ఏటీఎం, దుకాణాల‌నూ లాక్కెళిపోయిన వ‌ర‌ద‌

ఉత్త‌రాఖండ్‌లో భారీవ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తాకిడితో అనేక ప్రాంతాలు దెబ్బ‌తిన్నాయి. ఇటీవ‌లి వ‌ర‌ద‌ల తాకిడికి సుమారు ఎనిమిది దుకాణాలు, ఏటీఎం కూడా వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రు స్తున్న‌ది. జువెల‌రీ దుకాణాలు, సుమారు పాతిక ల‌క్ష‌ల‌తో ఉన్న ఏటీఎం మునిగి వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపో వ‌డం,  చూసి ప్ర‌జ‌లు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.  ఉత్త‌ర‌కాశీ వ‌ద్ద నీటి ఉదృతి మ‌రింత పెర‌గ‌డంతో వ‌ర‌ద తాకిడి ఊహించ‌ని స్థాయికి చేరుకుంది. దీంతో ఉత్త‌ర‌కాశీలోని పురోలా బాగా దెబ్బ‌తిన్న‌ది. ముఖ్యంగా కుమోలా ఖాడ్ నీటి స్థాయి ఈ వ‌ర్షాల కార‌ణంగా పెరిగిపోవ‌డంతో ప‌రిస్థితులు భ‌యాన‌కంగా మారాయ‌ని అధికారులు అంటున్నారు. చెట్లు, దుకాణాలతో పాటు ఏటీఎం కూడా బొమ్మ‌ల్లా కొట్టుకుపోవ‌డం చూసిన‌వారు వీడియో తీసి నెటిజ‌న్ల‌కు అందుబాటులో ఉంచారు.  ఇదేవిధంగా,  రాష్ట్రంలో ఇత‌ర ప్రాంతాల్లోనూ భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ప‌ర్వ‌తాలు మట్టిపెళ్ల‌లు పెద్దస్థాయిలో విరిగి ప‌డ్డాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు తెలిపారు. ఉత్త‌ర‌కాశీలో హైవేలు వ‌ర‌ద నీటిలో మునిగి పోయాయి. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో సాధార‌ణ జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థ‌మ‌యింది. ప‌ర్యాట‌కులు, ప్రాంతీయ ప్ర‌జ లు అనేక మంది నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.  ఇదిలా ఉండ‌గా, దెహ‌రాడూన్ ఛాబ్రా గ్రామంలో ఉద‌యం నుంచీ భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు ఎస్‌డి ఆర్ ఎస్ ద‌ళాలు డెహ్రాడూన్ చేరుకున్నాయి. 

సుప్రీం పర్యవేక్షణలో వివేకా హత్య కేసు దర్యాప్తు!

ఏపీ మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం టీవీ సీరియల్ లా సా...గుతోంది. రోజుకో కుదుపు.. పూటకో మలుపులా ఈ కేసు విచారణ తీరు మారింది. సీబీఐ దర్యాప్తు ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు చందంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో ఆయన కుమార్తె డాక్టర్ సునీత  సుప్రీంను ఆశ్రయించారు.   తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొనసాగాలని ఆమె దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని  ఆమె ప్రతివాదులుగా  చేర్చారు. అత్యంత దారుణంగా, అమానవీయంగా జరిగిన తన తండ్రి హత్య కేసులో సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదని  తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్న వైనాన్ని కూడా తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు. 2019 మార్చి 15న   వివేకానందరెడ్డిని పులివెందులలోని తన నివాసంలోనే దారుణం హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి, వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఈ ఐదుగురి పేర్లు తెర మీదకు వచ్చినా.. వీరి వెనక సూత్రధారులు ఉన్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగి మూడేన్నరేళ్లు పూర్తయినా ఇంకా దోషులెవరనేది తేలనే లేదు. అయితే.. తన తండ్రి హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి పట్టు వీడకుండా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే నిందితులు ఉల్టా కేసులు వేయడం, సీబీఐ అధికారుల కారు డ్రైవర్ పై బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలతో  విచారణ నత్తనడక నడుస్తోంది. దీంతో సునీతారెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలంటూ ఆమె పిటిషన్ వేశారు.

జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్క్ లో క్యాన్సర్ కారకాలు..అమ్మకాల నిలిపివేత

చిన్నారులకు అవసరమయ్యే అన్ని ప్రాడెక్ట్స ను ఉత్పత్తి చేసి విక్రయించే సంస్థ ఏది అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది జాన్సన్ అండ్ జాన్సన్. సబ్బు నుంచి చిన్నారుల కోసం ఉపయోగించే టవల్స్, ఆయిల్, మాయిశ్చరైజర్స్, డైపర్స్  ఇలా  పువ్వుల్లాంటి తమ చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ఉప యోగించే ప్రతి వస్తువూ జన్సన్ అండ్ జాన్సనే బ్రాండ్ ను ఉపయోగించేవారు కోకొల్లలు. అలాంటిది ఇప్పుడు జన్సన్ అండ్ జాన్సన్ ఒక పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ఆ సంస్థ ఉత్పత్తి చేసే బేబీ టాల్క్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్క్ అమ్మకాలు నిలిచిపోనున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో ఉపయోగించే ఆస్ బెస్టాస్ ఒవేరియన్లో  క్యాన్సర్  కారకాలున్నాయని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలున్నాయంటూ దాదాపు 38వేల కేసులు నమోదయ్యాయి. అయితే క్యాన్సర్ కారకాల ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ ఖండించింది. తాము ఉత్పత్తి చేసే బేబీ టాల్కం పౌడర్ సురక్షితమైనదేనని వైద్య నిపుణులు నిర్ధారించారనీ చెబుతోంది. అయినా వినియోగదారుల ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో వచ్చే ఏడాది తరువాత ఈ సంస్థ విక్రయిస్తున్న బేబీ టాల్కమ్ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఈ బేబీ టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ ని వినియోగించాలని నిర్ణయించింది. అదలా ఉంచితే రెండేళ్ల కిందటే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను అమెరికా, కెనడాలలో నిలిపివేసింది.  

పార్టీ వ‌దిలిన‌వారితో రాజీనామా చేయించండి.. బండి డిమాండ్‌

ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా స‌రే రెచ్చ‌గొట్ట‌డం, హ‌డావుడి చేయ‌డం, అస్థిర‌త‌కు గురిచేయ‌డం బీజేపీవారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. ప్ర‌స్తుతం బీజేపీ నాయ‌క‌త్వం అంతా తెలంగాణాపైనే ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. మునుగోడులో ఎలాగ‌యినా గెలిచి త‌మ స‌త్తా ఏమిట‌న్న‌ది కేసీఆర్ ప్ర‌భుత్వానికి చాటాల‌న్న ఆతృతే ఎక్కువ ప్ర‌ద‌ర్శిస్తున్నారు బండిసంజ‌య్ టీమ్‌. అందుకే  టీఆర్ ఎస్ పార్టీ ఉపఎన్నిక‌ల్లో పాల్గొన డానికి ముందే పార్టీ వ‌దిలేసిన వారితో రాజీనామా చేయించి యుద్ధంలోకి దిగాల‌ని ఆయ‌న టీఆర్ ఎస్‌కు ఓ ఛాలెంజ్ విసిరారు.  మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజైన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం, రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో సంజయ్‌ పాద యాత్ర కొనసాగింది. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ కేసీఆర్‌కు నైతిక విలువ‌లు ఉంటే ఎన్నిక‌ల్లో పోటీకి రావాల‌ని అన్నారు.  ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, రైతుల‌కు ల‌క్ష రూపాయ‌ల రుణ మాఫీ, ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి హామీలన్నీ గాలికి వ‌దిలేశారా అని ప్ర‌శ్నిం చారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ల‌క్ష కోట్లు ఖ‌ర్చుచేశామ‌న్న కేసీఆర్ దాని వ‌ల్ల తెలంగాణా రైతాంగానికి  జ‌రి గిన ప్ర‌యోజ‌న‌మేమిటో తెలియ‌జేయాల‌ని డిమాండ్ చేశారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదిముర్మును ఓడించేందుకు కేసీఆర్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపాడని ఆరోపిం చారు. కేసీఆర్‌ అంటే ఖాసీం చంద్రశేఖర్‌ రజ్వీ అని, కేటీఆర్‌ అంటే సయ్యద్‌ మక్బూల్‌ అని ఎద్దేవా చేశారు. వీఆర్‌ఏలకు మద్దతు..రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేస్తున్న ఆందో ళనకు సంజయ్‌ మద్దతు తెలిపారు.  పెట్రోల్‌, డీజిల్‌ గ్యాస్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ నాయ కులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రామన్నపేటలో సంజయ్‌ ప్రసంగిస్తుండగా ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై స్వతంత్ర దర్యాప్తునకు జాతీయ మహిళా కమిషన్ ఆదేశం

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. తెలుగు రాష్ట్రాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు.  దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్న మాటలు.. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి  రెండు సార్లు మీడియాతో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేకుండా ఉన్నాయని జనం అభిప్రాయపడుతున్నారు. అలాగే వారి మాటల్లోని తేడాను సామాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు ఏకి పడేస్తున్నారు. అలాగే  తెలుగుదేశం పార్టీ కూడా ఈటెలలాంటి ప్రశ్నలు సంధిస్తూ వైసీపీపి ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ లోని ఇద్దరు మహిళా మంత్రులూ కూడా గోరంట్లకు మద్దతుగా మాట్లాడటంతో నెటిజన్లు ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. అయినా జగన్ సర్కార్, వైసీపీ పార్టీ అంతా నాఇష్టం.. ఏం చేసినా అడిగేదెవరు అన్న రీతిలో వ్యవహరిస్తోంది. అయితే ఇక గోరంట్ల వ్యవహారంలో ఇక ఆ పరిస్థితి  ఉండే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో కేంద్ర పెద్దలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందని హస్తిన నుంచి అందుతున్న సమాచారం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ జస్పీర్ సింగ్ గిల్ ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ప్రధానికీ, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూ లేఖలు రాశారు. అక్కడితో ఆగకుండా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కారణంగా ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అందరూ అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.    ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన పార్లమెంట్‌లో ఇటువంటి వ్యక్తులు అడుగు పెట్టడానికి అనర్హులని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ గిల్ కోరారని అంటున్నారు.   ఎంపీ గిల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పిందించి,  న్యూఢ్ వీడియో కాల్ వ్యవహారంపై  తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ రాసినట్లు తెలిసింది.  అలాగే ఈ వ్యవహారంపై స్వతంత్ర్య దర్యాప్తు జరిపి.. సాధ్యమైనంత త్వరగా మహిళా కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి  రేఖా శర్మ లేఖ రాశారు. దీంతో జగన్ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీ అని చూసీ చూడనట్లు  ఊరుకుందామనుకున్నా.. ఎదురుదాడితో ఈ వ్యవహారంలో విపక్షాల నోరు నొక్కుద్దామనుకున్నా ఇక వీలయ్యే అవకాశం లేదు. సాంకేతికంగా వీడియో ఒరిజనలా, ఫేకా అని తేల్చడం సాధ్యం కాదంటూ అనంతపురం ఎస్పీతో ప్రభుత్వం చెప్పించినా.. కేంద్రం తలచుకుంటే ఎస్పీ మాటల డొల్ల తనం కూడా వెల్లడైపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం న్యూడ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని నిగ్గు తేల్చాని బావిస్తే వైసీపీ బుకాయింపులకు అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  దీంతో ఇప్పుడు వైసీపీకి, జగన్ సర్కార్ లో మాధవ్ కు మద్దతుగా మాట్లాడిన వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందని పరిశీలకులు అంటున్నారు. 

