అంబటి రాంబాబు- నాగబాబు- మధ్యలో బండ్ల గణేష్

ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జనసేన నేత కొణిదెల నాగబాబు మధ్య ట్విట్టర్ వేదికగా  ప్రాసలతో విమర్శలు పడుతున్నాయి. పంచ్ లు పేలుతున్నాయి. వీరి మధ్యలో అంబటిపై నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్, జనసేన శ్రేణులు, పవన్ ఫ్యాన్స్. వీరంతా  తమ  శైలిలో ట్వీట్ల వార్ రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు, సెటైర్లతో ఏపీలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశారు. ఈ వార్ ప్రారంభించింది మంత్రి అంబటి రాంబాబు. వివాదానికి మూల కారణం చేనేత చాలెంజ్. చేనేత వస్త్రం ధరించి, ఫొటో పోస్ట్ చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చాలెంజ్ విసిరారు. ఆ చాలెంజ్ ను స్వీకరించిన పవన్ కళ్యాణ్ అదే చాలెంజ్ ను టీడీపీ చీఫ్ చంబ్రబాబు నాయుడికి మరో ఇద్దరికి విసిరారు.  దీంతో తెర మీదకి వచ్చిన మంత్రి అంబటి.. ‘పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేస్తారా? లేదా?’ అంటూ సెటైర్ వేయడంతో ట్వీట్ల వార్ స్టార్ట్ అయింది. అంబటి ట్వీట్ కు స్పందించిన జనసేన నేత నాగబాబు.. రాంబాబు మార్ఫింగ్ ఫొటోతో జవాబు ఇచ్చారు. దీనిపై స్పందించిన అంబటి ‘బాగా ఖాళీగా ఉన్నట్లున్నారు’ అంటూ నాగబాబుపై రీ ట్వీట్ చేయడం గమనార్హం. ‘పవన్ కళ్యాణ్ గారూ.. కాటన్ దుస్తులు చాలెంజ్ ఆపి ఇంతకీ 175 సీట్లలో పోటీ చేస్తున్నారా లేదా, ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి’ అని అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కు మార్ఫింగ్ ఫొటోతో నాగబాబు దీటుగా జవాబు ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ను తన దేవుడిగా చెప్పుకునే సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ‘అలాగే రంభల రాంబాబుగారు.. మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారు.. జై పవన్ కళ్యాణ్’ అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. మంత్రి అంబటి సెటైర్ కి జనసేన నేత నాగబాబు ఊహించని స్థాయిలో రీ ట్వీట్ చేశారు. ‘ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా! బాబూ.. ఓ రాంబాబు.. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసీపీ సర్కస్ లో నీ లాంటి బఫూన్ గాళ్లు అడిగే  క్లారిఫికేషన్స్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకు గానీ, పవన్ కళ్యాణ్ కు గానీ   లేదు’ అని ట్వీట్ చేస్తూ.. అంబటి ఫొటోను మార్ఫింగ్ చేసి, జతచేశారు. నాగబాబు రీ ట్వీట్ పై మళ్లీ అంబటి మరో సెటైర్ వేస్తూ.. ‘భలే ఓరండీ నాగబాబుగారు, ఎంత ఓపిగ్గా, ఎంత తీరిగ్గా నా బొమ్మేశారండి.. ఖాళీగా ఉన్నట్లున్నారు.. ధన్మవాదాలు’ అంటూ రీ ట్వీట్ చేయడం గమనార్హం. ఆపైన అంబటి రాంబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ‘జై జనసేన.. జైజై పవన్ కళ్యాణ్.. బాబు ఓ రాంబాబు మీ బుద్ధి మారుదు రాంబాబు’ అంటూ ఓ అభిమాని అంబటిని ఏసుకున్నాడు. ‘నీలాంటి పాలేరు గాడికి సమాధానం చెప్పాలేంట్రా రంభల రాంబాబు’ అని మరో ఫ్యాన్ కౌంటర్ వేశాడు. ‘రాసలీలల రాంబాబు’ అని ఒకరు, ‘పాలేరు రాంబాబు’ అంటూ ఇంకొకరు, ‘గుడివెనుక నాసామి రాంబాబు’ అంటూ మరో అభిమాని అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు.

ఘనంగా 'తెలుగు వన్' ఎండీ కుమార్తె పెళ్లి.. చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖుల హాజరు

తెలుగు వన్ సంస్థల అధినేత కంఠంనేని రవిశంకర్ కుమార్తె జితేష్ణ వివాహం సాయిరామ్ సోహిల్ తో శనివారం(ఆగస్టు 13) సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార, వైద్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.     కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా హాజరయ్యారు. అలాగే సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ సుజనా చౌదరితోపాటు తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.     బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సింగీతం శ్రీనివాసరావు, ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, వై.వి. ఎస్. చౌదరి, నీలకంఠ, వీరశంకర్, వి.ఎన్. ఆదిత్య, రవిబాబు, భానుశంకర్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్, నటులు వినోద్ కుమార్, శివాజీ, రాజీవ్ కనకాల, రచయితలు జనార్దన మహర్షి, నివాస్ తదితరులు హాజరయ్యారు.

దీని భావమేమి జగనేశా.. ఓవర్సీస్ విద్యానిథి పథకానికి అంబేడ్కర్ పేరు మార్పుపై ఆగ్రహం

