చైనా నౌకను అనుమతించిన లంక
posted on Aug 16, 2022 @ 1:16PM
చెబితే వినాలి. వినేవాడు మంచివాడు. విని పాటించేవాడు మహామంచివాడు. చెప్పినా విన్నట్టు నటించి తన పనే చేసేవాడు చైనీయుడు. అవును ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా అంతే మూర్ఖంగా వ్యవహరిస్తోంది. ఇపుడు శ్రీలంక అనేకానేక భయాందోళనలతో చైనాకి తలొగ్గి తన మాటే వింటోందేమో అనిపిస్తోంది. కారణం చైనా నౌకను అనుమతించడమే.
చైనా కి తలొగ్గిన శ్రీలంక భారత్, అమెరికా ల మాటలు భేఖాతరు చేసిందనే అనాలి. భద్రతా పరమైన కార ణాల దృష్ట్యా చైనా షిప్ ని అనుమతించ వద్దు అని భారత్ చెప్పినా వినకుండా శ్రీలంక అనుమతి ఇచ్చింది. తమ దేశ భద్రతను ముప్పులో పడేస్తూ చైనా నౌకను శ్రీలంక అనుమతిం చడంపై భారత్ ఇప్పు డు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్థిక సంక్షోభంలో కొట్టి మిట్టాడు తున్న శ్రీలంకకు భారత్ పలు రకాలుగా సహాయాన్ని అందిస్తోంది. దీనిలో భాగంగా సముద్ర భద్రతను పటిష్టం చేసేందుకు ఇటీవల సముద్ర నిఘా విమానాన్ని శ్రీలంకకు బహుమతిగా ఇచ్చింది. భారత్‌లో శిక్షణ పొందిన శ్రీలంక నావికాదళం, వైమానిక దళ సిబ్బంది ఈ విమా నాలను నడుపుతారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇలా ఉండగా.. ఇప్పటికే శ్రీలంక కు భారీ మొత్తంలో రుణాలిచ్చిన చైనా తన మాటవినేలా ఒత్తిడి తీసుకొస్తుంది.
భారత్, అమెరికా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనా నిఘా నౌక తమ దేశంలోని హంబన్ తోటా నౌకా శ్రయంలో తిష్ట వేసేందుకు శ్రీలంక అనుమతి ఇచ్చింది. ఈమేరకు హంబన్ తోటా పోర్టుకు ఆగష్టు 16న చేరుకున్న డ్రాగన్ నౌకకు శ్రీలంక పోర్ట్ అధికారులు, నౌకా కంపెనీకి చెందిన చైనా అధికారులు స్వాగతం పలికారు. తొలుత చైనా నౌక ఈనెల 11వ తేదీనే చేరుకోవల్సి ఉండగా.. భారత్ భద్రతాపరమైన ఆందోళ నల నేపథ్యంలో తదుపరి సంప్రదింపులు జరిగే వరకు వాయిదా వేయాలని శ్రీలంక విదేశాంగ మంత్రి త్వ శాఖ కోరింది. చివరికి డ్రాగన్ కంట్రీ ఒత్తిడికి తలొగ్గిన శ్రీలంక చైనా నౌకకు అనుమతులు ఇచ్చింది.