50 వసంతాల పోస్టల్ పిన్ కోడ్
posted on Aug 16, 2022 @ 12:05PM
ఉత్తరాలు రాయడం సరే అది సరయిన అడ్రస్‌కి చేరాలంటే పోస్టల్ పిన్‌కోడ్ వేయడం కీలకం. అది లేకుంటే ఉత్తరం ఎటుపోతుందో దానికే తెలీదు. పోస్టల్ వారూ పిన్‌కోడ్ తప్పనిసరిగా ఉండాలని అడుగు తూంటారు. లేకుంటే అది అందకపోయినా ప్రశ్నించడానికి అధికారం లేదన్నది వారి హెచ్చరిక. స్వతంత్ర భారతదేశం 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అలాగే పిన్ కోడ్ కూడా గోల్డెన్ జూబ్లి ని సెలెబ్రేట్ చేసుకుంటోంది.
పోస్టల్ ఇండెక్స్ కోడ్ లేదా ఏరియా కోడ్ లేదా జిప్ కోడ్ అని పిలుస్తారు. పిన్ కోడ్ 1972 ఆగష్టు 15 న ప్రారంభం అయింది. దేశంలో చాలా ప్రాంతాల పేర్లు ఒకలాగే ఉండడం,చిరునామా స్థానిక బాష లో రాస్తుండడం తో అర్ధం కాక ఇబ్బంది పడేవారు.అందుకోసం అప్పటి కేంద్ర సమాచారశాకా సెక్రటరీ శ్రీ రంభికాజీ వేలంకర్ ఆరు అంకెల పిన్ ప్రేవేశపెట్టారు.
పిన్ కోడ్ లో కనిపించే ఆరు అంకెలలో మొదటిది ఏరియా జోన్ ని సూచి స్తుంది. రెండవ అంకె సబ్ జోన్ ని సూచిస్తుంది.మూడవ అంకె జిల్లా ని సూచిస్తుంది.మిగతా మూడు అంకె లు జిల్లా లో వ్యక్తిగత పోస్టల్ ఏరియా కికేటాయించ బడతాయి.పిన్ కోడ్ ని ప్రేవేశపెట్టినప్పుడు భారతదేశం 8 భౌగోళిక ప్రాంతాలుగా విభజించ బడింది. 9 వ జోన్ ఆర్మీ పోస్టల్ సర్వీస్ రిజర్వు గా ఉంచారు.నేడు దేశం లో మొత్తం 19101 పిన్ లు ఉన్నాయి. ఇందులో ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఉండదు. పిన్ కోడ్ సహాయంతో వస్తువుల పంపిణి సులభతరం గా మారింది.