ఆసియాక‌ప్‌లో భార‌త్ కే విజ‌యావ‌కాశం.. రికీ పాంటింగ్‌

భారత్‌-పాక్‌ల మధ్య జరగనున్న పోరుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన తీర్పును వెలువరించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే ఘర్షణపై తన తీర్పును ఇచ్చాడు  రోహిత్ శర్మ జ‌ట్టు విజయంతో మ‌హానందంతో వెళ్ల‌డాన్ని తాను చూడగలనని చెప్పాడు. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న టోర్న మెం ట్‌లో చిరకాల ప్రత్యర్థులు ఆగస్టు 28న తలపడనున్నారు. ఈ ఏడాది ఆసియా కప్‌లో ఇదే అతిపెద్ద పోరుగా పలువురు భావిస్తు న్నారు. పాంటింగ్ ఇప్పుడు మ్యాచ్‌పై తన అంచనాను వెల్లడించాడు. మొత్తమ్మీద హెడ్-టు-హెడ్ గణాంకాలలో పాకిస్తాన్ కాస్తంత పై స్థాయిలో నిలిచి ఉన్నప్పటికీ, ఆసియా కప్ విషయానికి వస్తే ప‌రి స్థితి భిన్నంగా ఉంటుంది.  భారత్‌ 13 మ్యాచ్‌లలో వారి ప్రత్యర్థులపై 7-5 ఆధిక్యాన్ని కలిగి ఉంది. ది ఐసిసి రివ్యూ  తాజా ఎపి సోడ్ లో మాట్లాడుతూ, పాంటింగ్ రాబోయే భారీ మ్యాచ్‌ గురించి తన జోస్యాన్ని చెప్పాడు.ఈ క్లాష్ నుండి విజేతలుగా నిలిచేందుకు తాను భారత్‌తో కట్టుబడి ఉంటానని చెప్పాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు నేను భారత్ ప‌క్షాన‌ ఉంటానని పాంటింగ్ చెప్పాడు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క పోటీ కోసం శర్మ అతని జట్టుకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ పాకిస్తాన్‌ను ప్రశంసిస్తూ, సూపర్ స్టార్ ఆటగాళ్లను ఉత్పత్తి చేసే దేశం అని చెప్పాడు. ఇక‌ పాకిస్థాన్‌కు ఏదీ తీసిపోదని, ఎందుకంటే వారు అద్భుతమైన క్రికెట్ దేశం, అవుట్ అండ్ అవుట్ సూపర్ స్టార్ ప్లేయర్‌లను ప్రదర్శిస్తూనే ఉన్నారు, అని పాంటింగ్ అన్నారు. పాంటింగ్ కూడా ప్రత్యర్థి మరింత బలోపేతం కావచ్చని వ్యాఖ్యానించాడు  టెస్ట్ క్రికెట్‌లో ఇరు జట్లు పోరాడేందుకు ఆసక్తిగా ఉన్నాను. 2007లో బెంగళూరు మ్యాచ్‌ డ్రాగా ముగిసిన తర్వాత భారత్‌, పాకిస్థాన్‌లు రెడ్ బాల్ క్రికెట్‌లో తలపడలేదు. జట్ల మధ్య పోటీ భారత్ , పాక్‌ అభిమానులకు టెస్ట్ క్రికెట్‌లో పరాకాష్టగా ఉంటుందని ఆస్ట్రేలియా స్టార్‌ చెప్పాడు. నేను ప్రత్యర్థు ల గురించి ఆలోచించినప్పుడు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్  యాషెస్ క్రికెట్ మా టెస్ట్ మ్యాచ్ గేమ్ కోసం నేను ఎప్పుడూ ఆలోచించే పరా కాష్ట. భారతదేశం మరియు పాకిస్థానీలు దాని గురించి అదే చెబుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరియు అసలు పోటీ ఆ రెండు దేశాలకు కూడా టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో పరాకాష్టగా ఉంటుందని పాంటింగ్ అన్నారు.

కాషాయం స్థానంలో మువ్వన్నెల జెండా!

ఆర్ఎస్ఎస్ తన ప్రొఫైల్ పిక్ ను మార్చేసింది. సామాజిక మాధ్యమంలో ఆర్ఎస్ఎస్ ప్రొఫైల్ పిక్ ఇంత కాలం కాషాయ జెండా ఉండేది. కానీ శుక్రవారం( ఆగస్టు 15) ఆ ప్రొఫైల్ పిక్ మారిపోయింది. కాషాయ జెండా స్థానంలో జాతీయ జెండా కనిపించింది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవ్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా మోడీ పిలుపును అనుసరించి తన ప్రొఫైల్ పిక్ ను మార్చేసింది.  ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ గా మువ్వన్నెల జెండాను ఉంచాలని నరేంద్ర మోదీ ప్రజలను పిలుపు నిచ్చిన సంగతి విదితమే.  గతంలో ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను గురించి కాంగ్రెస్ పార్టీలో పలు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్ మార్చాలని సూచించిన సమయంలో కాంగ్రెస్ నేతలు పలు విమర్శలు చేశారు. 52 ఏళ్లుగా నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఎగరని జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుంటారా..?   కాంగ్రెస్ నేత జైరాం రమేష్ నిలదీశారు. దీంతో ఆ విమర్శలకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ తన సామాజిక మాధ్యమ ప్రొఫైల్ పిక్ ను కాషాయ జెండా నుంచి జాతీయ జెండాకు మార్చేసిందని భావిస్తున్నారు. హ 

మునుగోడుకు అమిత్ షాపై బండి ఏమన్నారంటే..!?

అమిత్ షా మునుగోడు సభ వాయిదా పడిందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 21న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని స్పష్టం చేశారు. మునుగోడులో భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అమిత్ షా సమక్షంలో మునుగోడులో కమలం గూటికి చేరుతారని బండి క్లారిటీ ఇచ్చారు. మునుగోడు సభ కోసం అమిత్ షాకు రెండు తేదీలు ప్రతిపాదించామని బండి వివరించారు. ఆగస్టు 21, ఆగస్టు 29 తేదీలను ఆయనకు సూచించగా.. ఆయన 21 వ తేదీని ఎంచుకున్నారని, దీంతో ఈనెల 21న మునుగోడులో అమిత్ షా భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారనీ బండి స్పష్టత ఇచ్చారు.   ఇలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. బీజేపీ చేరికల కమిటీ నియోజకవర్గంలో  టీఆర్ఎస్ అసమ్మతి నేతలకు బీజేపీ నేతలు గాలం వేయడంలో యాక్టివ్ అయ్యింది. అలాగే అమిత్‌ షా నుంచి బండి సంజయ్‌ వరకు ఇప్పుడు అందరూ  మునుగోడు పైనే  దృష్టి కేంద్రీకరించారు. కేంద్రీకరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో   మండలాలు,   మున్సిపాలిటీలలో పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సిద్ధం చేసేందుకు రాష్ట్ర నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు చేస్తున్నది.   మునుగోడు ఉప ఎన్నికను కేంద్ర పార్టీ నేరుగా పర్యవేక్షిస్తోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. మరో వైపు   కాంగ్రెస్ నేతలు కూడా మునుగోడులో పాదయాత్రతో రంగంలోకి దిగారు. ఈ నెల 16 నుంచి గ్రామాల వారీగా రచ్చబండ ను కాంగ్రెస్ నిర్వహించనుంది. మొత్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ఒక రోజు తేడాలో  జరుతుండటం మునుగోడులో రాజకీయం రసకందాయంలో పడింది. 

గోరంట్ల న్యూడ్ వీడియోను ఫోరెన్సిక్ కు పంపండి.. అమిత్ షాకు న్యాయవాది లేఖ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ కు సంబంధించిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించాలని కోరుతూ ఏపీ న్యాయవాది ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కులేఖ రాశారు. ఏపీలో మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయనా లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు తదితర నేరాలలో వైసీపీ నాయకులు, మద్దతు దారులకు ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉంటోందని ఆయన ఆ లేఖలో న్యాయవాది లక్ష్మీనారాయణ ఆరోపించారు.    మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వైసీపీ నేతల్ని కాపాడేందుకు పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘దిశ’   చట్టం అంటూ ఏపీ సర్కార్ మహిళల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర హోం శాఖ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ చేసినట్టుగా ఉన్న వీడియో క్లిప్ ఫేక్ అని, మార్ఫింగ్ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పడం మహిళలను విస్మయానికి గురి చేసిందన్నారు. జూన్ 2019 నుంచి జులై 2022 మధ్య రాష్ట్రంలో మహిళలపై 777 ఘటనలు నమోదయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు.   అలాగే, డీజీపీకి మరో లేఖ రాశారు. వీడియో క్లిప్‌పై విచారణ జరుగుతుండగానే వాస్తవాల్ని వక్రీకరించి వివరాలను వెల్లడించడం పోలీసుల ఎథిక్స్, స్టాండింగ్ ఆర్డర్లకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఎస్పీ ఫకీరప్ప ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందనీ, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ ఆ లేఖలో కోరారు.

వెంకటరెడ్డికి వ్యతిరేకంగా యాదాద్రిలో పోస్టర్లు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో యాదాద్రి జిల్లాలో పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ ద్రోహిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభివర్ణిస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి, ఒక వైపు మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ వెంకటర రెడ్డికి ఏ బాధ్యతలూ అప్పగించని కాంగ్రెస్ ఆయనను ఎన్నికల సమావేశానికి గానీ, టీపీసీసీ చీష్ మునుగోడు నియోజకవర్గంలో చేపట్టనున్న పాదయాత్రకు కానీ ఆహ్వానించకండా దూరంగా ఉంచింద. అదే సమయంలో కాంగ్రెస్ లో కొందరు తనను దారుణంగా దూషిస్తున్నారనీ, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనీ వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. తనను విమర్శించిన వారూ, విమర్శల వెనుక ఉన్నవారూ క్షమాపణ చెప్పాలనీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాగా కోమటి రెడ్డి డిమాండ్ మేరకు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెబుతూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక ముందు వివాదానికి తెరపడుతుందనుకుంటే.. యాదాద్రి జిల్లాలో వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వెంకటరెడ్డిని కాంగ్రెస్ ద్రోహిగా అభివర్ణిస్తూ వెలిసిన ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారన్నది తెలియరాలేదు. అయినా కాంగ్రెస్ లో వెంకటరెడ్డి వ్యతిరేక వర్గీయులే ఈ పోస్టర్లు వేసి ఉంటారని బావిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంశానికి ఇప్పట్లో తెరపడే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు,

తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణను భారీ వర్షాలు మరోసారి ముంచెత్తనున్నాయి. ఈ నెల 14,15 తేదీలో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటలలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఉండగా, ఆదివారం (ఆగస్టు 14), సోమవారం(ఆగస్టు15) తేదీలలో   కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో అ  భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.  

వెంకటరెడ్డికి రేవంత్ క్షమాపణ..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బేషరతు క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరులో కాంగ్రెస్ నిర్వహించిన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై  పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ పరుష వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రేవంత్ స్పందించారు. ఈ మేరకు కోమటిరెడ్డికి బేషరతుగా క్షమాపణ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోను ట్విట్లర్లో పోస్టు చేశారు. అంతే కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇన్ చార్జ్  మాణిక్యం ఠాకూర్, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి చుండూరు సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కించపరిచేలా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ గా క్షమాపణులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. హోంగార్డ్ ప్రస్తావన సమా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. మునుగోడులో తన పాదయాత్రకు ముందు ఈ వివాదానికి తెర దించడమే మేలని రేవంత్ భావించినట్లు చెబుతున్నారు.  విభేదాలను విడనాడి మునుగోడులో కాంగ్రెస్ విజయానికి సమష్టిగా కృషి చేద్దామని ఆయనీ సందర్భంగా పేర్కొన్నారు.

మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం

మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి పతాక స్థాయికి చేరింది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గ టీఆర్ఎస్ అసంతృప్త నేతల రహస్య సమావేశం కలకలం రేపింది. ఈ రహస్య సమావేశానికి నియోజకవర్గం నలుమూలల నుంచీ దాదాపు 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ప్రభాకరరెడ్డికి వినా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం మనస్ఫూర్తిగా సహకరిస్తామని అసంతృప్త నేతలు అంటున్నారు. అయితే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి పార్టీ టికెట్ ఖరారు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లెదని అసమ్మతి నేతలు అంటున్నట్లు సమాచారం. ఈ రహస్య సమావేశం నేపథ్యంలో పార్టీ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది.   అసమ్మతులను బుజ్జగించే బాధ్యతను మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించింది. అయితే ఆయన అసమ్మతి నేతలతో జరిపిన చర్చలు ఫలించలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా ప్రభాకరరెడ్డి విషయంలో రాజీ పడేది లేదని వారు భీష్మించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దండు మల్కాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో అసమ్మతి నేతలు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు ఉపఎన్నిక ను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నియోజకవర్గ కారు పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమనడం పార్టీకి  మింగుడుపడటం లేదు.   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.  ఈ ఉప ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో త్రిముఖ పోరు హోరాహోరీగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో ఒక్కసారిగా అసమ్మతి జ్వాలలు రేగడం ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరమేనని అంటున్నారు.  మునుగోడు ఉప ఎన్నికలో విజయం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమదే అధికారం అని చాటుకోవాలన్న లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు సర్వ శక్తులూ ఒడి మునుగోడును దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో అసమ్మతి సెగలు ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

అత్యంత విషమంగా సల్మాన్ రష్దీ ఆరోగ్యం

న్యూయార్క్ లో ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ప్రసిద్ధ రచయత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఒక విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తున్న ఆయనపై పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి వేదిక పైకి దూసుకు వచ్చి మరీ దాడి జరిపాడు. దుండగుడిని అదుపులోనికి తీసుకున్నారు. కాగా ఆ దండగుడు సల్మాన్ రష్దీ మొడపై కత్తితో పొడిచాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్ప కూలిపోయారు. ఆయనకు వెంటనే ప్రథమ చికిత్స చేసి హెలికాప్టర్ లో ట్రామా సెంటర్ కు తరలించారు. అక్కడ సల్మాన్ రష్దీ కి చికిత్స జరుగుతోంది. రష్దీ ఏజెంట్ కథనం ప్రకారం రష్దీ ఆరోగ్య పరిస్థితి అంత్యంత విషమంగా ఉంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే కాలేయం కూడా దెబ్బ తింది అని పేర్కొన్నారు. కత్తి పోటును అడ్డుకునే ప్రయత్నంలో రష్దీ చేయి అడ్డు పెట్టుకున్నారనీ, దీంతో ఆయన చేతిలో నరాలు తెగిపోయాయనీ వివరించారు.   భారత సంతతికి చెందిన రష్దీ  ముంబైలో 1947లో రష్దీ జన్మించారు. ఆ తరువాతి కాలంలో బ్రిటన్ కు తరలి వెళ్లారు. 1981లో ఆయన రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలు లభించాయి.  ఆ తరువాత 1988లో ఆయన రచించిన ‘ది శైటానిక్ వర్సెస్’ వివాదాస్పదమైంది. పలు ఇస్లామిక్ సంస్థలు ఆయన పై మండి పడ్డాయి. ఆయనను హత్య చేస్తామంటూ బెదరింపులు కూడా వచ్చాయి. ఇరాన్ అయితే తమ దేశంలో దిశాటినిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా రష్దీ పై ఫత్వా కూడా విధించింది. దీంతో ఆయన దాదాపు దశాబ్దం పాటు పూర్తిగా ఆజ్ణాతంలో ఉన్నారు. ఆయన  ఎక్కడ ఉంటున్నదీ కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనీయలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై న్యూయార్క్ లో దాడి జరిగింది.

వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగ

మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగపెట్టేసిందా? పార్టీ నుంచి బహిష్కరించకుండానే ఆయనను ఏకాకిని చేసేసిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే కాదు.. స్టార్ క్యాంపెయినర్ కూడా. అయినా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన సమయంలో మునుగోడులో కాంగ్రెస్ ప్రచార సారథ్యం వెంకటరెడ్డిదే అని ఒక ఊరడింపు మాట తప్ప... ఆ తరువాత జరిగిన ఏ విషయంలోనూ, ఏ వ్యవహారంలోనూ వెంకటరెడ్డికి ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. కనీసం సమావేశాలకు కూడా పిలవడం లేదు. మునుగోడు ప్రచార కర్తల జాబితాలో ఆయన పేరు కూడా లేదు. ఎన్నికల సమావేశాలకు పిలవడం అటుంచి కనీసం ప్రచారానికి రమ్మని కూడా అనడం లేదు. ర్యాలీలు, పాదయాత్రలలోనూ ఆయనను దూరంగానే పెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే  కాంగ్రెస్ లో ఉండి కూడా  లేనట్టుగానే ఆయన పరిస్థితి ఉంది. కనీస అవగాహన ఉన్న ఎవరికైనా కాంగ్రెస్ ఆయనకు పొమ్మన లేక పొగపెడుతోందని ఇట్టే అర్ధమైపోతుంది. అలాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇంకా అర్ధం కాలేదని భావించలేం. కానీ ఆయన ఇంకా పార్టీలోనే ఉన్నారు. ఉండి ఊరుకోవడం లేదు. టీపీసీసీ చీఫ్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వాటిని పార్టీ పట్టించుకోవడం లేదని తెలిసినా ఆయన తన ప్రయత్నం తాను మానడం లేదు. సోదరుడి గొంతుకకు వంత పాడుతున్నట్లు ఆయన తీరు ఉందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయన పార్టీలో ఉన్నా బీజేపీ గూటికి చేరిన ఆయన సోదరుడిలాగే కాంగ్రెస్ చూస్తోంది. దీంతో అనివార్యంగా ఎవరూ పిలవకపోయినా, ఎవరూ ఆహ్వానించకపోయినా... ఆ విషయాన్ని దాచి పెట్టి మునుగోడు ఉప ఎన్నికతో తనకు సంబంధం లేదనీ, తానక్కడకు ప్రచరానికి వెళ్లబోవడం లేదనీ గంభీరంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనపై అనుచిత విమర్శలు చేయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తనను విమర్శించిన వారినీ, విమర్శించేలా చేసిన వారిని వదిలిపెట్టనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాళ్ల విషయం రాష్ట్ర కాంగ్రెస్ తో కాదనీ, ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోనే తేల్చుకుంటాననీ చెబుతున్నారు. అయితే ఆయన మాటలను కాంగ్రెస్ వర్గీయులే ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీలో ఉండీ లేనట్టేనని, ఆయన తీరు పట్ల హైకమాండ్ కూడా విసిగిపోయిందనీ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ కాదుకదా, కనీసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి అప్పాయింట్ మెంట్ దొరకడం కూడా కష్టమేనంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ ఎప్పుడో పరిగణనలోనికి తీసుకోవడం మానేసిందని అంటున్నారు. పార్టీ నుంచి కోమటిరెడ్డిని ప్రత్యేకంగా బహిష్కరించడం అంటూ ఉండదనీ, కానీ ఆయనకు కనీస గుర్తింపు కూడా లేని చోట ఉండలేని పరిస్థితి కల్పించడమే పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నీ తెలిసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని అడ్డు పెట్టుకుని ఉండటానికి కారణం.. పార్టీలో ఉంటూనే తన సోదరుడికి సాధ్యమైనంత మేలు చేసి ఆ తరువాత కమలం గూటికి చేరాలన్న వ్యూహమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  

ఇక బీజేపీకి దబిడి దిబిడే!

బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువు తీరిన అనంతరం జాతీయ స్థాయిలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీహార్ లో బీజేపీయేతర శక్తులన్నీ ఏకమైన విధంగానే జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు మార్గం సుగమమైందని పరిశీలకులు అంటున్నారు. గతంలోలా కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న పోటీ తీవ్రత గణనీయంగా తగ్గిందంటున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ లు చొరవ తీసుకుంటారని చెబుతున్నారు. వారి వెనుక ర్యాలీ కావడానికి జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలకు ఎటువంటి అభ్యంతరం ఉండక పోవచ్చునని అంచనా వేస్తున్నారు. బీజేపీ కూటమి ఏర్పాటు సన్నాహాలలో భాగంగానే తేజస్వి యాదవ్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అదినేత్రితో బేటీ అయ్యారని అంటున్నారు. సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఇక దేశ వ్యాప్తంగా బీహార్ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. బిహార్‌లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైన విధంగానే,  దేశ వ్యాప్తంగా కూడా రాజకీయ బీజేపీయేతర రాజకీయ పార్టీలు విభేదాలు విస్మరించి ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తేజస్వి యాదవ్ చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మతపర ఘర్షణలతో   ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీంతో ప్రజాభీష్టం మేరకు 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించడమే ఇప్పుడు దేశంలోని అన్ని బీజేపీయేతర పార్టీల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఆ బాధ్యతతోనే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడానికి సుముఖంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ లో అదే జరిగిందనీ, దేశ వ్యాప్తంగా ఇదే రిపీట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీహార్ పరిణామాలు   బీజేపీకి చెంపపెట్టు వంటివని అన్నారు.  ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. అయితే దేశంలో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం అసాధ్యమన్న తేజస్వి యాదవ్..బీజేపీకి ముందున్నది గడ్డుకాలమేనని పేర్కొన్నారు. కాగా తన హస్తిన పర్యటనలో సోనియాగాంధీతో పాటు  పలువురు విపక్ష నేతలతోనూ తేజస్వి ప్రసాద్ భేటీ అయ్యారు. 

బీజేపీ ఆశలపై నితీష్ ఎఫెక్ట్... 2024 ఎన్నికలు అంత వీజీ కాదు

బీహార్ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా బీజేపీపై పడిందా? నిన్న మొన్నటి దాకా తిరుగులేని పార్టీగా, 2024 ఎన్నికలలో ఒంటరిగా బీజేపీకే 300కు పైగా స్థానాలు వస్తాయంటూ అన్ని సర్వేలూ వెల్లడించిన పరిస్థితి మారిపోయిందా? అంటే తాజాగా వెలువడిన సీ ఒటర్ సర్వే ఔననే అంటోంది. నితీష్ ఎపిసోడ్ తరువాత బీజేపీ బలం గణనీయంగా తగ్గిందని మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే నిర్వహించిన సీ ఓటర్ సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి కనీసంలో కనీసం 21 సీట్ల తక్కువ వస్తాయని సర్వే వెల్లడించింది. ఆగస్టు 1కి ముందు నిర్వహించిన సర్వేలో బీజేపీ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని పేర్కొన్న ఆ సర్వే నితీష్ ఎపిసోడ్ తరువాత మాత్రం ఆ సంఖ్య 289కి పరిమితం అవుతుందని తేల్చింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు లభించినప్పటికీ మెజారిటీ మాత్రం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. భారీ విజయంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సాధారణ విజయంతో సరిపెట్టుకోవలసి వస్తుందని ఆ సర్వే పేర్కొంది. అయితే ఈ సర్వే అనంతరం విశ్లేషకులు రానున్న రోజులలో బీజేపీ బలం మరింత తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఒక్కటొక్కిగా మిత్ర పక్షాలు చేజారిపోతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక..కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ బలహీనతలు మరింత ప్రస్ఫుటంగా బయటపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించకుంటే.. ఆ పార్టీ ఇక తెలంగాణపై ఆశ వదిలేసుకోవలసిందేనని చెబుతున్నారు.

ది శాటానిక్ వర్సెస్ రచయత సల్మాన్ రష్దీపై దాడి

ప్రముఖ రచయత సల్మాన్ రష్దీపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ‘ది శాటనిక్ వర్సెస్’ పుస్తకం వివాదాస్పదమైంది. సల్మాన్ రష్దీ దైవ దూషణ చేశారంటూ ముస్లింలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ఆయనపై ఫత్వా విధించింది. రష్దీని  ఖతం చేసిన వారికి  3 మిలియన్ డాల్లర్లు నజరానా ప్రకటిస్తూ ఇరాన్ నజరానా ప్రకటించింది. ముస్లింల నుంచి బెదరింపులు ఎదుర్కొంటున్న రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. న్యూయార్క్ లోని ఒక విద్యా సంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా ప్రేక్షకుల్లోంచి వేదికపైకి దూసుకు వచ్చిన ఒక అగంతకుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు.  భారత సంతతికి చెందిన రష్దీ  ముంబైలో 1947లో రష్దీ జన్మించారు. ఆ తరువాతి కాలంలో బ్రిటన్ కు తరలి వెళ్లారు. 1981లో ఆయన రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలు లభించాయి.  ఆ తరువాత 1988లో ఆయన రచించిన ‘ది శైటానిక్ వర్సెస్’ వివాదాస్పదమైంది. పలు ఇస్లామిక్ సంస్థలు ఆయన పై మండి పడ్డాయి. ఆయనను హత్య చేస్తామంటూ బెదరింపులు కూడా వచ్చాయి. ఇరాన్ అయితే తమ దేశంలో దిశాటినిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా రష్దీ పై ఫత్వా కూడా విధించింది. దీంతో ఆయన దాదాపు దశాబ్దం పాటు పూర్తిగా ఆజ్ణాతంలో ఉన్నారు. ఆయన  ఎక్కడ ఉంటున్నదీ కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనీయలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై న్యూయార్క్ లో దాడి జరిగింది. వేదికపైకి దూసుకు వచ్చిన అగంతకుడు కత్తితో ఆయన మెడపై పొడిచాడు.  వెంటనే ఆయన కుప్పకూలిపోయారు. దాడికి పాల్పడిన అగంతకుడిని వేదికపై ఉన్న వారు పట్టుకున్నారు. కుప్పకూలిన రష్దీని హుటాహుటిన హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు. 

