అవినీతి నిరూపిస్తే ఎన్నికల్లో పోటీచేయను.. రాజగోపాల్ రెడ్డి
posted on Aug 16, 2022 @ 11:19AM
కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అవినీతి ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. టీఆర్ఎస్ నేత, మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగదీష్ రెడ్డికి తనను విమర్శిం చే హక్కే లేదని, తాహతకు మించి మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తాను రాజకీయా లను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడినట్టు, కాంట్రాక్టులు దక్కించుకున్నట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. జగదీష్ రెడ్డి చెబుతున్నవన్నీ సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితే తాను రాజ కీయ సన్యా సం తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అమిత్‌షా మీటింగ్‌పై నాయకులు, కార్యకర్తలతో సమావేశమ య్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతి అక్రమాలు, నేర చరిత్రపై త్వరలో చిట్టా విప్పితే ఆయన మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. రాజకీ యంగా ఎదుర్కోలేక తన వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీసేలా మంత్రితో పాటు, కొందరు ఆరోపణ లు చేస్తు న్నారని విమర్శించారు. మంత్రి అయిన తర్వాత జగదీశ్‌రెడ్డి వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డా డని ఆరోపించారు.
శంషాబాద్‌లో 70 ఎకరాల్లో ఫామ్‌హౌస్, నాగారంలో ఐదు ఎకరాల్లో ఇల్లు నిర్మించుకున్నాడని, బినా మీల పేరుతో కోట్ల అస్తులు కూడబెట్టుకున్నాడని ఆరోపించారు. తాను 2009 సంవత్సరం తర్వాత ఉన్న ఆస్తు లు అమ్ముకున్నానని తెలిపారు. 35 ఏళ్ల క్రితమే తనకు కంపెనీ ఉందని, ఆ కంపెనీ సొమ్ములో కొంత పేదలకు దానం చేస్తున్నానని తెలి పారు. ప్రస్తుతం తన కుమారుడు కంపెనీ వ్యవహారాలు చూసు కుంటున్నాడని తెలిపారు.
తెలంగాణ సెంటిమెంటుతో గెలిచిన నువ్వు సూర్యాపేట నుంచి వచ్చి ఇక్కడ రౌడీ యిజం ప్రదర్శిస్తే మునుగోడు ప్రజలు ఊరుకోరని, సంస్కారం లేదని మాట్లాడ తావా? అని విమర్శిం చారు. మంత్రి వ్యవహారాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటు న్నారని చెప్పారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా విజయం మునుగోడు ప్రజలదేనన్నారు. తన రాజీనా మాతో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని, మునుగోడు ఉప ఎన్నికపైనే తెలంగాణ భవిష్యత్తు అధారపడి ఉందన్నారు. లక్ష మందితో 21న మునుగోడులో బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత చౌటుప్పల్-తంగడపల్లి రోడ్డును పరిశీలించారు. సమావేశంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు