ముఖేష్ అంబానీని బెదిరించింది న‌గ‌ల‌వ్యాపారి

దేశంలో ఇటీవ‌లికాలంలో ధ‌నికులు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు బెదిరింపు కాల్స్ రావ‌డం, బ్యాంకు దోపిడీలు జ‌ర‌గ‌డం వింటున్నాం. త‌ర‌చూ దేశంలో ఎక్క‌డో ఒక ప్రాంతంలో బ్యాంకు దోపిడీ జ‌రుగుతూనే ఉంది. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ముఖేష్ అంబానీ ఇటు వంటి సంఘ‌ట‌న‌లు ఎదుర్కొన‌డం ఇది రెండవ‌సారి. గతేడాది ఫిబ్రవరిలో ముంబైలోని అంబానీ నివాసం  సమీ పంలో పేలుడు పదార్థాలతో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) దొరికింది. అనంతరం పోలీసు అధికారులతో సహా కొందరిని అరెస్టు చేశారు. కాగా తాజాగా ఆయ‌న‌ను బెదిరించిన‌వాడు న‌గ‌ల వ్యాపారి భౌమిక్‌గా గుర్తించారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని దక్షిణ ముంబైకి చెందిన విష్ణు భౌమిక్ అనే నగల వ్యాపారిగా గుర్తించారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని ఆసుపత్రికి ఫోన్ చేసి బెదిరించిన సౌత్ ముంబై నగల వ్యాపారి తప్పుడు గుర్తింపుతో మొత్తం ఎనిమిది సార్లు కాల్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విష్ణు భౌమిక్ అనే అనుమానితుడు కాల్ చేస్తున్నప్పుడు అఫ్జల్ అని పేర్కొన్నాడు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు సోమవారం(ఆగస్ట్ 15 ) అనేక బెదిరింపు కాల్‌లు వచ్చాయి. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో రిలయన్స్ ఫౌండేషన్ వారి హర్స్కిసాందాస్ హాస్పిటల్ నంబర్‌కు కాల్స్ వచ్చాయి. 56 ఏళ్ల భౌమిక్ కూడా ఒకసారి బెదిరింపు కాల్స్‌లో ధీర్బుభాయ్ అంబానీ పేరును ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. దహిసర్‌లో నివాసముంటున్న భౌమిక్‌ నేరచరిత్రను పోలీసులు ధృవీకరిస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 506(2) కింద నగల వ్యాపారిపై కేసు నమోదు చేశారు. కొన్ని కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోరినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ముఖేష్ అంబానీని బెదిరించి దుర్భాషలాడాడు. క్రిమినల్ బెదిరింపులు మరియు బెదిరింపులు జారీ చేసినందుకు సెక్షన్ 506(2) కింద అతన్ని అరెస్టు చేశారు" అని డిసిపి నీలోత్పాల్ మీడియాకి తెలిపారు. పోలీసులు ప్రస్తుతం నిందితు డిని విచారిస్తున్నారు, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

రుజువు కోసం పాము తెచ్చాడు!

బ‌డికి వెళ్లేవాడు టీచ‌ర్ ఏమ‌డు గుతుందా అని భ‌య‌ప‌డ‌తాడు. హోంవ‌ర్క్ చూపినా నువ్వే చేశావా? అని వెయ్యి అనుమానాల‌తో రెండు ప్ర‌శ్న‌లన్నా అడుగుతుంది టీచ‌ర్‌. అందుకే లెక్క‌ల పుస్త‌కంలో లెక్క‌, హోంవ‌ర్క్ చేసిన‌ది ఒకటేన‌ని చూప డానికి ఓ పిల్లాడు వాళ్ల‌మ్మ‌ చేత ఫోన్ చేయించి మ‌రీ చెప్పించా డ‌ట‌. అప్పుడుగాని ఆ టీచ‌ర్ న‌మ్మ‌ లేదు. అదుగో అలాంటి ప్ర‌శ్న‌ ల‌తో చంపు తార‌నే రామేంద్ర యాద‌వ్ ఓ చిన్న ప్లాస్టిక్ బాటిల్‌లో ఏకంగా చిన్న పామును బంధించి మ‌రీ డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి తీసికెళ్లాడు. వాళ్ల ప్రిస్క్రిప్ష‌న్ లా వారి ప్ర‌శ్న‌లు బొత్తిగా అర్దంగావుగ‌దా.. అందుక‌ని! ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉన్నావ్ జిల్లాలో రౌఅఫ్జ‌ల్ న‌గ‌ర్‌ రామేంద్ర యాద‌వ్ నివాసం. ఆమ‌ధ్య ఒక రోజు ఆయ‌న భార్య ఇంటి పెర‌ట్లో ప‌ని చేస్తుండ‌గా ఓ పాము వ‌చ్చి కాటేసింది. అంతే ఆమె విల‌విల‌లాడిపోయింది. ఆమె అరుపుల‌కు యాద‌వ్ వ‌చ్చి చూసేస‌రికి ఆమె ప‌డిపోయి ఉంది. వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి తీసికెళ్ల‌బోయాడు. అంత‌లో పాము అక్క‌డికి ద‌గ్గ‌ర‌లోనే ఉండ‌డం చూశాడు. దాని నెత్తిన ఒక్క‌టి కొట్టి ఓ ప్లాస్టిక్ సీసాలో పెట్టి బూచాడిని బంధించిన‌ట్టు చేసి ఆ సీసాతో పాటు ఆస్ప‌తికి భార్య‌ను తీసికెళ్లాడు.  ఆయ‌న హ‌డావుడి చూసి డాక్ట‌రు వ‌చ్చి ఏమ‌యింద‌ని అడిగాడు. పాము కాటు వేసింది. వెంట‌నే వైద్యం చేయండిబాబా, లేకుంటే చ‌నిపోతుందేమో అని భ‌యంతో వేడుకున్నాడు. డాక్ట‌రు ఇంకా ఏదో అడ‌గ‌బోయాడు. అంత‌లో సీసాలో ఉన్న పాముని చూపిం చాడు. అది చూసి డాక్ట‌ర్ ఖంగారుప‌డి అదెందుకు తెచ్చావ‌య్యా సామీ.. అని అడిగాడు. అబ్బే ఏంలేదు, పాము క‌రిచింది అన గానే అది ఏ పాము, దాని జాతేందీ.. అడుగుతారు గ‌దా.. అందుకే చూపిస్తే స‌రిపోద్ద‌ని తెచ్చా సార్‌! అన్నాడు చ‌క్క‌గా సీసాలో క‌దులుతున్నా పామును చూపించి. అయితే  సీసాలోని పాము చావకుండా గాలి లోపలికి వెళ్లేలా రంధ్రాలు చేశాడు అదీ చిత్రం.  అత‌ని భార్యకి వైద్యంచేశారు. ఆమె బ‌తికింది. యాద‌వ్ ఆ పామును అడ‌విలో వ‌దిలేశాడు.

