తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం విద్యుత్ షాక్‌!

వెన‌క‌టికి ఒకాయ‌న టీలు, సిగెరెట్లు బ‌కాయిప‌డ్డాడ‌ని ఆయ‌నకు ఓ దుకాణం వాడు రేప‌ట్నుంచీ మీకేమీ ఇవ్వ‌న‌న్నాడు. ఎందుకురా అని అడిగితే రెండునెల్లుగా ఐదు పైస‌లు ఇవ్వ‌లేద‌న్నాడు. పెద్దాయ‌న‌కు కోపం వ‌చ్చింది. మొన్నామ‌ధ్యనేగా రెండొంద‌లు ఇచ్చాను.. రాయ‌డం రాక ప‌ద్దులో రాయ‌క‌పోతే, నా త‌ప్పే మిటి? అన్నాడాయ‌న‌. కానీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోతే బావ‌యినా, ఏపీ స‌ర్కార్ అయినా ఒక‌టే. అందులోనూ విద్యుత్ బ‌కాయిలు పేర‌బెడితే కేంద్రం మ‌నోడేగా అనుకోదు.  మొండికేస్తే చేసే దేముం టుంది?  పాత క‌రెంటు బకాయిలు క‌ట్ట‌క‌పోతే క‌రెంటు పీకేస్తారుగ‌దా? ఇపుడు దేశంలో ఏకం గా 13 రాష్ట్రా ల ప‌రిస్థితి కొద్దిగా తేడాతో ఇలానే ఉంది.  విద్యుదుత్ప‌త్తి సంస్థ‌ల నుంచి రోజూ కొంటున్న విద్యుత్‌కు బిల్లులు స‌కాలంలో చెల్లించాలి. కానీ  ఏపీ స‌ర్కార్ అలా చేయ‌లేద‌ని చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కేంద్రం నిర్ణ‌యించింది.  చర్యలను ఉపసంహరించే వరకు డిస్కంలు ఇదే పరి స్థితిని ఎదుర్కోనున్నాయి.  కేంద్రం నిషేధం విధించిన వాటిలో మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మణిపుర్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌ గఢ్‌, జమ్మూ-కశ్మీర్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాల డిస్కంలు కూడా ఉన్నాయి. నిషే ధం వల్ల తలెత్తే లోటు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు విధించే అవకాశం ఉంది. తెలంగాణలో వ్యవసాయ బోర్లకు త్రీఫేజ్‌ కరెంటును శుక్రవారం ఉదయం 7.30 నుంచి సాయంత్రం 3 లేదా 4 గంటల వరకు, తిరిగి రాత్రి 10.30 నుంచి తెల్లవారుజామున అయిదున్నర వరకు ఇచ్చేందుకు డిస్కంలు ఏర్పా ట్లు చేస్తున్నాయి. కాగా, వివిధ రాష్ట్రాల డిస్కంల‌కు స‌ర‌ఫ‌రా చేసిన విద్యుత్‌, చెల్లించాల్సిన బిల్లు మొత్తాల‌ను విద్యు దుత్ప త్తి  సంస్థ‌లు ఎప్ప‌టికప్పుడు అప్‌లోడ్ చేసేందుకు వీలుగా పోర్ట‌ల్ ఏర్పాటు చేశారు.  జులై, ఆగస్టు నెలల్లో డిస్కంలు తీసు కున్న విద్యుత్‌ బిల్లులను ఇంధన ఉత్పత్తి సంస్థలు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాయి. అప్ లోడ్‌ చేసిన తేదీనే ప్రామాణికంగా తీసుకుని బకాయిలున్నాయంటూ కేంద్రం చర్యలు తీసుకుంది.  వాస్తవానికి బిల్లు ఇచ్చిన తర్వాత 45 రోజుల వరకు చెల్లింపు వ్యవధి ఉంటుంది. ఈలోగా సరఫరా చేసిన విద్యుత్‌ ఎంత? బిల్లులో పేర్కొన్న విధంగా యూనిట్‌ ధరలు ఉన్నాయా? ఇలాంటి అంశాలను పరిశీలిం చిన తర్వాతే ఉత్పత్తి సంస్థలకు బిల్లులను చెల్లిస్తుంటామని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఈ విషయా న్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి.  దీన్ని పరిశీలించి నిషేధిత జాబితా నుంచి శుక్రవారంలోగా ఏపీ డిస్కం లను తొలగించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.  డిస్కంలు చేసిన చెల్లింపుల సమాచారం యాప్‌లో అప్‌డేట్‌ కాలేదు. దీంతో బకాయిలు కనిపిస్తున్నాయి. ఇలా నెల రోజుల వ్యవధిలో దేశంలోని వివిధ డిస్కంలు సుమారు రూ.5 వేల కోట్ల బకాయిలున్నట్లు యాప్‌ చూపుతోంద‌ని అధికారులు పేర్కొన్నారు.  అవసరాల మేరకు శుక్రవారం రియల్‌టైం మార్కెట్‌లో విద్యుత్ ను కొనుగోలు చేస్తామని ఏపీ ఇంధన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పీక్‌ డిమాండ్‌ సమయంలో రోజు కు 10-15 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం అవుతుందన్నారు. విద్యుత్‌ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్‌ ద్వారా విద్యుత్‌ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. తెలంగాణలో గురు వారం గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 12,114 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది ఇదే రోజు (2021 ఆగస్టు 18)న 8500 మెగావాట్లు మాత్రమే డిమాండు ఉంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పెద్దగా లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, ఇళ్లకు, వ్యవసాయానికి వినియోగం పెరగడంతో డిమాండు ఎక్కు వైంది. ప్రస్తుతం కృష్ణానదిలో భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు తక్కువగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం గరిష్ఠ డిమాండు సమయంలో డిస్కంలు 2 వేల మెగావాట్ల దాకా ఎక్స్ఛేంజీలో కొంటున్నాయి. శుక్రవారం నుంచి నిషేధం విధించినందున ఈ మేర వ్యవసాయానికి త్రీఫేజ్‌ సరఫరా తగ్గించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. సమ స్య పరిష్కారమైతే ఎలాంటి కోతలు ఉండవని అధికారులు చెబుతున్నారు.  కేంద్ర ఇంధన శాఖ 2022 జూన్‌ నుంచి చెల్లింపుల్లో జాప్యం సర్‌ఛార్జి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యుదుత్పత్తి సంస్థలకు బిల్లులను నిర్దేశిత వ్యవధిలో చెల్లించాలి. తెలంగాణ రూ.1,600 కోట్లు, ఏపీ రూ.350 కోట్లు బకాయిలున్నాయంటూ.. విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో లావాదేవీలపై కేంద్రం నిషేధం విధించింది

ప్రజారోగ్యంపై మామా అల్లుళ్ల దృష్టి! మంగళగిరి, హిందూపురంలో ఆరోగ్య రథాలు

ఒక వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల కోసం పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేస్తూ రాకెట్ వేగంతో దూసుకు పోతుంటే.. మరో వైపు పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రి స్పీడును అందుకుంటూ.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పరుగులు తీస్తున్నారు. ఆయనకు పార్టీ బలోపేతంతో పాటు మంగళగిరిలో తన విజయానికి బాటలు వేసుకోవడమన్న అదనపు బాధ్యత కూడా ఉంది. ఎక్కడైతే పరాజయం ఎదురైందో అక్కడే తన విజయాన్ని ఘనంగా చాటాలన్న పట్టుదలతో లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే  మంగళగిరిలో అన్నా క్యాంటిన్లు ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికీ శుభమస్తు  అనే నినాదంతో సంజీవనీ ఆరోగ్య రథాన్ని   ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లకు ప్రజల నుంచి వచ్చిన స్పందనకు ఏ మాత్రం తీసిపోని విధంగా  ఆరోగ్య రథానికి సైతం ప్రజాస్పందన వెల్లువెత్తుతుండటంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తున్నాయి.  ఆరోగ్య రథానికి వచ్చిన స్పందన ఏ స్థాయిలో ఉందంటే.. లోకేష్ స్ఫూర్తితో హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆరోగ్య రథాన్ని తన నియోజకవర్గంలో ప్రారంభించారు. త్వరలో హిందూపురం నియోజకవర్గంలో మరిన్ని ఆరోగ్య రథాలను తీసుకురావాలని బాలకృష్ణ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య రథాన్ని తన నియోజకవర్గంలో కూడా ప్రారింభించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్ణయించారట. ఆ క్రమంలో ఇప్పటికే ఒక ఆరోగ్య రథం.. హిందూపురం చేరుకుని.. ప్రజలకు సేవలందిస్తోందని తెలుస్తోంది. మరి కొన్ని వాహనాలు.. మరి కొద్ది రోజుల్లో హిందూపురం చేరుకుంటాయని తెలుస్తోంది. ముచ్చటగా మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు కోసం బాలయ్య  ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ క్రమంలో మరిన్ని పథకాలు తీసుకు వచ్చేందుకు ఈ మామా అల్లుళ్లు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకర్గానికి  మొత్తం మీద మూడు లేదా నాలుగు ఆరోగ్య రథాలను కేటాయించాలని వీరు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తన అల్లుడు, తెలుగుదేశం జాతీయ కార్యదర్వి నారా లోకేష్ ప్రజా సేవా దృక్ఫథం తనను ముగ్ధుడ్ని చేసిందని బాలయ్య అంటున్నారు. హిందూపురంలో తాను ప్రారంభించిన ఆరోగ్య రథం ప్రతీ రోజు ఓ గ్రామానికి వెళ్తి.. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి.. మందులిస్తారు. అయితే ఆరోగ్య పరంగా పెద్ద సమస్య ఉంటే.. పెద్ద ఆసుపత్రులకు వెళ్లాలంటూ వారిని రిఫర్ చేసి.. తక్కువ ఖర్చుతో అక్కడ వైద్యం అందేలా చర్యలు సైతం తీసుకొంటారు. పల్లెటూళ్లులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగ్గా పని చేయడం లేదు. దీంతో టీడీపీ తీసుకు వచ్చిన ఆరోగ్య రథాలకు ప్రజల్లో భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రజల ఆకలిని తీర్చడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు  మామా అల్లుళ్లు నడుం కట్టారు.    గత ప్రభుత్వ హాయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సేవలు అందేవనీ, కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వ వైద్యం సరిగా అందడం లేదనీ ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బాలయ్య,   లోకేశ్ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి ఆరోగ్య రథాలను జనంలోకి పంపించడం పట్ల జనంలో హర్షం వ్యక్తం అవుతోంది.   మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో తాను మంగళగిరి నుంచి బరిలో దిగనున్నట్లు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు.  అలాగే హిందూపురం నుంచే బాలయ్య మరోమారు బరిలో దిగనున్నారు. దీంతో మామా అల్లుళ్లిద్దరూ తమ తమ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూనే.. ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేసే బృహత్తర బాధ్యతను తలకెత్తుకున్నారు.     

