బోస్ ..ఒక్క సేల్ఫీ !
posted on Aug 16, 2022 @ 1:00PM
ఊహించని సంఘటనలు జీవితంలో ఆశ్చర్యపరుస్తుంటాయి. మనం మర్చిపోయినా ఎవరో ఎక్కడో దూరం నుంచి గుర్తుపట్టి పిలిచి మాట్లాడుతూంటారు. కొందరు ఏకంగా ఫోటో అంటారు, ఒక్కరిద్దరు ఏకంగా సెల్ఫీకి మీదపడినా పడొచ్చు. చిత్రంగా విజయవాడ విమానాశ్రయంలో దీనికి కాస్తంత భిన్నంగా జరిగింది. ఒక పెద్ద అధికారి ఒక కానిస్టేబుల్‌నే సెల్ఫీ కావాలని అడగడం!
విజయవాడ విమానాశ్రయంలో హెడ్ కానిస్టేబుల్ బోస్ డ్యూటీలో ఉన్నారు. అంతలో అక్కడకు వచ్చిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆయనను చూడగానే విష్ చేశారు. ‘బోస్.. ఒక్క సెల్పీ’ అని అడిగారాయన. అంత గొప్ప వ్యక్తి తనతో సెల్ఫీ తీసుకునేందుకు అడగ్గానే బోస్ షాక్ అయ్యారు. సరే సార్ అంటూ నవ్వుతూ ఇద్దరు ఓ సెల్ఫీ తీసుకున్నారు. అలా జేడీ ఓ కానిస్టేబుల్‌తో తీసుకున్నారు.
కానిస్టేబుల్‌కి ఇంత సీనుందా ఎలాబ్బా.. అని అక్కడ చాలామంది ఆశ్చర్యంగా ఇద్దరినీ చూస్తుండి పోయా రు. ఇంతకీ హెడ్ కానిస్టేబుల్ బోస్ చేసిన గొప్ప పనేంటంటే.. గతంలో ఏడు నెలల చిన్నారిని బోస్ దత్తత తీసుకున్నాడట. ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి ప్రస్తుతం డాక్టర్ చదివి స్తున్నాడు. చిన్నారిని దత్తత తీసుకునేందుకు బోస్‌ను డీఐజీ పాల్‌రాజ్ ప్రోత్సాహించారు.
ఇలాంటి వ్యక్తితో ఫొటో దిగడాన్ని గర్వంగా భావిస్తున్నానంటూ ఫొటోతో పాటు క్యాప్షన్ రాసుకొచ్చారు బోస్. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన జేడీ లక్ష్మీనారాయణకు బోస్ ఆదర్శంగా నిలువడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కుమ్మరిస్తున్నా