బండి సంజ‌య్ యాత్ర‌పై టీఆర్ ఎస్ రాళ్ల‌దాడి

అనువుగాని చోట అణ‌ కువ‌గా ఉండా ల‌న్నారు పెద్ద‌లు. పాపం బండి సంజ‌ య్‌కి ఇది అం త‌గా ప‌ట్టిం పు లేన‌ట్టుంది. అప్పుడే అధి కారంలోకి వ‌చ్చేసిన‌ట్టు సుదీర్ఘ ఉప‌ న్యాసాల‌తో ఆక‌ట్టుకుని త‌న బీజేపీకి తెలంగాణాలో మ‌హోప‌కార్యం చేయాల‌న్న అత్యు త్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే ఉన్నాయి.ఆయ‌న త‌మ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌న‌గామజిల్లా దేవ‌రుప్పుల గ్రామం లో తిరుగుతూండగా ఊహించ‌ని ప్ర‌శ్న‌ల‌కు త‌ట్టుకోలేక‌పోయారు. అక్క‌డి టిఆర్ ఎస్ అభిమానులు తిర‌గ‌బ‌డి రాళ్ల‌దాడి చేశారు.  బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్రలో  మధ్యలో మైలారం దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా మోహరించారు. బండి సంజ య్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సంజయ్‌కి స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చారు. పోటాపోటీ నినా దాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం(ఆగ‌ష్టు 15) ఉదయం ప్రారంభమైంది. సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలం గాణా బీజేపీ అధ్య‌క్షుడు బండిసంజ‌య్ రాష్ట్రంలో వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మే అన్న ధీమాతో మ‌రిత రెచ్చిపోయి ప్ర‌సంగాలు చేయ డం ఆన‌వాయితీగా మారింద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. దేవురుప్పుల గ్రామంలో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ రాష్ట్ర యువ‌త‌కు ఎన్ని ఉద్యోగాలిచ్చాడో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇంకా విమ‌ర్శ నాస్త్రాలు సంధిస్తుండ‌గా టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త ఆయ‌న్ను మీ మోదీగారు  ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని జనంలో నుంచి వ్యక్తి నిల దీశాడు. దీంతో ఘాటుగా స్పందించిన బండి సంజయ్ త‌న స‌హజ పంథాలో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇవ్వ‌మ‌ను, త‌మాషాలు చేస్తున్నారా? యూజ్లెస్ ఫెలోస్... తెలంగాణ ఎవరు తెచ్చారు, మీ కేసీఆర్ తెచ్చాడా. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పెన్షన్లు ఇవ్వు మను, రైతు రుణమాఫీ చేయుమను కేసీఆర్‌ని. దళితున్ని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేరు, దళితులకు మూడెకరాలు ఎం దుకు ఇవ్వడం లేదని విమర్శలు చేశారు.  అప్ప‌టిదాకా ఆయ‌న మాట తీరుకు  రెచ్చిపోయిన టీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలు కూడా ధీటుగా స్పందించడంతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన నిర్మల మల్లారెడ్డి, రాములు కార్తీక్ తీవ్రం గా గాయపడ్డారు. వారిని పోలీసులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. 

జెండా ఆవిష్కరణ వేళ విషాదం.. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేళ విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో జెండా ఎగురేసేందుకు ప్రయత్నిస్తూ విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనీల్ కుమార్ గౌడ్ (40), తిరుపతి (42) లు సాతంత్ర్య దినోత్సవ వేళ పతాకావిష్కరణ చేస్తున్నారు. అయితే జెండా కర్ర పైనున్ విద్యుత్ వైర్లకు తాకింది. ఈ విషయం గమనించని ఇరువురూ పతావిష్కరణకు ప్రయత్నించారు. దీంతో ఇరువురికీ కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో అనిల్ కుమార్ గౌడ్, తిరుపతి అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి ధనుంజ్ గాయపడ్డారు. గాయపడిన ధనుంజయ్ ను ఆసుపత్రికి తరలించారు. పంద్రాగస్టు వేడుకలో జరిగిన ఈ దుర్ఘటనతో అంతటా విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 

స్వాతంత్ర్య దినోత్సవ వేళ పిల్లలతో మోడీ ముచ్చట్లు

నేటి బాలలే రేపటి పౌరులు.. ప్రధాని మోడీ ఆ రేపటి పౌరులతో మమేకమై వారిని ఉత్సాహ పరుస్తూ వారి మధ్య కలియదిరిగారు. వారు నృత్యం చేస్తుంటే చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఈ దృశ్యం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద కనిపించింది. ఎర్రకోట బురుజుల మీద నుంచి ప్రసంగించిన అనంతరం ప్రధాని మోడీ ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమానికి వచ్చిన చిన్నారుల వద్దకు వెళ్లారు. దేశ పటం ఆకారం లో కూర్చుని ఉన్న వారి వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. వా రిని వారి వారి సంప్రదాయాలకు అనుగునంగా నృత్యం చేయమని ప్రోత్సహించారు. చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. మోడీ చిన్నారులతో కలిసి ముచ్చటించడం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ లో లేదు. హఠాత్తుగా ప్రధాని పిల్లల మధ్యకు వెళ్లి వారితో ముచ్చటించడం, వారి మధ్య కలియదిరగడంతో పిల్లలలో ఉత్సాహం వెల్లివిరిసింది. వారంతా మోడీతో మాట్లాడేందుకు, ఆయనతో కరచాలనం  చేసేందుకు పోటీ పడ్డారు. 

