మునుగోడు మండలం ఇన్‌ఛార్జి సీతక్క
posted on Aug 16, 2022 @ 11:44AM
మునుగోడు సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గ వ్యూహా లు రచిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపి ఉత్సాహంగా ఉరకలువేయించడానికి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి మంగళవారం (ఆగష్టు 16)నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డి నిర్వహించనున్న పాదయాత్ర నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఇన్ ఛార్జులను నియమించారు.
చౌటుప్పల్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి; నారాయణపూర్: బలరాం నాయక్, గండ్ర సత్యనారాయణ; మునుగోడు: సీతక్క, విజయ రామారావు; నాంపల్లి: అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి; గట్టుప్పల్: ఎస్ఏ సంపత్ కుమార్, ఆది శ్రీనివాస్; చండూరు: ఈరవత్రి అనిల్, డాక్టర్ వంశీకృష్ణ; మర్రిగూడ: చెరకు సుధాకర్, వేం నరేందర్ రెడ్డిని నియమించారు.
వారంతా తమ మండలాల పరిధిలోని పార్టీ నాయకులతో సమావేశమవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలి పాయి. ఈ నెల 16న నాంపల్లి, మర్రిగూడ.. 17న ఆశావహులతో సమావేశం.. 18న మునుగోడు, చండూ రు..19న సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం ఒక మండలం, సాయంత్రం మరో మండలంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉపఎన్నికలో గెలుపు నకు అనుసరించా ల్సిన వ్యూహం, కేడర్‌ను, ప్రజాప్రతినిధులను కాపాడుకోవడం, ఎన్నిక పూర్త య్యే వరకు ప్రతి గ్రామానికి 8 మందితో ఒక కమిటీ వేయడం.. ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటి ఎజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి.