భార్యను మరో మహిళలో పోల్చి చులకన చేయడం వేధింపే!

భార్యను మరో మహిళతో పోల్చి చులకన చేయడం వేధింపుల కిందకే వస్తుంది. కేరళ హైకోర్టు ఈ మేరకు విస్పష్ట తీర్పు చెప్పింది. భార్యను మరో మహిళతో పోల్చి చులకన చేయడం మానసిక వేధింపేనని ఒక విడాకుల కేసులో కేరళ హై కోర్టీ పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల కిందట వివాహబంధంతో ఒక్కటైన జంట విడాకుల కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భార్యతో విభేదాల కారణంగా విడాకులు కోరుతూ భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా తాను అందంగా లేనంటూ భర్త నిత్యం వేధిస్తున్నాడనీ, ఇతర మహిళలతో పోలుస్తూ తనను కించపరుస్తున్నాడనీ, దాంతో తాను మానసిక క్షోభకు గురై డిప్రషన్ కు గురయ్యాననీ భార్య కోర్టుకు తెలిపింది. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ సుధతో కూడిన హైకోర్టు బెంచ్  భార్య‌ను ఇత‌ర మ‌హిళ‌తో పోలుస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం మాన‌సిక వేధింపుల కిందికి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. 

బాబు ఢిల్లీ టూర్.. కమలం స్కెచ్ లో భాగమేనా?

తెలంగాణలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కి చెక్ పెట్టి.. అధికారం చేజిక్కించుకునేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో బాబును మోడీ స్వయంగా పలకరించి, ఆప్యాయంగా మాట్లాడారా? శత్రువుకు శ్రుతువు మిత్రుడు అనే లాజిక్‌ను తెరపైకి తీసుకు వచ్చి.. మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంత్రాంగం నెరపేందుకు .. కమలం పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారా? అంటే.. రాజకీయ విశ్లేషకులు నుంచి అందుకు అవుననే సమాధానం వస్తోంది.  తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ప్రదాని మోడీయే  స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించడమే కాకుండా పక్కకు తీసుకువెళ్లి కొద్ది సేపు ప్రత్యేకంగా ముచ్చటించారు.  ఇది సమావేశానికి హాజరైన ప్రముఖులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.  తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిణామం విస్తృత చర్చకు తెర తీసింది.  దాదాపు నాలుగేళ్ల తర్వాత.. వీరిద్దరు ఎదురుపడటం ఇదే ప్రథమం. ఉప్పు నిప్పులా ఉండే ఇరువురూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం.. ప్రత్యేకంగా ముచ్చటించుకోవడంపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు.  గతంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై అధికార ఫ్యాన్ పార్టీ నాయకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అందుకు నిరసనగా చంద్రబాబు ఓ రోజు దీక్ష చేసి.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షాతో భేటీకి ప్రయత్నించారు. కానీ అప్పట్లో చంద్రబాబుకు ఇరువురూ కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన రెండు రోజులు వేచి చూసి .. ఆ తర్వాత వెనుదిరిగారు. ఆ తరువాత కూడా  చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా.. మోడీ, అమిత్ షాలను  కలిసే ప్రయత్నం  చేయలేదు.. అలాగే వారు కూడా చంద్రబాబును అంతగా పట్టించుకోనూ లేదు. కానీ ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం మద్దతు ప్రకటించడంతో   కమలనాధుల మనస్సును చంద్రబాబు మరోసారి గెలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. ఆ అధికారాన్ని హస్త గతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ రాష్ట్రంలో నేరుగా బీజేపీ రాజకీయాలు చేయడానికి అట్టే సమయం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గత టీడీపీ నాయకులంతా కారు పార్టీలో చేరి.. సీఎం కేసీఆర్‌కి కోటరీగా మారిపోయారు. కానీ తెలంగాణలో  సైకిల్ పార్టీ కేడర్ మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా.. కేసీపీ సిమెంట్‌తో కట్టిన నిర్మాణంలాగా చాలా స్ట్రాంగ్‌గా ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ క్యాడర్ బలంపైనే బీజేపీ ఆశలు పెంచుకుంటోంది. ఏపీలో చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. ఆ ప్రభావం తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ బీజేపీకి అండగా నిలిచేలా చేస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.  అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో   బీజేపీ తెలుగుదేశం క్యాడర్ అండతో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశంతో మైత్రి ఉంటే తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా కొన్ని జిల్లాలలో తెలుగుదేశం బలం తమకు తోడ్పడుతుందని కమలనాథులు భావిస్తున్నారని చెబుతున్నారు.  తెలంగాణలో కీసీఆర్ అధికారానికి వచ్చే ఎన్నికలలో చెక్ పెట్టాలంటే చంద్రబాబు అండ అవసరమని బీజేపీ గుర్తించిందని అంటున్నారు.నాలుగేళ్ల   తర్వాత చంద్రబాబుతో  మోడీ తనంత తానుగా మాట కలపడాన్ని చూస్తుంటే తెలంగాణలో పాగాకు స్కెచ్ లో భాగమేనని విశ్లేషిస్తున్నారు. బీజేపీ స్కెచ్ లో భాగంగానే  ఏపీలో తెలుగుదేశానికి సహకరిస్తే.. తెలంగాణలో కమలానికి సహకారం అందిస్తామని చెప్పడానికే చంద్రబాబు మళ్లీ హస్తిన పర్యటనకు బయలు దేరుతున్నారని పరిశీలకులు అంటున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే వారంలో ఆయన ఢిల్లీకి పయనమవనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ టూర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు.. విపరీతంగా అప్పులు చేయడం.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం.. దాడులకు దిగడం.. కేంద్ర పథకాలు.. తమ పథకాలంటూ జగన్ ప్రభుత్వం కలరింగ్ ఇవ్వడం తదితర అంశాలపై కేంద్రంలోని పెద్దలకు చంద్రబాబు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మాసంలోనే చంద్రబాబు హస్తిన బాట పట్టే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మోదీతో చంద్రబాబు భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే రానున్నది ఎన్నికల సీజన్.. దాంతో రాజకీయ సమీకరణాలు సైతం మారనున్నాయని వారు చెబుతున్నారు.  మరోవైపు ఇటీవల ఢిల్లీలో మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశమనంతరం చంద్రబాబు, మోదీ.. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరు కలిసి మాట్లాడుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లోని మీడియా పలు కథనాలను ప్రచురించింది. అయితే వీరిద్దరు ఏం చర్చించుకున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. కానీ ఇటీవల పార్టీ పాలిట్ బ్యూరో మీటింగ్‌లో చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలో మోదీతో చర్చించిన పలు అంశాలు వివరించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రధాని మోదీ ఒక్కొక్కరినీ పలకరిస్తూ తానే వద్దకు వచ్చారని చంద్రబాబు చెప్పారని.. మనం కలిసి చాలా రోజులైందని.. ఢిల్లీ రావడం లేదా? అని  చంద్రబాబును మోదీ ప్రశ్నించారట. ఢిల్లీలో తనకు పనేమీ లేదని.. అందుకే రావడం లేదని మోదీకి చంద్రబాబు సమాధానం ఇచ్చారు.అలాగే మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని.. మనం ఒకసారి కలవాలని చంద్రబాబుతో మోదీ చెప్పారట. తాను కూడా మిమ్మల్ని కలుద్దామనుకోంటున్నట్లు ఈ సందర్బంగా మోదీతో చంద్రబాబు చెప్పారట. ఓ సారి వీలు చూసుకుని ఢిల్లీ రావాలని.. మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారమిస్తే.. నాకు అనువుగా ఉన్న సమయం చెబుతానని మోదీ.. చంద్రబాబుతో పేర్కొన్నారని ఆయన స్వయంగా చెప్పారు. ఈ పరిణామాలను, చంద్రబాబు మరో సారి మోడీతో భేటీకి ఢిల్లీ పర్యటనకు సమాయత్తం అవుతుండటం గమనిస్తే.. తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం.. ఏపీలో తెలుగుదేశానికి బీజేపీ సహకారం అందించుకునే వ్యూహానికి  ఇరు పార్టీలూ తెరతీసినట్లుగానే కనిపిస్తోంది.ఏదీ ఏమైనా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అయితే అధికార వైసీపీకి గుండెల్లో దడ పుట్టడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

జార్ఖండ్ సీఎంకు సుప్రీంలో ఊరట

మనీ ల్యాండరింగ్ కేసులో జర్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు సుప్రీంలో ఊరట లభించింది. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తునకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గనుల అక్రమ లీజు మంజూరు ద్వారా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2010లో ఉపాధి హమీ పథకం కింద కాంట్రాక్టుల మంజూరుపై కూడా దర్యాప్తు జరిపించాలని ఆ పిటిషన్లలో కోరారు. కాగా ఈ పిటిషన్లపై విచారణ నిలిపివేయాలని జార్ఖండ్ సర్కార్, హేమంత్ సొరేన్ అప్పీలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ సుధాంశు ధూళియా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

ఇలా నియామకం.. అలా రాజీనామా!

కాంగ్రెస్ కు గులాంనబీ ఆజాద్ బిగ్ షాక్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్ ను పార్టీ  అధినేత్రి సోనియా  గాంధీ నియమించారు. కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీని పార్టీ అధిష్ఠానం బుధవారమే ప్రకటించింది. ఆ కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్ ను నియమించింది. అయితే తన నియామకాన్ని   ప్రకటించిన గంటల వ్యవధిలోనే గులాం నబీ  ఆజాద్  ఆ  పదవికి  రాజీనామా చేశారు.  అంతే కాకుండా జమ్మూ కాశ్మీర్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి  కూడా ఆజాద్ రాజీనామా  చేశారు. అలాగే  క్యాంపెయిన్ కమీటీ సభ్యులలో మరో ముగ్గురు కాశ్మీరీ  నేతలకు కూ డా కమిటీకి రాజీనామాలు సమర్పించారు. ఇది నిజంగానే కాంగ్రెస్ కు తేరుకోలేని షాక్  అనే చెప్పాలి. అసలే కాశ్మీర్ లో కాంగ్రెస్ ఉనికి అంతంత మాత్రం. ఇప్పుడు క్యాంపెయిన్ కమిటీకి ఆజాద్ సహా నలుగురు రాజీనామా  చేయడం కాంగ్రెస్ కు తేరుకోలేని ఎదురుదెబ్బే  అవుతుందని   పరిశీలకులు అంటున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన గులాబ్ నబీ ఆజాద్ గత   కొంత  కాలంగా అధిష్ఠానం తీరు పట్ల  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడంతో మరింత రగిలిపోతున్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ తనకు  పదవులు అప్పగించిన సందర్భాన్ని తన అసంతృప్తిని మరింత బాహాటంగా వ్యక్తం చేయడానికి వచ్చిన  అవకాశంగా  ఉపయోగించుకున్నారు. 

మోదీజీ, మీ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌నే లేదు.. రాహుల్‌

బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండదనే విషయం యావద్దేశం చూసిందని అన్నారు. దోషులను విడుదల చేసే ఇలాంటి నిర్ణయాల ద్వారా ఈ దేశ మహిళలకు ప్రధాని ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని ఆయన ప్రశ్నిం చారు. 2002లో గర్భి ణిగా ఉన్న బిల్కిస్ బానోపై అత్యాచారం జరిపి, ఆమె కుటుంబానికి చెందిన ఏడు గురిని హత్య చేసిన కేసులో దోషులుగా నిర్ధారించిన 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం శిక్షా కాలం తగ్గి స్తూ విడుదల చేసింది. దీనిపై రాహుల్ ఓ ట్వీట్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదు నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, మూ డేళ్ల ఆమె కుమార్తెను చంపిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో విడుదల చేశారు. నారీ శక్తి గురించి అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఈ చర్య ద్వారా మహిళలకు ఎలాంటి సందేశం ఇవ్వ దలచుకున్నారు. మోదీజీ...మీ మాటలకు చేతలకు పొంతన ఉండదనే విషయం యావద్దేశం చూసిం ద‌ని హిందీలో ట్వీట్ చేశారు. బిల్కిస్ బానో కేసులో దోషులు 15 ఏళ్ల జైలుశిక్ష తర్వాత సోమవారం గుజరాత్ లోని గోద్రా సబ్ జైలు నుంచి విడుదల కాగానే వారికి స్వీట్లు, పూలదండలతో స్వాగతం లభించింది. బిల్కిస్‌ బానో కేసులో దోషులుగా తేలిన 11 మంది జీవిత ఖైదులు సోమవారం (ఆగ‌ష్టు 15)గోద్రా సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. వీరి విడుదలకు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం రెమిషన్‌ పాలసీ కింద ఆమో దించిన నేపథ్యంలో మొత్తం 11 మంది దోషులూ జైలు నుంచి బయటకు వచ్చారు. 2002లో గోద్రా ఘటన తర్వాత చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్య కేసులో 2002లో సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందికి శిక్ష విధించింది. ముంబై హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దోషులు ఇప్పటికే 15 ఏళ్ల‌కు పైగా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తువిడుదల కోరుతూ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాల మేరకు గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 11 మంది దోషులకు శిక్ష నుంచి ఉపశమనం

బాల‌కృష్ణ దంప‌తులు  ఆరంభించిన ఎన్టీఆర్ ఆరోగ్య‌ర‌థం

ఆంధ్రప్ర‌దేశ్‌లో ఆస్పత్రులు, రోగుల సంర‌క్ష‌ణ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ అనేకానేక విమ‌ర్శ‌లు విమ ర్శ లు ఎదుర్కొంటున్న‌ది. ఆస్ప‌త్రుల‌కు వెళ్లే రోగుల‌కు ఆరోగ్య‌శ్రీ ర‌క్షణ‌గా ఉంటుంద‌ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌కటించిన ప్రభుత్వం ఆ త‌ర్వాత దాన్ని అస‌లు ఆస్ప‌త్రులు ఆద‌రిస్తున్న‌దీ లేనిదీ కూడా ప‌ట్టిం చుకోవడం మానేశారు. ఆరోగ్య‌శ్రీ విష‌యంలో ఆస్ప‌త్రులు రోగుల ప‌ట్ల సానుకూల స్పంద‌న ఇవ్వ‌డం లేదు. చాలాకాలం నుంచే ప్ర‌భుత్వ ఆరోగ్య ప‌థ‌కాల‌కు ఆస్ప‌త్రుల నుంచి గ‌ట్టి మ‌ద్ద‌తు ఉంద‌నే అభి ప్రాయాలు, ప్ర‌చారాలు కేవ‌లం అక్క‌డికే ప‌రిమితం అయ్యాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌జారోగ్యానికి ర‌క్ష‌ణ క‌ల్పించే విధం గా టీడీపీ సీనియ‌ర్ నేత‌, సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ దంప‌తులు బుధ‌వారం (ఆగ‌ష్టు 17)న ఎన్టీ ఆర్ ఆరోగ్య‌ర‌థం ఆరంభించారు.  హిందూపురం మండ‌ల ప‌రిధిలోని చ‌లివెందుల గ్రామంలో ఈ ర‌థాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ ర్భంగా మాట్లాడుతూ బాల‌కృష్ణ‌, రూ.40 ల‌క్ష‌ల వ్య‌యంతో ఈ ర‌థాన్ని రూపొందించామ‌న్నారు. ఇందులో మొబైల్ క్లినిక్ అన్ని వైద్య వ‌స‌తులూ ఉన్నాయ‌న్నారు. 200 వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోను వీలుంద‌ని, మందులు ఉచితంగా అంద‌జేస్తామ‌న్నారు.  ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలను ఉపయోగించకుండా పక్కన పడేయడం సిగ్గుచేటని బాలకృష్ణ అన్నా రు. ఇంక్యుబేటర్లు పక్కన పడేశారని, సిగ్గు.. శరం ఉన్నవాళ్లు ఆలోచించాలన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథా న్ని పార్టీలకతీతంగా అందించామని, మనిషిని మనిషిగా గౌరవించాలని, తెలుగువారి ఆత్మగౌరవం కోస మే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. ఒక్క హిందూపురం, మంగళగిరి మాత్రమే కాదని.. రాష్ట్రం మొత్తం వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా వాహనానికి అపకారం చేస్తారేమోనని సీసీటీవీ పెట్టించామన్నారు. హిందూపురంను ఆరోగ్యపురంగా చేయాలన్నదే తమ అందరి ధ్యేయమని బాలకృష్ణ స్పష్టం చేశారు.

మ‌నీలాండ‌రింగ్ కేసులో నా తీర్పు వేరే ... జ‌స్టిస్ లావు

మనీలాండరింగ్‌ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  న్యాయ నిపుణులు, మాజీ  న్యాయమూర్తులు చేసిన  వ్యాఖ్యలను తాను చదివానన్నారు. ఒకవేళ తానే తీర్పు ఇచ్చి ఉంటే వేరే వైఖరిని తీసుకునేవాడి నని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తెలిపారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కఠినమైన నిబంధనలు సరైనవేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తనకు భిన్నాభిప్రాయాలున్నాయని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు చెప్పారు.  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లీఫ్‌ లెట్‌ అనే సంస్థ జీవితం- స్వేచ్ఛ అన్న అంశంపై నిర్వ హించిన ఒక వెబినార్‌లో ఆయన ప్రసంగిస్తూ చ‌ట్టంలోని సెక్షన్‌ 45 రాజ్యాంగంలోని 14, 21వ అధిక రణాలను ఉల్లంఘిస్తుందని గతంలో నికేష్‌ షా కేసులో సుప్రీంకోర్టు మరో రకమైన తీర్పు ఇచ్చిన విష యాన్ని ఆయ న గుర్తు చేశారు. నేర న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం ప్రకారం ఒక నేరారోపణకు గురైన వ్యక్తికి అతడు ఏమి నేరం చేశాడో చెప్పాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ నాగేశ్వరరావు అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తమను ఎందుకు పిలిచిందో తెలియని పరిస్థితి ఉండడం సరైన విధానం కాదని అన్నారు. కేసు నమోదుకు సం బంధించిన ఈసీఐఆర్‌ పత్రాలను ఈడీ ఇవ్వకపోతే బెయిల్‌కు దరఖాస్తు చేసుకునేవారు తమనెలా సమర్థించుకోగలుగుతారని ఆయన ప్రశ్నించారు. అందువల్ల మనీలాండరింగ్‌ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగత స్వేచ్చకు విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయం ఏర్పడిందని తెలి పారు.  సుప్రీంకోర్టుపై తాను విశ్వాసం కోల్పోతున్నానంటూ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలతో తాను ఏకీభవించలేనని జస్టిస్‌ నాగేశ్వరరావు చెప్పారు. కేవలం కొన్ని తీర్పులు తమకు ఇష్టం లేనందువల్ల గత 75 ఏళ్లుగా మనుగడలోఉన్న ఒక సంస్థపై నమ్మకం కోల్పోరాదని ఆయన చెప్పా రు. ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కును అనుభవించే అవకాశం ఎందరికో కలిగించిందని తెలిపారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిందని చెప్పారు. కోర్టుల జోక్యం వల్లనే కూడు, గూడు విద్య వంటి సమ స్యలకు పరిష్కారం లభించిన సందర్భాలున్నాయని ఆయన వివరించారు. 

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గడ్కరీకి దక్కని స్థానం

బీజేపీలో అత్యన్నత నిర్ణయాత్మకమైన పార్లమెంటరీ బోర్డు లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్థానం దక్కలేదు. అలాగే పార్టీలో మరో సీనియర్ నాయకుడైన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సైతం పార్లమెంటరీ బోర్డులో అవకాశం దక్కలేదు. ఈ ఇరువురినీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం పార్టీలో సంచలనం సృష్టించింది. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ నిర్ణయం గడ్కరీకి షాకే. ఇటీవలే రాజకీయాల పట్ల వైరాగ్యం కలుగుతోందంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే కాక యావత్ రాజకీయ వర్గాలలోనూ సంచలనం సృష్టించిన సంగతి విదితమే. అలాగే గడ్కరీకి కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా స్థానం కల్పించలేదు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ కు కూడా స్థానం కల్పించలేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో  జేపీ నడ్డా, నరేంద్ర మోదీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, యడియూరప్ప, శర్బానంద్ సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్ పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జాటియా, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవిస్, ఓం మాథుర్, బీఎల్ సంతోష్, వనతి శ్రీనివాస్ ఉన్నారు. 

కిడ్నాప్‌ కేసులో లొంగిపోవాలి.. న్యాయ‌శాఖ మంత్రి అయ్యాడు!

కాస్తంత చ‌దువుంటే ఎవ‌ర‌యినా రాజ‌కీయాల్లోకి రావ‌చ్చు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌చ్చు. ప్ర‌జాస్వామ్యంలో ఇదో అవ‌కాశం. నిరుద్యోగి విసిగెత్తి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి నిల‌దొక్కుకున్నా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన కాలం కాదిది. సామాజిక ప‌రిస్థితులు, రాజ‌కీయ నాయ‌కులు, పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల విసిగెత్తి త‌న ప్రాంతానికి తానే ఏదో ఒక మేలు చేయాల‌న్న గ‌ట్టి నిర్ణ‌యం తీసేసుకుని రాజ‌కీయాల్లోకి దిగి ఏకంగా సీఎం కావ‌డం సినిమాల్లో చూస్తాం.  అంత‌కాకున్నా క‌నీసం ఎమ్మెల్యే కావ‌డానికి వాస్త‌వ రాజ‌కీయాల్లో అవ‌కాశం ఉంది. బీహార్‌లో మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కార్తికేయ పై ఇంత‌కు ముందే కేసులు ఉన్నాయ‌ని తెలిసింది. అలాంటి కోర్టు ప‌క్షిని మంత్రిమండ‌లిలోకి ఎలా తీసుకుంటార‌ని నీతిస్‌పై దుమారం మొద ల‌యింది.  గ‌తంలో ఎంత అద్భుతం కాకున్నా, రాజ‌కీయాలు వంట‌ప‌డితే నేత కావ‌చ్చున‌న్న‌ది బీహార్ రాజ‌కీయాల్లో నే గ‌మ‌నించ‌గ‌లం. ఇపుడు తాజాగా, బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్ క్యాబినెట్‌లోకి 31 మందిని తీసు కున్నారు. ఇందులో 16 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉండ‌గా, ఆర్జేడీ ఎమ్మెల్సీ కార్తికేయ సింగ్ న్యాయశాఖ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం వివాదానికి దారి తీసింది.  కిడ్నాపింగ్ కేసులో కార్తికేయ  సింగ్ ఈనెల 16న దనపూర్ కోర్టులో లొంగిపోవాల్సి ఉండగా, ఆయన నేరు గా పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకుని మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, కళంకిత మంత్రిని క్యాబి నెట్ లోకి తీసుకోవడం నితీష్‌ను ఇరకాటంలోకి నెట్టింది. '  కానీ  కార్తీకేయ కేసుల గురించి త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని, అస‌లు అందుకు సంబంధించిన ఎలాంటి స‌మాచారం త‌న వ‌ద్ద లేద‌ని, ఎవ‌రూ తెలియ‌జేయ‌లేద‌ని బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ మీడియా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా చెప్పారు. 

పంద్రాగస్టు పండుగ వేదికగా.. రాజకీయ ప్రచార సభలు

స్వాతంత్రం వచ్చిందని సభలు చేసి సంబరపడిపోతే సరిపోదన్నాడు మహాకవి శ్రీశ్రీ.. అయితే నేటి రాజకీయ నాయకులు మహాకవి శ్రీశ్రీ మాటను వేరేగా అర్ధం చేసుకున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను సంబరాలతో సరిపెట్టేయకుండా రాజకీయ విమర్శలకు వేదికగా చేసేసి తాము ఆజాదీ కా అమృతోత్సవ్ ను కేవలం సంబరాలతో సరిపెట్టేయలేదనీ, వాటిని విమర్శల మసాలా జోడించామని చెబుతున్నారు. లేకుంటే జాతి మొత్తం విభేదాలను, అంతరాలను, తారతమ్యాలనూ మరచి చేసుకోవలసిన ఈ పండుగను, వేడుకలు రాజకీయ విమర్శలకు వేదికగా మార్చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను రాజకీయ వేదకగా మార్చి తమాషా చూశారు. ముందుగా మోడీ విషయానికి వస్తే.. ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని మోడీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దేశం సాధించిన విజయాలు, ఘనతల గురించిన ప్రస్తావన కన్నా.. అవినీతి, వారసత్వ పాలనపై విమర్శలకే పెద్ద పీట వేశారు. ప్రతిపక్షాలు ఏం చేసినా అది అవినీతి, వారి అధికారం అంతా వారసత్వ మయం అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది. మొత్తంగా చెప్పాలంటే.. మోడీ ప్రసంగం అంతా స్వోత్కర్ష, పరనిందగా సాగింది. దేశంలో అవినీతి నిర్మూలనే ధ్యేయంగా సాగుతున్న తన పాలనకు ప్రజాశీర్వాదం కావాలని స్వాతంత్ర్యద్యమం సందర్భంగా జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రధానిగా మోడ ఎర్రకోట బురుజులపై నుంచి జెండా ఎగురవేయడం ఇది తొమ్మిదో సారి. దేశంలో అవినీతి నిర్మూలనకు తాను మొదటి సారి జెండా ఆవిష్కరించినప్పటి నుంచి తొమ్మిదో సారి జెండా ఎగురవేస్తున్న నాటి వరకూ ఆయన చేసింది ఏమిటో చెప్పడానికి ఇంత కంటే మంచి సందర్భం మరొకటి ఉండదు.. కానీ మోడీ ఈ సందర్భాన్ని అందుకు కాకుండా విపక్షాలపై పరోక్షంగా నిందలు వేయడానికీ, విమర్శలు గుప్పించడానికి ఎన్నుకున్నారు. అంటే స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభ వేళ ఆయన విపక్షాలపై రాజకీయ విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు.  ఎనిమిదేళ్లుగా దేశంలో తమ పార్టీ అధికారాన్ని విస్తరించడానికి ఇచ్చిన ప్రాధాన్యం మోడీ దేశంలో అవినీతి నిర్మూలనకు ఇవ్వలేదని పరిశీలకుల విమర్శలను ఆయన పట్టించుకోలేదు. ఆయన దృష్టిలో అవినీతి నిర్మూలన అంటే ప్రత్యర్థి పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులేనని విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. రాజకీయ వేధింపులనే మోడీ అవినీతి నిర్మూలనగా సూత్రీకరిస్తున్నారని విమర్శిస్తున్నాయి.    ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయానికి వస్తే.. ఆయనదీ ఒకే అజెండా.. అది మోడీపై విమర్శలు. తెలంగాణకు మోడీని శత్రువుగా చూపడానికే ఆయన స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేదికను ఎంచుకున్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారం, ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి, ప్రగతి, ప్రజాసమస్యలు, వరదలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదల కారణంగా సంభవించిన నష్టం ఇత్యాది అంశాలపై ఆయన దృష్టి సారించకుండా కేవలం రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టడం, మోడీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడానికే కేసీఆర్ ప్రసంగం పరిమితమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇక ఏపీ ముఖ్యమంత్రి అయితే స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్వోత్కర్షకు ఇచ్చినంత ప్రాధాన్యం మరే  ఇతర అంశానికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆజాదీ కా అమృతోత్సవ్ సంబరాలకు రాజకీయ రంగు పూసి సమావేశాలను ఎన్నికల ప్రచార సభలుగా మార్చేసిన వైనంపై ప్రజలలో నిరసన వ్యక్తమౌతున్నది.  స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటేలా కాకుండా రాజకీయ ప్రచారం కోసం అధికార పార్టీలు ఈ వేడుకలను వేదిక చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వ‌న్డే, టెస్టుల‌ను ర‌క్షించండి...ఐసీసీకి  క‌పిల్ విన్న‌పం

క్రికెట్ అంటే ఆల్‌వైట్స్‌లో ఐదురోజులు జ‌రిగే టెస్టు మ్యాచ్‌నే అస‌లు క్రికెట్ అంటారు. పాత‌కాలం ప్లేయ ర్లు దానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తారు. మంచి ప్లేయ‌ర్ స‌త్తాను టెస్ట్ క్రికెట్ తెలియ‌జేస్తుంద‌ని అంటారు. ఎందుకంటే ఐదు రోజుల ఆట‌లో ఎంతో నిల‌క‌డ‌గా, ఓపిక‌తో ఆడ‌వ‌ల‌సి వ‌స్తుంది. అదే క్రికెట‌ర్ ల‌క్ష‌ణం అంటారు. అయితే చాలాకాలం నుంచి ఆధునిక క్రికెట్‌లో మ‌కుటాయ‌మానంగా వ‌న్డేలు, ఆ త‌ర్వాత అతి పొట్టి ఫ‌ర్మాట్‌గా టీ-20 పోటీలు వ‌చ్చేశాయి.  వన్డే, టెస్టు క్రికెట్‌ బతికి బట్టకట్టేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో మరింతగా దృష్టి సారించాలని కోరాడు. మరోవైపు ఐసీసీ మాత్రం వచ్చే సైకిల్‌లో వన్డే క్రికెట్ విషయంలో ఎలాంటి తగ్గుదల లేదని ఐసీసీ పేర్కొంది. వచ్చే 9 సంవత్సరాలకు 3.. 50 ఓవర్ల ప్రపంచకప్‌లను షెడ్యూల్ చేసింది. భార‌త్‌ ఆతిథ్యం ఇవ్వనున్న 2023 ప్రపంచకప్‌తో ప్రారంభం అవుతుంది.  పొట్టిఫార్మాట్ల  ఆట అందం కంటే స్కోరు బోర్డు ప‌రిగెత్తించ‌డ‌మే జ‌రుగుతోంది. ఈ రెండు ఫార్మాట్లు కూడా బౌల‌ర్ల కంటే బ్యాట‌ర్‌, ఫీల్డ‌ర్ ప‌టిమ‌నే తెలిజేస్తాయి. కేవ‌లం సిక్స్ లు, ఫోర్లు బాదే వాడే గొప్ప ప్లేయ‌ర్‌గా అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకుంటు న్నాడు. క‌నుక ఈ ఫార్మాట్ అస‌లు సిస‌లు క్రికెట్ అనిపించుకోద‌న్నది భార‌త్ లెజెండ్ క‌పిల్ దేవ్ అభిప్రాయం. కానీ ఆయ‌న అభి ప్రాయాన్ని చాలా మంది త‌ప్పు ప‌ట్టారు. కాలానుగుణంగా ఆట‌లో వ‌స్తున్న మార్పుల‌ను కూడా అంగీక‌రించా ల్సిందేన‌ని, పొట్టి ఫార్మాట్‌ను లెక్క‌లో కి తీసుకోవాల‌నే గ‌వాస్క‌ర్ వంటివారి వాద‌న‌.  ఐపీఎల్, బీబీఎల్ వంటి పొట్టిఫార్మాట్‌లకు క్రేజ్ పెరుగుతూ సంప్రదాయ టెస్టు, వన్డే క్రికెట్‌పై మోజు తగ్గి పోతుండడంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. వన్డే, టెస్టు ఫార్మాట్‌ను రక్షించాలంటూ ఐసీసీ కి మొరపెట్టుకున్నాడు. టీ20, ఫ్రాంచైజీ క్రికెట్ లీగుల సంప్ర దాయ క్రికెట్‌ను వెన క్కి నెట్టకుండా చూడాలని కోరాడు. యూరప్‌లో క్రికెట్ ఫుట్‌బాల్ దారిలోనే నడుస్తోం దన్న కపిల్.. రోజు రోజుకు ద్వైపాక్షిక క్రికెట్‌కు ప్రాధాన్యం తగ్గిపోతోందన్నాడు.  ఐసీసీ తదుపరి అంతర్జాతీయ క్యాలెండర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చేరగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా తమ దేశవాళీ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్స్ కోసం ప్రత్యేక స్లాట్స్ పొందే అవకాశం ఉంది. వారు ఒక్కో దేశంతో ఆడడం లేదని, నాలుగేళ్ల కోసారి ప్రపంచకప్‌లోనే అది జరుగుతోందని, ఇదేమంత ఆరోగ్య‌క‌ర  సంప్రదాయం కాద‌ని క‌పిల్ అన్నారు. 

జగన్ అడ్డాలో పవన్ సెగ!

ఏపీ సీఎం జగన్ అడ్డాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలు పెడుతున్నారు. పంటలు నష్టపోయి బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేనాని రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. పంటసాగులో నష్టాల పాలై, అప్పుల బాధతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడమే కాకుండా.. ఒక్కొక్క బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అంద జేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లలకు చదువులను కూడా జనసేన పార్టీయే చూసుకుంటుందని భరోసా ఇస్తున్నారు. అందు కోసం జనసేనాని ఒక నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీరుపైన, వైఎస్ జగన్ పరిపాలనా విధానాలపైన సమయం చిక్కిన ప్రతిసారీ విమర్శలు ఎక్కుపెడుతున్న పవన్ కళ్యాణ్.. జగన్ సొంత ఇలాఖాలో అడుగుపెడుతుండడంతో వైసీపీ శ్రేణుల్లో హీట్ పెంచేసింది. గతంలో చేసిన విమర్శలకు తోడు ఇప్పుడు తాజాగా మళ్లీ వైసీపీ పైన, జగన్ పైన ఇంకెలాంటి ఆరోపణలు సంధిస్తారో, ఏ విధంగా ఇరుకున పెడతారో అనే సంశయాలు వైసీపీ శ్రేణుల్లో పెరిగిపోతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సొంత జిల్లానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుండడంతో వైసీపీ నేతలు, శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో అంటే.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆ పార్టీ అధినేత చిరంజీవి వాహనాలను వైఎస్సార్ అనుచరులు, బంధువులు ధ్వంసం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అప్పటి మాదిరిగా అవాంఛనీయ సంఘటనలేవైనా జరుగుతాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ గతంలో మాదిరిగానే ఇప్పుడు వైసీపీ శ్రుణులు గానీ, వైఎస్సార్ బంధువులు గానీ జనసేన అధినేత వాహనాలపైన, వాహన శ్రేణిపైన దాడులకు దిగితే.. అనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనే భయాలు నెలకొంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే 12 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని జనసేన నేతలు చెబుతున్నారు. అంతే కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని నోటిమాటగా చెప్పడమే కానీ.. సీఎం జగన్ ఒక్క కుటుంబానికి కూడా పరిహారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు వైఎస్సార్ బీమా కింద 7 లక్షల రూపాయల బీమా చెల్లించడం లేదని జనసేన నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సభలకు వెళ్లకుండా కౌలు రైతు కుటుంబాలను వైసీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారంటూ జనసేన నేతలు ఆరోపిస్తుండడం గమనార్హం. ఒక పక్కన తన సొంత జిల్లా, మరో పక్కన కౌలు రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించకుండా, బీమా అందించకుండా తన సర్కార్ చేతులెత్తేసిన నేపథ్యంలో జనసేన అధినేత నేరుగా ఆయా బాధిత కుటుంబాలకే ఆర్థిక సాయం చేసేందుకు వస్తుండడాన్ని వైసీపీ నేతలకు అస్సలు సహించలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత, పవన్ కళ్యాన్ సొంత అన్న చిరంజీవి వాహనాలను ధ్వంసం చేసినట్లే ఇప్పుడు కూడా వైసీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కడప జిల్లాలో కౌలురైతు భరోసా యాత్ర సందర్భంగా రాజంపేట నియోజకవర్గం సిద్దవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని కౌలు రైతు కుటుంబాల కష్టాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికే సరైన ప్రణాళిక లేకుండా పరిపాలన సాగిస్తూ.. అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న వైసీపీకి ఇప్పుడు జనసేనాని కడప టూర్ గోరుచుట్టు మీద రోకలిపోటులా మారనుందా? అనే భయాలు ఆ పార్టీ నేతల్లో పట్టుకున్నాయంటున్నారు. రైతు భరోసా అంటూ పవన్ కళ్యాణ్ తమ జిల్లాకు వచ్చి, వైసీపీ సర్కార్ పైన, జగన్ పైన ఎలాంటి బాంబులు పేలుస్తారో అనే ఆందోళన పట్టుకుందంటున్నారు. మొత్తానికి జగన్ ఇలాఖాలో పవన్ కళ్యాణ్ పర్యటన వైసీపీ నేతుల, శ్రేణుల్లో తీవ్రమైన హీట్ కు కారణం అవుతుందా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

జీవో 317తో టీచ‌ర్ల‌కు తీవ్ర న‌ష్టం ... టీడీపీ నేత అశోక్‌

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. యాప్‌ని డౌన్లోడ్  చేసుకోమంటూ రెండో రోజు సెల్‌డౌన్ కొనసాగించారు. ఉపా ధ్యాయ సంఘాలకు మద్దతుగా ఆందోళనలో టీడీపీ నేత అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యా య సంఘాల నేతలు మాట్లాడుతూ  ప్రభుత్వ విధానాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని స్పష్టం చేశారు. తమ సెల్ ఫోన్ లలో యాప్ డౌన్లోడ్‌నుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  317 జీవో కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిం చేందుకు గతంలోనూ హామీ ఇచ్చినా.. కనీసం చర్చించడం లేదన్నారు. కేవలం ప్రభుత్వానికి మద్దుతు ఇచ్చేవారితో చర్చించి.. వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. జీవో 317 కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. సమస్యలు పరిష్కరించేందుకు గతంలోనూ హామీ ఇచ్చారు. అయినా కనీసం చర్చిం చడంలేదు. ఇప్పటికైనా బదిలీలు చేపట్టాలి.  వ్యక్తిగత సమాచారం చోరీ కోసమే యాప్ డౌన్లోడ్‌పై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని  అశోక్ ఆరోపించారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారం మాకెందుకు అంటూనే, మీరెక్కడెక్కడ తిరుగుతున్నారో మా వద్ద సమాచారం ఉందని అధికారులు బెదిరిస్తున్నార‌ని తెలిపారు.  ప్రభుత్వం ఇదే తరహా ఒత్తిడి కొనసాగిస్తే సెల్ డౌన్‌తో పాటు యాప్ డౌన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ డిమాండ్లు అంగీకరించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమన్నారు. జగన్మోహన్ రెడ్డి నూతన విధానం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. 

ఈ దీవి ఖ‌రీదు రూ.3 కోట్లు!

మంచి క‌ల‌ర్‌ఫుల్ కార్డు, అంత‌కుమించి క‌ళ్ల‌ను ఇట్టి క‌ట్టిప‌డేసే బంగ్లా బొమ్మ చూడంగానే ఢామ్ ప‌డేసేట్టు ఉంటుంది. కార్డు ఫోర్డు తెర‌వ‌గానే అది ఎక్క‌డున్న‌దీ చుట్టుపక్క‌లేమున్న‌దీ అన్నివివ‌రాలూ ఉంటాయి. చూస్తున్నంత‌సేపూ స‌ద‌రు రిప్ర‌జంటేటివ్ కామెంట్రీతో ఊద‌ర‌గొడ‌తాడు.. ఇదీ రియ‌ల్ ఎస్టేట్ వారి ప్ర‌చార ప‌ద్ధ‌తి. కొన‌బోతే జీవితంలో ఏదో న‌ష్ట‌పోతారన్న స్థాయిలో భ‌య‌పెడ‌తారు.  ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా ప్ర‌చారాలు, కొనుగోళ్లు, అమ్మ‌కాలు జ‌రిగిపోతున్నాయి. అదీ ఒక్క ఫ్లాట్ లేదా విల్లా గురించిన హ‌డావుడి. కానీ చిత్రంగా ఏకంగా ఒక దీవి కోస‌మూ ఇదే స్థాయి ప్ర‌చారం జ‌రుగుతోంది. కేవ‌లం మూడు కోట్లు చెల్లిస్తే ప్ల‌డ్డా ఐలెండ్ మీ సొంతం అంటున్నారు! ఈ ద్వీపంలో ఐదు బెడ్‌రూమ్‌ల ఇల్లు ఉంది, ఒక హెలిపాడ్, ఒక లైట్ హౌస్ ఉంది. ఇదేమీ ఈమ‌ధ్య నాటి ది కాదు. ఏకంగా 1790ల్లోది! ఎంతో ప్ర‌శాంతంగా బ్ర‌హ్మాండంగా ఉన్న ఈ ద్వీపం ఖ‌రీదు ముంబైలో 3 బి హెచ్‌కె ఖ‌రీదు కంటే త‌క్కువేన‌ట‌! మొత్తం 28 ఎక‌రాల ఈ ద్వీపం చాలాకాలం నుంచి ఖాళీగానే ఉంది. ఎవరూ ఇక్క‌డికి వెళ్ల‌డం, ఉండ‌టం జ‌ర‌గ‌లేదు. అయితే ముప్ప‌య్యేళ్ల క్రితం దీన్ని ఆరాన్ ఎస్టేట్ వారు అమ్మేశారు. దీన్ని డెరిక్, సాలీ మార్ట‌న్ అనే డిజైన‌ర్లు కొన్నారు.  క‌నుక ప్ర‌స్తుతం వారిద్ద‌రూ దీని య‌జ‌మా నులు. ఈ ద్వీపం స‌రిగ్గా గ్లాస్గో నుంచి 31 మైళ్ల దూరంలో ఉంది. ఆర్డొస్సాన్ నుంచి ప‌డ‌వ‌లో ఇక్క‌డికి చేరు కోవ‌చ్చు. ఈ ద్వీపంలో వంద‌కు పైగా ర‌కాల ప‌క్ష‌లు ఉన్నాయి. కాగా లైట్ హౌస్‌ని 1990 నుంచి ఎడిన్‌బ‌ర్గ్ నిర్వ‌హిస్తోందిట‌. పురాత‌న‌ప‌ద్ద‌తిలో అద్దం, నూనె దీపం తీసేసి వాటి స్థానంలో సోలార్ శ‌క్తి తో న‌డిచే ఎల్ ఇ డి లైట్లు అమ‌ర్చారు. 

రాష్ట్రంలో దొర‌ల‌పాల‌న న‌డుస్తోంది... య‌న‌మ‌ల‌

అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ ఒక మాట‌, వ‌చ్చిన త‌ర్వాత మ‌రో మాట మాట్లాడుతూ యువ‌తకు ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలేశార‌ని, రాష్ట్రంలో దొర‌ల‌పాల‌నే న‌డుస్తోంద‌ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.  బుధవారం (ఆగ‌ష్టు 17) ఆయన ఇక్కడ మీడియాతో మాట్లా డుతూ,  ఎన్నికలముందు యువతకు అనేక హామీలిచ్చి వారి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక యువత నెత్తిపై జగన్ భస్మాసుర హస్తం పెట్టారన్నారు. 2.30 లక్షల ఉద్యోగాల ఖాళీ ల భర్తీ, జాబ్‌ క్యాలెం డర్‌పై.. జగన్‌ను నిరుద్యోగులు నిలదీయాలన్నారు. మూడేళ్లలో ఏపీలో పెట్టుబడులు రాకపోగా ఉన్నవీ పోయాయని, జగన్‌‌కు సీఎం హోదా వచ్చాక ప్రత్యేక హోదాను మరిచారని విమర్శించారు. గ‌త టీడీపీ పాల‌న‌లో యువ‌త త‌మ‌కు నచ్చిన రంగంలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు  60 శాతం దాకా సబ్సిడీ అందుకునే వారు. డ్రైవింగ్‌ వృత్తిలో ఉన్న యువతకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా బ్యాం కు రుణాలు ఇప్పించి ఇన్నోవా కార్లు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పలు రకాల యంత్రాల కొనుగోలు కు సబ్సిడీ ఇచ్చి సహ కారమందించారు. ఒక్కో యువకుడికి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల దాకా బ్యాంకు ల ద్వారా రుణసాయం చేశారు. బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో కొంత మందికి ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీఎస్‌, ఎన్‌టీఎ్‌ఫడీఎస్‌ సహకారంతో నేరుగా ప్రభుత్వమే రుణాలందించింది. అంతేగాక‌, ఏటా 50 వేల మంది ఎస్సీ, 5 వేల మంది ఎస్టీ యువత లబ్ధి పొందేవారు. పలు ఐటీడీఏ ప్రాజె క్టుల ద్వారా గిరిజనులకు అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నిర్వహించేవారు. గొర్రెలు, బర్రెలు తదితర ఆర్థికాభివృద్ధి యూనిట్లను 90 శాతం సబ్సిడీతో అందించేవారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి వసతిని కూడా కల్పించారు. గిరిజన మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, ఆటోలు, పెద్ద వాహనాలను 90 శాతం సబ్సి డీతో అందించారు. ఎస్టీ కార్పొరేషన్‌, ఐటీడీఏల ద్వారా పేద ఎస్టీ రైతులకు విద్యుత్‌ సౌకర్యం, బోర్లు, మో టార్లు, పైపులు తదితర సౌకర్యాలు కల్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్వయం ఉపాధి పథకానికే స్వస్తి పలికారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్లక్ష్యం చేసిన ఎన్‌ఎస్‌‌టీఎఫ్‌డీసీని చంద్రబాబు ప్రభుత్వం పునరు ద్ధరిస్తే... జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం ఆ నిధులను  నిలి పేసింది.  రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు లేక నవ్యాధ్రంలో నిరుద్యోగాభివృద్ది దిన, దినాభివృద్ది చెందుతోందని యనమల అన్నారు. 75 శాతం పరిశ్రమల్లో స్ధానికులకే ఉద్యోగాలన్న జగన్ రెడ్డి.. కొత్త పరిశ్రమలు, తీసుకు రాగపోగా ‎ కమీషన్ల కోసం ఉన్న వాటిని తరిమేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే.. జగన్ రెడ్డి రద్దు చేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరే షన్లు ద్వారా చం ద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే.. జగన్ రెడ్డి రద్దు చేసి వారి పొట్ట కొట్టా రని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగేదాకా లాగేశారా?

ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్నారు పెద్దలు.. అలాగే ఏదైనా సరే తెగేదాకా లాగకూడదనీ అన్నారు. అయితే వెంకటరెడ్డి ఆ రెంటినీ పరిధి దాటి వాడేశారా? ఇక వెంకటరెడ్డి విషయంలో కాంగ్రెస్ సీరియస్ నిర్ణయం తీసేసుకుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన క్షణం నుంచీ.. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. అంతకు ముందు నుంచీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ ను వీడతాను జగ్రత్త అంటూ అధిష్ఠానానికి ఫీలర్లు పంపుతూనే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పట్ల తన వ్యతిరేకతను ఏ మాత్రం దాచుకోకుండా రచ్చ చేస్తూనే ఉన్నారు. అధిష్ఠానం కోమటిరెడ్డి బ్రదర్స్ ను బుజ్జగించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. సరే కోమటిరెడ్డి బుజ్జగింపులను పట్టించుకోలేదు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేశారనే చెప్పాలి. టీపీసీసీ చీఫ్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ కు అంగీకరించి రేవంత్ రెడ్డి క్షమాపణ కూడా చెప్పారు. అయితే కోమటిరెడ్డి తన వైఖరి మార్చుకోలేదు. క్షమాపణలు ఎవరిక్కావాలి అంటే మళ్లీ కొత్త రాగం అందుకున్నారు. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ కు లైట్ వెలిగింది. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారన్నది కాంగ్రెస్ కు అర్ధమైంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వరకూ వేచి చూడాలన్న సేఫ్ గేమ్ ఆడుతున్నారని అవగతమైంది. దీంతో కాంగ్రెస్ కూడా వెంకటరెడ్డిని డ్రాపౌట్ గా పరిగణించడం ప్రారంభించింది. ఎందుకంటే వెంకటరెడ్డి మునుగోడులో సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పని చేసేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదని తేటతెల్లమైంది. దీంతో కోమటిరెడ్డి విమర్శలు, డిమాండ్లకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. కోమటిరెడ్డి తీరు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా లేదనీ, ఆయన వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ ను బలహీనపరచడమేననీ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇక విమర్శలను ఆపేయాలనీ, సైలెంట్ గా ఉండాలనీ ఖరాఖండీగా చెప్పేసిందని పార్టీ శ్రేణులు అంటున్నారు. అంటే కోమటిరెడ్డికి పార్టీ హైకమాండ్ ఉంటే ఉండు.. లేకుంటే నీ సోదరుడి మాదిరిగానే నీ దారి నువ్వు చూసుకో అని చెప్పకనే చెప్పేసింది. మామూలుగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పాటికే పార్టీకి రాజీనామా చేసి రాజగోపాలరెడ్డి బాట పట్టి ఉండాల్సింది. కానీ కోమటిరెడ్డికి కావలసింది అది కాదు.. పార్టీ పొమ్మనలేక పొగపెట్టినంత మాత్రాన వెళ్లడానికి సిద్ధంగా లేరు. పార్టీలో ఉంటూనే తన వ్యవహార శైలితో.. మునుగోడులో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయానికి దోహదపడే విధంగా వ్యవహరించాలి. అది భరించలేక కాంగ్రెస్ పార్టీయే తనపై చర్య తీసుకుని పార్టీ నుంచి బహిష్కరించాలి. అప్పుడే తనకు సానుభూతితో పాటు సోదరులిద్దరికీ కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న ప్రచారానికి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గేమ్ ప్లాన్ ను పసిగట్టిన కాంగ్రెస్.. ఆయన గేమ్ ప్లాన్ కు విరుగుడు మార్గం అనుసరిస్తోంది. కోమటిరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించకుండా ఆయన నోరు అదుపు చేయాలని భావిస్తోంది. ఆయనను పొమ్మనదు.. అలాగని పార్టీలో ఆయన ఉనికిని గుర్తించదు. అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పడంతో కోమటిరెడ్డికి ఆఖరి చాన్స్ ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఆ తరువాత కూడా కోమటిరెడ్డి తీరు మారకపోవడంతో ఆయన ఉనికినే గుర్తించని విధంగా పార్టీ ముందుకు సాగాలని ఒక నిర్ణయానికి వచ్చిందని పరిశీలకలు అంటున్నారు. అందుకే ఆయన విమర్శలను, అలకలను పట్టించుకోకుండా పూర్తిగా మునుగోడు విజయం మీదే దృష్టి కేంద్రీకరించాలని పార్టీ శ్రేణులకు, రాష్ట్ర నాయకత్వం ద్వారా హై కమాండ్ విస్పష్ట ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు.

వైసీపీ ఏటీఎంలుగా ఆర్‌బిసీలు.. అచ్చెన్నాయుడు

రాజ‌కీయ మ‌నుగ‌డ కోసం రైతాంగాన్ని ద్రోహం చేయ‌డానికి వెనుకాడ‌టం లేద‌న్నది  వైసీపీ ప్ర‌భుత్వం పై విప‌క్షాల మాట‌. తాజాగా రైతు బ‌రోసా కేంద్రాల‌ను కేవ‌లం ఏటీఎం మిష‌న్లుగా మార్చుకున్నార‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. ఆర్బీకేలు రైతుల నుంచి స‌రిగా ధాన్యం కొన‌డం లేదని, కొన్న‌ప్ప‌టికీ రైతుకి వెంట‌నే వాటి డ‌బ్బు చెల్లించ‌డం లేద‌ని ఆయ‌న మండిపడ్డారు. ఎరువులు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతూ రైతుల‌కు ఎరువుల‌పై స్వ‌ల్ప‌కాలిక రుణం కూడా ద‌క్క‌డం లేద‌ని, రాష్ట్రంలో నిత్యం ఎరువుల కొర‌త ఉండ‌టం రైతాంగం ప‌ట్ల ప్ర‌భుత్వ ప్రేమ‌నే తెలియ‌జేస్తుంద‌న్నారు.  రాష్ట్రంలో అధికారులు, వైసీపీ నాయ‌కుల మ‌ధ్య రైతాంగం న‌లిగిపోతున్నార‌ని అచ్చెన్నాయుడు ఆరో పించారు. వారు కుమ్మ‌క్క‌యి న‌కిలీ రైతుల‌ను న‌మోదు చేసి ధాన్యం కొనుగోళ్ల‌లో ఒక్క ర‌బీలోనే వంద‌ల కోట్ల సొమ్ము కాజేశార‌ని ఆరోపించారు. మొత్తం కొనుగోళ్ల‌పై లెక్క‌లు ప‌రిశీలిస్తే ప్ర‌భుత్వం రైతాంగానికి ఎంత‌గా మోసం చేసింది, చేస్తున్న‌దీ బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అన్నారు.  ధరల స్థిరీకరణకు రూ.3000 కోట్లు, విపత్తు లకు రూ.6000 కోట్లు కేటాయిస్తామని చెప్పారని వేటికీ దిక్కు లేదని ఆయన అన్నారు. ఈ పరిపాలనను మించిన విపత్తు మరొకటి లేదని విమర్శించారు. ధాన్యం బస్తాపై 200 వరకూ కమీషన్ గుంజుతున్నారని తెలిపారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువుల మొత్తం ఎంత? ఎంత మొత్తంలో ఎరువులు ఆర్బీకే ల వద్ద ఉన్న‌ది,  ఎంత మొత్తం ఆర్బీకే ల ద్వారా ఇచ్చార‌న్న‌దీ ప్ర‌భుత్వం తెలియ‌జేయాల‌ని టీడీపీ సీనీయ‌ర్ నేత డిమాండ్ చేశారు.  ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా  ఎంత పంట పండించారు, అందులో ఆర్బీకే ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఎంత? దానిలో రైతులకు పెట్టిన బకాయిలు ఎంత? అనే విషయాలపై ఈ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. 