దేశానికి చెదపు రుగులు అవినీతి, వారసత్వం

దేశాన్ని అవినీతి, వారసత్వం చెదపురుగుల్లా తొలిచేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయడం ప్రధానిగా మోడీకి ఇది తొమ్మదో సారి. ఈ సందర్భంగా ప్రధాని ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ప్రజలంతా ఏకమై దేశం నుంచి అవినీతినీ, వారసత్వ సమస్యనూ తరిమేయాలని పిలుపునిచ్చారు. అవీనీతిని నిర్మూలిస్తే సామాన్యుడి జీవితం మెరుగౌతుందన్నారు. అవినీతి పరులను క్షమిస్తే ప్రగతిని ప్రతిబంధకమన్నారు.  అమృత్ మహోత్సవాల సందర్భంగా కొత్త దశ, దిశను ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన ముందున్న మార్గం కఠినమై న‌ద‌ని, ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్ స్వతం త్రంగా మనుగడ సాగించలేదని, ముక్కలు చెక్కలు అవుతుందన్న‌ వారి అభిప్రాయం తప్పని నిరూపించామన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి దన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలమని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని, ఆజాదీకా అమృత మహోత్సవ వేళ భారతీయులందరికీ  స్వాతంత్ర్య దినో త్సవ శుభాకాంక్షలు చెప్పారు.  ఈ సందర్భంగా దేశ స్వాతం త్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవస రం ఉందన్నారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్‌లకు మనం రుణపడి ఉండాలన్నారు.  దేశంలోని ప్రతి ఒక్క పేద వారికీ సాయం అందేలా చూడటమే తన జీవిత లక్ష్యమన్నారు. 130 కోట్ల మంది ప్రజలు రాజకీయ సుస్థిరత ఫలాలను చూస్తు న్నా రన్న ప్రధాని.. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో ప్రైవేటు రంగానిది కూడా కీలక పాత్రని, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ దశాబ్దం ఖచ్చితంగా టెక్నాలజీదేనని, దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. జైజవాన్‌, జైకిసాన్‌, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్‌ అన్నారు. రసాయన ఎరువులపై ఆధారపడడం తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు. వికసిత భారతం, బానిసత్వ నిర్మూలన, వారసత్వం, ఏకత్వం, పౌర బాధ్యత ఇవే మన పంచ ప్రాణాలని ప్రధాని మోదీ వ్యాఖ్యా నించారు. వచ్చే పాతికేళ్లు  పంచ ప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపిచ్చారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్‌లు మన ప్రతిభకు నిదర్శనమన్న ప్రధాని మోదీ..రెండు, మూడు స్థాయిల్లోని నగరాల నుంచి కూడా  ప్రతిభ వెలుగులోకి వస్తోంద న్నారు. మన సామర్థ్యాలపై మనం విశ్వాసం ఉంచాలన్నారు. మన దేశం ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించింద న్నారు. ప్రపంచ అవ సరాలను తీర్చే సత్తా భారత్‌కు ఉందన్నారు.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌మ ప్ర‌సంగానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనం తరం ఎర్ర కోటకు చేరుకున్న ప్రధాని మోదీకి.. త్రివర్ణ దళాల చీఫ్‌ల సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. గన్ సెల్యూట్ కోసం తొలిసారిగా దేశీయంగా రూపొందించిన హౌవిట్జర్ తుపాకులను ఉపయోంచారు. స్పెషల్ యూత్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌లో భాగంగా.. 14 దేశాలకు చెందిన 26 మంది ఆఫీసర్లు, 127 మంది క్యాడెట్లు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా దేశ రాజ ధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పది వేల మందికిపైగా భద్రతా సిబ్బందితో ఎర్రకోట వద్ద బహుళ అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.

ఇదేం వెర్రిరా నాయ‌నా..! 

రెండు స్థంభాల‌కు తాడు గ‌ట్టి ఓ పిల్ల క‌ర్ర ఆదారంతో ఆ తాడు మీద న‌డుస్తూ ఒక వేపు నుంచి మ‌రో వేపు న‌డుస్తుంది. ఈలోగా నేల మీద జ‌నం చూస్తు ఆశ్చ‌ర్య‌ పోతూంటారు. ఒక‌డు డ‌ప్పు వాయిస్తూ పాటందుకుం టాడు.. ఇది మ‌నం చిన్న‌పుడు చూసిన‌, ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేని గొప్ప ఫీట్. దీనికే  మ‌నం  ఓర్నీ ఏం న‌డిసిందిరా! అనుకున్నాం. మ‌రో వ్య‌క్తి కాలుతున్న క‌ర్ర‌ముక్క కిల్లీ వేసుకున్న‌ట్టు నోట్లో వేసుకుని క్ష‌ణం త‌ర్వాత త‌న‌కేమీ తెలీన్న‌ట్టు బ‌య‌టికి ఉమ్మేస్తా డు. ఇదో గొప్ప ఫీట్‌! మ‌రి గాల్లో పుల్ల‌ప్స్ చేసేవాడిని చూస్తే ఏకంగా గుండె ఆగిపోతుందేమో! ఇటీవ‌లికాలంలో ఫిట్నెస్ పిచ్చి పెద్ద పెద్ద న‌గ‌రాల నుంచి మారుమూల ప‌ల్లెల వ‌ర‌కూ ప‌ట్టుకుంది. కుర్రాళ్ల‌కి వారి సినీ హీరోలు స‌ల్మాన్‌, ప్ర‌బాస్‌లా త‌యారైపోతే అమ్మాయిలు ఢామ్ అని ప‌డతార‌ని గొప్ప న‌మ్మ‌కం. ఈ పిచ్చిలో అనేక వ్యాయామాలు చేస్తున్నారు. ఆరోగ్యానికి చేసే వ్యాయామాల‌కు ప‌రిమితి ఉంటుంది. కానీ ఓవ‌రాక్ష‌న్ చేస్తే అది ప్ర‌మాదాన్ని కొనితెచ్చుకున్న‌ట్టే అవుతుంది. అన్న‌ట్టు ఈ ఫిట్నెస్ పిచ్చి ప్ర‌పంచ‌దేశాల్లో ఏకంగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కెంత‌గా ప‌ట్టింది. ఏదో ఒక‌టి చేసే బదులు పుష‌ప్స్ చేసి రికార్డుల్లోకి ఎక్కాల‌నే కుర్రాళ్ల సంఖ్య మ‌రీ పెరిగిపోయింది. ఆ మ‌ధ్య స్టాన్ బ్రౌనీ స్నేహితుడు అర్జెన్ ఆల్బ‌ర్స్ ఏకం గా ప్ర‌పంచ‌రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడ‌ట‌. అత‌ను వాళ్లింటో పుష‌ప్స్ చేస్తూ జ‌నాన్ని, గిన్నిస్ సంస్థ అధికారుల‌ను పిలిచి టీలు, కాఫీలు ఇచ్చి వాళ్లెదుట పుష‌ప్స్ చేయ‌లేదు. అత‌గాడి పిచ్చికి ఏకంగా హెలికాప్ట‌ర్ కావాల్సి వ‌చ్చింది. అదెలా సేసేడ్రా బావా.. అని మ‌నూళ్లలో అనుకునేలాగానే పూర్తి చేసి రికార్డు సాధించారు.   ఈ ఏడాది జూలై 6న బెల్జియం  ఆంట్వ‌ర్ప్‌లో స్టాన్‌, ఆల్బ‌ర్స్ లు ప్ర‌పంచ‌రికార్డు అధిగ‌మించే పుల‌ప్స్ పోటీకి సిద్ద‌ప‌డ్డారు. హెలికా ప్ట‌ర్ వెళుతూంటుంది, దానికి వేలాడుతూ పుల‌ప్స్ చేయ‌డం. ఏమాత్రం ప‌ట్టు త‌ప్పినా, చేసే క్ర‌మం త‌ప్పినా మ‌నిషి ద‌క్క‌డు. కానీ వాళ్లిద్ద‌రికీ ప్రాణాల‌కంటే ప్ర‌పంచ రికార్డు మీదే ప్రేమ‌. అదే సాధించారు. వీళ్లు ఏకంగా 25 పుల‌ప్స్ తీసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.  వీళ్లు సామాన్య‌లు కాద‌నుకున్నారు అంద‌రూ. కింద‌కి రాగానే తాకి మ‌రీ చూశారు.. బ‌తికే ఉన్నారా, పోయా రా అని! ఇలా హెలికాప్ట‌ర్ పుల‌ప్స్ చేయ‌డం ఇపుడు ప్ర‌పంచ‌పోటీల్లో భాగం చేస్తార‌ట‌! 

ఐటి రంగం అభివృద్ధి  మ‌న కృషే  ... చంద్ర‌బాబు

దేశ సమైక్యత విషయంలో తెలుగు దేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని, టెలీ కమ్యూ నికేషన్ రంగంలో మార్పులకు తెలుగు దేశం పార్టీ నాంది పలికిందని టీడీపీ జాతీయ అధ్య క్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా, చేబ్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లా డుతూ, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణానికి కృషి చేశామని,  మనం చేసిన కృషి కారణంగా ఐటి రంగం అభివృద్ధి జరిగిం దని, ఇప్పుడు  అదే వెన్నెముకగా మారిం దన్నారు.     స్వాతంత్య్రం నుంచి దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. కరోనాను లెక్క చేయకుండా దేశా నికి అన్నం పెట్టడానికి శ్రమించిన రైతులను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. ఒకనాడు పేదరికంలో మగ్గిన దేశం  నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి వచ్చిందని, రక్షణ రంగంలో ఎంతో పురోభివృద్ధి సాధించామన్నారు. సొంతగా ఆయుధాలు తయారు చేసుకుంటున్నామన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత పేదరికం, రైతుల ఆత్మహత్యలు, రహదారులు లేకపోవటం వంటి సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ విధానాల వల్ల సమస్యలు వస్తాయన్నారు. విదేశి పాలనలో దేశం దోపిడీకి గురైందని, ప్రజలు బానిసత్వంలో మగ్గారని, విదేశీ పాలనలో పేదరికం, కరవు కాటకాలు అనుభ వించారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అన్నారు.  నెహ్రూ నుంచి పీవీ నరసిం హారావు , వాజ్ పేయి వంటి వారు దేశం కోసం ఎన్నో పనులు చేశారని కొనియాడారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో విషయాల్లో ముందున్నారని, ప్రపంచంలో మేటైన మేధావులు ఉండే దేశం మనదని, పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు మన దేశాన్ని ప్రపం చంతో పోటీ పడేలా చేశాయన్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావుని కూడా స్మరించు కోవా లన్నారు. పేద ప్రజలకు మేలు చేయటం కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు. రాబోయే పాత‌కేళ్లలో ఏం చేయాలో ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. విలువలతో కూడిన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని, లేకపోతే సమాజం విచ్ఛిన్నం అవుతుందన్నారు. మేము తీసుకున్న చర్యల వల్ల రైతు బిడ్డలు కూడా ఐటి రంగంలోకి వచ్చారని, అప్పుడు వేసిన విత్తనం ఇప్పుడు వృక్షంగా మారి ఫలసాయం వస్తోందన్నారు.  ప్రపం చంలోని పెద్ద పెద్ద కంపెనీలకు మన వాళ్లే సీఈవోలుగా ఉన్నారని, అది తెలుగువారి సత్తా.. బారతీయుల సత్తా అని అన్నా రు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పోవాలని, వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదన్నారు. విద్య, ఆరోగ్యం విషయంలో ఇంకా ముం దుకు పోవాలని, త‌మ పాల‌న‌లో తెచ్చిన మహిళా రిజర్వేషన్లతో వారు చదివి, ఉద్యోగాల్లో స్థిర పడ్డారని, పురుషులతో సమానంగా పోటీ పడి ముందుకు వెళ్తున్నారన్నారు.  నదుల అనుసంధానం ఈ దేశంలో చిరకాల వాంఛ అని, నదీ జలాలను సముద్రంలో కలవ కుండా సద్వినియోగం చేసుకోవాల న్నారు. టీడీపీ హయాంలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసి చూపామని, గంగా, కావేరి నదుల అనుసంధానం చాలా ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి ఉన్నచోట అభివృద్ధి జరగదన్నారు. జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవా సులు కృషి చేయాలని పిలుపిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు ఆదర్శమని, మహత్మా గాంధీ చేసిన పోరాటం  ప్రపంచానికి స్ఫూర్తి అని, మన గౌరవం, ప్రతిష్ట పెరగాలంటే దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. 