ఆ  ఆస్తుల పంప‌కానికి చ‌ట్ట‌మా?.. ఆగ్ర‌హించిన ఏపీ హైకోర్టు

స్కూల్లో ఇద్ద‌రు స్నేహితులు వాదించుకుంటున్నారు.. నోట్‌బుక్ గురించి. ఒక‌రి నోట్‌బుక్  ఈ  ఇద్ద‌రు కాకుండా వేరే విద్యార్ధి ద‌గ్గ‌రికి వెళ్లింది. తానివ్వ‌కుండా నా నోట్సు వాడి ద‌గ్గ‌రికి ఎలా వెళ్లింద‌ని మొద‌టి వాడు ప్ర‌శ్నించాడు. నేనే ఇచ్చాన‌న్నాడు రెండో వాడు. నా వస్తువును న‌న్ను అడ‌క్కుండా, ప‌ర్మిష‌న్ తీసుకోకుండా ఎలా ఇచ్చావ‌ని నిల‌దీశాడు. పెద్ద గొడ‌వే అయింది. కొంత‌సేప‌టికి ఎలాగో శాంతించారు. ఇందుకు భిన్నంగా లేదు.. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ ప‌ని. సింహాచ‌లం వ‌రాహ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి దేవ స్థానానికి చెందిన పంచ‌గ్రామాల భూము ల్ని ఆక్ర‌మ‌ణ‌దారుల పేరు మీద  క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. అందుకు ఏకంగా చ‌ట్టం కూడా తెచ్చింది. హై కోర్టు ఆగ్ర‌హించింది. మీది కాని ఆస్తిని వేరొక‌రికి పంచేందుకు చ‌ట్టం ఎలా చేస్తార‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది.  ఇలాంటి చ‌ర్య‌ల్ని అనుమ‌తిస్తే, పేద‌ల‌కు పంచుతున్నామ‌నే పేరుతో ప్రైవేటు వ్య‌క్తుల భూముల్ని సైతం స్వాధీనం చేసుకొని ప‌రిహారం చెల్లించామ‌ని చెప్పే ప్ర‌మాధం ఉంద‌ని హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌ మూర్తి జ‌స్టి స్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, జ‌స్టిన్ డీవీఎస్ సోమ‌యాజులుతో కూడిన ధ‌ర్మాస‌నం గురువారం వ్యాఖ్యానించింది. వ్యాజ్యాల‌పై తుది వాద‌న‌లు వినిపించేందుకుసిద్ధ‌మై రావాల‌ని ఇరుప‌క్షాల న్యాయ‌ వాదుల‌కు స్ప‌ష్టం చేసింది. విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.  పంచగ్రామాల భూములను ఆక్రమణదారుల పేరిట క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన చ‌ట్టాన్ని విజయవాడకు చెందిన రామనాథం రామచంద్రరావు హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆక్రమణల క్రమబద్ధీకరణకు రుసుమును ఖరా రు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 229ని చట్ట విరు ద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.  విచారణ జరి పిన హైకోర్టు భూముల క్రమబద్ధీకరణపై యథాతథ స్థితి పాటించాలని 2019 ఏప్రిల్‌ 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపించారు. దేవాల యాల భూములను విక్రయించడానికీ, క్రమబద్ధీకరించ డానికీ వీల్లేదని హైకోర్టు 2005 లో తీర్పు ఇచ్చిం ది.  ఆ  ఆదేశాలను అధిగమించేందుకు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దేవ స్థానం కోల్పోయే భూము లకు తగినంత పరిహారం లభించడం లేదు. చట్టాన్ని రద్దు చేయమ‌ని కోరారు.  దీనిపై ఏజీ స్పందిస్తూ... గత 30 ఏళ్లుగా ఆ భూములు ఆక్రమణలో ఉన్నాయని, ఆక్రమణదారులు నివా సాలు ఏర్పాటు చేసుకున్నారని, ఆ భూముల నుంచి దేవస్థానానికి ఎలాంటి ఆదాయమూ లేదని తెలి పారు.  భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని, తద్వారా వచ్చే సొమ్మును దేవస్థానానికి జమ చేస్తామని వివరించారు. దేవస్థానం కోల్పోతున్న భూమికి ప్రత్యా మ్నా యం మరోచోట భూమిని ఇస్తామన్నారు. సింహాచలం దేవస్థానం ఈవో తరఫు న్యాయవాది కె.మాధవరెడ్డి వాదనలు వినిపిస్తూ... ఆక్రమణదారులను భూముల నుంచి ఖాళీ చేయించే పరిస్థితి లేదన్నారు. ప్రభు త్వ నిర్ణయంతో దేవస్థానానికి ఆదాయం వస్తుందని చెప్పారు. భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభు త్వం తీసుకొచ్చిన పథకాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.  ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. క్రమబద్ధీకరణ పేరుతో దేవస్థానానికి చెందిన విలువైన భూము లను వేరేవారికి కట్టబెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రత్యామ్నాయంగా తక్కువ విలువ ఉన్న భూములను దేవస్థానానికి అప్పగించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, దేవ స్థానం.. ఇరుపక్షాలు కమ్మక్కు అయ్యారా? అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. వాజ్యం పై తుదివిచారణ జరుపుతామంటూ విచారణను వాయిదా వేసింది.

పరుగులు తీయాలి ఓ నేతలూ ఉరకలు వేయాలి.. చంద్రబాబు దిశా నిర్దేశం

వచ్చే ఏన్నికలలో  టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న తన   శపథాన్ని నెరవేర్చుకునేందుకు సమరసన్నాహాలు చేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాల పేరుతో ఒక్కో జిల్లాలో మూడేసి రోజులు పర్యటించిన చంద్రబాబు నాయుడు తాజాగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ ఇన్ చార్జిలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇలా రోజుకు ఐదు నియోజకవర్గాల వంతున సమీక్షించి, నేతలను ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. పార్టీ ఇన్ చార్జిలతో వేర్వేరుగా చిట్ చాట్ లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీల బలా బలాలు, రాజకీయ పరిణామాల గురించి వివరంగా తెలుసుకుంటున్నారు. తాజాగా చేయించిన సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని మరీ చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు ఇస్తుండడం విశేషం. మరో పక్కన 2014 ఎన్నికల తర్వాత బీజేపీకి దూరం అయిన చంద్రబాబు ఈ మధ్య కాలంలో మళ్లీ ఆ పార్టీ ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం విశేషం. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తనను అవమానించిన వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు వచ్చే ఎన్నిక తల బొప్పి కట్టించి, బొమ్మ కనిపించేలా చేసేందుకు అవసరమైన అన్ని వ్యూహాలకు చంద్రబాబు పదును పెడుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు లేదా పొత్తు కుదుర్చుకునే వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఆయన మొన్నటికి మొన్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘పై ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని నిమిషాల పాటు చంద్రబాబుతో చేయి కలిపి మరీ ప్రధాని మోడీ ప్రత్యేకంగా చర్చించడం అందరినీ ఆకర్షించింది. త్వరలోనే మరోసారి చంద్రబాబు ఢిల్లీ టూర్ కు వెళ్లనున్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తుండడం గమనార్హం. నిజానికి ఏపీలో టీడీపీ తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేందుకు చంద్రబాబు సర్వేలు చేయిస్తుంటారు. దాంతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బృందం కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు సొంత టీమ్ తో సర్వేలు చేయిస్తూ ఉంటారు. దీంతో పాటు ఈసారి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీంతో కూడా ఆయన సర్వే చేయించారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అలాగే లోకేష్ టీం మరో సర్వే చేయించిందంటున్నారు. ఈ మూడు సర్వేల్లో కూడా 40 నియోజకవర్గాల్లో టీడీపీ- వైసీపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొన్నట్లు నివేదికలు వచ్చాయంటున్నారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న చంద్రబాబు తన శపథం నెరవేర్చుకునేందుకు ఇప్పుడు అలాంటి నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించారని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మే 29, 29 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో నిర్వహించిన టీడీపీ మహానాడు ఊహలకు మించి  సక్సెస్ అయింది. దీంతో టీడీపీ నేతలు, శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అదే స్ఫూర్తితో ఏపీ వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు, మినీ మహానాడు కార్యక్రమాలు కూడా విజయవంతం అయ్యాయి. అప్పటి నుంచి టీడీపీ నేతలు, శ్రేణుల్లో కూడా హుషారు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తమ అధినేత నిర్దేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ వైఫల్యాలు, అవినీతి, అసమర్థ పాలనపై విరుచుకుపడుతూనే ఉన్నారు. టీడీపీ అభ్యర్థుల విషయంలో దూకుడు ప్రదర్శించాలని, ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలనే యోచన కూడా చంద్రబాబు చేస్తున్నారని అంటున్నారు. దాంతో పాటు లోకేష్ కూడా దూకుడు పెంచారనీ, సీఎం జగన్ రెడ్డి రహస్యాలను బహిర్గతం చేసేందుకు రెడీ అయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో జగన్ కు సంబంధించిన అతిపెద్ద కుంభకోణం బయట పెడతానంటూ లోకేష్ ఇటీవల ప్రకటించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు ఒక పక్కన, నారా లోకేష్ మరో పక్కన టీడీపీని బలోపేతం చేస్తూనే.. అధికార వైసీపీ విధానాలపైన నిరంతరం పోరాటం చేయాలని పథకం రూపొందించారట. తద్వారా వచ్చే ఎన్నికలను తమకు సానుకూలం చేసుకుకేందుకు పక్కా ప్రణాళికతో వేగంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.

ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం

ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్యలు విఫలమయ్యాయి. ఉపాథ్యాయుల హాజరు కోసం ప్రభుత్వం తప్పని సరి చేసిన ఫేస్ రికగ్నేషన్ యాప్ పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. ఆ యాప్ డౌన్ లోడ్ చేయడం, దాంట్లో లగిన్ అవ్వడం తప్పని సరి చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి రోజూ తమ అటెండెన్స్ కు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లో ఫొటోలు అప్ లోడ్ చేయాలన్న ప్రభుత్వ నిబంధనను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యానారాయణ తో ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రితో వారు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం బొత్స మాట్లాడుతూ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విషయంలో ఉపాధ్యాయులలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నారు. ఓ 15 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించిన తరువాతే దీనిని అమలులోనికి తీసుకువస్తామన్నారు. ఈ నెలాఖరులోగానే టీచర్లకు శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే లక్ష మంది ఉపాధ్యాయులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారనీ, శిక్షణ కోసం తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారనీ వివరించారు.  ఈ విషయంలో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్లోందనీ, ఉపాధ్యాయులు సహకరించాలని మంత్రి బొత్స కోరారు. రానున్న రోజులలో అన్ని శాఖలలోనూ  ఇదే విధానం అమలు అవుతుందని అన్నారు.  కాగా దీనిపై ఉపాధ్యాయులు మాత్రం  సొంత ఫోన్లలో ఫేస్ రికాగ్నిషన్ యాప్ కు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. సొంత ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు. పాఠశాలలోనే మౌఖిక హాజరు పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే మొబైల్ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.

మంజూ.. ఆత్మ‌విశ్వాసానికి మ‌రో పేరు!

చేతిలో విద్య అంటూ ఉండాలేగాని ఎక్క‌డ‌న్నా బ‌తికేయొచ్చు అనేది పాత‌కాలంవారి మాట‌. పాత ఎప్పు డూ బంగార‌మే. బంగారం ఎప్పుడూ బంగార‌మే. బ్రిట‌న్ బ్రైట‌న్ న‌గ‌రంలో 85 ఏళ్ల మంజులా ప‌టేల్ హోట‌ల్లో టిఫిన్ చేయ‌కుండా అక్క‌డి వారికి ఒక్క‌రోజూ స‌రిగా గ‌డ‌వ‌డంలేదంటారు. అదుగో అంత‌టి ఇష్టం ఆ టిఫిన్లు, ఆమె ఆతిథ్యం అంటే. అక్క‌డి సంప్ర‌దాయ ఆహార‌ప‌దార్ధాలేకాకుండా, భార‌త్ ఉత్త‌రాది వంట‌కాల‌తోనూ ఆమె అక్క‌డివారి మ‌న‌సు గెలిచింది. ఆమెకు అంద‌రి రుచుల‌కు త‌గ్గ‌ట్టు చేసిపెట్ట‌డంతో పాటు అంద‌ర్నీ త‌న పిల్లల్లానే చూస్తూ, ప‌ల‌క‌రించ‌డం మ‌హా స‌ర‌దా. ఆమె ఈ ఆతిథ్య‌పు ప్ర‌త్యేక‌తే ఇంగ్లీషు వారిని అమాంతం ఆక‌ట్టుకుంది.  వాస్త‌వానికి ఆమె ఉగాండా కంపాలా న‌గ‌రం నుంచి బ్రైట‌న్‌కు వ‌చ్చిందేగాని మొద‌టి నుంచి ఇక్క‌డ స్థిర ప‌డిన భార‌తీయ సంత‌తికి చెందిన‌ది కాదు. ఆమెది కావ‌డానికి గుజ‌రాత్‌. కానీ బాల్యంలోనే  ఉగాండా వెళిపోయారు. ఆమె 13 ఏళ్ల వ‌య‌సులోనే తండ్రి చ‌నిపోవ‌డంతో ఇంటి బాధ్య‌త‌ను భ‌రించాల్సి వ‌చ్చిం ది. ఆ చిరుప్రాయంలో తానేమీ ఉద్యోగం చేయ‌లేక త‌న నాన‌మ్మ నుంచి అనేక ర‌కాల వంట‌కాల గురించి తెలుసుకుంది. వారు వంట చేస్తున్న‌పుడు ఎలా చేస్తారు, ఎన్ని ర‌కాలుగా వంట చేయ‌వ‌చ్చు అనేవి ఎంతో నేర్చుకుంది. అంతే తానూ అనేక ర‌కాల టిఫిన్స్ త‌యారు చేయ‌డంలో నిపుణురాల‌యి స్కూలు కు వెళ్లే పిల్ల‌ల‌కు బాక్స్‌లు స‌ర్ది పెట్టేది. అనేక కార్యాల‌యాల్లో ప‌నిచేవారికి త‌న చేతిరుచి చూపింది.  ఆమె వంట‌కా ల‌కు అంతా ఫిదా అయ్యారు. క్ర‌మేపీ ఆమె ఉగాండాలో మంచి రెస్టారెంట్ ఆరంభించారు. కానీ అన్నీ ఎల్ల‌కాలం మ‌నం అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌వు గ‌దా. ఉగాండాకి ఈదీ అమీన్ అనే రాక్ష‌సుడు పాల కుడు అయిన త‌ర్వాత అక్క‌డి ప‌రిస్థితులు మొత్తం దెబ్బ‌తిన్నాయి. దేశంలో ఆసియావాసులు ఆర్ధిక దోపి డీకి పాల్ప‌డు తున్నార‌ని అమీన్ ఆగ్ర‌హించాడు. త‌క్ష‌ణం దేశం విడిచి వెళ్లాల‌ని ఆదేశించాడ‌ట‌. అంతే మంజు లాంటి వారు అనేక‌మంది ఉగాండా విడిచిపెట్ట‌వ‌ల‌సి వ‌చ్చింది. అలా మంజు 1972 లో బ్రిట‌న్ చేరుకుంది. రాగానే చిన్న ఉద్యోగం కోసం విశ్వ‌య‌త్నం చేసింది.  కానీ ఎక్క‌డా ఉద్యోగం రాలేదు. కానీ ఆమె నిరాశ‌ప‌డ‌లేదు. ఆమె త‌న‌కు తెలిసిన విద్య‌నే జీవ‌నోపాధి మార్గంగా చేసుకుంది. అక్క‌డ ప‌రిచ‌య‌స్తుల‌తో క‌లిసి రెస్టారెంట్ ఆరంభించింది. అది  దిన‌దిన‌ప్ర‌వ‌ర్ధ‌మాన‌మై యావ‌త్ బ్రైటెన్ ప్ర‌జ‌లు రెస్టారెంట్‌కి క్యూక‌ట్టేలా చేయ‌గ‌లిగింది. ఇపుడు ఆమె కుమారుడు జేమిన్‌ ప‌టేల్ చూస్తున్నాడు. ఇటీవ‌లే మంజు 80వ పుట్టిన‌రోజును రెస్టారెంట్‌లోనే వీరాభిమానుల మ‌ధ్య బ్ర‌హ్మాండంగా జరిపాడు ప‌టేల్‌. 