పిల్లాడికి ముచ్చ‌ట‌ప‌డి పేరు పెడ‌తారు పెద్ద‌వాళ్లంతా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి. దానికి ముందో వెన‌కో ఆధుని క‌త్వం జోడిస్తూ మంచి పేరు పెట్టడానికే ప్ర‌య‌త్నిస్తారు. కుద‌ర‌క‌పోతే  లోకంలో స‌ర్వ‌సాధార‌ణ మైన బాబీ, నిమ్మీ, విన్నూ.. ఎలాగూ ఉంటాయి.  పేరు  మార్చ‌డం, అలాగే ఉంచ‌డం త‌ల్లిదండ్రుల యి ష్టం. కానీ ఒక ప్ర‌భుత్వ ప‌థ‌కానికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మారుస్తానంటే ఎలా కుదురుతుంది? అదేమ‌న్నా స్వ‌ంత వ్య‌వహార‌మా. జగన్ సర్కార్ అంబేడ్కర్ విద్యానిథికి ప‌థ‌కానికి పేరు మార్చ‌డం సర్వత్రా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇది  ఒక్క‌టే కాదు ఆంధ్రాలో కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ జిల్లా అని పేరు మార్చ‌డమూ అంతే వ్య‌తిరేక‌త‌కు గుర‌యింది. కోన‌సీమ అనేది ఆనాదిగా రాష్ట్రంలో అంద‌రికీ తెలి సిన ప్రాంతం. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జగన్ సర్కార్ కోనసీమను జిల్లాగా చేసింది. కొనసీమ జిల్లాగా పేరు ప్రకటించి ఆ తరువాత దానిని అంబేద్క‌ర్ కోన‌సీమ  జిల్లా అని మార్చ‌డంతో ఒక్కసారిగా కోనసీమ భగ్గుమంది. అంబేద్క‌ర్ విద్యానిధి ప‌థ‌కం వాస్త‌వానికి ఎంద‌రో విద్యార్ధుల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న‌ది.  గత  టీడీపీ ప్రభు త్వంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద  ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్ డి,  ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదువుకు నేందుకు రూ. 15 లక్షల చొప్పు న ఆర్థిక సహాయం అం దించామని ఆయన తెలిపారు. దీనివ‌ల్ల ఎంద‌రికో ల‌బ్ధి చేకూ రుతుంది. దీన్ని గురించి విప‌క్షాలూ మండి ప‌డుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు  ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ పథకానికి జగన్ తన పేరును చేర్చుకోవడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరుని తొలగించడం ఆయనను అవమానించినట్టేనని చంద్రబాబు అన్నారు. ఇది జగన్ అహంకారమని విమ ర్శించారు. అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించడమేనని చెప్పారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే పేరు మార్చి అంబేద్కర్ పేరును చేర్చాలని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ డి మాండ్ చేస్తోందని అన్నారు. అలాగే ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ" పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థు ల కైతే రూ.15 లక్షలు.. ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారన్నా రు. ఈ రకంగా ఐదేళ్ల తెలుగు దేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామన్నారు. మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైఎస్సార్ సీపీ ప్రభు త్వం.. ఇప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం" పేరు నుంచి అంబేద్కర్ పేరును తొల గిం చింది అన్నారు. ఇదిలాఉండ‌గా, కోన‌సీమను అదే పేరుతో జిల్లా చేసి ఇప్పుడు హ‌ఠాత్తుగా దాని పేరు అంబేద్క‌ర్ జిల్లాగా మార్చ‌డం విష‌యంలోనూ ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అనాదిగా కోనసీమ ప్రాంతీయులు త‌మ ప్రాంతాన్ని అలానే పిల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ్డారు. అదే పేరున జిల్లా ఏర్పాటును అంగీక‌రించారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కోన‌సీమ జిల్లా పేరును అంబేద్క‌ర్ జిల్లాగా మార్చ‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌న్నది ప్ర‌శ్నిస్తు న్నారు. వాస్త‌వానికి ఆ ప్రాంతీయుల‌కు అంబేద్క‌ర్ ప‌ట్ల ఎంతో గౌర‌వం ఉంది. గాంధీతో స‌మానంగా అంబే ద్క‌ర్ ప‌ట్ల నిత్య అభిమానాన్ని ప్ర‌క‌టిస్తూనే ఉంటారు.  కానీ జిల్లా పేరును ఇపుడు మార్చే బ‌దులు అస‌లు ముందే అంబేద్క‌ర్ అని పెట్టి ఉంటే అక్క‌డి ప్ర‌జ‌ల నుంచీ ఎటువంటి వ్య‌తిరేక‌తా వ‌చ్చేది కాదు. ఇపుడు జ‌గ‌న్ త‌న‌కు తోచిన‌విధంగా, ప్ర‌జ‌ల‌ను రాజ‌కీయ ప‌రంగా, ఓట్ల‌ప‌రంగా చూస్తూ అంబేద్కర్ జిల్లా అని పేరు మార్చ‌డం జ‌రిగింద‌న్న అభిప్రాయాలే వెల్లు వెత్తుతున్నాయి. ఈ ప‌రంగా ప్ర‌భుత్వం ప్ర‌జాభీష్టాన్ని అగౌర వ‌రుస్తూ తీసుకునే నిర్ణ‌యాలను అంగీక రించేందుకు సిద్ధంగా లేర‌నే అభిప్రాయాలు విన‌వ‌స్తున్నాయి.

కమలనాథులకు ఆంటీ షాక్

సహజ నటి జయసుధ వెండి తెర మీద.. దాదాపు ఐదు దశాబ్దాల పాటు.. వివిధ పాత్రల్లో అభిమానులను అలరించింది. అయితే ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా.. సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు..   ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో ఇప్పటికే బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఈ సహజ నటితో భేటీ అయి.. పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన అయితే ప్రస్తుతం తనకు లేదని ఈటలకు ఈ జ్యోతి సినిమా హీరోయిన్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారని సమాచారం. అలాగే అదే సమయంలో ఈటల ఎదుట జయసుధ పలు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. వాటిని అంగీకరిస్తే.. తాను పార్టీలో చేరేందుకు సిద్దమని ఈ సందర్భంగా ఈటలకు జయసుధ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే తన ముందు ఉంచిన ఈ ప్రతిపాదనలు.. హస్తినలోని పెద్దలతో మాట్లాడి.. చెబుతానని జయసుధతో ఈటల పేర్కొన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఝలక్ ఇచ్చి.. తెలంగాణలో పాగా వేసేందుకు మోదీ, అమిత్ షా ద్వయం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రముఖ సినీ రంగ ప్రముఖులు, మేధావులపై కమలనాథులు గురి పెట్టారు. వారిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా.. కమల దళాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తెలంగాణ నేతలతో ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో వారితో రాష్ట్ర బీజేపీ నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు.  అలా జరిగిందే జయసుధతో భేటీ కూడా అనే ఓ చర్చ అయితే అటు రాజకీయ వర్గాల్లో .. ఇటు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. జయసుధ 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్  రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో.. కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్‌కు గట్టి పోటీ ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం అడ్డా అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి తలసాని శ్రీనివాసయాదవ్‌ను జయసుధ ఓడించడంతో.. నాడు   సహాజ నటి పేరు ఉమ్మడి రాష్ట్రంలో  మారుమోగిపోయింది. ఆమె ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆమె గుడ్ బై చెప్పారు. ఇక 2016లో విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆమె భర్త నితీన్ కపూర్‌తో కలిసి టీడీపీ కండువా కప్పుకొన్ను. ఆ తర్వాత ఆమె సైకిల్ పార్టీకి కూడా బై బై గుడ్ బై చెప్పేసి.. మళ్లీ 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లోటస్ పాండ్‌లో వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొంత కాలంగా ఆమె స్తబ్దుగానే ఉంటున్నారు.  అలాంటి సమయంలో బీజేపీ నేతల దృష్టి.. జయసుధపై పడిందని సమాచారం. ఆమెను పార్టీలోకి తీసుకుంటే.. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలపై ఆమెకు నేటికి గట్టి  పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీకి తీసుకోవడం ద్వారా... టీఆర్ఎస్ స్పీడ్‌కు అడ్డుకట్ట వేయవచ్చుననే ఓ ఆలోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సహజ నటి ప్లస్ ఆంటీ సినిమా హీరోయిన్ జయసుధ.. అంటే ఈ ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలుసన్న సంగతి అందరికీ తెలిసిందే.  ఈ నేపథ్యంలో జయసుధను పార్టీలోకి తీసుకుంటే.. పార్టీకి మరింత అదనపు ఆకర్షణ ఏర్పడుతోందనే ఓ భావనలో మోదీ, అమిత్ షా ద్వయం సైతం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే.. తెలంగాణలో రాములమ్మ విజయశాంతి, తమిళనాడులో ఖుష్బు బీజేపీలో క్రియశీలకంగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో   సహజ నటి జయసుధతో పాటు పలువురు సినీ ప్రముఖులను పార్టీలోకి తీసుకుంటే.. తెలంగాణలో కమలం పువ్వు వికసిస్తోందనే ఓ ఆలోచనలో కాషాయం దండు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే.. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని పలువురి కీలక నేతలు బీజేపీ గుటికి చేరుతున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి కమలం కండువా కప్పుకొనున్నారు. ఈ నెల 21న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మునుగోడులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలోని కీలక నేతలను.. కమలదళంలో చేర్చేందుకు సన్నాహాలు జెట్ స్పీడ్‌లో జోరందుకున్నట్లు సమాచారం.