కేంద్రం అస‌మ‌ర్ధ‌త‌వ‌ల్ల‌నే ఆర్ధికవ్య‌వ‌స్థ కుంటుప‌డింది... కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గొల్కొండ కోటపై సీఎం జాతీయ పతా కాన్నిఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, కేంద్రం రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయంపై ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం లో కేంద్రం మొండి చేయి చూపిస్తోందంటూ మండి పడ్డారు. రైతుల ఉద్య మంతో కేంద్రం రైతు నల్లచట్టా లపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. టాక్సుల పేరిట జనాన్ని దోచుకుంటోందని విమర్శిం చారు. చిన్న పిల్లలు తాగే పాలు, స్మశాన వాటిక నిర్మాణంపై కేంద్రం ఎడాపెడా పన్నులు వేస్తోందని తీవ్రస్థాయిలో విరు చుకుపడ్డారు. ఉచితా లపై కేంద్రం రాష్ట్రాలను అవమ నిస్తోందన్నారు. కేంద్రం తీరు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.  కేంద్ర అస‌మ‌ర్ధ నిర్వాకం వ‌ల్ల‌నే దేశ ఆర్ధిక వ్య‌వస్థ కుంటుప‌డింద‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. దేశంలో నిరుద్యోగం తీవ్ర‌మ‌వు తోంద‌ని కేంద్రంలోని వారు నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని సీఎం మండిప‌డ్డారు. రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉన్న‌వారే నేడు ఫాసిస్టు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. దేశ త‌ల‌స‌రి ఆదాయం కంటే తెలంగాణా త‌ల‌స‌రి ఆదాయం 84 శాతం ఎక్కువ గా ఉంద‌న‌ని ఆయ‌న వెల్ల‌డిచారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం ద‌ళిత‌బంధు అనే ప‌థ‌కాన్ని గొప్ప‌గా అమ‌లుచేస్తోంద‌న్నారు. ఈ ప‌థ కం దేశానికి దిశా నిర్దేశం చేస్తోంద‌ని, ప్ర‌భుత్వం వ‌జ్ర‌సంక‌ల్పంతో ఈ ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తోంద‌న్నారు. అహింసామార్గంలో తెలం గాణా సాధించుకున్నామ‌ని, దేశానికి తెలంగాణా దిక్సూచిగా మారింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.  తెలంగాణా ఆర్ధిక‌రంగ‌రంలో వేగంగా దూసుకుపోవ‌డంతోపాటు అన్న‌పూర్ణ‌గా మారింద‌న్నారు. రాష్ట్రం అపురూప విజ‌యాల‌ను సాధిస్తోంద‌ని, హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంతో ఆకుప‌చ్చ‌గా మారింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెలంగాణా త‌ల‌స‌రి ఆదాయంలో ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌న్నారు. ప్ర‌జాసంక్షేమం ప్ర‌భుత్వాల బాధ్య‌త‌న్నారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు ఉచితాలు అనే ప‌దాన్ని త‌గిలిం చ‌డం దారుణ‌మ‌ని, గ‌త ఏడేళ్ల‌లో సొంత ప‌న్నుల ఆదాయంలో తెలంగాణా మొద‌టిస్థానంలో ఉంద‌ని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిం చారు. 

వికేంద్రీపాల‌న‌లో మ‌రో అధ్యాయం జిల్లాల పెంపు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌

మన స్వాతంత్ర్య పోరాటం మహోన్నతం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం  సందర్భంగా విజయ వాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జాతీయ పతాకా న్నిఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, నిబ ద్ధతకు మన జెండా ప్రతీకని తెలిపారు. మనవతా విలువకు ఉదా హరణ మన స్వాతంత్ర్య పోరాటమని ఆయన చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని తెలిపారు. స్వాతంత్ర్యంనాటికి 18 శాతం సాగు భూమికి నీరందిం చారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయం ఉందని అన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. దేశం దిగుమ తుల నుంచి ఎగు మతుల స్థాయికి వేగంగా అడుగులు వేసిందన్నారు. అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఆర్బీకేలు తీసుకొచ్చా మన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా చేసినట్లు చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లా ల పెంపు అని తెలి పారు. రైతులకు అండగా వైఎస్సార్‌ రైతు భరోసా తీసుకొచ్చామన్నారు. 52 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని జగన్‌ వెల్లడించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని తెలిపారు. స్వాతంత్ర్యం నాటికి 18 శాతం సాగు భూమికి నీరందించారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదు పాయం ఉందని అన్నారు. ప్రపంచ ఫార్మా రం గంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి వేగంగా అడుగులు వేసిందన్నారు. మూడేళ్ల పాల‌న‌లో అనేక పాల‌నాసంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేశామ‌న్నారు. అనేక‌వ‌ర్గాల‌ను దోపిడీ నుంచి కాపాడామ‌న్నారు.  ఆహార ధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశామని చెప్పారు. అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నా మని అన్నారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఆర్బీకేలు తీసుకొచ్చామన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా చేసి నట్లు చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లాల పెంపు అని తెలిపారు. రైతులకు అండగా వైఎస్సార్‌ రైతు భరోసా తీసుకొచ్చామన్నారు. 52 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని జగన్‌ వెల్లడించారు.   ఏళ్ల‌లో దేశం తిరుగులేని విజ‌యాలు సాధించింద‌ని, ప్ర‌పంచంతో పోటీప‌డి మ‌రీ ప్ర‌గ‌తి సాధిస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ కొనియాడారు. ఆహారం, ఔష‌ధాలు, ఆఖ‌రికి స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ దేశం ఉన్న‌త‌స్థాయిలో కొన‌సాగుతోంద‌న్నారు. ఆహార ధాన్య‌ల లోటును దేశం అధిగ‌మించింద‌న్నారు. ప్ర‌పంచ‌ఫార్మారంగంలో భార‌త్ ప్ర‌ధ‌మ స్థానంలో ఉంద‌న్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని అన్నారు. ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు.  దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని తెలిపారు. స్వాతంత్ర్యం నాటికి 18 శాతం సాగు భూమికి నీరందించారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదు పాయం ఉందని అన్నారు. ప్రపంచ ఫార్మారంగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి వేగంగా అడుగులు వేసిం దన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని అన్నారు. ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు. ఆహారధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశామని చెప్పారు.

ప్ర‌జాస్వామ్యానికి త‌ల‌మానికం భార‌త్.. ప్ర‌ధాని మోది

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేటి ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగరేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశ ప్రజలకు స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభా కాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, అమృత్ మహోత్సవాల సందర్భంగా కొత్త దశ, దిశను ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన ముందున్న మార్గం కఠినమై న‌ద‌ని, ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్ స్వతం త్రంగా మనుగడ సాగించలేదని, ముక్కలు చెక్కలు అవుతుందన్న‌ వారి అభిప్రాయం తప్పని నిరూపించామన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి దన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలమని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని, అమృ త మహోత్సవ వేళ భారతీయులందరికీ  స్వాతంత్ర్య దినో త్సవ శుభాకాంక్షలు చెప్పారు.  ఈ సందర్భంగా దేశ స్వాతం త్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవస రం ఉందన్నారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్‌లకు మనం రుణపడి ఉండాలన్నారు.  దేశంలోని ప్రతి ఒక్క పేద వారికీ సాయం అందేలా చూడటమే తన జీవిత లక్ష్యమన్నారు. 130 కోట్ల మంది ప్రజలు రాజకీయ సుస్థిరత ఫలాలను చూస్తు న్నా రన్న ప్రధాని.. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో ప్రైవేటు రంగానిది కూడా కీలక పాత్రని, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ దశాబ్దం ఖచ్చితంగా టెక్నాలజీదేనని, దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. జైజవాన్‌, జైకిసాన్‌, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్‌ అన్నారు. రసాయన ఎరువులపై ఆధారపడడం తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు. వికసిత భారతం, బానిసత్వ నిర్మూలన, వారసత్వం, ఏకత్వం, పౌర బాధ్యత ఇవే మన పంచప్రాణాలని ప్రధాని మోదీ వ్యాఖ్యా నించారు. వచ్చే 25 ఏళ్లు  పంచప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపిచ్చారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్‌లు మన ప్రతిభకు నిదర్శనమన్న ప్రధాని మోదీ..రెండు, మూడు స్థాయిల్లోని నగరాల నుంచి కూడా  ప్రతిభ వెలుగులోకి వస్తోంద న్నారు. మన సామర్థ్యాలపై మనం విశ్వాసం ఉంచాలన్నారు. మన దేశం ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించింద న్నారు. ప్రపంచ అవ సరాలను తీర్చే సత్తా భారత్‌కు ఉందన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌మ ప్ర‌సంగానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనం తరం ఎర్ర కోటకు చేరుకున్న ప్రధాని మోదీకి.. త్రివర్ణ దళాల చీఫ్‌ల సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. గన్ సెల్యూట్ కోసం తొలిసారిగా దేశీయంగా రూపొందించిన హౌవిట్జర్ తుపాకులను ఉపయో గిస్తున్నారు. స్పెషల్ యూత్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌లో భాగంగా.. 14 దేశాలకు చెందిన 26 మంది ఆఫీసర్లు, 127 మంది క్యాడెట్లు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా దేశ రాజ ధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పది వేల మందికిపైగా భద్రతా సిబ్బందితో ఎర్రకోట వద్ద బహుళ అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.