బ‌రితెగించిన ఢిల్లీ మెట్రో

భార‌త‌దేశం అన‌గానే అనేక సామాజిక క‌ట్టుబాట్లు, సంప్ర‌దాయాల పుట్టిల్లుగా ప్ర‌తీతి. మ‌హిళ‌ల‌ను గౌర‌వించే దేశంగా ప్ర‌సిద్ధి. వారిని అవ‌హేళ‌న చేస్తూ ఎలాంటి ప్ర‌చారాలు, సంభాష‌ణ జ‌ర‌గ‌నీయ‌ని దేశం. ఇంత‌టి  నిషేధాల సమాజంలో నిజానికి  సెక్స్ అండ్ సెక్సువాలిటీ గురించి బహిరంగంగా చర్చించరు. బహిరంగం గా వాటిపై చర్చపై దాదాపు నిషిద్ధం. కానీ ఆధునిక పోక‌డ‌లు క్ర‌మేపీ కాలంతో పాటు ఆధిప‌త్యం చెలాయి స్తుండ‌డంతో స‌మాజంలో కొంత మార్పు వ‌చ్చింది. కొన్ని క‌ట్టుబాట్ల‌ను ఇప్ప‌టి యువ‌త బొత్తిగా అంగీక‌రిం చ‌డ‌మూ లేదు. స్వేచ్ఛ‌పేరుతో చాలా హ‌డావుడే జ‌రుగుతోంది. కానీ ఢిల్లీ  మెట్రోవారు మ‌రింత  అతిగా వ్య‌వహ‌రించారు.  ఢిల్లీ మెట్రో కోచ్‌లో మహిళలకు మాత్రమే రిజర్వ్ చేసిన సీట్ల దగ్గర కండోమ్ యాడ్  పోస్టర్  వెలిసింది. కండోమ్ యాడ్ ఇలా బహిరంగంగా పోస్టు చేయడాన్నే చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. అదీ మహిళలు మాత్రమే కూర్చునే దగ్గర కనిపించడంతో వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధిం చిన ఫొటో ఒకటి వైరల్ అయింది. ఓ ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ఢిల్లీ మ‌రీ ఇంత పురోగ‌మించిందా.. అని మండిప‌డ్డాడు. ఇంకొం దరు ట్విట్టర్ యూజర్లకు అదేమీ పెద్ద విషయం కానిదిగా కనిపించింది. అంటే.. ఆ పోస్టర్‌లో తప్పేమిట‌ని ప్రశ్నించారు. ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ ఇలాంటి యాడ్స్‌ని ఏమాత్రం ఉత్సాహ‌ ప‌ర్చ‌కూడ‌దు. మ‌రీ ఇలాంటివి మ‌హిళ‌ల‌ను అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ని ప‌రిశీల‌కులు అంటు న్నారు.  అయితే, పోస్టర్ రభస పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వర్గాలు బుధవారం స్పందించాయి. ఆ యాడ్ చాలా కాలం నాటిదని, ఇప్పుడు అక్కడ లేదని, ఎప్పుడో తొలగించారని వివరించాయి.

పానీపూరీ... ఎంత రుచో అంత ప్ర‌మాదం!

సాయింత్రాలు స‌ర‌దాగా స్నేహితులు క‌లుసుకోవ‌డానికి పెద్ద అడ్డా పానీపూరీ బ‌ళ్లే. అందులో రుచి ఏమిటో గాని కుర్రాళ్లంతా ప‌రుగులు తీస్తుంటారు. గోలుగా ఉండే చిన్న పూరీలాంటి దానికి రంధ్రంచేసి పెద్ద కుండలోంచి చింత‌పులుసులాంటి నీళ్లుపోసి, కాసింత శెన‌గ‌లు,ఉల్లిముక్క‌లు వేసి ఇస్తాడు. అదో టేస్టు.. క‌బుర్ల‌లో ప‌డిన‌వారంతా లెక్క‌లే న‌న్ని తినేస్తుంటారు. బండివాడికి క‌ళ్ల‌లో మెరుపు... ఈపూట‌కి బాగానే సంపాదించాన‌ని!  అయితే ఇలాంటి చిరుతిళ్ల జోలికి వ‌ర్షాకాలం వెళ్ల‌వ‌ద్ద‌ని డాక్ట‌ర్లు ప్ర‌చారం చేస్తున్నారు. వ‌ర్షాకాలానికి, పానీ పూరీకి సంబంధంలేద‌ని తినేవాళ్లు మాత్రం అటుకేసి వెళుతూనే ఉన్నారు. దీనికి ప్రాంతాల‌తో సంబం ధం లేదు. ఈ రోజుల్లో దాదాపు అన్ని ప‌ట్ట‌ణాల్లో పానీపూరీ బళ్లు చాలా ఫేమ‌స్‌. మునుపు కాల‌క్షేపం బ‌ఠా ణీలు అనేవారు. ఇపుడు కాలంతో పాటు రుచులూ, చిరుతిళ్ల‌లో నూ మార్పులు వ‌చ్చేశాయి. అందుకే పానీ పూరీకి ప‌ట్టంగ‌ట్టారు. కానీ ఇది అంత ఆరోగ్య‌క‌రం కాద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు ప‌శ్చిమ బెంగాల్ సంఘ‌ట‌న‌ను ఉద‌హ‌రిస్తున్నారు.  పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలోని వీధి దుకా ణంలో చాలామంది పానీపూరీ తిన్నారు. అక్కడ పానీ పూరీ తిన్న వంద‌ మందికి పైగా అస్వస్థతకు గుర య్యారు. బాధిత వ్యక్తులు అతిసారంతో ఇబ్బంది పడుతున్నారు. విరోచనాలు, వాంతులు , కడుపు నొప్పి తో విలవిలలాడుతున్నారు. పానీపూరీ తినటం వల్లే అని వారు గుర్తించారు, సమాచారం అందుకున్న వైద్యఆరోగ్య శాఖ అధికారుల ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రోగులకు మందులు అందించారు. కొందరు తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్న కారణంగా వారిని ఆసుపత్రులకు తరలించారు. వారంతా డయేరియా బారిన పడినట్టుగా వైద్యాధికారులు గుర్తించారు. మొత్తం మూడు గ్రామాలకు చెందిన ప్రజలు సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలో  ఓ వీధి చివ‌రి బండి ద‌గ్గ‌ర  పానీపూరి తిన్నారు. అస్వస్థతకు గురైన వ్యక్తులు డోగాచియా, బహిర్ రణగాచా  మకల్తలా నివాసితులుగా తెలుస్తుంది. మే నెలలో మధ్యప్రదేశ్ లోనూ  పానీపూరి తినడం వల్ల 97 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మం డాలా జిల్లా లో సింగర్పూర్లో  జరిగిన ఓ జాతరకు వెళ్లిన పిల్లలు అక్కడ పానీపూరి తిన్నారు. తిన్న కాసేప టికే వాంతులు, విరోచనాలతో, కడుపు నొప్పితో బాధపడుతూ పిల్లలు అస్వస్థత కు గురి కావటంతో వారి ని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక ఇటువంటి అనేక ఘటనలు వర్షాకాలంలో ప్రధానంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పానీపూరీ తయారీలో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్లనే పానీ పూరి తిన్నవారు డయేరియా బారిన పడినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడిన వందమందికి వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. వారికి ప్రాణాపాయం లేకుండా చికిత్స చేస్తున్నారు. అందుకే వర్షాకా లం బయట పానీపూరీలు తినడం మంచిది కాదని సూచిస్తున్నారు.  సో, పిల్ల‌లూ, పెద్ద‌లూ పానీపూరీ జోలికి వెళ్ల‌వ‌ద్దు.