సంక్షేమానికి జగన్ జనగణమన

ప్రజా సంక్షేమమే మా ప్ర‌భుత్వ ధ్యేయ‌మని ప్ర‌చారం చేసుకున్నంత మాత్రాన సంక్షేమం చేప‌డుతున్న‌ట్టు కాదు. నిజంగానే ప్ర‌జ‌ల సంక్షేమానికి త‌గిన ప‌థ‌కాల‌తో వారికి ఆస‌రాగా నిల‌వాలి. కేవ‌లం ప‌థ‌కాలు ప్ర‌క టించ‌డం, యాప్‌లు త‌యారుచేయించి ప్ర‌జ‌ల‌కు తాయిలాలుగా ఇవ్వ‌డం త‌ప్ప ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రత్యే కించి జ‌రుగుతున్న సంక్షేమ‌మేమీ లేద‌న్నది విశ్లేష‌కుల మాట‌.  పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగు ప‌ర‌చాలి, బీసీలు, ద‌ళితులు, గిరిజ‌నులు, ముస్లింలు, క్రిస్టియ‌న్ మైనారిటీల అభివృద్ధి గురించి ఆలో చించి ప‌థ కాలు చేప‌ట్టాలి. కానీ ఇవేమీ జ‌ర‌గ‌డ‌మే లేదు స‌రిక‌దా, గ‌తంలో ఉన్న సంక్షేమ ప‌థ‌కాలూ నిర్ల‌క్ష్యానికి గుర య్యాయి. బిసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేష‌న్ల ద్వారా ఆయా వ‌ర్గాల‌కు అందాల్సిన స‌హ‌కారం ఆగి పోయింది.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడేళ్లుగా వారికి ఎలాంటి ఆర్థిక సాయం చేయకుండా మొండి చేయి చూపింది. గ్రామీణ ప్రాంతాల్లో పలు రకాల యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ  ఇచ్చి  సహకారమందించారు.  ఒక్కో యువ కుడికి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల దాకా బ్యాంకుల ద్వారా రుణసాయం చేశారు. బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో కొంత మందికి ఎన్‌ఎస్ఎఫ్ డీఎస్‌, ఎన్‌టీఎఫ్డీఎస్‌ సహకారంతో నేరుగా ప్రభు త్వమే రుణాలందించింది. గిరిజన మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, ఆటోలు, పెద్ద వాహనాలను 90 శాతం సబ్సిడీతో అందించారు. ఎస్టీ కార్పొరేషన్‌, ఐటీడీఏల ద్వారా పేద ఎస్టీ రైతులకు విద్యుత్‌ సౌకర్యం, బోర్లు, మో టార్లు, పైపులు తదితర సౌకర్యాలు కల్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్వయం ఉపాధి పథకానికే స్వస్తి పలికారు.  కాంగ్రెస్‌ హయాంలో నిర్లక్ష్యం చేసిన ఎన్‌ఎస్‌‌టీఎఫ్‌డీసీని చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరించింది. కానీ జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం ఆ నిధులను నిలిపేసింది.  ము స్లిం, క్రిస్టియన్లకూ దక్కని రుణాలు ముస్లింలలో ఎక్కువ మంది పట్టణాలు, మండల కేంద్రాల్లో వెల్డింగ్‌, మెకాని క్‌ షాపులు, పాత ఇనుమ సామానుల అంగడి, తదితర చిన్న చిన్న స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నా రు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలు అమల్లోకి తెచ్చింది. పలు రకాల కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించింది.  చంద్రబాబు ప్రభుత్వం లో ముస్లిం, క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా ఏటా 10 వేల మందికి స్వయం ఉపాధి యూ నిట్లు ఏర్పా టు చేసుకునేందుకు సాయం చేసింది. దుకాన్‌, మకాన్‌ పథకాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో ప్రతి ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం ఉపాధి యూనిట్లకు మంగళం పాడే సింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. కేవలం ఐదు  కులాలకు చెందిన 44 లక్షల మందికి తప్ప మిగతా 1.70 కోట్లమంది బీసీల సంక్షేమం ఊసేలేద‌న్న‌ విమర్శలు వస్తున్నాయి. 4.37 లక్షల మంది కి ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందజేసి, బీసీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచా రం చేసుకుంటోంది.

బీజేపీ  సీత‌య్య‌..! 

పిల్లాడికి పౌష్టికాహారం పెడుతున్నా ఎత్తు పెర‌గ‌డం లేద‌ని త‌లిదండ్రులు బాధ‌ప‌డ్డారు. ఒక‌రోజు ఎక్క‌డో విని ఒక  టేపు కొని రెండు నెల‌ల‌కోసారి వాడిఎత్తు కొల‌వ‌నారంభించారు. హాల్లో గోడ‌మీద స్కేలు గీత‌లు చూసి తెలిసిన‌వారికీ అర్ధ‌మ‌యింది. కానీ ప‌క్కింటివారిని పిలిచి మీరు మీ పిల్లాడి ఎత్తు గురించి ఆలోచిం చ‌మ‌ని చెప్ప‌లేదు. ఎవ‌ర‌యినా త‌మ అభివృద్దిని అంచ‌నా వేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. కానీ తెలంగాణాలో మాత్రం కేసీఆర్ ప్ర‌భుత్వం ఎప్పుడు కూల‌బోతున్న‌దీ బీజేపీ వారు లోకానికి తెలియ‌జేసే గ‌డియా రాన్ని ఏ ర్పాటు చేశారు. గ‌తంలోనూ ఇలాంటి కార్య‌క్ర‌మం చేప‌ట్టి ఈసీ నుంచి మొట్టికాయ‌లు వేయించు కున్నారు. అక్కడితో వారి ప్ర‌య‌త్నాలు మానుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లెట్టారు. మ‌ద్ద‌తు నిచ్చే వారు పేర్లు రిజిస్ట‌ర్ చేసుకోవాల‌నీ కోరుతున్నారు.  మళ్లీ 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ డిజిటల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ పాలనకు కౌం ట్ డౌన్‌ పేరుతో బీజేపీ ఆఫీస్‌ దగ్గర డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. డిజిటల్‌ బోర్డును  బీజేపీ ఇంఛార్జ్‌ తరు ణ్ చుగ్ ప్రారంభించనున్నారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ డిజిటల్‌ బోర్డులను జీహెచ్‌ఎంసీ అధికారులు నిలిపివేశారు. ఈసారి బీజేపీ ఆఫీస్‌ ప్రహారీ గోడ లోపల డిజిటల్‌ బోర్డ్ ఏర్పా టు చేసినట్లు బీజేపీ తెలిపింది. ఐరన్ పిల్లర్‌ నిర్మించి డిజిటల్‌ బోర్డ్‌ను ఏర్పాటు చేసినట్లు కమలం పార్టీ స్పష్టం చేసింది. కేసీఆర్ ఆధిప‌త్యాన్ని దెబ్బ‌కొట్ట‌డం, అధికార‌పీఠం ఎక్క‌డం మాత్ర‌మే బీజేపీకి తెలంగాణా ల‌క్ష్యంగా మా రింది. ఆమ‌ధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ‘సాలు దొర - సెలవు దొర’ ప్రచా రాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఈ ప్రచారంపై ఈసీ అభ్యం తరం వ్యక్తం చేసింది. ఈ ప్రచారంపై ఈసీకి టీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ ప్రచారానికి అను మతి కోసం బీజేపీ పార్టీ చేసిన అభ్యర్థనతోనే ఈసీ ఈ క్యాంపెయిన్ గురించి పరిశీలించి నిలిపి వేయా లని ఆదేశించింది. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌ ఫొటోలతో పోస్టర్లు ముద్రిం చేందుకు బీజేపీ అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నిరాకరించింది. అలా చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సీఎం ఫొటోతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రచా రంపై బీజేపీ ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దూకుడైన నిర్ణయాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కొంత కాలంగా ‘సాలు దొర - సెలవు దొర’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. అటు.. టీఆర్‌ఎస్ కూడా నేరుగా ప్రధాని మోదీపై విమర్శలు కురిపిస్తూ ఈ ప్రచారాన్ని తిప్పికొడుతోంది.

ప్రభుత్వాన్ని నడపడం లేదు.. ఏదో మేనేజ్ చేస్తున్నామంతే!