తిరుమల కొండపై భక్తుల అవస్థలు... శ్రీవారి దర్శనానికి 48 గంటలు

తిరుమలకు భక్తులు పోటెత్తారు. టీటీడీ భక్తుల రద్దీని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో తిరుమల కొండపై భక్తులు నానా ఇక్కట్లూ పడుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని టీటీడీ చెబుతున్నప్పటికీ భక్తులు మాత్రం ఇంకా ఎక్కువ సమయమే పడుతోందని చెబుతున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా ఆరు ఏడు గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలోని భక్తులకు టీటీడీ ఎటువంటి సౌకర్యాలూ కల్పించలేదు. అన్నేసి గంటలు తీగడానికి మంచినీరు, తినడానికి అల్పాహారం సరఫరా చేయడంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేతులెత్తేసింది. క్యూ లైన్ల పరిస్థితి చూస్తే ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లన్నీ కూడా నిండిపోయి లేపాక్షి సర్కిల్, షాపింగ్ కాంప్లెక్స్, పాత అన్నదానం మీదుగా శ్రీవారివ సేవాసదన్ వరకూ కూడా భక్తుల క్యూలైన్ పెరిగిపోయింది. దాదాపుగా రెండు కిలోమీటర్లకు మించి భక్తులు క్యూలైన న్ లో వేచి ఉన్నారు. ఇక కాలి నడక భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లూ లేవు. వరుస సెలవులు కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా ఉందని టీటీడీ చెబుతోంది. రూంలు దొరకక భక్తులు నానా అవస్థలూ పడుతున్నారు. భోజన సదుపాయాలు సైతం సరిగా కల్పించలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. వరుస సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని తెలిసినా అందుకు అనుగుణంగా ఏర్పాట్ల విషయంలో టీటీడీ చేతులు ఎత్తేసింది.  

చర్చిలో భారీ అగ్నిప్రమాదం.. ఈజిప్టులో 41 మంది మృతి

ఈజిప్టులోని ఓ చర్చిలో ఆదివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. చర్చిలో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ కనీసం ఐదు వేల మంది ఉన్నారని చెబుతున్నారు. కాప్టిక్ అబు సిఫిన్ చర్చలో ఆదివారం ప్రార్థనలకు భారీ సంఖ్లో వచ్చారు. కాగా ఆ సమయంలో కరెంట్ పోవడంతో జనరేటర్ వేశారు. ఓవర్ లోడ్ అవ్వడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన సమయంలో చర్చిలో పెద్ద సంఖ్యలో జనం ఉండటంతో తొక్కిసలాట జరిగింది. మంటలను అదుపు చేశారు. తొక్కిసలాట కారణంగానే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

భారత్ విదేశాంగ విధానం బ్రహ్మాండం.. పాక్ మాజీ ప్రధాని ప్రశంసల వర్షం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై మళ్లీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ విదేశాంగ విధానం బ్రహ్మాండమంటూ కితాబిచ్చారు. లాహో్ లో ఆదివారం (ఆగస్టు 14)లాహోర్‌లో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన సభలో ఇమ్రాన్‌ఖాన్‌  అమెరికా ఒత్తిళ్లను లెక్క చేయకుండా, భారత్‌ తక్కువ ధరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ సమర్థించారు. ఇండియా, పాకిస్థాన్‌లకు ఒకే రోజు స్వాతంత్య్రం లభించినా, న్యూఢిల్లి మాత్రం దేశ ప్రజల అవసరాలకు తగినట్లు విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని, కానీ, పాకిస్థాన్‌లోని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఇమ్రాన్‌ఖాన్‌ విమర్శలు గుప్పించారు. అమెరికాకు ఇండియా వ్యూహాత్మక భాగస్వామి. కానీ, పాకిస్థాన్‌ కాదు. కానీ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దన్న అమెరికా ఆంక్షలను భారత్‌ ఇసుమంతైనా  లక్ష్య పెట్టకుండా దేశానికి ఎది ప్యయోజనమో అదే చేసిందని ఇమ్రాన్ పేర్కొన్నారు.    చమురు కొనవద్దనేందుకు మీరెవరని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికాను సూటిగా ప్రశ్నించారని పొగిడారు. రష్యా నుంచి యూరప్‌ గ్యాస్‌ కొనుగోలు చేస్తోంది. మా దేశ అవసరాలకు అవసరమైన చమురు మేం కొంటున్నామని అంతర్జాతీయ వేదికపై అగ్రరాజ్యం అమెరికాకు స్పష్టం చేయడం ద్వారా భారత్ తన సార్వభౌమాధికారంపై మరొకరి పెత్తనం, ఆజమాయిషీని సహించబోదని విస్పష్టంగా తేల్చేసిందని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఒక స్వతంత్య్ర దేశ విదేశాంగ విధానం ఎలా ఉండాలో భారత్ ను చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలని అన్నారు. అమెరికా ఆగ్రహానికి భయపడి రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించిన పాక్‌ ప్రధానిపై ఇమ్రాన్‌ ఈ సందర్బంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ జోరు తగ్గిందా?.. రేవంత్ దూకుడు ఆగిందా?.. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?