విజయమ్మకు లైఫ్ థ్రెట్.. కొత్త కారు టైర్లు పేలిన ఘటనతో సర్వత్రా అనుమానాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్  తల్లి  విజయమ్మకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె అనంతపురం జిల్లాలో ఓ వివాహనికి హాజరై.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో కర్నూలు నగర శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు ఎడమ వైపు రెండు టైర్లు ఒక్కసారిగా బరస్టయ్యాయి. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తమై.. కారు వేగాన్ని నియంత్రించడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలువురు విజయమ్మ క్షేమంగా ఉన్నందుకు ఊపిరి పీల్చుకుంటూనే ఆమెకు అంత పెద్ద ప్రమాదం ఎదురు కావడం పట్ల ఆందోళల వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కొత్త కారు అదీ ఖరీరైన అత్యాధునిక హంగులు ఉన్న కారుకు ఒకే సారి రెంటు టైర్లు బరస్ట్ కావడమేమిటన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కొనుగోలు చేసి ఇంకా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తికాని కారు టైర్లు రెండు ఒకే సారి బరస్ట్ కావడంపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కొనుగోలు చేసిన టొయోటా వెల్లిఫైర్ కారు ఖరీదు కోటిన్నర అని చెబుతున్నారు. అలాంటి కార్లకు అసలు టైర్లు పేలే అవకాశాలు అతి తక్కువ అని వివరిస్తున్నారు. అదీకాక ఇటువంటి ఖరీదైన కార్లు   ముందుగానే అన్ని టెస్టులూ చేసి, సేఫ్టీ మెజర్స్ అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే  డెలివరీ ఇస్తారని వాహన రంగ నిపుణులు అంటున్నారు. కొత్త టైర్లు బరస్టయ్యే అవకాశమే ఉండదనీ, అలాంటిది రెండు టైర్లు ఒకే సారి బరస్టవ్వడమేమిటని అంటున్నారు.    వైయస్ రాజశేఖరరెడ్డి భార్యగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ  అధ్యక్షురాలిగా   విజయమ్మకు ప్రజల్లో   గౌరవ ఉంది.   ఆమె కుమారుడు వైయస్ జగన్ ప్రస్తుతం ముఖ్యమంత్రగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మకు రక్షణగా ఓ ఎస్కార్టు వాహనం అయినా ఉండాలి.. లేకుంటే.. ఆమె భద్రత కోసం కనీసంలో కనీసం  ఇద్దరు  పోలీసులు అయినా ఉండాలని అయితే ఆమె ఎటువంటి భద్రతా సిబ్బందీ వెంట లేకుండా కేవలం ఇద్దరితో మాత్రమే ప్రయాణించడం పట్ల నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ఏపీ కేబినెట్‌లోని మంత్రులకు జగన్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. అలాగే   ఎమ్మెల్యేలకు సైతం గన్‌మెన్లను కేటాయించింది.  ఎస్కార్ట్ కూడా కేటాయించింది. మరి అలాంటప్పుడు.. మాజీ సీఎం వైయస్‌ఆర్ భార్యగా, ప్రస్తుత సీఎం వైయస్ జగన్‌కి తల్లిగా.. ఓ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వైయస్ విజయమ్మకు ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయమ్మ కారుకు జరిగిన ప్రమాదం తీరును గమనిస్తుంటే ఆమె ప్రణాలకు ముప్పు ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఈ భోజ‌నం కుక్క‌లు కూడా తిన‌వు.. కానిస్టేబుల్ మండిపాటు

