సూర్యుడికీ అంతిమ ఘడియలు!?
posted on Aug 16, 2022 @ 10:07AM
సూర్యుడికీ అంతిమ ఘడియలు తప్పవా. సమస్త ప్రాణ కోటికీ జీవనాధారమైన సూర్యడూ నిర్వీర్యమైపోతాడా? అందుకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ ఖగోళ శాస్త్రవేత్తలు ఔననే సమాధానం ఇస్తున్నారు.
సూర్యుడికి అంతిమ ఘడియలు తప్పవన్న విషయంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. అయితే ఖంగారుపడాల్పిందేమీ లేదు. సూర్యుడి అంతిమ ఘడియలు రావడానికి ఇంకా వేల కోట్ల సంవత్సారలు పడుతుంది. ఖగోళ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం వెయ్యి బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు ఇక అంతర్థానమైపోతాడనీ, సూర్యగ్రహం మనుగడలో ఉండదనీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఘంటాపథంగా చెబుతోంది.
లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉండే సూర్యగ్రహంలో ఉష్ణ వాతావరణానికి కారణమైన హైడ్రోజన్ వాయువుల పరిమాణం.. రానురాను తగ్గిపోతూండటమే సూర్యుగ్రహం మనుగడ కోల్సోతుందన్న ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలకు కారణం. సూర్యగ్రహం ఉగ్ర ఉష్ణానికి కారణమైన హైడ్రోజన్ వాయువుల పరిమాణం తగ్గిపోతుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న గాయియా స్పేస్‌క్రాఫ్ట్ ఈ ఏడాది జూన్‌లో అందించిన ఈ సమాచారమే ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. సూర్యుడిలో ఉన్నట్లే నక్షత్రాల్లోనూ సంక్షిష్ట వాతావరణం, ద్రవ్యరాశి, ధూళివంటి పదార్థాలు ఉన్నాయని, కాలానుగుణంగా పరిణామక్రమంలో అవి నిర్వీర్యమవుతున్నట్లే సూర్యుడిలోనూ మార్పులు సంభవించి నిర్వీర్యమవ్వడం ఖాయమని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.