కర్నాటకలో బొమ్మై ప్రభుత్వం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో తెలియజేసే ఓ ఆడియో లీక్ అయ్యింది. కర్నాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారానికి తెరతీశాయి. విపక్ష కాంగ్రెస్ పార్టీకి అనుకోని అవకాశంగా అందివచ్చాయి. అంతేనా ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసేలా వ్యాఖ్యలు చేసిన మధుస్వామి రాజీనామాను డిమాండ్ చేస్తూ సహచర మంత్రులో ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై ఎంత కప్పిపుచ్చుదామని చేసినా ముధుస్వామి వ్యాఖ్యలపై దుమరం రేగుతూనే ఉంది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే.. చెన్నపట్నకు చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్‌ మంత్రి మునుస్వామికి ఫోన్ చేసి రైతులకు సంబంధించిన అంశంపై కో-ఆపరేటివ్ బ్యాంకుపై  ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై మంత్రి సమాధానమిస్తూ  ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు. కేవలం నెట్టుకువస్తున్నాం  అని సమాధాపమిచ్చారు. అందుకు సంబంధించిన ఆడియో లీకై ప్రభుత్వాన్ని ఇక్కట్లలోకి నెట్టింది. దీనిపై మరో మంత్రి మునిరత్న మాట్లాడుతూ ప్రభుత్వానికి నష్టం చేసే వ్యక్తులు కేబినెట్ లో ఉండాల్సిన అవసరం లేదని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విపక్ష కాంగ్రెస్ అయితే కర్నాటకలో బీజేపీ సర్కార్ ప్రజలకు కాకుండా ఆర్ఎస్ఎస్ కు జవాబుదారీగా ఉంటోందని విమర్శలు గుప్పించింది.  

గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ పై సీబీఐ దర్యాప్తు?!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ రంగంలోనికి దిగనుందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై జాతీయ రాజకీయాలలో కూడా దుమారం రేగుతోంది. గోరంట్ల మాధవ్ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అంటున్నారు. అది ఫేక్ వీడియో అనీ, తనను బదనాం చేయడానికి కుట్ర పూరితంగా ఫేక్ వీడియోను సృష్టించారనీ ఆరోపిస్తున్నారు. బీసీ కార్డును వాడుకుంటూ.. ఇక బీసీనీ అయిన తనను రాజకీయంగా సమాధి చేయాలన్న తెలుగుదేశం కుట్రలో భాగమే ఈ వీడియో అని ఆరోపిస్తున్నారు. మరో వైపు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఎటువంటి పోరెన్సిక్ పరీక్షలూ లేకుండానే గోరంట్ల న్యూడ్ వీడియో ఫేక్ అని  సర్టిఫికేట్ (తీర్పు) ఇచ్చేశారు. అదే సమయంలో ఏపీలో రచ్చగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. ఈ న్యూడ్ వీడియో తనది కాదు ఇది ఫేక్ అని ఎంపీ గారు అంటున్నారు.తనను బదనాం చేస్తున్నారు అని ఆయన ఆరోపిస్తున్నారు. కొందరు కలసి బీసీనైన తనను రాజకీయంగా హత్య చేయాలని చూస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇలా ఉండగా  తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి   అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ లో చేసిన టెస్టులలో ఈ వీడియో ఒరిజినల్ అని తేలింది అంటూ మాధవ్ పై చర్యకు డిమాండ్ చేశారు.  కాగా ఈ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై  జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. పంజాబ్ కి చెందిన కాంగ్రెస్ ఎంపీ లోక్ సభ స్పీకర్ కి లేఖ రాసి ఎంపీ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకో వైపు జాతీయ మహిళా కమిషన్ కూడా   దీని మీద పూర్తి విచారణ చేయాలని ఏపీ డీజీపీని కోరింది. తాజాగా   ఏపీ హై కోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మాధవ్ ది అని భావిస్తున్న వీడియోపై  సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో మీద దర్యాప్తు జరపాలని ఆ లేఖలో కోరారు. అలాగే మాధవ్ మీడియా ముందు చేసిన కామెంట్స్ వల్ల కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ ఆ వీడియో బైట్స్ ని కూడా సీబీఐకి పంపించారు.ఆయన తన ఫిర్యాదుని ఈ మెయిల్ ద్వారా చెన్నై లో ఉన్న సీబీఐ అఫీసుకు పంపించారు. మరి సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. 

ఎవడ్రా నువ్వు.. యూజ్ లెస్ ఫెలో!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన శైలిలో స్పందించారు. ఈ వీడియో వ్యవహారంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెబుతున్నవి సొల్లు కబుర్లు అని ఆమె అభివర్ణించారు. అతడు జిమ్‌లో ఉంటే తీశారన్నారని.. అయినా ఎవరిదండి ఆ జిమ్.. జిమ్‌లో బట్టలు లేకుండా ఉంటారా? అని రేణుకాచౌదరి ప్రశ్నించారు. తనకు తెలిసి బట్టలు లేకుండా చేసే జిమ్ ఇదే అయి ఉంటుందని ఆమె వ్యంగ్యంగా అన్నారు. అలాంటప్పుడు జిమ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ జగన్ ప్రభుత్వాన్ని రేణుకా చౌదరి సూటిగా ప్రశ్నించారు. ఓ యూస్ లెస్ ఫెలో... అలా మాట్లాడారన్నారు. గోరంట్ల ట్రాక్ రికార్డు కూడా అలాంటిదేనని.. అతడి గత చరిత్ర సైతం ఇటువంటిదేనని రేణుకా చౌదరి ఈ సందర్బంగా గుర్తు చేశారు. గోరంట్ల సీఐగా ఉండి.. పోలీస్ అసోసియేషన్ హెడ్‌గా ఉండిన ఆయనకు చట్టాలు తెలియదా? అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు. గోరంట్ల చేసిందే తప్పు.. క్షమాపణలు చెప్పుకొంటే మర్యాదగా ఉండేదని.. తప్పు ఏదో జరిగిపోయిందని చెప్పుంటే బాగుండేదని ఈ సందర్బంగా రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. కానీ ఇలా కప్పి పుచ్చడం కోసం చేసే ప్రయత్నాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా యాధా రాజా తథా ప్రజా పరిస్థితే అనుకోవాల్సి ఉందన్నారు. సీఎం జగన్  స్టాండింగ్.. ఆయన స్టేటస్ ఇదని.. అందుకే ఆయన చుట్టు ఇటువంటి వారిని పెట్టుకొన్నారని ఆమె వ్యంగ్యంగా అన్నారు. ఇంత చేసి మళ్లీ కమ్మ కులంపై ఆరోపణలు చేయడం ఏమిటని ఆమె మండిపడ్డారు. అయినా కమ్మ కులం పేరు ఎందుకు ఎత్తుతున్నారని ఆమె గోరంట్లను సూటిగా ప్రశ్నించారు. కమ్మ కులం అంటే ఏమనుకుంటున్నావంటూ గోరంట్లపై రేణుకా చౌదరి నిప్పులు చెరిగారు. నీవు చేతకాని వెధవంటూ గోరంట్లపై  మండిపడ్డారు.  తలా తోక తెలియకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారన్నారు... ఆ క్రమంలో ఖబడ్దార్ అంటూ గోరంట్లకు మాధవ్ కు రేణుకా చౌదరి సవాల్ విసిరారు. చేసింది వెధవ పనులు పైపెచ్చు..కులంపై విరుచుకు పడతావా అంటూ గోరంట్లపై రేణుకా ఆగ్రహం వ్యక్తం చేశారు.   రేపు ఈ వెధవ మనింటికి వస్తే.. మన ఆడపిల్లలు సేఫా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఏపీలో గోరంట్ల తీరు అలా ఉంటే.. తెలంగాణలో కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు తీరును ఈ సందర్బంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు. దీనిపైన కూడా చర్యలు లేవన్నారు. ఇసుక తకిడి.. పేడ తకిడి అన్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు.. వారి ముర్ఖత్వాలు.. వాళ్లు చేసే వెధవ పనులు.. వాళ్ల పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు మోసారు.. మోస్తున్నారని అన్నారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ తప్పదని హెచ్చరించారు.  ఎన్నికల అఫిడవిట్‌లో తాను రేపిస్ట్ అంటూ గోరంట్ల చెప్పారని రేణుకా చౌదరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి వాటినైనా ఎన్నికల సంఘం చూసుకోవాలన్నారు. అయితే అదీ తనకు తెలియదని... నాకు న్యాయవాది చెప్పాడంటూ గోరంట్ల మాట్లాడరని.. మరి సదరు న్యాయవాదిపై ఏం చర్యలు తీసుకున్నావంటూ గోరంట్లను రేణుకా చౌదరి నిలదీశారు. ఆ ఎన్నికల అఫిడవిట్‌లో గోరంట్లే స్వయంగా డిక్లరేషన్ ఇచ్చారని ఆమె చెప్పారు. కావాలంటే గోరంట్ల మానసిన స్థితిని బాగు చేసేందుకు తమ సామాజిక వర్గం వారంతా డబ్బులు వేసుకుని మరీ చికిత్స చేయిస్తామంటూ   రేణుకా చౌదరి ఆపర్ ఇచ్చారు.      

బాబుదే అధికార పీఠం ఎలాగంటే..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఒక పక్కన అధికార వైసీపీ, మరో పక్కన ప్రతిపక్ష టీడీపీ, ఇంకో వైపున జనసేన, బీజేపీలు తమ తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో తలమునకలై ఉన్నాయి. మరో పక్కన పబ్లిక్ సర్వేల పేరుతో పలు సంస్థలు నివేదికలు కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. అనే ప్రాతిపదికన ఆయా సర్వేలు నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఆయా సర్వేల నివేదికల ఫలితాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీట్లు తగ్గినా అధికార వైసీపీదే మళ్లీ అధికారం అని చెబుతున్నాయి. అయితే.. సుమారు ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల వరకు ఇదే మూడ్ ఓటర్లలో ఉంటుందా? అంటే దానికి అవునని మాత్రం చెప్పలేకపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ సర్కార్ దిగువ స్థాయి, మధ్య తరగతిలోని కొన్ని వర్గాల ఓట్లను రాబట్టుకోగలుగుతుందనీ, ఉన్నత వర్గాలు, మధ్యతరగతిలోని కొన్ని వర్గాల వారు, తటస్థులు అధిక శాతం మంది పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేసే పరిస్థితి అంతగా ఉండదనీ అంటున్నారు. అలాంటప్పుడు పోలింగ్ శాతం తక్కువ నమోదవుతుంది. అలా ఓటు వేసేది దిగువ, కిందిస్థాయి వర్గాల వారే అయి ఉంటారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న వారు అధికార పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అదే.. పోలింగ్ శాతం అధికంగా పెరిగితే మాత్రం అధికార వైసీపీకి చెక్ చెప్పినట్లే అనే విశ్లేషణలు వస్తున్నాయి. నిజానికి ఉన్నతస్థాయి, మధ్యతరగతి వర్గాలు, తటస్థులను పోలింగ్ బూత్ లకు గనుక రప్పించ గలిగితే ప్రతిపక్ష  టీడీపీకే ప్రయోజనం కలుగుతుందంటున్నారు. పోలింగ్ శాతం పెరగడం అంటే.. అధికార పక్షంపై వ్యతిరేకత ఒకటైతే.. ఉన్నత, మధ్యతరగతి, తటస్థంగా ఉండే వర్గాల ఓట్లు పోలవడం మరో కారణం అవుతుంది. అదే జరిగితే అధికార వైసీపీకి మూడినట్లే అనే అంచనాలు వస్తున్నాయి. అదే సమయంలో టీడీపీకి విజయావకాశాలు పెరుగుతాయంటున్నారు.  ఇప్పటి వరకు వచ్చిన సర్వేల ప్రకారం పేదలు, గ్రామీణ ఓటర్లలో మాత్రం వైసీపీ పట్ల కొంత సానుకూలత ఉంది. ఈ కారణంతోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో మళ్లీ వైసీపీకే అధికారం అనే అంచనాలు వస్తున్నాయి. సంక్షేమ పథకాలు అందుకుంటున్నవారు వైసీపీ పట్ల సంతోషంగానే ఉంటారు. అయితే.. ఏపీలో అభివృద్ధి అసలే లేదనే చర్చ ఉన్నతస్థాయి మధ్యతరగతి వర్గాల్లోని విద్యావంతుల్లో కొనసాగుతోంది. వీరితో పాటు తటస్థుల్లో కూడా ఇలాంటి చర్చే జరుగుతోంది. ఈ మూడు వర్గాల్లోనే వైసీపీ వ్యతిరేక ఓటు ఉంటుంది. అందుకే ఈ మూడు వర్గాలను ఆకట్టుకోగలిగితే.. టీడీపీకి సానుకూలత పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. పోలింగ్ బూత్ లకు ఉన్నత వర్గాలు రారు అనే బలమైన భావన ఉంది. మధ్యతరగతి వర్గాల్లో అధికశాతం మంది పోలింగ్ కు గైర్హాజరవుతుంటారు. తటస్థులైతే ఎవరికి ఓటు వేస్తే ఏం ప్రయోజనం అనే వేదాంత ధోరణిలో ఓటింగ్ కు దూరంగా ఉంటుంటారు. వాస్తవానికి ఈ మూడు వర్గాలు తలచుకుంటే మాత్రం ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నాయి. ఒకవేళ వారు బయటికి వచ్చి ఓట్లు వేస్తే మాత్రం.. బలమైన మార్పు తప్పదనే భావించాలి. ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కచ్చితంగా ఇబ్బందుల్లో పడుతుందనే భావన ఈ మూడు వర్గాల్లోనూ ఉంది. అయితే.. అది ఉద్యమ స్థాయిలో లేదనే చెప్పాలి. ఈ భావననే ఏపీ ప్రజల్లో రాజేసేందుకు టీడీపీ అహరహం కృషి చేస్తోంది. టీడీపీ ప్రయత్నాలు ఉన్నత, మధ్యతరగతి, తటస్థ వర్గాలను ఆకర్షించగలిగితే.. వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగించినట్లే అంటున్నారు.  చూడాలి మరి.. 2024లో ఏపీలో ఏమి జరుగుతుందో.. టీడీపీ గనుక ఆ మూడు వర్గాలను పోలింగ్ బూత్ లకు రప్పించ గలిగితే భారీ పోలింగ్ జరుగుతుంది. అదే జరిగితే అధికార మార్పిడి తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మాధవ్ వీడియోపై మడమ తిప్పిన వైసీపీ

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై విపక్షాలే కాకుండా, రాష్ట్ర ప్రజలు కూడా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ అశ్లీల వీడియో గోరంట్ల మాధవ్ దే అని తేలితే.. కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ వీడియోపై ప్రతిపక్ష టీడీపీ విమర్శల తీవ్రత పెంచింది. దీంతో మాట తప్పి మడమ తిప్పిన వైసీపీ ఇప్పుడు మాధవ్ పై చర్యలు తీసుకోకుండా.. ప్రతిపక్షాలపై మాటల దాడితో విరుచుకుపడుతోంది.  నిజానికి ఆ వీడియో గోరంట్ల మాధవ్ దే అని స్పష్టం అయి, పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే..  బీసీల నుంచి  తీవ్ర వ్యతిరేకత తప్పదనే భయం వైసీపీని వెంటాడుతున్నట్లుంది. అందుకేనేమో చర్యల మాట పక్కన పెట్టేసింది వైసీపీ. ఒక పక్కన ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షకు పంపకుండానే అది ఫేక్ వీడియో అని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పతో ఒక ప్రకటన చేయించి, సమస్యను వైసీపీ మరింత జఠిలం చేసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒరిజినల్ వీడియో దొరికితే ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతామని ఫకీరప్ప ప్రకటించారు. దీంతో ఆ వీడియోను తెలుగుదేశం అగమేఘాల మీద అమెరికాకు చెందిన ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి, రిపోర్టు తెప్పించింది. ఆ వీడియోను ఎలాంటి ట్యాంపరింగ్ చేయలేదని, ఒరిజినలే అని టీడీపీ తన విమర్శలకు పదును పెట్టింది.  గోరంట్ల మాధవ్ వీడియో ఒక పక్కన టీడీపీ- వైసీపీ మధ్య వివాదంగానే కాకుండా.. కమ్మ- కురబ కులాల మధ్య చిచ్చు రేపేలా మారింది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోరంట్ల మాధవ్.. అది తనపై కమ్మ సామాజికవర్గం చేసిన కుట్ర అంటూ అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించడం గమనార్హం. మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని కమ్మ సామాజికవర్గానికి చెందిన అనేక మంది తీవ్రంగా ఖండించారు. పరుష పదజాలంతో మాధవ్ పై విరుచుకుపడ్డారు. గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారాన్ని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి మహిళా జేఏసీ నేతలు తీసుకెళ్లారు. మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేలా మాట్లాడిన ఫకీరప్పపై గవర్నర్ కు వారు ఫిర్యాదు చేశారు. న్యూడ్ వీడియో వ్యవహారం నుంచి బయట పడేందుకు సామాజికవర్గాన్ని మాధవ్ వాడుకుంటున్నారని ఫైరయ్యారు. మాధవ్ కు నీతి, నిజాయితీ ఉంటే.. లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని మహిళా జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరో పక్కన కురుబ నేతలు కూడా మాధవ్ పై మండిపడుతుండడం విశేషం. కురుబలకు మాధవ్ ఒరగబెట్టిందేమీ లేకపోగా, నమ్మి ఓట్లు వేస్తే తమ ఆత్మగౌరవాన్ని మాధవ్ బజారుకీడ్చారంటూ ఫైరవుతుండడం గమనార్హం.  కాగా.. ఈ అశ్లీల వీడియోపై అటు టీడీపీ ఇటు వైసీపీ ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నాయనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. ఒక మహిళతో మాధవ్ అశ్లీలంగా వీడియో మాట్లాడుతూ దొరికిపోయిన వ్యవహారం ఇప్పటికే వైసీపీ- టీడీపీ మధ్య జరుగుతున్న వార్ కు ఆజ్యం పోసినట్లయింది. మాధవ్ అశ్లీల వీడియోపై టీడీపీ ఏ మాత్రం పట్టు వీడడం లేదు. అశ్లీల వీడియోతో దొరికిపోయిన మాధవ్ ను సస్పెండ్ చేయాలని వైసీపీపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. మరో పక్కన మాధవ్ వీడియోపై లోక్ సభ స్పీకర్ కు కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై ఘాటుగానే స్పందించింది. టీడీపీ విమర్శల దాడి పెంచండంతో వైసీపీ నేతలు, ఆ పార్టీ ప్రభుత్వ పెద్దలు మాట మార్చేశారు. మాధవ్ పై చర్యలు తీసుకుంటే బీసీ సామాజికవర్గాలు తమకు దూరం అవుతాయనే భయం వైసీపీని వెన్నాడుతున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మాధవ్ పై చర్యలు తీసుకునేలా జగన్ పై ఒత్తిడి పెంచి, విజయం సాధించి బీసీల మద్దతు వైసీపీకి దూరం చేయొచ్చనే వ్యూహంతో టీడీపీ ముందుకు వెళ్తున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా మాధవ్ వీడియో వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నాయంటున్నారు.  

మిలియన్ మార్చ్ కు ఉద్యోగుల సమాయత్తం.. అణచివేతకు ప్రభుత్వం నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో ఓ మిలియన్ మార్చ్ జరగబోతోంది. సెప్టెంబర్ ఒకటో తేదీన  సీపీఎస్ ఉద్యోగులు. టీచర్లు ఈ మిలియన్ మార్చ్ చేస్తున్నారు.  అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్.అందుకు భిన్నంగా అవగాహన లేకుండా  లేకుండా హామీ ఇచ్చానని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంపై పోరుబాటే శరణ్యమని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న  సీపీఎస్ ఉద్యోగులు, మరీ   సెప్టెంబర్ ఒకటో తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను  గట్టిగా తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సహజంగానే టీచర్ల నిరసనకు  ప్రభుత్వ అనుమతి ఇచ్చే అవకాశాలు ఎంత మాత్రం ఉండవు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని టీచర్లు తమ నిరసనను ఆపే అవకాశాలూ లేవు.  గతంలో చలో విజయవాడను నిరోధించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వివఫలమైన సంగతి తెలిసిందే. పీఆర్సీ విషయంలో తమను మోసం  చేసిందని ఉద్యోగులు తీ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సెప్పెంబర్ 1న మిలియన్ మార్చ్ కోసం రోడ్డెక్కితే పరిస్థితి తీవ్రంగా మారుతుందన్నఆందోళన ప్రభుత్వంలో వ్యక్తమౌతోంది. ఒక వేళ ఉద్యోగుల మిలియన్ మార్చ్ విజయవంతమైతే ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న అన్ని వర్గాలూ పోరుబాట పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ మిలియన్ మార్చ్ ను నిర్వీర్యం చేయాలన్న పట్టుదలతో ఏపీ సర్కార్ ఉంది. అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం కూడా పట్టుదలలకు పోతుండటంతో మిలియన్ మార్చ్ సందర్భంగా శాంతి భద్రతల పరిస్థితికి విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

బీజేపీ కార్యాల‌యం వ‌ద్ద అనుమానాస్ప‌ద కారు

తెలంగాణాలో మునుగోడు ఉప ఎన్నిక‌ల హ‌డావుడితో రాజ‌కీయ పార్టీల హ‌డావుడి రోజు రోజుకీ పెరుగుతోం ది. నాయ‌కులు ఒక‌రి మీద ఒక‌రు ఆరోప‌ణ‌లు, హెచ్చ‌రిక‌లు, స‌వాళ్లు విసురుకుంటూ రాజ‌కీయాలను వేడె క్కిస్తున్నారు. రాష్ట్రంలో మూడు ముఖ్య‌పార్టీలు టీఆర్ ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ కొత్త కొత్త వ్యూహాల‌తో మును గోడులో విజ‌యానికి వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏది కనిపించినా కూడా అనుమానాస్ప దంగా చూడాల్సి వస్తోంది. నేడు బీజేపీ ఆఫీస్ ఎదుట ఒక కారు కనిపించింది.  మహారాష్ట్ర నంబర్‌తో రెండ్రోజులుగా నానో కారు  అక్క డే ఉంటోంది. నానో కారులో పెద్ద సూట్‌కేసును సైతం బీజేపీ కార్యకర్తలు గుర్తించారు. ఇంకే ముంది?  ఏదో జరిగిపోతోందంటూ  రచ్చ రచ్చ. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబు స్క్వాడ్‌తో  సహా పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద వాలిపోయారు.  క్షణాల్లో మీడియా కూడా బీజేపీ కార్యాలయం వద్దకు చేరిపోయింది. ఏం జరుగుతుందో ఏమోనన్న ఉత్కంఠ. కారులోని సూట్ కేసులో బాంబ్ ఉంటుందన్న అనుమానం. అయితే కారులో ఏమీ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికే బీజేపీ కార్యాలయం ముందు పార్క్ చేసిన కారుకు సంబంధించిన ఓనర్ వచ్చారు.  ట్విస్ట్ ఏంటంటే.. కారులో ఉన్న సూట్ కేస్‌లో బట్టలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. బీజేపీ కార్యా లయం పక్క కాలనీలో ఉండే వ్యక్తి ఇక్కడ కార్ పార్క్ చేశాడని నిర్దారణ అయింది. ఇన్వెస్టగేషన్ కోసం కారును, కారు ఓనర్‌ను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడ పార్క్ చేయడానికి కారణాలు, ఏమైనా కుట్ర ఉన్న దా అనే కోణంలో అనుమానంతో కారు ఓనర్‌ను విచారించారు. 