ఉన్న అవకాశాలను కూడా చేజార్చుకోవడం కాంగ్రెస్ కు అలవాటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ కు నిజంగా మునుగోడు ఉన ఎన్నిక కలిసి వచ్చిన అవకాశమనే చెప్పాలి. అయితే అంతర్గత విభేదాలతో ఆ అవకాశాన్ని చేజార్చుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందా అంటే ఔననే చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నిక వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ కే కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. పార్టీలో అంతర్గత విభేదాలకూ చెక్ పడుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతమైందన్న వాదనకూ బలం చేకూరుతుంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన నాటి నుంచీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యవహారాలతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారన్న సంకేతాలూ ఉన్నాయి. అయినా కూడా కాంగ్రెస్ ఆయనపై చర్య తీసుకునే సాహసం చేయలేదు. పైపెచ్చు చివరి నిముషం వరకూ బుజ్జగింపుల పర్వం కొనసాగించి.. అనవసరమైన ప్రాధాన్యత పెంచింది. దానిని అలుసుగా తీసుకునే ఆయన, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ పై విమర్శలతో చెలరేగిపోయారు. రాజగోపాలరెడ్డి, వెంకటరెడ్డి ద్వయం విమర్శలను దీటుగా ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ సీనియర్లు ఏ మాత్రం చొరవ తీసుకోలేదు. అదేదో పార్టీకి సంబంధించి విషయం కాదన్నట్లుగా, రేవంత్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారమన్నట్లుగా మౌనం వహించారు.  పైపెచ్చు రేవంత్ దూకుడు వల్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి దూరమయ్యారంటూ   నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు హై కమాండ్ కు ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఆ ఫిర్యాదు మేరకే హై కమాండ్ రేవంత్ దూకుడుకు కళ్లెం వేసే చర్యలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బేషరతు క్షమాపణ చెప్పారని అంటున్నారు. అంతే కాకుండా కరోనా అంటూ మునుగోడులో కీలక సమయంలో ప్రచారానికీ దూరం అయ్యారని అంటున్నారు. పాదయాత్రలో పాల్గొనకపోవడం, తన సహజశైలిలో బీజేపీ, తెరాసలపై విమర్శల దాడి చేయడంలోనూ కూడా వాడి తగ్గించారని పరిశీలకులు   విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా మునుగోడు ప్రచారం విషయంలో వెనక్కు తగ్గమని హైకమాండ్ నుంచి రేవంత్ కు  ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.  ఇందుకు ఉదాహరణగా రాజగోపాల్ రెడ్డి ని  బుజ్జగించే బాధ్యతను .. అదే జిల్లాకు చెందిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడాన్నిప్రస్తావిస్తున్నారు. అలాగే ఉపఎన్నిక బాధ్యతలను నల్గొండ జిల్లా కు చెందిన సీనియర్లకే అప్పగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. జల్లా కాంగ్రెస్ నుంచి మరిన్ని వలసలు ఉంటాయన్న బూచిన చూపి మునుగోడు విషయంలో రేవంత్ ను దూరం పెట్టే వ్యూహానికి కాంగ్రెస్ సీనియర్లు తెరలేపినట్లు చెబుతున్నారు.  మునుగోడు ఉపఎన్నికకోసం   మధుయాష్కీ నేతృత్వంలో కమిటీ వేయడం వెనుక కారణం ఇదేనని చెబుతున్నారు.  

భద్రాచలం వద్ద మళ్లీ వరద ఉధృతి.. సాగర్ కూ వరద పోటు

తెలుగు రాష్ట్రాలలో వరద ముప్పు తొలగడం లేదు. గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో సర్వం కోల్పోయిన బాధితులు మరోసారి గోదావరి వరద ముంచుకు వస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. కేవలం 20 రోజుల కిందట వరద ఉధృతికి కకావికలమైన పోవవరం ముంపు గ్రామాల ప్రజలు మరోసారి భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.8 అడుగులకు చేరింది. గత నాలుగు రోజులుగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 50.4 అడుగులకు పెరిగిన గోదావరి నీటి మట్టం రాత్రి అయ్యే సరికి 50.8 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో వైపు నాగార్జున సాగర్ వద్ద కృష్ణ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి భారీ ఎత్తున నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే సాగర్ నుంచి దిగువకు భారీ ఎత్తున నీటిని వివడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 584 అడుగులకు చేరింది. 

హలో అనొద్దు.. వందే మాతరం అనాలి.. ప్రభుత్వాధికారులకు మహా సర్కార్ ఆదేశం!

మహా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఫోన్ లో హలో అని కాదు.. వందే మాతరం అనాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వాధికారులందరూ సోమవారం (ఆగస్టు 15) నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకూ తమకు ఫోన్ వస్తే హలో అంటూ ఆన్సర్ చేయకూడదనీ, వందే మాతరం అంటూ ఆన్సర్ చేయాలని మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆ దేశాలను ఆయన మౌఖికంగానే ఇచ్చారు. కానీ అధికారిక ఉత్తర్వులు ఈ నెల 18లోగా జారీ చేస్తామని ప్రకటించారు. అధికారులందరూ ఈ ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మోడీ ఘర్ ఘర్ తిరంగా పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.  

కాటేసిన పామును కసిదీరా కొరికి చంపేసింది!

మనం చిన్పప్పుడు పాము నుంచి చిన్నారిని కాపాడిన ముంగీస కథ విన్నాం. అలాగే పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. అలాగే ఆడుకుంటున్న నన్ను డిస్ట్రబ్ చేస్తే ఊరుకుంటానా అంది టర్కీలోని చిన్నారి. హాయిగా ఆడుకుంటున్న తనను కాటేసిన పామును కసిదీరా కొరికి చంపేసిందా చిన్నారి.   ఎవరి సాయం అక్కర్లేకుండానే ఓ రెండేళ్ల చిన్నారి పాముని కొరికి చంపేసింది. ఔను నిజం. ఈ సంఘటన టర్కీలో జరిగింది. టర్కీలోని బింగోర్ నగరంలో తన ఇంటి ముందు హాయిగా ఆడుకుంటున్న ఓ చిన్నారిని పాము కాటేసింది. అదీ ఆ బాలిక కింది పెదవిపై. పాపం చురుక్కుమందేమో ఆ పాపకు పట్టలేనంత కోపం వచ్చేసింది. వెంటనే ఆ పామును ఒడిసి పట్టుకుని కసి దీరా కరిచి చంపేసింది. ఆ తరువాత పెదవి మంట తట్టకుకోలేక ఏడవడం మొదలెట్టింది. ఇంట్లోనించి వచ్చి చూసిన పాప తల్లిదండ్రులకు విషయం అర్ధమైంది. వెంటనే తమ చిన్నారిని ఆసుపత్రికి  తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారి పెదవిపై పాము కాటేసిందని నిర్ధారించారు. సకాలంలో తీసుకురావడంతో గండం తప్పిందని చెప్పారు. ఇప్పుడా చిన్నారి కోలుకుంది.