ప్రధానిగా అటల్ జీవి అత్యుత్తమ విధానాలు: చంద్రబాబు
posted on Aug 16, 2022 @ 11:19AM
ప్రధానిగా అటల్ బీహారీ వాజ్ పేయివి అత్యుత్తమ విధానాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. వాజ్ పేయి వర్థంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు ఘన నివాళులర్పించిన చంద్రబాబు ఆధునిక భారత నిర్మాణంలో వాజ్ పేయిది కీలక పాత్ర అని పేర్కొన్నారు.
దేశ గమనాన్ని మార్చిన అత్యుత్తమ విధానాలను అవలంబించిన ప్రధానిగా వాజ్ పేయిని చంద్రబాబు అభివర్ణించారు. టెలికాం, స్వర్ణ చతుర్భుజి, ఓపెన్ స్కై పాలసీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు వంటి కీలక సంస్కరణల్లో తాను ఆయనతో కలిసి పని చేయడం తనకు ఎంతో సంతృప్తిని కలిగించిన అంశమని చంద్రబాబు పేర్కొన్నారు.
పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటి ఘనతలు దేశం వాజ్ పేయి హయాంలోనే సాధించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ వాజ్ పేయి వంటి దేశ భక్తుడిని తలుచుకుని తీరాలని చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.