మూఢ‌న‌మ్మ‌కం.. ప్రాణాంత‌కం 

పూర్వం శ్రీ‌కృష్ణుడు గోవ‌ర్ధ‌న‌గిరి ఎత్తి గోవుల‌ను, ఊరు జ‌నాన్ని భ‌యోత్పాతాన్నించి కాపాడాడ‌ని  ప్ర‌తీతి. దాన్ని గురించి క‌థ‌లు క‌థ‌లుగా ఇప్ప‌టికీ చెప్పుకోవ‌డం, భ‌జ‌న కీర్త‌న‌లు పాడుకోవ‌డమూ అనాది గా ఉంది. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బులంద్‌షెహ‌ర్ లో దేవేంద్రి అనే మ‌హిళకి పాము క‌రిస్తే ఆమె భ‌ర్త ఏకంగా పేడ‌గుట్ట కింద ప‌డుకోబెట్టాడు. ఆమె పాము కాటు విషం నుంచి బ‌య‌ట‌ప‌డి బ‌తుకుతుంద‌ని! కొంద‌రికి కొన్ని న‌మ్మ‌కాలు ఉంటాయి. వాటిని ఎన్నాళ్లుపోయినా దాటి రాలేరు. అత్యాధునిక యుగంలో ఉన్నా మారుమూల గ్రామాల్లోనే కాదు బులంద్‌షెహ‌ర్ వంటి ప‌ట్ట‌ణాల్లోనూ ఇలాంటి మూఢ న‌మ్మ‌కాల వారు ఉంటారు. న‌ల్ల‌పిల్లి దారికి అడ్డంగా వెళ్ల‌డం మ‌రింత దారుణంగా భావిస్తూనే ఉన్నారు. సైంటిస్టులు ఇలాం టి వేవీ న‌మ్మ‌వ‌ద్ద‌ని చెబుతూనే ఉంటారు. వారిది కంఠ‌శోష‌గానే మిగులుతోంది.  ఇంత‌కీ దేవేంద్రీ అనే ఆమె ఇంటికి ప‌నుల‌కు కావ‌ల‌సిన క‌ల‌ప తెచ్చుకోవ‌డానికి బ‌య‌టికి వెళ్లింది. ఆమె క‌ర్ర‌ముక్క‌లు ఏరుతున్న స‌మ‌యంలో ఒక పాము కాటు వేసింది. ఆమె భ‌య‌ప‌డి ఇంటికి ప‌రుగు తీసింది. భ‌ర్త‌కు జ‌రిగిన‌దంతా చెప్పింది. ఆమెను అత‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి తీసికెళ్లాల‌ని చుట్టుప‌క్క‌ల‌వారూ చెప్పారు. కానీ అత‌ను అంత అవ‌స‌రం లేదు, పాము కాటేక‌దా, పేడ ముద్ద‌ల వైద్యం చేస్తాన‌న్నాడు. వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. కానీ అత‌ను విన‌లేదు. వెంట‌నే ఇంటి ముందు  ఆమెను ప‌డుకోబెట్టి నువ్వేమీ ఖంగారుప‌డ‌కు అంటూ ఆమె మీద పేడ ముద్ద‌లు గుట్ట‌గా క‌ప్పాడు.  దేవేంద్రీ భ‌ర్త పిచ్చిత‌నం చూసి ప‌క్కింటాయ‌న పాముల మంత్ర‌గాడిని పిలిపించి మంత్ర చ‌దివించాడు. ఆయ‌న వ‌చ్చి ఈ త‌తంగం అంతా అయ్యేస‌రికి చాలా ఆల‌స్య‌మే అయింది. చీమ‌లు ఆమెను కుట్టేసేయి, పేడ పురుగులు పేడ‌ను మ‌రింత క‌ప్పేశాయి. భ‌ర్త గ‌మ‌నించుకోలేదు. మంత్ర‌గాడి మంత్రాలు వ్య‌ర్ధ‌మ య్యాయి. దేవేంద్రీ ప్రాణం విడిచింది. ఆమె భ‌ర్త‌ను ఆ ఊళ్లో చిన్న‌పిల్లాడి సైతం తిట్టిపోశాడు. ఇంత దారుణంగా ఎలా వ్య‌వ‌హ‌రించావు, పిచ్చిన‌మ్మ‌కాల‌కీ ఓ అంతుండాల‌ని ప‌క్కింటివాళ్లూ  తిట్టారు. 

మునుగోడులో బీజేపీ బిల్డప్ అంతా డొల్లేనా? టీఆర్ఎస్ దే పై చేయి అంటున్న సర్వే

మునుగోడులో బీజేపీకి అంత సీన్ లేదా? కోమటి  రెడ్డి రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు తెరతీసిన బీజేపీకి మునుగోడులో భంగపాటు తప్పదా? అంటే తాజా సర్వే ఫలితం ఔననే అంటోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కలిసి వచ్చినట్లు మునుగోడులో బీజేపీకి ఎంత మాత్రం కలిసి వచ్చే అవకాశాలు లేవని, ఇప్పటి దాకా రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన బిల్డప్ అంతా డొల్లేనని మునుగోడు ఫలితం తేల్చేస్తుందనీ ఆ సర్వే బల్ల గుద్ది మరీ చేబుతోంది. మునుగోడులో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యేనని బీజేపీ మూడో స్థానానికి పరిమితమౌతుందని పేర్కొంది. సాస్ గ్రూప్  ఆత్మసాక్షి సర్వే గ్రూప్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్(ఐపిఎస్ఎస్) టీమ్ఈ సర్వేను చేయించింది.  మండలాల వారీగా, కులాల వారీగా, లబ్ధి దారుల వారీగా ఈ సర్వే చేసినట్లు పేర్కొంది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో రెండు విధానాలలో సర్వే చేసినట్లు ‘ఓటా’ పేర్కొంది. ఒకటి రాండమ్ సర్వే కాగా మరొకటి సెలెక్టివ్ సర్వేగా వివరించింది. ఇలా జరిపిన సర్వేలో మునుగోడులో బీజేపీ పుట్టిమునగడం ఖాయమని తేలిందని పేర్కొంది. బీజేపీ మునుగోడు ఉప ఎన్నికలో మూడో స్థానానికే పరిమితమౌతుందని స్పష్టమైందని సర్వే పేర్కొంది. ఈ నెల 8-11 తేదీల మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగితే  బీజేపీది బలం కాదు వాపు మాత్రమేనని తేలిపోవడం ఖాయమని సర్వే వెల్లడించింది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలోనూ ర్యాండమ్ పద్దతిలో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. నాంపల్లి మండలంలో 790  , మర్రిగూడ మండలంలో 390, చందూరు మండలంలో 850, మునుగోడు మండలంలో 589,చౌటుప్పల్ మండలంలో 1020, గట్టుప్పల్ మండలంలో 200, నారాయణ పూర్ మండలంలో 520 శాంపిల్స్ చొప్పున సర్వే చేసినట్లు వివరించింది. నియోజకవర్గం మొత్తంలో 4350 మందిని ర్యాండమ్ గా ప్రశ్నించి వారి అభిప్రాయం తెలుసుకున్నట్లు వివరించింది.  దాదాపు అన్ని మండలాలలోనూ టీఆర్ఎస్ కే మొగ్గు కనిపించిందని సర్వే ఫలితం తేల్చింది. సగటు ఓటు షేరు తీసుకుంటే  టీఆర్ఎస్ కు 40శాతం, కాంగ్రెస్ కు 34.75 శాతం, బీజేపీకి 18 శాతంగా తేలిందని పేర్కొంది.  ఇతరులు 3.25 శాతంగా ఉండగా ఎటూ మొగ్గు చూపని వారు అంటే సైలెంట్ వోట్ ఫ్యాక్టర్ 4 శాతంగా సర్వే పేర్కొంది. దీనిని బట్టి రాష్ట్రంలో బీజేపీది వాపే కాదు బలమేనని సర్వే ఫలితం తేల్చేసింది. మునుగోడులో ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్యేనని, నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రాజగోపాల రెడ్డి రాజీనామాకు రేవంత్ పై వ్యతిరేకత, కాంట్రాక్టులే కానీ నియోజకవర్గ అభివృద్ధి కాదని భావిస్తున్నారని పేర్కొంది.  మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ సర్కార్ చేనేత బీమా ప్రకటించిందనీ, దీర్ఘ కాలంగా ఇక్కడి ప్ర.జలు డిమాండ్ చేస్తున్నగట్టుప్పల్ మండలాన్ని ప్రకటించడంతో జనం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా సర్వే పేర్కొంది.  

మ‌ర‌ణానంత‌ర  ప్ర‌యాణానుభ‌వం.. 

మ‌ర‌ణానంత‌ర జీవితం ఉంటుందా? ఇదేప్ర‌శ్న అనాదిగా చాలామంది రుషుల్ని, మాన‌సిక శాస్త్ర‌వేత్త‌ల్ని అడు గుతున్న ప్ర‌శ్న‌. క‌డు దుర్ల‌భం అన్న‌ది అనేక మంది స‌మాధానం. కానీ ఎక్క‌డో  ఒక‌చోట అప్పుడ పుడు కొన్ని వింత‌లు జ‌రుగుతూంటాయి. లోక‌మంతా ఆశ్చ‌ర్య‌ప‌డ‌టం ప‌రిపాటిగానూ మారింది. ఇటీవ‌లి కాలంలో ఇలాంటిదే జ‌రిగింది. జెస్సీసాయ‌ర్‌, బెట్టీ జె.ఈడీ అనే స్నేహితుల‌కు ఇలాంటి అనుభ‌వ‌మే అయింది. మ‌ర‌ణించే స‌మ‌యంలో ఊహంచని విచిత్రం చూశారు. 78 ఏళ్ల బెట్టీ ఆనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరింది. ఆప‌రేష‌న్ విఫ‌ల‌మై ఆమె చ‌నిపోయింది. కానీ శ‌రీరం నుంచీ ఆత్మ విడిపోయే సెకండులో బెడ్ మీద త‌న శ‌రీరాన్ని చూసుకుందిట‌. ఆమె ప్రాణం పోయిన త‌ర్వా త ముగ్గురు రుషుల్లాంటివారిని చూసింద‌ట‌. త‌న ఆత్మ రాకెట్ వేగంతో త‌న నివాసానికి వెళ్లి ఇంట్లో ఉన్న వారిని చూసింది. ఆ త‌ర్వాత పెద్ద గుహ‌లోకి వెళ్లింది, అక్క‌డ జీస‌స్ ద‌ర్శ‌న‌మిచ్చాడ‌ట‌. ఆయ‌న ఆమెను హ‌త్తుకుని బిడ్డా, ఇది నీవు నీ శ‌రీరాన్ని విడిచే స‌మ‌యం కాద‌ని అన్నార‌ట‌. ఆ త‌ర్వాత ముగ్గురు దేవ‌క‌న్య లు చ‌క్క‌ని తోట‌లోకి తీసికెళ్లి ఆమెకు మ‌ర‌ణ స‌మ‌యం కాద‌ని నీ శ‌రీరాన్ని వెళ్లి చేరు అనే ఆదేశించారు ఇదంతా జ‌రిగిన ఐదేళ్ల త‌ర్వాత ఆమె మెడిక‌ల్‌గా కొంత స‌మ‌యం మ‌ర‌ణించింద‌ని అది ఎలా జ‌రిగిందీ డాక్ట‌ర్లు వివ‌రించారు. ఆమె బ‌తికి వాళ్లంద‌రికీ తాను అనుభ‌వించిన దివ్యానుభ‌వాన్ని పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌న అనుభ‌వాల‌తో ఇపుడు ఆమె ఎంబ్రాస్డ్ బై లైట్ అనే పేర పుస్త‌కం రాస్తోంది.  ఇదంతా సాధ్య‌మా, ఇలా జ‌రుగుతుందా అంటే కొన్ని సంఘ‌ట‌న‌లు, సంద‌ర్భాలు న‌మ్మాలి. 

ఎంపీ అబ్రివేషన్ నే మార్చేశారు.. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జస్పీర్ సింగ్ గిల్

న్యూఢ్ వీడియో కాల్ విషయంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు  ఏపీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు  చేస్తున్నా విచారణే జరపకుండా పోలీసులు గోరంట్ల మాధవ్ కు మీడియా సమావేశం పెట్టి మరీ క్లీన్ చిట్ ప్రయత్నం చేసినా… అవన్నీ  ఏ మాత్రం ఫలించలేదు.  గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఢిల్లీ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ పరువును నిలువునా తీసేసింది. వైసీపీ సర్కార్ నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కాంగ్రెస్   ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ … లోక్‌సభ స్పీకర్, మహిళా కమిషన్ చైర్ పర్సన్, ప్రధాని మోడీలకు గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారు.  గోరంట్ల మాధవ్ తీరుతో పార్లమెంటు పరువు రోడ్డున పడినట్లైందనీ, పార్లమెంటు సభ్యులకు  ఎంపీలకు మాయని మచ్చలామారిందనీ అన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. గోరంట్ల మాధవ్ తన ఛండాలమైన పనితో ఎంపీ అబ్రివేషన్ నే మారిపోయేలా చేశారనీ, అందరూ ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని జస్బీర్ సింగ్ గిల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  వైసీపీ ఎంపీలు కూడా గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మాట్లాడుతున్న మాటలు పార్లమెంటు పరువుతీసేలా ఉన్నాయన్నారు. ఎంపీ భరత్.. గోరంట్ల మాదవ్ వీడియోను ఫోరెన్సిక్‌ను పంపామని ఒకసారి, అలాంటిదేమీ లేదని  మరోసారి చెబుతున్నారని, ఇలా ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తక్షణం విచారణ జరిపించి పార్లమెంట్ ఔన్నత్యం కాపాడాలని కోరారు.  

చలో బీహార్.. నితీష్, తేజస్వి ప్రసాద్ తో భేటీకి పట్నాకు కేసీఆర్

బీహార్ పరిణామాలతో కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారిస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆయన బీహార్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 14(శనివారం), 15(ఆదివారం) తేదీలలో ఆయన బీహార్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన బీహార్ సీఎం నితీష్ కుమర్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో భేటీ అవుతారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డయే కూటమి నుంచి బయటకు వచ్చేయడంతో మరో సారి జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలను వేగవంతం చేయాలని కేసీఆర్ భావస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదవ సారి ప్రయాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించడమే తన పర్యటన ఉద్దేశమని కేసీఆర్ చెబుతున్నప్పటికీ పరిశీలకులు మాత్రం జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలపై చర్చించేందుకు కేసఆర్ బీహార్ పర్యటన అని అంటున్నారు. ఇంత కాలం ఎన్డీయే కూటమిలో ఉన్నందున నితీష్ కుమార్ తో కేసీఆర్ టచ్ లో లేరు కానీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం చాలా కాలం నుంచీ కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మోడీపై విమర్శలు గుప్పించడం, 2024లో బీజేపీ ఓటమి తథ్యమంటూ పేర్కొనడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. అందుకే బీజేపీతో కటీఫ్ చెప్పి నితీష్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడంతోనే ఆయనతో భేటీకి కేసీఆర్ బీహార్ పయనమౌతున్నారని పరిశీలకులు అంటున్నారు. 

కొత్త‌గా 10ల‌క్ష‌ల పెన్ష‌న్ల మంజూరు.. క్యాబినెట్ నిర్ణ‌యం

తెలంగాణ కేబినెట్ భేటీ లో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.తాజాగా అదనంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణ యించింది. కొత్తవి,. పాతవి కలిపి మొత్తం 46 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం(ఆగ‌ష్టు11) నిర్వహించిన మంత్రివ‌ర్గ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించింది. ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ సమా వేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం  నిర్ణయం తీసు కుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్ష న్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు మంజూరు చేయనున్నారు. దీంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆదేశించింది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇక స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కోఠి ఈఎన్. టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది.  అలాగే కోఠి ఈఎన్‎టి ఆస్పత్రి లో అధునా తన సౌకర్యాలతో టవర్ నిర్మించాలని మంత్రులు నిర్ణయించారు. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌక ర్యాలతో కూడిన నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు మంత్రులు ప్రతిపాదనలు చేశారు. 