జగన్ అప్పుల వివరాలన్నీ బహ్మ రహస్యం.. అడగడానికి లేదు.. అడిగినా చెప్పరు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తోంది, ఎక్కడెక్కడ నుంచి చేస్తోంది. ఆ తీసుకున్న అప్పులను ఎలా ఖర్చు పెడుతోంది? ఈ వివరాలన్నీ బ్రహ్మ రహస్యం. కాదా కాదు జగన్ రహస్యం. ఎవరికీ తెలియదు, ఎవరైనా అడిగినా సర్కార్ చెప్పదు. ఆఖరికి కాగ్ అయినా సరే.. మరో రాజ్యాంగ వ్యవస్థ అయినా సరే. ఎవరడినిగా చెప్పం. మా అప్పులు, మా ఇష్టం అన్నట్లుగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోంది. రాజ్యంగ బద్ధంగా మేం నడుచుకోవడం కాదు.. మేం నడుపుతున్నదే రాజ్యాంగం. మేం చేసేదే పద్ధతి. ఎవరైనా సరే అంగీకరించి తీరాల్సిందే. ఇదీ జగన్ సర్కార్ వ్యవహారవైలి. లేకపోతే ఆర్థిక సంవత్సరం ఆరంభమై ఇన్ని నెలలు గడిచినా ఏపీ ప్రభుత్వ ఆదాయ,వ్యయ వివరాలేవీ ఎవరికీ తెలియదు. ఏపీ సర్కార్ కు సంబంధించి ఏప్రిల్ నెల ఆదాయ,వ్యయాల వివరాలను మాత్రమే కాగ్ ఆన్ లైన్ లో పెట్టింది. మిగిలిన మూడు నెలలకు సంబంధించి అతీగతీ లేదు.  దీనిపై కాగ్ ను అడుగుతుంటే ఏపీ నుంచి తాము అడిగిన వివరాలేవీ రావడం లేదని చెబుతోంది. అయితే ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వం మెరుగైన స్థితిలో ఉంది. జూన్ నెల వరకూ లెక్కలన్నింటినీ క్లీయర్ చేసి కాగ్ కు   అందించింది. కేవలం జూలై మాత్రమే పెండింగ్ లో ఉంది. ఏపీ సర్కారు మాత్రం మేమిచ్చినవే వివరాలు, మేం ఇచ్చినప్పుడే ఇస్తాం అన్నట్లు వ్యవహరిస్తున్నది.   ఈ నేపథ్యంలో కాగ్ ఆదాయ వ్యయ వివరాలను అందించాలని ఏపీ సర్కారును మరోసారి కోరింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా తొలి నెల లెక్కలు ఇంతవరకూ అందించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. దీంతో ఏపీ సర్కారులో కలవరం మొదలైతే.. కాగ్ ఏపీ సర్కార్ ను నిలదీయడం విపక్షాలకు విమర్శనాస్త్రం అందినట్లు అయ్యింది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా కాగ్ కు సక్రమంగా వివరాలు అందించలేదు. దీంతో తరచూ కాగ్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యాయాలనికి లేఖలు రాయడంతో పాటు సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ ఏపీ అధికారులు మాత్రం సరిగా స్పందించలేకపోతున్నారు. ప్రధానంగా రుణాలు, ష్యూరిటీల విషయంలో నెలకొన్న సందిగ్ధమే జాప్యానికి కారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరిస్తే కాగ్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. కానీ ఏపీ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తోంది.  రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్రం తగురీతిలో స్పందించకపోవడాన్ని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు.

మ‌ళ్లీ ఫ్లెక్సీల‌ ర‌భ‌స‌

బీజేపీ, టీఆర్ ఎస్ ల మ‌ధ్య ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల ర‌భ‌స మ‌ళ్లీ త‌లెత్తింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌చారానికి టీఆర్ఎస్ మీద విరుచుకుప‌డ‌ట‌మే ప్ర‌ధాన అస్త్రంగా ఉప‌యోగించుకుంటు న్నారు. ప్ర‌చారా నికి వెళ్లిన ప్ర‌తీ ప్రాంతంలోనూ, ప్ర‌తీ స‌భ‌, రోడ్‌షోలోనూ బీజేపీ నాయ‌కులు కేసీఆర్ ప్ర‌భుత్వం తెలంగా ణాను మోసం చేస్తోంద‌నే భారీ ప్ర‌చారానికి పూనుకున్నారు. విభేదాలు వ్య‌క్తం చేసుకోవ‌డానికి, తిట్టుకోవ‌డానికి  కూడా  ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను అడ్డుపెట్టు కుంటున్నారు.  టీఆర్ ఎస్ కూడా ఏమాత్రం త‌గ్గ‌కుండా పీఎం మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా త‌దిత‌రుల మీదా, ఇక్క‌డ బండి సంజ‌య్‌, కిష‌న్రెడ్డిల మీదా విరుచుకుప‌డుతున్నారు. వీలు దొరికిన‌పుడ‌ల్లా టీఆర్ ఎస్ శ్రేణులు, వీరాభి మానులు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల‌తో వెక్కిరిస్తున్నారు. ఈ త‌ర‌హా యుద్ధం క్ర‌మేపీ  ఆగ్ర‌హావేశాలతో కొట్లా ట‌కు మార‌డం ప‌రి పాటి అయింది.  తెలంగాణాకు వ‌చ్చే కేంద్ర నాయ‌కులు, మంత్రులు, బీజేపీ సీనియ‌ర్ల‌ను ఆహ్వానించ‌డంలో కూడా రాష్ట్ర బీజేపీ నాయ‌కులు, అభిమానులు టీఆర్ ఎస్ మీద విరుచుకుప‌డ‌టం, సెటైర్లు వేయ‌డ‌మే ఒక ప‌ద్ధ‌తిగా పెట్టుకున్నారు. కేంద్రం నుంచి వ‌చ్చే వారిని ఈ విధంగా ఆక‌ట్టుకోవాల‌న్నదే వారి ధ్యేయంగా క‌న‌ప‌డు తోంది. జనగామలో బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీగా ప్లెక్సీలు, ప్రచార హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసురుతూ టీఆర్‌ఎస్ నేతలు  హోర్డింగ్స్ పెట్టారు. జన గామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  ఈ హోర్డింగ్స్‌లను  ఏర్పాటు చేశారు. మరోవైపు బండి సంజయ్‌కు స్వాగతం పలు కుతూ బీజేపీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా,  కొన్ని బీజేపీ ప్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించే శారు. అయితే టీఆర్ఎస్ నాయకులే చించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోటాపోటీ విమర్శలు, ప్లెక్సీల నేపథ్యంలో జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ జనగామ నియోజకవర్గంలోకి బండి సంజయ్ పాదయాత్ర చేరుకోనుంది.