జైల్లో దొంగ‌కి తిండి సంగ‌తి ఎలా ఉన్నా, పోలీస్ లైన్స్ మెస్‌లో మాత్రం భోజ‌నం బ‌హు రుచిగా  ఉండా ల్సిందే. ఏమాత్రం ఉప్పు త‌గ్గినా, కూర‌లో కారం ఎక్కువ‌యినా, నాన్‌వెజ్ రుచిగా లేక‌పోయినా మండిప‌డ తారా, స‌ర్దుకుపోతారా? ఏమోగాని మ‌నోజ్ కుమార్ అనే కానిస్టేబుల్ మాత్రం తిండి చాలా దారుణంగా ఉం ద‌ని ఏకంగా ప‌ళ్లెం చూపుతూ క‌న్నీళ్ల‌ప‌ర్యంత‌మై అంద‌రికీ తెలిసేలా చేశాడు.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఫిరోజాబాద్ పోలీస్ మెస్‌లో రోటీలు, అన్నం, ప‌ప్పు పెడ‌తారు. కానీ  అవి  ఏమాత్రం రుచి క‌రంగా ఉండ‌డంలేద‌ని, ప‌ప్పు మ‌రీ నీళ్ల‌గా ఉంటోంద‌ని ఈ తిండిని  క‌నీసం కుక్క‌లు కూడా తిన‌వ‌ని గోడు పెడుతున్నాడు. దీన్ని గురించి ఎస్‌.పికీ ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నాడు కానిస్టేబుల్ మనోజ్‌. ప‌న్నెండుగంట‌ల డ్యూటీ త‌ర్వాత ఇలాంటి తిండి తినాల్సి వ‌స్తోంద‌ని క‌న్నీళ్ల‌ప‌ర్యంత‌మ‌ య్యాడు.  ముఖ్య‌మంత్రి ఆదిత్య‌నాధ్ పోలీసు అధికారుల‌కు మంచి నాణ్య‌మైన ఆహారం అందేలా చూసేందుకు ప్ర‌త్యేకించి అల‌వెన్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ మెస్ లో మాత్రం తిన‌డానికి వీలులేని ఆహారాన్ని ఇస్తున్నార‌ని మ‌నోజ్ కుమార్ మండిప‌డ్డాడు. అస‌లు బ‌ల‌మైన తిండి తినక‌పోతే డ్యూటీ ఎలా చేస్తామ‌న్న‌ది ఆలోచిం చాల‌ని అన్నాడు. మెస్ కుంభ‌కోణంలో సీనియ‌ర్ సీపీ, డిసీపీ పాత్ర కూడా ఉంద‌ని ఆరోపిం చాడు.  మొత్తానికి మ‌నోజ్ కుమార్ ఫిరోజాబాద్ పోలీస్ మెస్ భాగోతం బ‌య‌ట‌పెట్ట‌డానికే ఏకంగా వీడియో చేసి మ‌రీ నెటిజ‌న్ల దృష్టికి రావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలాఉండ‌గా,  మెస్ వ్య‌తిరేకంగా చేస్తున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ న ప్ర‌దేశం నుంచి మ‌నోజ్‌ను పోలీసులు వేరే ప్రాంతానికి త‌ర‌లించారు. కాగా మెస్ ఆహారం విష‌యాన్ని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిరోజాబాద్ పోలీసులు సిటీ సీఓను కోరారు. 

వెంకయ్యను గిల్లి మోడీ జోల పాట

పిల్లాడిని గిల్లేసి.. ఆనక తీరిగ్గా జోలపాట పాడిందట వెనుకటికి ఓ మహాతల్లి.  తాజా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరు సరిగ్గా ఇలాగే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లేదా.. ఉప రాష్ట్రపతిగా రెండోసారి కొనసాగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంకయ్య నాయుడికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టేసిన మోడీ తీరిగ్గా ఆయనకు మూడు పేజీల ఫేర్ వెల్ లేఖ రాసిన తీరును విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో వెంకయ్య నాయుడు దేశానికి చేసిన సేవలను ప్రధాని మోడీ తన ఫేర్ వెల్ లేఖలో కొనియాడడం గమ్మత్తుగా ఉందంటున్నారు. పొగడడం, అంతటితో ఆగకుండా మోడీ భూదానోద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య వినోబా భావేతో వెంకయ్య నాయుడిని పోల్చిన వైనాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఏ విషయమైనా సూటిగా, సుస్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వినోబా భావేకు అద్భుతమైన నైపుణ్యం ఉండేదని, అలాంటి లక్షణమే వెంకయ్య నాయుడిలోనూ ఉందని మోడీ పొగడ్తలతో ముంచెత్తారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉప రాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన వెంకయ్య నాయుడి ప్రయాణం ఎంతో స్ఫూర్తిమంతం అంటూ మోడీ ప్రశంసించారు. అయితే.. అన్ని దశలూ దాటుకుని అంతటి ఘన కీర్తి పొందిన వెంకయ్యపై ఏ మాత్రం గౌరవం లేకుండా బలవంతపు విశ్రాంతికి పంపడం ఏమిటని పలువురు మొడీని సూటిగా ప్రశ్నిస్తున్నారు.  ఏపీలో అసలే ప్రాధాన్యం లేని బీజేపీ, రాజకీయ ఉద్యమంలో చేరడానికి వెంకయ్యను ప్రేరేపించిన నమ్మకం, నిబద్ధత ఎంత శక్తిమంతమైనవో ఊహించుకోవచ్చనేది మోడీ వక్తం చేసిన అభిప్రాయం. వెంకయ్య నాయుడి శక్తి అనంత ప్రవాహం లాంటిదనీ. దాన్ని వెంకయ్య నాయుడి చతురత, జ్ఞానంలో చూడొచ్చనీ. వెంకయ్య వేసే అంత్య ప్రాసలు బాగా ప్రాచుర్యం పొందాయని మోడీ స్వయంగా ఫేర్ వెల్ లేఖలో ప్రస్తావించారు. వాక్చాతుర్యమే వెంకయ్యకు గొప్ప బలం అన్నారు. వెంకయ్య నాయుడి మాటలు ఎప్పుడు విన్నా.. అత్యంత అనువైన పదాలతో విషయాన్ని స్పష్టంగా చెప్పిన వినోబా భావే తనకు గుర్తుకు వస్తారంటూ కితాబు ఇచ్చారు. వినేవారిని సమ్మెహితులను చేసి, విషయాన్ని సరళంగా అర్థమయ్యేలా చెప్పగలిగే వెంకయ్య నాయుడి సామర్ధ్యం అద్భుతం అని మోడీ కీర్తించారు. అక్కడితో సరిపెట్టని మోడీ ‘వెంకయ్య నాయుడి చతురతకు జీవితకాలం ఆరాధకుడిగా ఉంటాను’ అని ఆ ఫేర్ వెల్ లేఖలో పేర్కొన్నారు. వెంకయ్య వ్యక్తిగత సలహాలతో తాను వ్యక్తిగతంగా ఎంతో లబ్ధి పొందాననీ చెప్పారు. అయినప్పటికీ వెంకయ్య నాయుడికి సరైన ప్రాధాన్యం కల్పించేందుకు మాత్రం మోడీకి చేతులు, నోరు రాలేదేమని తెలుగు ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దేశ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై వెంకయ్య నాయుడి లోతైన ఆలోచనలు, చేసిన విశ్లేషణలను వినేందుకు జర్నలిస్టులు, మేధావులు కూడా ఎంతో ఆసక్తి, ఉత్సుకత చూపించేవారని మోడీ గుర్తుచేశారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పనిచేసిన విధానాన్ని బట్టి ఆయన శక్తి సామర్ధ్యాలను అంచనా వేయొచ్చనీ, రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు రాజ్యసభను నిర్వహించిన తీరు అద్భుతం అన్నారు. ప్రధాని మోడీ. అధికార, ప్రతిపక్ష సభ్యులతో వెంకయ్య నెరపిన సన్నిహిత సంబంధాలు సభలో సౌహార్ద్ర స్ఫూర్తిని నింపాయంటున్నారు. అలాంటి వెంకయ్య నాయుడికి ఉన్నత పదవిలో నిలబెడితే జాతి మరింత స్ఫూర్తి పొందుతుందని, ముందుకు వెళ్తుందని మీరు ఎందుకు భావించలేదని మోడీని జనం ప్రశ్నిస్తున్నారు. పేదరిక నిర్మూలన, సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత చూపించిన వెంకయ్య నాయుడు ప్రతి విషయాన్నీ ‘నేషన్ ఫస్ట్’ కోణంలో చూసేవారని మోడీ చెప్పుకొచ్చారు. అలా నేషన్ ఫస్ట్ భావనతో ఉండే వెంకయ్య నాయుడు దేశ ప్రథమ పౌరుడిగా పనికిరాలేకపోయారా? మోడీ గారూ అంటూ పలువురు నిలదీస్తున్నారు. వెంకయ్య నాయుడి అనుభవం, జ్ఞానం భవిష్యత్ లో శాసనకర్తలకు వెలలేని ఆస్తులుగా ఉపయోగపడతాయంటున్న మోడీ.. మరి ఆయనను రాష్ట్రపతిని చేయడానికి ఇంకేమి లోపం కనిపించిందో వెల్లడిస్తే బాగుంటుందంటున్నారు.

ఈడు మ‌గాడ్రా .. బుజ్జే ! 

బ‌స్సుల్లో, ఆటోల్లో చాలాసార్లు మ‌నం చాలాసార్లు రూపాయి, రెండురూపాయ‌లు వదిలేస్తూ ఉంటాం. చిల్ల‌ర లేద‌ని డ్రైవ‌ర్లు నొక్కేస్తుంటారు. కానీ తుంగ‌నాధ్ చ‌తుర్వేదీ ఇర‌వై రూపాయ‌ల కోసం ఏకంగా రైల్వే వారిని క‌న్స్యూమ‌ర్ కోర్టుకు ఈడ్చాడు. ఇర‌వ‌య్యేళ్లు కేసు న‌డిచిన త‌ర్వాత ఆయ‌న‌కు రూ.15000 చెల్లించ‌మ‌ని కోర్టు ఆదేశించింది. దేశంలో క‌న్స్యూమ‌ర్ చ‌ట్టం అంటూ ఒక‌టి ఉంద‌ని చాలామంది ఇప్ప‌ టికైనా తెలుసు కుంటే మంచిది. చ‌తుర్వేది అనే లాయ‌రు 1999లో మ‌ధుర‌నుంచి మొరాదాబాద్‌కు రైల్లో వెళ్లారు. టిక్కెట్ విష‌యంలో పెద్ద గొడ‌వే జ‌రిగింది. అప్ప‌ట్లో మ‌ధుర నుంచి  మొరాదాబాద్‌కు టిక్కెట్‌  35 రూపాయ‌లు. కానీ బుకింగ్ కౌంట‌ర్ లో ఇర‌వై రూపాయ‌లు ఎక్కువ తీసుకున్నారు. ఆయ‌న వంద‌రూపాయ‌లు ఇస్తే 70 రూపాయ‌లు తీసుకోవా ల్సింది 90 రూపాయ‌లు తీసుకుని ప‌ది రూపాయ‌లు ఇచ్చారు. చ‌తుర్వేది రైల్వే అధికారుల‌కు ఫిర్యాదు చేస్తే భ‌య్యా, జ‌ర లైట్ తీసుకో అన్నార‌ట‌. ఆయ‌న‌కి కోపం వ‌చ్చింది. అంతే వెంట‌నే ఈశాన్య రైల్వే బుకిం గ్ క్ల‌ర్క్ మీద క‌న్స్యూమ‌ర్ కోర్టులో కేసు వేశారు. వందకు మించి కోర్టు వాద‌న‌లు జ‌రిగాయి. అన్ని రోజు లు అన్నిసార్లూ చ‌తుర్వేది కోర్టుకు వెళ్లారు. ఆయ‌న‌ నిజానికి అంత ఆరోగ్య‌వంతుడు కాదు. అయినా రైల్వే క్ల‌ర్కుకు, రైల్వే వారికి బుద్ధిచెప్పాల‌న్న ప‌ట్టుద‌ల‌తోనే చాలా స‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు.  ఈ కేసు 22 ఏళ్లు న‌డిచింది. చివ‌రికి సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన ఒక కేసు తీర్పు ఆధారంగా ఇలాంటి కేసులు క‌న్స్యూమ‌ర్ కోర్టు తీర్పు ఇవ్వ‌చ్చ‌ని తేలింది. అంతే రైల్వేవారికి గుండెల్లో రాయి ప‌డింది. అస‌లు అప్పుడే ఆ ఇర‌వై రూపాయ‌లు ఇచ్చుంటే స‌రిపోయేది. ఏదో ముస‌లాయ‌న క‌దా ఏం చేస్తాడులే అని క్ల‌ర్కు లు ద‌బాయించారు. కానీ క‌న్స్యూమ‌ర్ కోర్టు తీర్పు తాట‌తీసింది. చ‌తుర్వేదీకి వ‌డ్డీతో స‌హా 15000 నెల రోజుల లోపు  చెల్లించాల‌ని ఆదేశించింది. మొన‌గాడంటే ఈడ్రా బుజ్జీ అన్నారు మ‌ధుర‌ వారంతా!