పరోపకారి ఏనుగు

ఆకారం భీకరమే అయనా ఏనుగులకు మానవులలో ఉండే అన్ని స్పందనలూ ఉంటాయి. మమకారం, ప్రేమ, పరోపకార బుద్ధి, ఆత్మీయత, అనురాగం, ఆగ్రహం, క్రోధం ఇలాంటి స్పందలన్నీ ఏనుగులలోనూ మానవులతో సమానంగా ఉన్నాయనీ, ఉంటాయనీ చెబుతుంటారు. అందుకే ఏనుగులు మనుషులకు మచ్చిక అవుతాయి. వారి పట్ల మమకారాన్నీ పెంచుకుంటాయి. కాగా ఓ ఏనుగు చిన్నారి పట్ల స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. చైనాలోని ఓ జూలో ఓ ఏనుగు తన పరోపకార బుద్ధిని చూపింది. ఓ చిన్నారికి తన తొండంతో సహాయం అందించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నది. ఆధునిక కాలంలో మానవులలో కరవైపోతున్న సహాయం చేసే గుణం ఆ ఏనుగులో మాత్రం పుష్కలంగా ఉందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చైనాలోని ఓ జూకు వెళ్లిన ఫ్యామిలీలో రెండేళ్ల చిన్నారి తన బూటును పొరపాటున ఎనుగుల ఎన్ క్లోజర్ లో పడేసుకుంది. కాలి నుంచి జారి బూటు ఎన్ క్లోజర్ లో పడిపోవడంతో ఆ చిన్నారి బిక్కముఖం వేసింది. అయితే ఆశ్చర్య కరంగా ఓ ఎనుగు తన తొండంతో ఆ షూను తీసి పాపకు అందించింది. దాంతో ఆ చిన్నారి ముఖం వెలిగిపోయింది. ఈ మొత్తం సంఘటనను పక్కనున్న వారు తమ సెల్ ఫోన్ లో షూట్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఏనుగు పరోపకార బుద్ధిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ ఏనుగును చూసి మనుషులు బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు. మనుషులలో సున్నతత్వం, మానవత్వం కనుమరుగైపోతుంటే.. ఈ ఏనుగు మాత్రం మాలో అవి పుష్కలంగా ఉన్నాయని చాటిందనంటూ కామెంట్లు పెడుతున్నారు.  

ఆరంభం ఆర్భాటం.. అంతలోనే మంగళం.. జగన్ స్టైల్

ఆర్భాటంగా ఆరంభించడం... ఆ తరువాత మధ్యలోనే వదిలేయడం ఏపీ సీఎం జగన్ కు బాగా అలవాటైన విద్య. సంక్షేమ పథకాల విషయంలోనైనా, పార్టీ కార్యక్రమాల విషయంలోనైనా ఆఖరికి నియోజకవర్గ సమీక్షల విషయంలోనైనా సరే అదే పంథా. ఎలాంటి మినహాయింపులూ ఉండవు. గడపగడపకూ అంటూ ఆర్భాంగా ప్రారంభించిన కార్యక్రమం ఇప్పుడు అతీగతీ లేకుండా పోయినా దానికి సీఎం జగన్ ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. అసలు చాలా మంది ఈ కార్యక్రమం కోసం తమ ఇంటి గడప కూడా దాటలేదన్న ఆరోపణలు ఉన్నా పట్టించుకోవడం లేదు. మొదట్లో మాత్రం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాలు పంచుకోవడం లేదంటూ ఎమ్మెల్యేలపై చర్రుబుర్రులాడిన జగన్ ఆ తరువాత తత్వం బోధపడి మౌనం వహించారు. మంత్రుల సామాజిక న్యాయభేరి యాత్ర వైఫల్యంపై కూడా జగన్ అంతే నాన్ సీరియస్ గా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ లాభం లేదు అంటూ తానే స్వయంగా నడుంబిగించి ప్రారంభించిన  నియోజకవర్గాల సమీక్షల వ్యవహారం కూడా అంతే ఆర్భాటంగా ప్రారంభించి ఓ రెండు నియోజకవర్గాల సమీక్ష నిర్వహించేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ నియోజకవర్గాల సమీక్షలలో తన పాలన గురించి పొగడ్తలు లేకపోవడం.. కార్యకర్తల నుంచి కూడా సమస్యల పరిష్కారం కోసం వినతులు వెల్లువెత్తడంతో ఆయన ఇక ఆ కార్యక్రమానికీ మంగళం పాడేశారు. స్వోత్కర్ష, పర నింద ఆయన స్టైల్. అలాగే తన వద్దకు వచ్చే వారు కూడా విపక్షాలపై విమర్శలు గుప్పించి, తననూ తన పాలననూ పొగడ్తలతో ముంచెత్తితే ఆయన అంగీకరిస్తారు. అందుకు భిన్నంగా సమస్యల ప్రస్తావన తీసుకు వస్తే మాత్రం వారిని దూరం పెడతారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. బాలినేని వంటి వారు పార్టీ విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరించడానికి కారణం వారు సమస్యలను ప్రస్తావించి అధినేత ఆగ్రహానికి గురి కావడమేనంటున్నారు. ఇక జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రులకు ఉక్కపోతకు కారణం కూడా అదేనంటున్నారు. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు తన రాజకీయ అనుభవంతో క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేందుకు చేసే ప్రయత్నాలు అధినేతకు రుచించడం లేదని గ్రహించి సైలెంట్ అయిపోయారు. ఇక ఎమ్మెల్యేల పరిస్థితీ అంతే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లు పైబడిన కాలంలో కనీసం ఒక్కసారి కూడా సీఎంను కలవని ఎమ్మెల్యేల సంఖ్య అధికంగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక కార్యకర్తల సంగతి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ. నియోజకవర్గ సమీక్షల పేర కార్యకర్తలతో జగన్ భేటీ అవుతారని వారంతా ఎంతో సంతోషించారు. కానీ కుప్పం, రాజాం నియోజకవర్గాల సమీక్షతోనే ఆ కార్యక్రమానికి జగన్ మంగళం పాడేయడంతో కార్యకర్తలు ఉసూరు మన్నారు. క్షేత్ర స్థాయిలో నేతలను ప్రజలు నిలదీస్తున్న సమస్యల విషయం సమీక్షల్లో కార్యకర్తలు ఎక్కడ ప్రస్తావిస్తారో.. వారు ప్రస్తావించిన అంశాలే ఎక్కడ హై లైట్ అవుతాయోనన్న జంకే జగన్ సమీక్షలకు మంగళం పాడేయడానికి కారణంగా పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. జగన్ వచ్చే ఎన్నికలలో 175 అవుటాఫ్ 175 విన్ గ్యారంటీ అని చెబుతుంటే.. సమీక్షలకు హాజరైన వారు మాత్రం గుంతల రోడ్లు, పథకాల్లో కోత, లబ్డిదారులు సైతం వ్యక్తం చేస్తున్న ఆగ్రహం ఇవే ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమీక్షలు కూడా లేకుండా తమ అధినేత సైలంట్ గా ఉండటం పట్ల కార్యకర్తలలో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. సమస్యలను అడ్రస్ చేయకుండా ఎన్నికలలో ప్రజలను ఓట్లడిగేందుకు ఎలా వెళ్లగలమని వారు స్థానిక నేతలను నిలదీస్తున్నారు. స్ధానిక నేతలూ ఏం చేయలేని పరిస్థితి. 

బీజేపీవారి న‌మ్మ‌కంలో న‌మ్మ‌కం ఎంత‌?

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అన్ని ప్రాంతాల్లోకి విస్త‌రించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతోంద న్న భావ‌న బాగా ప్రచారం చేస్తోంది. వ్యూహ‌క‌ర్త‌లు, ప్ర‌చార‌క‌ర్త‌లు చురుగ్గా ఉన్న పార్టీగా బీజేపీ ప్ర‌సిద్ధి. కేంద్రంలో ఏ నిర్ణ‌యం తీసుకున్నా, పార్టీ ప‌రంగా, ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా వెంట నే దాన్ని భారీ ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టి, అనుకున్న‌ది సాధించ‌డం, రాష్ట్రాల్లో తాము అనుకున్న విధంగానే అమ‌లు జ‌రిగేట్టు చూడ‌టం, హెచ్చ‌రించ‌డం వంటివి బీజేపీవారికే చెల్లుతోంది.  త‌మ అభిప్రాయాల‌ను, నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల మీద, విప‌క్షాల మీద రుద్ద‌డానికి ఏమాత్రం సందేహించ‌ని బీజేపీ త‌మ‌కు ప్ర‌జ‌ల్లో అపార న‌మ్మ‌కం, గౌర‌వం ఉంద‌నే ప్ర‌చారం చేయించుకోవ‌డం ప‌రిపాటిగా మారిం ది. బీజేపీ చేప‌డుతున్న అన్ని ప‌థ‌కాలు, వాటి అమ‌లు, ప్ర‌జాసంక్షేమ విధానాలు గురించి ప్ర‌జ‌లు ఎంతో ఆక‌ర్షితుల‌య్యార‌ని, ప్ర‌జ‌ల‌కు త‌మ నాయ‌క‌త్వం మీద తిరుగులేని న‌మ్మ‌కం కుదిరింద‌ని, ఇక ఎల్ల‌కాలం అధికారంలోనే ఉంటామ‌న్న ధీమాతో క‌మ‌ల‌నాథులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీజేపీ ప‌ట్ల దేశ‌మంత‌టా గొప్ప విశ్వాసం, న‌మ్మ‌క‌మే పెల్లుబుకుతోంద‌ని ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  పార్టీకి శాయ‌శ‌క్తులా కృషి చేయాల‌ని, పార్టీని న‌మ్ముకుంటే ఎంతో అభివృద్ధి సుసాధ్య‌మ‌ని బీజేపీ కార్య‌కర్త లకు కేంద్ర మంత్రి బోధ చేశారు. కాల‌క్ర‌మంలో దేశ ప్ర‌జ‌ల్లో పార్టీ ప‌ట్ల ఆస‌క్తి పెరుగుతోందే గాని త‌గ్గ‌డం లే ద‌ని ఆయ‌న అన్నారు. 2014కి ముందు, ఆ త‌ర్వాత కాలాల‌ను ప‌రిశీలిస్తే దేశంలో బీజేపీ ప‌ట్ల ఆక‌ర్ష‌ణ స్ప‌ష్టమ‌వుతోంద‌ని, దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్య‌మ‌న్న ఆలోచ‌న విస్త‌రించింద‌ని అన్నారు. అయితే విప క్షాలు మాత్రం బీజేపీ త‌మ పార్టీ భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల‌మీద బ‌ల‌వంతంగా రుద్ది మ‌రీ త‌మ‌వేపు తిప్పు కోవ డం గ‌మ‌నిస్తున్నామ‌నే ఆరోపిస్తున్నాయి.  ఇత‌ర‌పార్టీల వ‌లె కేవ‌లం అధికార పీఠం కోసం బీజేపీ ఎన్నిక‌ల్లో పోటీప‌డ‌ద‌ని బీజేపీ సీనియ‌ర్ల మాట‌. అధి కార కాంక్ష లేన‌పుడు బీజేపీయేత‌ర రాష్ట్రాల్లో రాజ‌కీయాల్లోకి త‌ల‌దూర్చి గంద‌ర‌గోళ ప‌రిస్థితులు క‌ల్పిం చి ఆధిప‌త్యం చెలాయించ‌డానికి పూనుకోవ‌డం మ‌రి బీజేపీ వ‌ర్గాల రాజ‌కీయ‌కాంక్ష‌తో కూడిన వ్యూహాలు కాకుండా పోతాయా అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. కానీ బీజేపీ సీనియ‌ర్లు, కొత్త‌త‌రం నాయ కు లు కూడా బీజేపీ కంటే దేశంలో దేశ ఔన్న‌త్యాన్ని కాపాడే పార్టీ మ‌రోటీ లేద‌ని బ‌హుళ ప్ర‌చారానికి పూను కుంటున్నారు. దేశంలో ఎక్క‌డ ఏ సంఘ‌ట‌న జ‌రిగినా దాన్ని అక్క‌డి ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగా ప్ర‌చారం చేసి ఆ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసుకోవ‌డంలో బీజేపీ నేత‌ల రాజ‌కీయ చ‌ద‌రంగం ప్ర‌త్యేకత  స్ప‌ష్ట మ‌వుతోంది.  దేశంలో విప‌క్షం లేకుండా చేసుకోవ‌డానికి, పార్టీ విధానాల‌కు ఎదురుగాలి వీయ‌కుండా, విమ‌ర్శ‌ల‌కు తావు లేకుండా చేసుకోవ‌డానికి తీవ్ర‌య‌త్నాలు చేయ‌డం త‌ప్ప వాస్త‌వానికి కేంద్రం రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ యం గురించి అంత‌గా ప‌ట్టించుకోవ‌డంలేద‌న్న అభిప్రాయాలు ఈస‌రికే వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రానికి సంబంధంచిన ప్ర‌తి అంశాన్ని కేవ‌లం రాజ‌కీయ‌కోణంతో చూడ‌డం గోడు పెడ‌చెవిన‌పెట్టి త‌మ మాటే నెగ్గేట్లు ప‌రిస్థితుల‌ను అనుకూలం చేసుకోవ‌డం త‌ప్ప వాస్త‌వాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌న్న అభి ప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీ కేవ‌లం దేశ‌మంతా కాషాయం చేయ‌డానికే పూనుకుంది గాని సంక్షేమం దృష్ట్యా ప్ర‌త్యేకించి ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అన్ని ప్రాంతాల్లో అమ‌లు చేస్తున్న‌ది శూన్యం. కానీ దేశ ప్ర‌జ‌లం తా త‌మ వెంటే ఉన్నార‌ని చెప్పుకుంటూ త‌మ‌త‌ప్పిదాల‌ను దాచుకోవ‌డానికి, గంభీరంగా ప్ర‌వ‌చ నాలు చేయ‌డానికే బీజేపీ సీనియ‌ర్లు పూనుకున్నారు. యువ‌నాయ‌కులంతా త‌మ‌ను ప్ర‌శ్నిస్తున్న‌ వారి మీద విరుచుకుప‌డ‌టం మాత్ర‌మే ప్ర‌త్యేకించి శిక్ష‌ణ పొందిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బీజేపీ  దేశంలో తమ‌ప‌ట్ల న‌మ్మ‌కం ఎంతో పెరిగింద‌ని ఎలా చెప్ప‌గ‌ల్గుతున్న‌దీ బీజేపీ సీనియ‌ర్లే చెప్పాలి.

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. ఎదురుదాడితో వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్

వివరణ ఇవ్వలేనప్పుడు ఎదురుదాడే బెటర్ అన్న పంథాను వైసీపీ అనుసరిస్తోంది. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో వైసీపీ ఇదే పంథాను అనుసరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో బయటపడినప్పటి నుంచీ వైసీపీ తీరు, ఆ పార్టీ నాయకులు ఆ అంశంపై స్పందిస్తున్న తీరు అన్నీ అయోమయంగానే ఉన్నాయి. అయినదానికీ కానిదానికీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి గోరంట్ల మాధవ్ విషయంలో కనీసం స్పందించకపోవడం, పార్టీ పరువు నిలువునా బజారున పడుతున్నా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ నోరు మెదపక పోవడం చూస్తుంటే.. మాధవ్ నగ్న వీడియో కాల్ విషయంలో ఆ పార్టీ ఎంతగా డిఫెన్స్ లో పడిందో అర్ధమౌతోంది. వారాల తరబడిగా ఆ నగ్న వీడియో కాల్ విషయంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ఏకంగా లోక్ సభ స్పీకర్ కు సైతం ఫిర్యాదు అందింది. జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తునకు ఆదేశించింది. అయినా వైసీపీ మాత్రం గోరంట్లను కాపాడేందుకు ప్రయత్నాలుచ చేస్తూనే ఉంది. ముఖ్యంగా పోలీసుల అండతో బయట పడాలన్న తాపత్రయం ప్రదర్శిస్తున్నది. తొలుత ఆ వీడియో ఫేకో కాదో నిరూపించడం అసాధ్యం అని అనంతపురం ఎస్పీ చెబితే.. తెలుగుదేవం అమెరికాలో ఫోరెన్సిక్ ల్యాబ్ అది ఒరిజనలే అంటూ ఇచ్చిన సర్టిఫికేట్ ను చూపి ఇప్పుడేమంటారని నిలదీసింది. దానికి ఖండించడానికి కూడా మళ్లీ వైసీపీ పోలీసులనే అశ్రయించింది. అమెరికాలోని ప్రైవేట్ పోరెన్సిక్ ల్యాబ్  రిపోర్ట్ అంటూ తెలుగుదేశం నాకుడు పట్టాభి బయట పెట్టిన నివేదికే ఫేక్ అని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పడం వైసీపీ ఈ విషయంలో ఆత్మరక్షణ కోసం ఎంతగా ప్రయత్నిస్తోందో అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో బయటపెడతామని, అమెరికాలోని ప్రైవేట్ పోరెన్సిక్ ల్యాబ్ నివేదిక సరికాదంటూ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పడం సరికాదనీ పట్టాభి అంటున్నారు. తాము స్టాఫోర్డ్ కి పంపిన ఈ మెయిల్స్ అధారాలు ఉన్నాయని పట్టాభి అంటున్నారు. సీబీఐకి తప్పు చేసిన అధికార పార్టీ నాయకులను వెనకేసుకు రావడం మీద ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలో మహిళల భద్రతపై ఉండి ఉంటే బాగుంటుందని పట్టాభి పేర్కొన్నారు. మద్రాస్  ఐ ఐ టి నివేదికని ఫోర్జరీ చేసిన ఘనత రాష్ట్ర అధికార పార్టీది అని ఎద్దేవా చేసారు. గోరంట్ల మాధవ్ విషయం  లో అన్నిరకాల ఆధారాలు బయటపెట్టిన తమ పైనే కేసు లు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మాధవ్ న్యూడ్ వీడియో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలని  డిమాండ్ చేసారు. 

కాళేశ్వరంపై కేంద్రం ఆరోపణాస్త్రాలు దేనికి సంకేతం

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఘాత్మకంగా, రాష్ట్రానికే తలమానికంగా అభివర్ణించిన వాయు వేగంతో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పుడు వివాదాల ముసురు కమ్ముకుంటోంది. ఇటీవలి భారీ వరదల్లో ఆ ప్రాజెక్టు పంప్ హౌజ్ లు మునిగిపోవడమే ఇందుకు కారణంగా చెప్పాలి. అయితే కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన భారీ వరదల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెరాస సర్కార్ చెబుతున్నప్పటికీ విపక్షాల నుంచి మాత్రం కమిషన్ల కక్కూర్తి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంగా మారిందని అంటున్నారు.  డిజైన్ మార్పు పేరుతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని విపరీతంగా పెంచేసి అంతులేని అవినీతికి పాల్పడడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరుకుందని కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వెల్లువెత్తిన విమర్శలన్నీ ఒకెత్తు.. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ విమర్శలు మరో ఎత్తు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జలశక్తి మంత్రి షెకావత్ కాళేశ్వరం ప్రాజెక్టును దండుగమారి ప్రాజెక్టుగా అభివర్ణించడం, భారీ ఎత్తున అవినీతి జరిగిందనీ, నిర్మాణం నాసిరకంగా ఉందనీ అందుకే ఒక్క వరదకే దాని పని ఎత్తిపోయిందని షెకావత్ విమర్శించారు. స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నాసిరకమని, భారీ ఎత్తున అవినీతి జరిగిందనీ ఆరోపించడంతో.. ఇక ఈ ప్రాజెక్టుపై కేంద్రం విచారణకు ఉపక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీఆర్ఎస్, మంత్రి హరీష్ రావు ఎంత తీవ్రంగా షెకావత్ ఆరోపణలను ఖండించినా.. షెకావత్ విమర్శల సీరియస్ నెస్ ఇసుమంతైనా తగ్గలేదు. చాలా కాలంగా కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఆరోపణలకు గుప్పిస్తూ.. ఆయన జైలుకు వెళ్లడం ఖాయమంటూ చెబుతూ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఆరోపణలకు ఇప్పుడు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. అలాగే టీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, అప్పులు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు రాజకీయ కారణాలతో విమర్శల బురద జల్లుతోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇప్పుడు బురద జల్లుతున్న కేంద్రమే.. గతంలో పలు సందర్భాలలో కాళేశ్వరం ప్రాజెక్టును పొగడ్తలతో ముంచెత్తిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం అవినీతిపై షెకావత్ విమర్శల తరువాత ఈ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గే అవకాశాలు ఇంకెంత మాత్రమూ లేవని అంటున్నారు. తన ఆరోపణలను జస్టిఫై చేసుకోవడానికైనా కాళేశ్వరంపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించక తప్పని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, నాసిరకం నిర్మాణం కారణంగా ప్రాజెక్టుకు వాటిల్లిన నష్టం, నిరర్ధక వ్యయం తదితర అంశాలపై కేంద్రం త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.అలాగే ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలకు జస్టిఫికేషన్ కోసం ఈడీ దాడులు జరిగే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.  

భార‌త్‌లో కుల‌వివ‌క్ష‌, పేద‌రికం ప‌డుగుపేక‌లు.. ఐరాస నివేదిక‌

ఎంత క‌డిగినా మురికిపోకుండా ఉంటే ఇబ్బందిక‌ర‌మే. ఎంత చెప్పినా పాత పంథాలోనే వెళు తూంటే ఎవ రేమీ చేయ‌లేరు. అనాదిగా దేశంలో ఉన్న కుల వివ‌క్ష‌, పేద‌రికం, బాల‌కార్మిక వ్య‌వ‌స్థ‌ల గురించి ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది చాలాకాలం నుంచి విప‌క్షాలు, ప్ర‌జాసంఘాల మాట‌. కుల వ్య‌వ‌ స్థ‌ను నిర్మూలించ‌డం అనేది ప్ర‌భుత్వాల‌తోపాటు, ప్ర‌జ‌లూ త‌ల‌చుకోవాలి. దీన్ని గురించి చ‌ర్చోప‌ చ‌ర్చ‌లు జ‌రిగాయి, జ‌రుగుతాయి, ఎంద‌రో మేథావులు దీన్ని గురించి అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తూ స‌మా జం మున్ముందు దారుణంగా త‌యార‌వుతుంద‌నీ హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. కానీ మ‌లికిని అంత తొంద‌ ర‌గా వ‌దిలించ‌డ‌మూ క‌ష్ట‌మే. స‌మాజంలో రాని మార్పును అమాంతం కొద్దికాలంలో తెచ్చేయ‌ గ‌ల‌మ‌ను కోవ‌డం పొరపాటే. స‌మాజంలో అన్ని సంద‌ర్భాల్లోనూ కులం పేర జ‌రుగుతున్న దాడులు, హ‌త్య‌లు మ‌న స‌మాజం ఏమాత్రం మార‌క‌పోగా మ‌రింత వెన‌క‌డుగు వేస్తోంద‌నే సామాజిక విశ్లేష‌కుల అభిప్రాయం.  భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ముడిపడి  ఉ న్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని, అన్ని అంశాల్లోనూ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను వారికి నిరాకరిస్తున్నారని తెలిపింది. ఐరాస మానవ హక్కుల మండలి ప్రతినిధి టొమోయో ఒబొకట రూపొందించిన ఈ నివేదికను ఇటీవ‌ల‌ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీకి సమర్పించారు.  ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బాలకార్మిక వ్యవస్థ ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆసియా, పసిఫిక్‌, మధ్యప్రాఛ్యం, అమెరికా, ఐరోపాలలో నాలుగు నుంచి ఆరు శాతం పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారని, ఆఫ్రికా లో మరీ ఎక్కువగా 21.6 శాతం ఉన్నా రని నివేదిక వెల్లడించింది.  ప్రభుత్వ విధానాలు, బడ్జెట్‌ కేటాయింపుల్లో అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో వారికి చాలా పరిమితంగానే న్యాయం అందుతోందని తెలిపింది. వృత్తి, సంతతి ఆధా రంగా వారి పట్ల వివక్ష కొనసాగుతోందని తెలిపింది. కుల‌వివ‌క్ష అంత‌మొందించేందుకు కంక‌ణం క‌ట్టు కున్నామ‌ని ప్ర‌చారాలే త‌ప్ప వాస్త‌వానికి అందుకు గ‌ట్టి చ‌ర్య‌లేవీ తీసుకోవ‌డం లేదు. అన్ని ప్రాంతాల్లో, అన్ని సంద‌ర్భాల్లోనూ కుల‌వివ‌క్ష త‌లెత్తుతోంది. దీన్ని రాజకీయాల‌కు ఆస‌రాగా చేసుకుని ప్ర‌భుత్వాలు, రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల్లో మ‌రింత సందిగ్ధ‌త క‌ల్పించే య‌త్న‌మే చేస్తున్నారేగాని ఆ గోడ‌లు కూల్చేందు కు ధైర్యం చేయ‌లేకపోతున్నాయి. సామాజిక‌వేత్త‌లు, ఆధ్యాత్మిక చింత‌నాప‌రులు అనేక‌మంది  చాలా కాలం నుంచి చేస్తున్న కృషి ఏ మాత్రం ఫ‌లించ‌డం లేదు. దీనికి తోడు ఇటీవ‌లి కాలంలో ప‌రువు హ‌త్య‌ల పేరుతో కుల‌వివ‌క్ష‌త‌ను మ‌రింత ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నిస్తున్నాం.  దక్షిణాసియాలో దళితులు వెట్టి చాకిరీలో మగ్గిపోతున్నారని తెలిపింది. అట్టడుగు వర్గాల్లో బాల్య వివా హాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే బలవంతపు పెళ్లిళ్లు పాకిస్థాన్‌లో ఎక్కువగానూ, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, సోమాలియా దేశాల్లో తక్కువగానూ జరుగుతున్నాయని తెలిపింది. ప‌ట్ట‌ణాల్లో పెద్ద పెద్ద క‌ర్మాగారాల్లో, ప‌రిశ్ర‌మ‌ల్లో, గ్రామాల్లో కుటీర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ వెట్టి చాకిరీ ఇంకా రాజ్యం చేస్తోంద‌న్న‌ది తెలిసిందే. ముఖ్యంగా ద‌ళితులు ఈప‌రంగా దారుణ ప‌రిస్థితులు ఎదుర్కొం టున్నారు. వెట్టిచాకిరీని అరిక‌ట్టేందుకు ప్ర‌జాసంఘాలు ఉద్య‌మిస్తూనే ఉన్న‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లం ద‌క్క‌డం లేదు. కాగా, మైనారిటీలు, వలస కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు ప్రశంసనీయమైన పాత్ర పోషి స్తున్నాయని నివేదిక కొనియాడింది. 

రగిలిపోతున్నరాములమ్మ..

కమలనాథులు తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదంటూ ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి రగిలిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం బి.జె.పి రాష్ట్ర నాయకత్వంపై విజయ శాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫ్రైర్ బ్రాండ్ అయిన తనను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సేవలను ఉపయోగించుకోవడం లేదని ఆమె అసహనంగా ఉన్నారు. ఏదైనా బాధ్యతలు అప్పగించి పని చేయమంటే చేస్తాం కానీ ఏ బాధ్యతలూ ఇవ్వకుండా పని చేయడం లేదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తాను   అసంతృప్తి గా ఉన్నానో,లేదో పార్టీ నాయకులనే అడగాలన్న విజయశాంతి  ఉద్యమకారిణిగా   ప్రజల గుండెలలో తనకు సుస్థిర స్థానం ఉందని దాన్ని ఎవరు తీయలేరని చెప్పారు. పార్టీలో తన పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్ళని పాతరేస్తే మంచిదని పేర్కొన్నారు.  తెలంగాణ ఉద్యమం కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పోరాడిన విజయశాంతి ఆ తరువాత తన పార్టీని  ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తో విలీనం చేశారు.  కేసీఆర్   చెల్లిగా మారి.. టీఆర్ఎస్ లో నంబర్2 స్థానాన్ని దక్కించుకున్నారు. ఈమెను కేసీఆర్ ఎంపీని చేసి ఢిల్లీకి కూడా పంపించారు. అయితే కేసీఆర్ తో విభేదాలతో రాములమ్మ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం  కాంగ్రెస్ లో చేరారు. తొలి నాళ్లలో విజయశాంతికి కాంగ్రెస్ లో మంచి ప్రాధాన్యతే దక్కింది. పార్టీ  ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు సైతం అప్పగించారు. ఆమె కోరినట్లుగానే మెదక్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కూడా కాంగ్రెస్ ఇచ్చింది. అయితే ఆ  ఎన్నికలలో విజయశాంతి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందంటూ అలిగిన విజయశాంతి తదననంతరం కమలం గూటికి చేరారు. బీజేపీలో కూడా తొలి నాళ్లలో విజయశాంతికి మంచి ప్రాధాన్యతే లభించింది. ఆ తరువాత తరువాత అంటే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ అయిన తరువాత విజయశాంతికి ప్రాధాన్యత ఒకింత  తగ్గిందనే చెప్పాలి.   తెలంగాణలో అధికారం అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. అందుకు అనుగుణంగా వరుస కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ఈనేపథ్యలోనే పార్టీలో విజయశాంతికి గళమెత్తే అవకాశం రావడం లేదు. బీజేపీ తన సేవలను ఉపయోగించుకోవడం లేదనీ, తనను నిశబ్దంలో ఉంచేస్తోందని రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి తాజాగా ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా సర్వాయి పాపన్న జయంతిలో కనీసం మాట్లాడే అవకాశం కూడా తనకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి భగ్గుమనడం ఆమె రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏమై ఉంటుందా అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది,    

సెప్టెంబ‌ర్ 7 నుంచి కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌

దేశంలో అన్ని వ‌ర్గాల‌వారిని ఏకం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భార‌త్ జోడో యాత్ర‌ను త‌లపెట్టిం ది. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న తన ప్రతిష్టాత్మకమైన భారత్ జోడో యాత్రలో పౌర సమాజాన్ని భాగ స్వామ్యం చేయాలని కోరుతూ, పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు, మేధావులు, రచయితలతో ఆగస్టు 22న కాంగ్రెస్ సమావేశం కానుంది.  ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో సెప్టెంబరు 7న ఈ యాత్రను ప్రారంభిం చనున్నారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 3,571 కి.మీటర్ల మేర 68 లోక్‌ సభ నియో జక వర్గాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్‌ పాదయాత్ర సాగనుంది.  దేశ రాజధానిలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో దాదాపు 150 మంది పౌర సమాజ ప్రతినిధులతో కాంగ్రెస్ సమా వేశాన్ని నిర్వహించనుందని, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు సెప్టెంబరు 23న, యాత్రకు అంకితమైన పార్టీ లోగో, నినాదం మరియు వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు. పాదయాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. దాదాపు 3500 కి.మీ పొడవునా దాదాపు 150 రోజుల్లో పూర్త వుతుంది. రాహుల్‌తో సహా కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 150 మంది నాయకులు పాదయాత్రలో పాల్గొం టారు. అలాగే రాష్ట్ర యూనిట్ నాయకులు కూడా  చేరనున్నారు. కాగా, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో యాత్ర దాదాపు 15-20 రోజు ల పాటు కొనసాగు తుం దని అంచనా. ఇతర రాష్ట్రాలు మూడు నుంచి ఐదు రోజుల్లో యాత్ర ముగించ వ‌చ్చు. అనారోగ్య కారణాల దృష్ట్యా సెప్టెంబర్ 7న జరగనున్న పాదయాత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదు. ఆమె కోవిడ్‌-19తో బాధపడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తు తం ఆమె ఐసొలేష‌న్‌లో ఉన్నారు. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు, రైతులు, బలహీనపక్షాల తరఫున కొనసాగనున్న ఈ జోడోయాత్ర గురించి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మీడియాకు వివరించారు. రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి కేఎస్‌ అళగిరి నేతృ త్వం వహించగా, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌లు దినేష్‌ గుండూరావు, సిరివళ్ల ప్రసాద్‌, సీనియర్‌ నేతలు కుమరి అనంతన్‌, ఈవీకే ఎస్‌ ఇళంగోవన్‌, తంగబాలు, పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ జయకుమార్‌, డాక్టర్‌ చెల్లకుమార్‌, తిరు నావుక్కరసు, జ్యోతిమణి, ఎమ్మెల్యేలు సెల్వం పెరుందగై, రూబీ మనోహరన్‌, రాజేష్‏కుమార్‌ విజయ తరణి, ప్రిన్స్‌, టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి, ఎస్‌ఏ వాసు, జిల్లా అధ్యక్షులు  జె.ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కేఎస్‌ అళగిరి, గుండూరావు మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో 4 రోజుల పాటు సాగే పాదయాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొంటారని తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు రాష్ట్రం లోని 76 కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సెప్టెం బరు 7వ తేదీ కన్యాకుమారిలో రాహుల్‌గాంధీ అక్కడున్న కామరాజర్‌ మండపంలో నివాళులర్పి స్తారని తెలిపారు. అక్కడి నుంచి 3 కి.మీటర్ల మేర పాదయాత్ర చేస్తారన్నారు.  పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగసభలోనూ ప్రసంగిస్తారని తెలిపారు. 8వ తేదీ ఉదయం కన్యాకుమారి నుంచి కల్యక్కావలై వరకు సుమారు 60 కి.మీ దూరాన్ని సుమారు 3 రోజుల్లో అధిగమిస్తారన్నారు. దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివ రించారు. 

రాజకీయ పార్టీలతో తెలంగాణ సీఈవో సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వికాస్ రాజ్ గురువారం(ఆగస్టు 18) తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎనిమిది రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపడుతున్న ఈ క్రింది కార్యకలాపాలపై సీఈఓ వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. 1. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2. ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్‌ను లింక్ చేయడం 3. ఎన్నికల ఫారాలలో మార్పులు అలాగే 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి నాలుగు అర్హత తేదీలలో (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1 మరియు అక్టోబరు 1)  ఇటీవల జరిగిన సవరణల గురించి కూడా సీఈవో రాజకీయ పార్టీలకు తెలియజేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు, ముందుగా అవసరమైన నాణ్యమైన ఓటర్ల జాబితాను నిర్ధారించేందుకు క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీలను సీఈవో కోరారు. భారత ఎన్నికల సంఘం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని, అవసరమైన సహకారం అందిస్తామని రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు రాబోయే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి మరియు ఫోటో సిమిలర్ ఎంట్రీల(PSEs) గురించి వివరణలు కోరాయి. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని బూత్‌ లెవల్‌ అధికారులు చురుగ్గా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే నివాస మార్పు ఆధారంగా ఓటర్లను ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి మార్చడానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని రాజకీయ పార్టీలు కోరాయి.

తెలుగు రాష్టలకు పొంచి ఉన్న విద్యుత్ కొరత.. ఇక పవర్ కట్ లు తప్పవా?

తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉంది. విద్యుత్ బకాయిల కారణంగా కేంద్రం 11 రాష్ట్రాలకు విద్యుత్ విక్రయాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఆ 11 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా3 ఉన్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు గురువారం (ఆగస్టు 18) అర్ధరాత్రి నుంచి ఎక్స్ంజ్ లలో విద్యుత్ కొనుగోలు నిలిచిపోయింది. కేంద్రం నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు ముందు ముందు విద్యత్ కొరత ఏర్పడ నుంది.   అవసరాలను బట్టి తెలంగాణ డిస్కమ్ లు రోజూ 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో విద్యుత్ కొనుగోలుకు ఆటంకం అనివార్యం అవుతుంది. తెలంగాణ నుంచి రూ.1300 కోట్లకుపైగా చెల్లించాలని, ఏపీ డిస్కమ్ ల నుంచి రూ.400 కోట్లకుపైగా బకాయిలు రావాల్సి ఉంది. కేంద్రం నిర్ణయం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా తమిళనాడు, కర్నాటక, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మణిపూర్, మిజోరం, జమ్ముకశ్మీర్,  రాష్ట్రాలకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం లేదు. 

శవయాత్రల్లో భగవద్గీత పెడితే భౌతిక దాడులే.. బండి

భగవద్దీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన గురువారం (ఆగస్టు 18) జనగామలో అర్చక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలతో సమావేశమయ్యారు. భగవద్గీత వినిపిస్తే ఎవరైనా మరణించారా అని అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ గతంలో ప్రశాంతతకు భగవద్గీత వినేవారని అన్నారు. ఇకపై ఎవరైనా మహాప్రస్థానం (అంతిమయాత్ర) లో భగవద్గీత వినిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  శవయాత్రల్లో భగవద్గీతను పెట్టకూడదని అలా చేస్తే భౌతిక దాడులు చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడు ఎన్నికలపై కూడా మాట్లాడారు.   అలాగే మునుగోడు ఎన్నికలను దృష్టిలో  టికెట్ కోసం ఆశావహులు లాబీయింగ్ లు వంటివి బీజేపీలో కుదరవన్నారు. ఆగస్టు 21న మునుగోడులో నిర్వహించ నున్న సభకు భారీగా జనసమీకరణ   ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.   సభ తరువాత కూడా బీజేపీ అగ్ర నేతలు మునుగోడులోనే మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  గత ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  జరగనున్న ఉప ఎన్నిక కావడంతో టీఆర్‌ఎస్ కాంగ్రెస్,బీజేపీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక విజయం అత్యంత కీలకం. ఇక కాంగ్రెస్ పార్టీకి  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా మునుగోడు ఉప ఎన్నిక గెలిచి తీరాల్సిన సవాల్. ఇక అధికార టీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే ఈ ఉప ఎన్నికలో విజయం ఆ పార్టీకి అత్యంత కీలకం. మూడు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఉప ఎన్నికలో విజయానికి సర్వ శక్తులూ ఒడ్డుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు బై ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది.

ఏడుస్తున్న సెల్ఫీని పోస్ట్ చేశాడు, ఉద్యోగ ఆఫ‌ర్లు ముంచెత్తాయి!

ఏడుస్తున్న సెల్ఫీని పోస్ట్ చేసినందుకు వైరల్‌గా మారిన సీఈఓ తొలగించిన ఉద్యోగి ఒకరు జాబ్ ఆఫర్లతో ముంచెత్తారు. మార్కె టింగ్ సంస్థ అయిన బ్రాడెన్ వాలేక్జ‌ లింక్డ్ ఇన్‌కి వెళ్లి, గత వారం అతను తొలగించిన ఇద్దరు ఉద్యోగులలో ఒకరైన నోహ్ స్మిత్ తనకు పంపిన టెక్స్ట్‌ల స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేశాడు. నోహ్ మరుసటి రోజు ఈ చిత్రాన్ని నాకు పంపాడు, వాలేక్ లింక్డ్‌ఇన్‌లో రాశాడు. అతను స్మిత్ ఇన్‌బాక్స్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు, అది అతనికి ఉద్యోగం ఇవ్వడానికి ఆసక్తి ఉన్న కాబోయే యజమా నుల సందేశాలతో నిండిపోయింది. వైరల్‌గా మారడం ఎప్పుడూ ఉద్దేశించబడలేదు, కానీ దీన్ని చూసినప్పుడు ప్రతి ఒక్క దుష్ట వ్యాఖ్య విలువైనదిగా చేస్తుంది. మీరు నోవా స్మిత్ ఇన్‌బాక్స్‌లో ఉద్యోగావకాశాలు, ఉద్యోగ లభ్యతలు మరిన్ని వాలేక్ చెప్పారు. మీ అందరి కారణంగా, నోవా ఎంచుకోవడానికి అద్భుతమైన అవకాశాలను పొందబోతున్నాడు. బ్రాడెన్ వాలేక్ లింక్డ్‌ఇన్‌లో తన ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించిన విధానానికి గత వారం వైరల్ అయింది, ప్రజలు దీనిని ఖండించదగినదిగా భావించారు. తన కంపెనీ నుండి కొంతమంది ఉద్యోగులను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించ డానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాలేక్ ఏడుస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. దీన్ని పోస్ట్ చేయాలా వద్దా అని నేను ముందుకు వెనుకకు వెళ్ళాను. మేము మా ఉద్యోగులలో కొందరిని తొలగించవలసి వచ్చింది, వాలేక్ అతను ఏడుస్తున్న చిత్రంతో పాటు రాశాడు. కాబట్టి, ప్రజలు చూడాలని నేను కోరుకుంటున్నాను, అక్కడ ఉన్న ప్రతి సీఈఓ నిష్కపట హృదయంతో ఉండకూడదు అతను లేదా ఆమె ప్రజలను తొలగించవలసి వచ్చినప్పుడు పట్టిం చుకోరు, అన్నా రాయన. తొలగింపులు జరిగినప్పటికీ, కంపెనీ ఎల్లప్పుడూ ప్రజల-మొదటి వ్యాపారమని వాలేక్ చెప్పారు. మేము ఎల్లప్పుడూ ప్రజల మొదటి వ్యాపారంగా ఉన్నాము.  మేము ఎప్పుడూ అలానే ఉంటాము, ఈ రోజు వంటి రోజుల్లో, నేను కేవలం డబ్బు తో నడిచే వ్యాపార యజమానిని అతను దారిలో ఎవరిని బాధపెట్టాడు అనే దాని గురించి పట్టించుకోకుండా ఉండాలని నేను కోరు కుంటున్నాను. వాలాకే పోస్ట్ అతనిని అపహాస్యం చేయడానికి దారితీసింది, వేదికపై సానుభూతి చూపినందుకు ప్రజలు అతనిని దూషిం చారు. జోక్‌ల బట్‌గా ఉన్నప్పటికీ, తోటి  సీఇఓ లు, వ్యాపార ప్రముఖుల నుండి  తనకు వచ్చిన సందేశాలను చూసి తాను హృదయ పూర్వకంగా ఉన్నానని వాలేక్ చెప్పారు. కారణం ఏమిటంటే, ఇతర వ్యాపార యజమానుల నుండి నాకు లెక్కలేనన్ని మెసేజ్ లు వస్తున్నాయి, ఇలా.. లవ్ దిస్, బి దేర్, వరస్ట్ ఫీలింగ్, మీతో పాటు.. అని వాలేక్ చెప్పారు.

టాటావారి  గుడ్‌ఫెలోస్‌!

రతన్ టాటా దయ, వినయం తరచుగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ పారిశ్రామిక వేత్తలు, విజయ వంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్నప్పటికీ, అతను ఎల్లప్పుడూ సాధారణ జీవితాన్ని గడిపాడు. ఇటీవల, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌లో పెట్టుబ‌డులు పెట్టారు. ఇది వృద్ధులను యువ కులు, చదువుకున్న గ్రాడ్యుయేట్‌లతో జత చేయడం ద్వారా అర్ధవంతమైన సహచర్యం కోసం వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ స్టార్టప్ వృద్ధులకు మద్దతు, స్నేహాన్ని అందిస్తుంది. గత ఆరు నెలల్లో, గుడ్‌ఫెలోస్ విజయవంత మైన బీటా ను పూర్తి చేసింది. ఇప్పుడు ముంబైలో త్వరలో పూణె, చెన్నై, బెంగళూరులో అందుబాటులో ఉంటుంది. సీనియర్ సిటిజన్ల కోసం భారతదేశపు మొదటి సహచర స్టార్టప్ అయిన గుడ్‌ఫెలోస్ గురించి రతన్ టాటా మాట్లాడుతూ, గుడ్ ఫెలోస్ సృష్టించిన రెండు తరాల మధ్య బంధాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి, భారతదేశంలో ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతున్నాయి. గుడ్‌ఫెలోస్‌లోని యువ బృందానికి ఈ పెట్టుబడి సహాయ పడుతుం దని నేను ఆశిస్తున్నాను. 28 ఏళ్ల కార్నెల్ యూనివర్సిటీలో చదువుకున్న శంతను నాయుడు గుడ్‌ఫెలోస్ స్టార్టప్‌ను స్థాపిం చారు. 2018 నుండి, నాయుడు టాటాకు జనరల్ మేనేజర్‌గా సహాయం చేస్తున్నారు. అతను కుక్కలు, విచ్చలవిడిగా టాటా కు ఉన్న ప్రేమను పంచుకున్నాడు, గతంలో పెంపుడు జంతువుల చుట్టూ కూడా వెంచర్‌ను ప్రారంభించాడు. సీనియర్ సిటిజన్స్ కోసం భారతదేశపు మొదటి సహచర స్టార్టప్ ఇది. నాయుడు టాటా ఎల్క్సీలో డిజైన్ ఇంజనీర్‌గా కూడా పని చేశారు. పారిశ్రామికవేత్త రతన్ టాటా శంతను నాయుడు ఆలోచనలను మెచ్చుకున్నారు మరియు అతను ఆఫీసు నుండి దూరంగా గడిపిన సమయాన్ని కూడా అతని మెంటీని క్షమించాడు. గుడ్‌ఫెలోస్‌ను ప్రారంభించిన సందర్భంగా, రతన్ టాటా మాట్లాడుతూ, అసలు వృద్ధాప్యం వచ్చే వరకు ఎవరూ పట్టించుకోరు. గుడ్‌ఫెలోస్ స్టార్టప్ అంతరాన్ని తగ్గించడానికి, సేవలకు బదులుగా నిజమైన బంధాన్ని అందించడానికి సహాయపడుతుంది. గుడ్‌ఫెలోస్ ముఖ్యంగా మనవలు-ఆన్-డిమాం డ్ అని శంతను నాయుడు చెప్పారు. గుడ్‌ఫెలోస్ వ్యాపార నమూనా ఒక ఫ్రీమియం సబ్‌స్క్రిప్షన్ మోడల్. తాతయ్య ఈ సేవను అనుభవించాలనే లక్ష్యంతో మొదటి నెల ఉచితం. రెండవ నెల నుండి పింఛనుదారుల పరిమిత స్థోమత ఆధారంగా నిర్ణయించబడిన చిన్న చందా రుసు ము. గుడ్‌ ఫెలోస్ ఈ ప్రదేశంలో వారి విద్యా నేపథ్యాన్ని వర్తింపజేయడానికి అనుమతించే ఉద్యోగాన్ని కనుగొనాలని చూస్తున్న గ్రాడ్యు యేట్‌లకు స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్‌లతో పాటు ఉపాధిని కూడా అందిస్తుంది.