కూర‌ల‌మ్మేవాళ్ల దేశ‌భ‌క్తి

భ‌క్తి, ప్రేమ‌లు మ‌న‌సులో ఉండాలే గాని మైకుల్లో గోల‌చేయ‌ న‌క్క‌ర్లేదు. భారీ ప్ర‌చారాలేమీ అక్క‌ర్లేదు. చిన్న‌ పాటి ప‌ని చాలు. అమృతోత్స‌వ్ పేరు తో బీజేపీవారికున్నంత దేశ‌భ‌క్తి మాకు లేదుగాని మాకున్నంత‌లో మాదీ దేశ‌భ‌క్తే అంటున్నారు కూర‌ గాయ‌ల మార్కెట్లో దుకాణాల‌వారూ. నిజమే రాజ‌కీయ‌నాయ‌కుల‌కు, పారిశ్రామిక వేత్త‌ల‌కే కాదు అంద‌రికీ ఉంటుంది. ఎవ‌రి స్థాయిలో వారు దాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు.  ఇది ఏ ఊరు, ఎక్క‌డా అన్న‌ది అవ‌త‌ల‌పెడితే, అస‌లు ఇలా కూడా దేశ‌భ‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌కే జ‌య‌హో అనొచ్చు. మార్కెట్లో వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. అంద‌రూ ఇలానే వారి దుకాణాల ముందు ఏర్పాటు చేశారు. పారిశ్రామిక‌ వేత్త‌లు వారి సంస్థ‌ల పైనా జెండా ఏర్పాటు చేస్తారు, నాయ‌కులు వారి వారి కార్యాల‌యాల్లో, స్కూళ్ల‌లో ఉపాధ్యాయులు. కూర‌గాయ‌లు అమ్మేవారు మార్కెట్లో పెట్టుకున్నారు. వీరి ప్ర‌య‌త్నం బ‌హుశా రైతుల ప‌రంగా దేశ‌భ‌క్తిని ప్ర‌క‌టిస్తున్నారేమో! దేశానికి వెన్నెముక రైతాంగం అనేది అనాదిగా మ‌న దేశం గురించి చెప్పుకుంటూన్నాం. కానీ ప్ర‌భుత్వాలేవీ ఇటీవ‌లి కాలంలో వారి గోడే పట్టించుకోవ‌డం లేదు. అందుకే వారు ఆగ్ర‌హించి ఎదురుతిరుగుతున్నారు. ఇదే ఆ మ‌ధ్య గుజ‌రాత్ రైతాంగం చేసి న‌ది. ధ‌డిసి, ఏమీ చేయ‌లేని స్థితిలో కేంద్రం దిగివ‌చ్చింది. రైతుల సంర‌క్ష‌ణే మా ల‌క్ష్యం అంటూ అజెండాల్లో రాసుకునే మ‌హానేత‌లు రైతుల వెన్నే విరుస్తున్నారు. తిండిపెడుతున్న‌వారికే తిండి లేకుండా చేయ‌డానికి సాహ‌సిస్తున్నారు. అంతా పారిశ్రామిక వాడ‌ల‌వుతున్నాయే గాని పంట‌భూములు దెబ్బ‌తింటు న్నాయన్న‌ది తెలియ‌కా కాదు. ఏదో ఒక పండ‌గ‌రోజునో, స్వాతంత్య్ర‌దినోత్స‌వం రోజునో రైతాంగాన్ని ఆకాశానికి ఎత్తే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భు త్వాలు రైతుల్ని గుర్తుచేసుకోవ‌డ‌మే అవుతోంది. కానీ వారి దేశ‌భ‌క్తి ఉంద‌న్న‌ది కూర‌గాయ‌లు అమ్మేవారి ద్వారా ప్ర‌క‌టించారు.

గోరంట్ల‌పై, స‌హ‌క‌రిస్తున్న పోలీసుల‌పైనా చ‌ర్య‌లు తీసుకోండి..టీడీపీ నేత‌ అనిత

మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో తాను ముందుంటాన‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌చారం బాగానే చేయించుకున్నారు. కానీ త‌న ఎంపీయే ఊహిం చ‌నివిధంగా ప‌ట్టుబ‌డినా అదంతా క‌ట్టుక‌ధే అన్న‌ట్టు జ‌గ‌న్ వ్య‌వ‌హ రించ‌డంప‌ట్ల విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. వైసీపీ అనంత‌పురం ఎంపీ గోరంట్లమాధ‌వ్ న్యూడ్ వీడియో లోక‌మంతా చూసి నివ్వెర‌పో యింది. అయినా అందులో ఉన్న‌ది న‌కిలీ, అదంతా మార్ఫింగ్ వ్య‌వ‌ హార‌మ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఎంత‌యినా త‌మ‌వాడు అంత దుర్మార్గానికి ఒడిగ‌డ‌తాడా అన్నది వారి ధీమా. కానీ అందులో క‌ని పించిన‌ది గోరంట్ల మాధ‌వుడే అని త‌ప్పుల్లేకుండా అంద‌రూ అన్నారు. కానీ అందుకు అవ కాశం లేద‌ని వైసీపీ కితాబునిచ్చింది.  మావాడు మ‌హా మంచివాడ‌ని చెబుతూ త‌ప్పించుకునే య‌త్నం చేస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక‌లు వ‌స్తేగాని ఏదీ తేల్చ‌లేమ‌ని అం టున్నారు. సీఎం, మంత్రులు, ఎంపీలు కూడా గోరంట్ల ప‌ట్ల ఎంతో ప్రేమ‌గా ఉండ‌డం, ఆయ‌న్నుదీన్నించీ త‌ప్పించ‌డానికే పూను కున్నారని విశ్లేష‌కులు అంటున్నారు. కానీ విప‌క్షాల‌కు అంత అవ‌స‌రం లేదు. ఉన్న‌ది ఉన్న‌ట్టే చీల్చి చెండాడుతారు. అందు లోనూ ప్ర‌జ‌ల దృష్టిలో ప‌రువు పోగొట్టుకున్న వైసీపీ స‌ర్కార్ స‌మాధానం చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది.  ఎస్పీ ఫక్కీరప్ప చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం వీలుకాదని ఎస్పీ చెప్పడంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత  అస హనం వ్యక్తం చేశారు. గోరంట్ల న్యూడ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షకు పంపితే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లపై, సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్‌ సర్కార్‌ విఫలమైం దన్నారు.

ఈ బంధం అనుబంధ‌మేనా?

అన్న‌య్య స‌న్నిధి.. అదే నాకు పెన్నిధి.. అంటూ చెల్లెలు అన్న‌గారి కాళ్ల‌ మీద ప‌డి క‌న్నీళ్ల‌తో క‌డిగిన‌పుడు ప్రేక్ష‌కులు అన్న‌గారినే మెచ్చుకున్నారు. సినిమాలో చెల్లెలు నిజంగానే వీర ప్రేమ ప్ర‌క‌టించింది గ‌నుక‌.  అన్నా చెల్లెళ్ల మ‌ధ్య ప్రేమ త‌రిగిపోతుందా అంటే అసాధ్య‌మంటారు పెద్ద‌వాళ్లు.. కానీ  ఇప్పుడు అవ‌స‌రార్ధం ప్రేమ‌నే ప్ర‌క‌టించారు వైసీపీ చెల్లెళ్లంతా!  ఏపీ సీఎం జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్ట‌డానికి స్వీట్లు తినిపించ‌డానికి పార్టీ మ‌హిళా మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ క‌ట్టారు. వారి ప్రేమ‌ను మ‌రీ సినిమాటిక్‌గానూ ప్ర‌ద‌ర్శించారు. బొట్టుపెట్టి రాఖీ క‌ట్టి స్వీట్లు తినిపిస్తుంటే జ‌గ‌న్ మాత్రం ఏమి ప్రేమ ఎంత‌టి ప్రేమ అనుకునే ఉంటారు. హోంమంత్రి తానేటి వ‌నిత‌, మ‌రో మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ, వాసిరెడ్డి ప‌ద్మ.. అంతా అన్న‌గారి మీద ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో పోటీలుప‌డ్డారు.  మరో వైపు.. మహి ళలపై దాడులు జరిగితే... గన్ కంటే ముందు జగనన్న వచ్చేస్తాడంటూ గతంలో చెప్పిన మరో మంత్రి ఆర్కే రోజా మాత్రం.. జగనన్నకు రాఖీ కట్టలేదని.. నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా తెగ ట్రోల్ చేస్తున్నారు.  ఇంత‌లో ఎంత మార్పు అనుకునే ఉంటారు జ‌గ‌న్‌. తాను క‌ష్టాల్లో ఉన్న‌పుడు, జైల్లో ష‌టిల్ ఆడుతున్న పుడు ఈ చెల్లెళ్ల‌లో ఏ ఒక్క‌రూ క‌నీసం అటుకేసి వెళ్ల‌లేదు. వెళితే మెడకి  ఏమి చుట్టుకుంటుందోన‌ని భ‌యం! కానీ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఎక్క‌డా లేని ప్రేమ ఒల‌క‌బోస్తున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డానికి  స‌హ‌క‌రించింది ఆయ‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, సోద‌రి ష‌ర్మిల‌. కానీ వారిని  దూరం చేసుకోవ‌డం బ‌హుశా ఇప్పుడు ఇబ్బందిపెడుతుందనే విశ్లేషకుల మాట‌. ర‌క్షా బంధ‌న్ అంటే చెల్లెలు, అక్కా వ‌చ్చి రాఖీ క‌ట్ట‌డం స‌హ‌జంగా జ‌రిగేది. కానీ ష‌ర్మిల దూరంగా ఉన్నా రు. త‌ల్లి అవ‌మానంతో కూతురు వేపు వెళ్లారు.  మరోవైపు.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, సీఎం జగన్ సోదరి  షర్మిల.. తెలంగాణలో పంట చేలల్లో వరి నాట్లు వేస్తూ.. రైతులకు సాయం చేస్తున్న ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొనకపోవడంతోనే రాజకీయ చెల్లెళ్ల ప్రేమలోనే జగనన్న తరించాల్సి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు.

దేశ‌భ‌క్తి..  జాతీయ‌మా..గుజ‌రాతీయ‌మా!

అడుగో అరి భయంకరుడు కట్టబ్ర‌హ్మ‌న్నా..అది వీర పాండ్య వంశాంకురా సింహ గర్జన.. అంటూ పెద్ద ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఆవేశంగా న‌టిస్తుంటే ఇంత‌కంటే దేశ‌బ‌త్తి ఎవ‌రుకుంట‌దిరా బావా! అనుకున్నారంతా! అల్లూరి గ‌ర్జ‌న కృష్ణ గొంతులో విని ఈడ్రా మొన‌గాడంటే.. అన్నారంతా. దేశ‌భ‌క్తిని స‌రిగ్గా ఆజాదీ కా అమృతోత్స‌వ్ స‌మ‌యంలోనే విపరీతంగా  ప్ర‌చారం చేస్తోంది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే బీజేపీవారి  దేశ‌భ‌క్తి అన‌న్య‌సామాన్యం. ఎవ్వ‌రికీ ఉండ‌డానికి వీల్లేదు. వారి ప్రేమ ఎల్ల‌లు దాటిపోయింది. అయినా అలా వెళ్లిన వారు తిరిగి వ‌స్తార‌నే భ్ర‌మ‌లో పెట్టి దేశానికి మాత్రం దేశ‌భ‌క్తి గీతాలను పెద్ద ఎల్పీలోనే వినిపిస్తున్నారు బీజేపీ నేత‌లు. స్వాతంత్య్ర‌  సమరంలో ఫ‌లానా ఆయ‌న గాంధీగారు అడ‌గ్గానే ఇంట్లో బంగార‌మంతా ఇచ్చేశాడ‌ట‌, ఒకామె ఏకంగా పుస్తెలే తీసిచ్చేసింది. క‌థ‌లు క‌థ‌లుగా అనాదిగా చెప్పుకుంటున్న ఇలాంటి సంఘ‌ట‌న‌లు  కోకొల్ల‌లు. కానీ తాజాగా బీజేపీ మాత్రం ఇక్కడ బ్యాంకుల నుంచి కోట్లు రుణాల రూపంలో కొల్లగొట్టి దేశ సరిహద్దు దాటేసిన దేశ భక్తులను వదిలే స్తోంది. అలా ఇక్కడ సంపద దోచుకుని పరారైన ‘దేశభక్తు’లలో  మోడీగారి గుజ‌రాత్ సంబంధీకులే అత్యధికులు కావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ వీరు ఎల‌గ‌బెట్టిందేమిట‌య్యా అంటే ఇక్క‌డి వంటింట్లో పొపుల డ‌బ్బాలో చిల్ల‌ర‌తో స‌హా బ్యాంక్ మేనేజ‌ర్ల జేబుల్లో వంద‌రూపాయ‌ల‌తో స‌హా అమాంతం లాక్కుపోయి విదేశాల్లో స‌రదాగా కాలం గ‌డుపుతున్నారు. వారికి ఇక్క‌డికి రావ‌డం బొత్తిగా ఇష్టం లేద‌ు. విజ‌య్ మాల్యా, మొహుల్ చోక్సీ, నీర‌వ్ మోడీ వంటివారు అక్క‌డే కులాసాగా జీవితాంతం ఉండాల‌ను కుంటున్నారు. ఎందుకంటే ఇక్క‌డ బ్యాం కులు, జ‌నాల సొమ్ము చ‌క్క‌గా అక్క‌డ విందులు వినోదాల‌కి స‌రిపోతుంది. ప్ర‌త్యేకించి అక్క‌డ ఏ ఉద్యోగం చేయ‌క్క‌ర్లేదు. చ‌దువు కోసం విదేశానికి వెళ్లిన కుర్రాడు మాత్రం ఓ పూట చీపురు ప‌ట్టుకుని రోడ్డూడిచే ప‌ని చేస్తు న్నాడు.  పార్ల‌మెంటులో, బ‌య‌టా ఈ ఆధునిక దేశ‌భ‌క్తుల బాగోతం గురించి ప్ర‌భుత్వాన్ని, ఎంపీల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. కానీ వారికి చీమ కుట్టిన‌ట్ట‌యినా లేదు. కాబోతే, అప్పుడే మ‌త్తు నుంచి తేరుకున్న‌ట్టు తోచిన స‌మాధానం ఇచ్చి ఊరుకుంటున్నారు. కాకుంటే జ్యోతిష్యుడి ద‌గ్గ‌రికి వెళ్లి చిల‌క జ్యోసం లో ప్ర‌శ్ని స్తామంటున్నారు. అంతే త‌ప్ప వారిని  క‌నీసం  ముంబ‌యి కూడా తీసుకురాల‌ని ప‌రిస్థి తుల్లో ప్ర‌భుత్వం ఉంది. మ‌న దేశం, మ‌న వ్యాపారులు, మ‌న పారిశ్రామిక‌వేత్త‌లు, విద్యావేత్త‌లు అంటూ భారీ ప్ర‌సంగాలు చేస్తుండే ప్ర‌ధాని మోదీ అనేక ప‌ర్యాయాలు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లారే గాని ఎక్క‌డో ఒక‌చోట వీరిని గురించి వాక‌బు చేయ‌లేదు. అంటే మ‌నోడు. మ‌నూరోడు అనే భావ‌న పాపం ఆయ‌న్ను క‌ట్టేస్తోంది. ఆయ‌న‌మాత్రం ఏం చేస్తాడు. ఎంత‌యినా ప్రాంతీయాభిమానం. ఆయ‌న‌కు దేశ‌భ‌క్తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌చార సామ గ్రి కానీ నిజానికి ఇలాంటి వార‌ని లాక్కొచ్చి పోలీస్ స్టేష‌న్లో ప‌డేసి ఉత‌కాల‌న్న ప‌ట్టు ద‌ల ఏమాత్రం లేదు. అది దేశ‌భ‌క్తి అనిపించుకోదు. ఇది దేశానికి ప‌ట్టిన దౌర్భాగ్యం.  బ్యాంకుల‌ను మోసం చేయ‌డం ఎంత తేలిక అన్న‌ది నీర‌వ్ మోడీ లాంటివారు నిరూపించారు.  ఇటువంటి వారిని దేశానికి లాక్కొచ్చి వారు దోచేసిన సొమ్మును కక్కిస్తే దేశ ఆర్థిక కష్టాలు చాలా వరకూ గట్టెక్కుతాయి. మోడీ ఎన్నికల ప్రచారంలో విదేశాలలో మూలుగుతున్న మన వారి నల్లడబ్బును వెనక్కు రప్పించి పేదలకు పంచేస్తామని ఎంతో ఘనంగా వాగ్దానం చేశారు. ఆ తరువాత ఎందుకో మరి అక్కడి సొమ్మును వెనక్కు తీసుకుకోవడం సంగతి అటుంచి.. ఇక్కడ నుంచి తన రాష్ట్రం వారు సొమ్ము దోచుకుని విదేశాలకు పారిపోతున్నా చూస్తూ ఊరుకున్నారు. ఎంతైనా దేశ భక్తి (గుజరాత్ భక్తి) కదా?  ప్రభుత్వమే ఇక్కడి బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన వారి జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో ఉన్న 28 మందిలో ఒక్క విజయ్ మాల్యాను మినహాయిస్తే మిగిలిన 27 మందీ గుజరాతీ యులే కావడం కాకతాళీయమంటే నమ్మి తీరాలి మరి. ఇంతకీ వీరు దోచేసి తీసుకుపోయిన సొమ్ము ఎంతో తెలుసా అక్షరాలా పది ట్రిలియన్ డాలర్లు.

తెలంగాణ బీజేపీకి సీఈసీ షాక్.. సాలుదొర సెలవు దొర ప్రచారానికి బ్రేక్

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు మీద ఉన్న బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా సాలు దొర.. సెలవు దొర అంటూ కేసీఆర్ ఫొటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి ప్రచారం ప్రారంభించింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రచారంపై అభ్యంతరం తెలిపింది. కేసీఆర్ ఫొటోలతో ఆయన వ్యతిరేక ప్రచారం చేయడం చట్టానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. విశేషమేమిటంటే ఈ ప్రచారంపై టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు.అయితే  కేంద్ర ఎన్నికల సంఘమే అటువంటి ప్రచారం చట్ట వ్యతిరేకమని పేర్కొంది. కేసీఆర్ ఫొటోలతో పోస్టర్లు ముద్రించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం  తెలంగాణ బీజేపీని విస్పష్టంగా ఆదేశించింది. గత నెలలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా  టీఆర్ఎస్  మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగా బీజేపీ కూడా చాలు దొర.. సెలవు దొర అంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇప్పడు అదే నినాదంతో అంటే సాలు దొర.. సెలవు దొర అంటూ ప్రచారం చేసుకోవడానికి ఈసీ అనుమతి కోరింది. అయితే ఈసీ నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, రాతలతో ప్రచారం కూడదని స్పష్టం చేసింది.  దీంతో ఇక బీజేపీ టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతిని హైలైట్ చేస్తూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది.

ఎంపీ న్యూడ్ వీడియోకాల్ పై లోక్ సభ స్పీకర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు

వైసీపీ ఎంపీ న్యూడ్ కాల్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళతో   న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారంపై  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు అందింది. ఒక కాంగ్రెస్ ఎంపీ ఈ ఫిర్యాదు చేశారు. పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ సింగ్ గిల్‌  గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అలాగే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ,  జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌ల‌కు కూడా ఫిర్యాదు చేశారు,  గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్  వీడియో వ్య‌వ‌హారం పార్ల‌మెంటుకు మాయ‌ని మ‌చ్చ‌గా  ఆయ‌న త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోపై త‌క్ష‌ణ‌మే దృష్టి సారించి   క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూల స్తంభమైన పార్లమెంటులో ఇటువంటి వ్యక్తులు అడుగుపెట్టడానికి అనర్హులని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాల్ వ్యవహారంలో ఎలాంటి తాత్సారానికీ తావు లేకుండా సత్వరమే విచారణ చేసి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ సింగ్ గిల్‌ కోరారు.

ఎల్ల‌లు లేని స్నేహం 

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.. అంటూ పెద్ద రోడ్డుకి ఇరుప‌క్క‌ల నుంచి హీరోలు క‌లుసుకునేందుకు ఏకంగా పాట అందుకుంటారు.. స్నేహ‌బంధ‌మూ.. అంటూ న‌లుగుర‌యిదుగురు వ‌య‌సుమ‌ళ్లి స్నేహితులూ అంతే ఉత్సాహంగా పాడేసుకుంటారు.. ఇందులో ఎంతో నిజం ఉంది. స్నేహానికి ప్ర‌దేశం, దేశం, ఖండా ల‌తో ప‌రి మితులు విధించ‌లేం. అంతెందుకు రాజ‌కీయాల ప‌రంగా పాకిస్తాన్‌ను ఛ‌స్తే స్నేహితుడిగా అంగీ కరించ‌లేం. కానీ ఆట‌ల విషయానికి వ‌చ్చేస‌రికి క్రీడాకారులంతా స‌ర‌దాగా గ‌డిపేస్తుంటారు. ఒక‌రిని ఒక‌రు అభినందించుకోవ‌డం, జోక్స్ వేసుకోవ‌డ‌మూ చూస్తుంటాం.  ఇది అస‌లు సిస‌లు ప్రేమ‌. కాలం మారి నా అలాంటి స్నేహాలు ఉంటాయి. ఇపుడు తాజాగా హార్వ‌ర్డ్ వ‌ర్సి టీలో ఇద్ద‌రు త‌మ స్నేహం గురించి తెలియ జేశారు. ఒక‌రు భార‌త్‌కి చెందిన అమ్మాయి, మ‌రొక‌రు పాకి స్తాన్! వీరిద్ద‌రూ చాలాకాలం త‌ర్వాత క‌లిసేరు. కానీ అంతే స్నేహ‌పూర్వ‌కంగా, మ‌రెంతో అభిమానంతో మాట్లాడుకున్నారు. తాను ఇన్నాళ్ల‌కు పాక్ స్నేహితురాలిని క‌ల‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని స్నేహా ప్ర‌క‌టించింది.  చిత్ర‌మేమంటే ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానాన్ని రాజ‌కీయ నాయ‌కులు రాజకీయాల‌ను దూరం పెట్ట‌డానికి ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌డం లేదు. దాడులు, మార‌ణ‌హోమాలు సృష్టించ‌డానికే కంక‌ణం క‌ట్టుకోవ‌డం పాక్ వంతు అయింది.  స్నేహా బిస్వాస్ హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్లో చ‌దువుతోంది. ఇటీవ‌లే ఆమె కాలేజీ ఆవ‌ర‌ణ‌లో ఒక‌మ్మాయిని చూసి క్ష‌ణం నివ్వెర‌పోయింది. ఎక్క‌డో క‌లిసిన మొహంలానే ఉందే అనుకుంది. అంతే ఒక్క‌సారి గ‌తం సినిమా రీలులా తిరిగింది. రీలు ఆగ‌గానే ఆమె త‌న పాకిస్తానీ స్నేహితురాల‌న్న‌ది గుర్తించింది. ఇస్లామా బాద్ అమ్మాయితో ఫ‌స్ట్ సెమిస్ట‌ర్ అయ్యేలోగా మ‌రింత స‌న్నిహితురాల‌య్యింది స్నేహా. ఆమె ధైర్యంగా చెప్పే అనేక విష‌యాల‌ప‌ట్ల స్నేహా ఆక‌ర్షితురాల‌యింది. మ‌నం అనుకుంటున్న వైరానికి అస‌లు అక్క‌డి ప్ర‌జ‌ల్లో భార‌త్‌ప‌ట్ల ఉన్న అభిమానానికి పొంత‌నే లేద‌ని స్నేహా అభిప్రాయ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం.

నార్మన్ ఫోస్టర్ పిటిషన్ పై జగన్ సర్కార్ కు సుప్రీం నోటీసులు

ఒక‌రి గొప్ప‌త‌నాన్ని ఓర్వలేని తనంతో తిరస్కరించడం,ఒక‌రి దార్శనికత జాతికి మేలు చేస్తుందని తెలిసినా  నిర్ల‌క్ష్యం చేయ‌డ‌మో అమ‌లు కాకుండా అట‌కెక్కించ‌డ‌ం క్ష‌మార్హం కాదు. క్షంతవ్యం కాదు. జగన్ సర్కార్ సరిగ్గా అలా క్షంతవ్యంకాని వ్యవహార శైలినే ఈ మూడేళ్లుగా చేస్తూ వస్తున్నది.  నాడు నారా చంద్ర‌బాబునాయుడు ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా రాజ‌ధాని నిర్మాణ ప‌ను ల‌ కోసం విదేశీయుల‌తో సంప్ర‌దిచ‌డం మీద అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ఆయ‌న దూర‌దృష్టిని  గ్ర‌హించి విమర్శకులంతా ఆ తరువాత మెచ్చుకున్నారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించారు.  ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత  రాజ‌ధానిగా అమ‌రావ‌తిని దేశనికే తలమానికంగా నిర్మించాలని  చంద్రబాబు ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. కానీ అందుకు సంబం ధించి కొంత వ‌రకే ప‌నులు సాకార‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. రాజధాని అమరావతి వైభోగాన్ని, ప్రాశస్థ్యాన్ని కొనసాగనీయరాదని నిర్ణయించుకుంది. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటక తెరతీసింది.  ఆ ప్రయత్నంలో అన్ని విధాలుగా అభాసుపాలైంది. అదలా ఉంచితే.. టీడీపీ  హయాంలో అమరావతి నిర్మాణం కోసం నార్మన్ అండ్ ఫోస్టర్ కంపెనీ డిజైన్లు సిద్ధం చేసింది. అయితే అధికారం లోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని  జగన్‌ పక్కన పెట్టారు. అంతే కాదు గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని అమరావతి భవనాలకు డిజైన్లు సిద్ధం చేసిన  నార్మన్ అండ్ ఫోస్టర్ కంపెనీ  తమకు చెల్లించాల్సిన సొమ్ముల కోసం ఇచ్చిన నోటీసులను జగన్ సర్కార్ పట్టించుకోలేదు.   దీంతో నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ  సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేర‌కు జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు  నోటీసులు జారీ చేసింది. అమరావతి విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయం బెడిసి కొట్టిందనే చెప్పాలి.    మూడు రాజ‌ధానుల నిర్ణయం   పాల‌నా సౌల‌భ్యం కోస‌మేనని జగన్ సర్కార్ చెప్పిన కారణాన్ని ఎవరూ ఆమోదించలేదు. అమ‌రావ‌తి రాజ‌ధానికి భూములు ఇచ్చిన‌ రైతులు వ్యతిరేకించారు. విపక్షాలు తప్పుపట్టాయి. చివరికి న్యాయస్థానమూ అది కుదరదని విస్పష్టంగా తీర్పు చెప్పింది.