వారు ఒకే నియోజ‌క‌వ‌ర్గాన్ని చేజిక్కించుకోవ‌డంలో పోటాపోటీగా త‌మ స‌త్తాను ప్ర‌ద‌ర్శిస్తున్న‌వారు బైరెడ్డిరాజ‌శేఖ‌ర్ రెడ్డి, గౌరు వెంక‌ట‌రెడ్డి.  ఇరువురూ నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందినవారే. తండ్రి వారసత్వ రాజకీయంతో బైరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్సీనియర్‌ నేత మద్దూరు సుబ్బా రెడ్డి పిలుపుతో గౌరు వెంకట రెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1994, 1999లో బైరెడ్డి నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యేగా పని చేశారు. ఇక.. గౌరు వెంకటరెడ్డి సతీమణి గౌరు చరితారెడ్డి 2004 ఎన్నికల్లో బైరెడ్డిని ఓడించి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వి భ‌జన‌లో భాగంగా నందికొట్కూరు జ‌న‌ర‌ల్ నుంచి ఎస్పీ రిజ‌ర్వుడుగా మారింది.  ఈ కార‌ణంగా బైరెడ్డి, గౌరు రెడ్డి కుటుంబాలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాన్ని పాణ్యానికి మార్చాయి. అక్క‌డా నువ్వా నేనా అన్నంతా రాజ‌కీయాలు న‌డిచాయి. 2019 ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు వారిద్ద‌రిని ఒక‌టి చేశారు. ఫ‌లితంగా ఆ ఎన్నిక‌ల్లో గౌరు బావ మాండ్ర శివానంద రెడ్డి నంద్యాల టీడీపీ అభ్య‌ర్ధిగా పోటీచేసిన‌పుడు ఇద్ద‌రూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తునిచ్చి ప్ర‌చారం చేశారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆయ‌న ఓడిపోయారు.  ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో తలెత్తిన పరిస్థితులతో బైరెడ్డి, ఆయన కూతురు శబరి బీజేపీలో చేరారు. అటు.. 2019 ఎన్ని కల్లో పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసిన గౌరు చరితారెడ్డి ఓడిపోయారు.  ఓటమి చెందినప్పటికీ గౌరు ఫ్యామిలీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. మూడేళ్ల నుంచి బైరెడ్డి, గౌరు.. ఎవరి పార్టీ కార్యక్రమాల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. అయితే.. ఇటీవ‌ల  పిన్నాపురంలో నెలకొన్న సమస్యలపై బైరెడ్డి సీరియస్‌గా స్పందించారు. గ్రీన్ కో కంపెనీ నిర్మించే పవర్ ప్రాజెక్టులతో పిన్నాపురానికి ఇబ్బందులు తలెత్తుతాయని, ముఖ్యంగా.. రిజర్వాయర్ ఆనకట్ట గ్రామానికి అతి సమీపంలో ఉండ‌డంతో  ముప్పు వాటిల్లే అవకాశం ఉందని బైరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  కాగా,  గ్రీన్ కో ప్రాజెక్టుపై గ్రామస్తులు ఆందోళన చేస్తుంటే.. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న గౌరు వెంకటరెడ్డి  ఆ కంపెనీ తో త‌లెత్తే  సమ స్యలను నిర్ల‌క్ష్యం చేశార‌ని  బైరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల తరుపున పోరాడాల్సిన ప్రతిపక్ష నేతలు  పోలీసుల చేత ముందే హౌస్ అరెస్టులు చేయించుకుని. ఆందోళనలు చేస్తున్న ట్లు నటిస్తున్నారని బైరెడ్డి విమర్శించారు.  ఇదిలా ఉండ‌గా,  బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గౌరు గ‌ట్టిగానే స‌మాధానం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరెంత సంపాదించుకున్నారో చర్చించుకుందామ‌ని.. బైరెడ్డికి సవాల్ విసిరారు. పాణ్యంలోని పరిశ్రమల యజమానులు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకున్నట్లు ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్‌ చేశారు.