జ‌గ‌న్ ప‌ట్ల ఆగ్ర‌హంతో చెప్పుతో కొట్టుకున్న విక‌లాంగులు

అనాలోచిత నిర్ణ‌యాలు ప్ర‌మాద‌క‌ర‌మే. అందునా ప్రభుత్వం తీసుకుంటే దాని ఫ‌లితాలు పొందేవారి జీవితం మ‌రింత దుర్భ‌రం కావ‌డం బాధాక‌రం. మొన్న‌టివ‌ర‌కూ ఇస్తున్న పింఛ‌న్లు ఇపుడు కాదంటే వాటి మీద‌నే ఆధార‌ప‌డేవారు మ‌రి జీవితం చాలించాలా? ఈ ప్ర‌శ్న‌ను ప్ర‌భుత్వాన్ని వేయ‌లేక‌, త‌మ‌కు ఆసారా పోయింద‌న్న బాధ‌తో విక‌లాంగులు నానా అవ‌స్థా ప‌డుతున్నారు. విక‌లాంగుల‌కు వై ఎస్ రాజ‌ శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో పెన్ష‌న్ మంజూర‌యింది. వారు మొన్న‌టి వ‌ర‌కూ ఆయ‌న పేరు చెప్పుకుని బాగానే గ‌డిపారు. కానీ ఇటీవ‌లే రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విక‌లాంగుల పెన్ష‌న్ చాలామందికి తొల‌ గించారు.  పెన్ష‌న్ తొల‌గించ‌డానికి ప్ర‌భుత్వం చెప్పే జ‌వాబు కంటే పెన్ష‌న్ ఇక రాద‌న్న బాధే విక‌లాంగుల‌ను ఇబ్బం ది పెడుతోంది. తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి ప‌రిధిలోని వెలంపాలెంకు చెందిన  దివ్యాంగుడు వెంకటే శ్వర్లు, ఆయన సోదరుడు నరసింహులు త‌మ బాధ‌ను వెళ్ల‌బుచ్చుకున్నారు. వెంక‌టేశ్వ‌ర్లుకి రెండు కాళ్లూ ప‌నిచేయ‌వు, చేతులు రెండూ వంక‌ర్లు తిరిగాయి. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న వీల్‌ఛైర్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయినా త‌న సోద‌రుని స‌హాయంతో ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేస్తూన్నారు. కానీ ప్ర‌భుత్వాధికారులు ప‌ట్టించుకోలేదు. తండ్రిలానే త‌మ‌ను ఆదుకుంటాడ‌ని జ‌గ‌న్ రెడ్డి ప‌ట్ల వీరాభి మానంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌కు ఎంతో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌వారిలో ఈ సోద‌ రులూ ఉన్నారు. కానీ రాజ‌కీయ ప‌రిస్థితులు మారిపోయాయి.    ప్రస్తుత జగన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో దిక్కు తోచని స్థితి ఏర్పడింది. తనలాంటి వందలాది మందికి పెన్షన్ తొలగించి ఆవేదన మిగిల్చారని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు  ఓటేసి నందుకు తమ చెప్పుతే తామే కొట్టుకున్నారు, ఆ సోద‌రులు.  వీలైతే న్యాయం చేయాలని లేకపోతే ముఖ్య మంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

పాల‌నాసౌల‌భ్యం కోస‌మే రెవెన్యూ ఉద్యోగుల్ని తీసుకునేది.. మంత్రి కొట్టు

దేవాదాయ‌శాఖ‌లో ఉద్యోగుల కొర‌త‌వ‌ల్ల‌నే పాల‌నా సౌల‌భ్యం కోసమే రెవెన్యూ ఉద్యోగుల‌ను దేవా దాయ‌ శాఖలో తీసుకుంటున్నామ‌ని  దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ  స్పష్టం చేశారు.  మాన్యం భూములపై పూర్తి హక్కు దేవదాయ శాఖకే ఉంటుంద‌న్నారు. అయితే వాటి  మీద వచ్చే  ఫల సాయంపై మాత్రమే అర్చకులకు హక్కు ఉంటుందని  మంత్రి  తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదే శాలతో ధార్మిక  పరిషత్ ఏర్పాటైందని, అయితే టీడీపీ హయంలో పరిషత్ ఎందుకు ఏర్పాటు చేయలేదో ఆ  పార్టీ నాయకులే చెప్పాలన్నారు. అవినీతిని అరికట్టడం, ఇతరత్రా నిర్ణయాలు తీసుకోవడంలో ధార్మిక  పరిషత్  కీలక  పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఏర్పాటైన ధార్మిక  పరిషత్‌లో 21 మంది సభ్యులు ఉంటారు. భూములు, దుకాణాల లీజ్‌కు సంబంధించిన వ్యవహారాల్లో అలాగే మఠాధిపతులపై చర్యలు తీసుకునే అధికారం ధార్మిక పరిషత్ ఉంటుంది. హిందు ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి గ్రామంలో ఒక  దేవాలయానికి ధూప  దీప  నైవేద్యా లు  కోసం  నిధి  ఏర్పాటు చేస్తున్నాం.  దేవాదాయ శాఖ పరిధిలో 4 లక్షల  ఎకరాలకు పైగా  భూములు ఉన్నాయని,  కోర్టు వివాదాల్లో ఉన్న ఆల య భూములు, కేసుల పురోగతి తెలుసుకోడానికి త్వరలో తయారు చేయించే వెబ్‌సైట్లో పొందుపరుస్తా మని చెప్పారు.

అమాందా.. ఇదేం పిచ్చి!

అమ్మాయిలంతా ఆర‌డుగుల అంద‌గాడే భ‌ర్త‌గా రావాల‌నుకుంటారు. గ‌తంలో బ‌చ్చ‌న్‌, ఆ త‌ర్వాత నాగ్‌, ఇపుడు ప్ర‌భాస్‌. కానీ అమాండా మాత్రం ఏకంగా స‌ముద్ర‌పు దొంగ‌నే కోరుకుంది. అదీ అత‌ని ఆత్మ‌ని!  అమాండా ఒక దెయ్యాన్ని వివాహం చేసుకోవడానికి గ్రహం మీద ఉన్న ప్రతి మనిషిని విడిచిపెట్టిన సూపర్ ఉమెన్‌. అవును! తనకు సరైన సరిపోలికను కనుగొనడంలో విఫలమైన తర్వాత, ఈమె  తన  ఆత్మ సహ చరుడిని 18వ శతాబ్దపు పైరేట్ దెయ్యంలో కనుగొంది. అమందా ఐదుమంది పిల్లల తల్లి.  కానీ ఈ దెయ్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొంది. ఆమె అతన్ని జాక్  అని పిలుస్తుంది.  అతనిని కాటుక న‌లుపు జ‌త్తుతో భ‌లే ఉంటాడ‌ని వర్ణి స్తుంది. అతను హైతీ సముద్రపు దొంగ అని కూడా ఆమె పేర్కొంది. ఆమె చెప్పిన‌దాని ప్రకారం, 1700లలో జాక్  చేసిన నేరాలకు మరణశిక్ష విధించబడింది,  కానీ  అది అమందా సాధారణ జీవితాన్ని గడపకుండా ఆపలేదు. ఆమె జాక్‌తో డేట్‌లకు వెళుతుంది, ఫైట్ చేస్తుంది  సాధారణ  జంట చేసే  ప్రతిదాన్ని చేస్తుంది. మేము నిజంగా సన్నిహితులమయ్యాం, నేను అతని గురించి ఎంత ఎక్కువ నేర్చుకున్నానో, నేను అతని ని  అంత‌కంటే ఎక్కువగా ఇష్టపడ్డాను. ఒక రోజు అతను నాతో మ‌నం నిజంగా కలిసి ఉండగలం మీకు తెలుసా అన్నాడు,  కానీ ఆత్మ,  మానవుడి మధ్య సన్నిహిత సంబంధం గురించి నేను ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదని  ఆమె చెప్పింది. వారి పెళ్లి రోజున, అమండా జాక్‌కు ప్రాతినిధ్యం వహించడానికి పుర్రె,  క్రాస్‌బోన్స్ జెండాను ఉపయోగిం చింది,  జాక్ 'ఐ డూ' అని చెప్పడానికి  ప్రత్యేక మీడియాను ఉపయోగించింది. సరే, ఇది ఈ శతాబ్దపు పెళ్లి. అయితే, ఎవరైనా మరింత విచిత్రమైన సోల్‌మేట్‌ని కనుగొంటే  తప్ప!

ఆద‌ర్శ రాజ‌నీతిజ్ఞుడు వాజ్‌పేయి

అట‌ల్ బిహారీ వాజ్‌పేయి అన‌గానే ఒక అకుంఠిత దేశ‌భ‌క్తుడు, గొప్ప వ‌క్త అంత‌కుమించి రాజ‌నీతిజ్ఞుడు గుర్తుకువ‌స్తార‌ని దేశంలోని పెద్ద పెద్ద రాజ‌కీయ‌నాయ‌కులంతా అంగీక‌రిస్తారు. ఆయ‌న ప్ర‌సంగిస్తూంటే లోక్‌స‌భ‌లో అంద‌రూ ఎంతో శ్ర‌ద్ధ‌గా విన‌డం గురించే అంద‌రూ చెబుతారు. ఎంతో సీరియ‌స్ విష‌యాన్నే అంతా చ‌క్క‌గా కాస్తంత హాస్యోక్తితో కూడిన గంభీర కంఠ‌స్వ‌రంతో వినిపించ‌డం ఆయ‌నే చెల్లింది. అట‌ల్‌జీ అనే అన్ని ప‌క్షాల‌వారూ అమిత గౌర‌వంగా పిలిచేవారు. దేశ స‌ర్వ‌తోముఖాభివృద్ధిని ఎల్ల‌పుడూ ఆకాంక్షిం చిన మ‌హానేత వాజ్‌పేయి.  భారత మాజీ ప్రధాన మంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 4వర్దంతి సందర్భం గా దేశం మొత్తం ఆయనకీ నివాళి అర్పిస్తోంది.ఆయన దేశానికీ చేసిన సేవలని స్మరిస్తోంది.1924 డిసెంబర్ 25 మద్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన వాజపేయి 2018 ఆగష్టు16 న కన్నుమూసారు. భారతీయ జనతా పార్టీ తర పున ప్రధానమంత్రి పదవి పొందిన నేత. మొదటసారిగా రెండవ లోక్ సభ కి ఎన్నిక అయ్యారు. ౩వ, 9వ లోక్ సభలు తప్పించి 14 వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంట్ కు ప్రాతినిద్యం వహించారు. ఆయన రెండు సార్లు రాజ్యసభ కి కూడా ఎన్నికయ్యారు.1968 నుంచి 1973 వరకు జన సంఘ్ పార్టీ అద్యక్షుడి గా పని చేసారు. 1980నుంచి 1986 వరకు భారతీయ జనతా పార్టీ కి వ్యవస్థాపక అద్యక్షుడిగా సేవలు అందిం చారు. 1996 లో ప్రధాన మంత్రి లబించినా కేవలం 13 రోజులు మాత్రమే చేసారు.1998 లో రెండవ పర్యా యం ప్రధాన మంత్రి పదవి లబించినా 13 మాసాలు పాలించారు.  1999లో13వ లోక్ సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధాన మంత్రి పదవి చేబట్టి 2004 వరకు పదవి లో ఉన్నారు.దేశ రాజధాని ఢిల్లీలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక చిహ్నం ‘సదైవ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ మహా నీయునికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా బీజేపీ సీనియర్ నేతలు ‘సదైవ అటల్’ స్మారక చిహ్నం వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈసందర్భంగా  ప్రధానమంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా కౌల్ భట్టాచార్య ‘సదైవ అటల్’ స్మారకానికి చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అటల్ జీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ పితామహుడు అటల్ బిహారీ వాజ్ పేయి కోట్లా ది మంది కార్యకర్తలకు మార్గదర్శి అని, ఆయన ఎందరో నాయకులకు స్ఫూర్తిదాయకమైని బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2018 ఆగష్టు 16వ తేదీన తుదిశ్వాస విడిచారు.

అదానీ, అంబానీల దృష్టి ఏపీ పైనే.. జగన్

అన‌కాప‌ల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  మంగళవారం పర్యటించారు. ఈ సందర్భం గా ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు. ఎనిమిది పరిశ్రమల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు లక్షకు పైగా చిన్న పారిశ్రామిక సంస్థలున్నాయన్నారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర జీడీపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆదిత్య బిర్లా, శ్రీ సిమెంట్స్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నార న్నా రు. 15 నెలల్లోనే టైర్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైందని అన్నారు.  ప్రభుత్వ సహకారంతో రెండో ఫేజ్‌కు ముందుకొచ్చారని...  2023 ఆగస్ట్ నాటికి రెండో ఫేజ్ పనులు  పూర్తి చేస్తామని తెలిపారు. మూతబడిన ఎంఎస్ఎంఈలకు చేయూతనిస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేర్కొన్నారు.  రూ. 1.54లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 1,00,155 మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌న్నారు. అలాగే, మూతపడ్డ ఎంఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు చేయూతినిస్తున్నామ‌ని జ‌గ‌న్ అన్నారు. ఎంఎస్‌ ఎమ్‌ఈల పున రుద్ధరణకు రూ.1463 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామ‌న్నారు.  రాష్ట్రంలో దాదాపు లక్ష వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని, రాష్ట్రంలో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఆగస్టు 2023 నాటికి రెండో ఫేజ్‌ పనులు పూర్తి చేసే అవకాశం ఉంద‌న్నారు, ఒక ప్రాంత అభివృద్ధికి మెరుగై న ఉపాధి అవకాశాలు కావాలన్నారు.  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటు న్నా మ‌ని,  వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని సీఈవో నితిన్‌ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రపంచంలోనే బెస్ట్‌ ప్లాంట్‌గా యూనిట్‌ను తయా రు చేస్తామని సీఈవో నితిన్‌ అన్నారు. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. 

చంద్ర‌న్న సూచ‌న‌లు.. మేల‌న్నా!

ప‌ద‌విలో ఉన్నా లేకున్నా ప్ర‌జాసంక్షేమాన్ని ఆశించేవాడే నిజ‌మైన నాయకుడు. తెలుగు దేశం  పార్టీ జాతీ య అధినేత, ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి  నారా చంద్ర‌బాబునాయుడు  ఇటీవ‌లి  కాలంలో మ‌రింతగా ఆ సంగ‌తిని ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం జేస్తున్నారు. ప్ర‌జ‌ల సంక్షేమ‌మే త‌మ పార్టీ ల‌క్ష్యంగా నూత‌ నోత్సాహం తో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నారు.  డిజిట‌ల్ యుగంలోనూ అవినీతి ఆమోగ్య‌యోగం కాద‌ని,  దేశం లేదా రాష్ట్రం స‌ర్వ‌తోముఖాభివృద్ధికి అది తీవ్ర ఆటంక‌మ‌ని బాబు అన్నారు. దేశం వ‌చ్చే పాతికేళ్ల‌లో విజ‌న్ 2047 ల‌క్ష్యా ల‌పై ప్ర‌భుత్వం ప‌నిచేయాలని ఆయ‌న కొన్ని సూచ‌న‌లు చేశారు.  విజన్‌-2047కు చంద్రబాబు సూచన‌లేమంటే..  విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించ‌డం.  ఆర్థిక అసమానతల్లేని సమాజాన్ని నిర్మించ‌డం. యువతకు అవకాశాలు కల్పించ‌డం,  దేశంలో సంపద సృష్టి జరగాలి. ఆ సంపదను పేద ప్రజలకు పంచ‌డం. రైతుల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకురావ‌డం, విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ చేయ‌డం,  మహిళా సాధికారతకు ప్రణాళికలు వేయ‌డం, దేశంలో నదుల  అనుసం ధానం చేయాలి.   ఏపీలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేశాం. అవినీతి ర‌హిత‌ పాలన అందించడం, టెక్నా లజీతో అవినీతిని అంతం చేయడం. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ నంబర్‌ 1 కావడానికి  ప్రభుత్వం తో పాటు ప్రజలు ప్రత్యేక ప్రణాళిక, సంకల్పంతో పనిచేసి సుసాధ్యం చేయాలన్నారు.