English | Telugu

భారతీయ చిత్ర పరిశ్రమకి ఎవరెస్ట్ శిఖరం అమితాబ్ బచ్చన్ 

ఎవరెస్ట్ శిఖరం భారతదేశానికి ఎంత గర్వ కారణమో..భారతీయ చిత్ర పరిశ్రమకి ఆయన నటన అంతే గర్వకారణం. భారతీయ చిత్ర పరిశ్రమకి సంబంధించిన అన్ని భాషలకి చెందిన నటులు వాళ్ళ చిత్రం యొక్క తాలూకు షూటింగ్ లో పాల్గొంటున్న ప్రతి సారి ఆయన నటించిన ఏదో ఒక సినిమాని చూస్తూనే ఉంటారు. ఆయన వయసు ప్రస్తుతం 81 సంవత్సరాలు. అంత వయసులో కూడా ఇంకా నటిస్తూ భారత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సైతం ఉన్న తన అభిమానులని తన నటన తో అలరిస్తూనే ఉన్నారు. ఆయనే ది గ్రేట్ ఇండియన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్. ఈ రోజు ఆ నట శిఖరం పుట్టిన రోజు.

మన భారత దేశానికీ స్వాతంత్రం ఇంకో 5 సంవత్సరాల్లో రాబోతుంది అనగా అమితాబ్ 1942 వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ని అలహాబాద్ లో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు హరి వంశ రాయ్ బచ్చన్. బచ్చన్ అనేది హరి వంశరాయ్ యొక్క కలం పేరు. హరివంశ రాయ్ బచ్చన్ అనే పేరు తో కవితలు రాస్తుండే వాళ్ళు దాంతో అమితాబ్ పేరు చివర కూడా బచ్చన్ చేరింది. ఉన్నత విద్యని అభ్యసించిన అమితాబ్ ఆ తర్వాత సినిమా మీద ఇష్టంతో ప్రఖ్యాత సినీ దర్శకులు రూపొందించిన భువన్ అనే సినిమా కి వాయిస్ నేరేటర్ గా వర్క్ చేసాడు. ఆ తర్వాత ఎలాగైనా సినీ కళామతల్లి ఒడిలోనే తన జీవితం తనువు చాలించాలి సినిమానే నా జీవితం అని డిసైడ్ అయిన అమితాబ్ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం అప్పటికే టాప్ హీరోగా ఉన్న రాజేష్ ఖన్నా దగ్గర లెటర్స్ రాసే ఉద్యోగం లో చేరారు. రాజేష్ ఖన్నా దగ్గర అమితాబ్ చెయ్యాలసిన పని ఏంటంటే ఆ రోజుల్లో రాజేష్ ఖన్నా అంటే పిచ్చి అభిమానం తో ఎంతోమంది అమ్మయిలు రాజేష్ ఖన్నా కి లెటర్స్ రాసేవాళ్ళు.ఆ లెటర్స్ కి అమితాబ్ రిప్లై ఇచ్చేవాళ్ళు.ఆలా కొన్ని సంవత్సరాలు అమితాబ్ ,రాజేష్ ఖన్నా దగ్గర లెటర్స్ రాసే ఉద్యోగం చేసాడు

అలా సాగుతున్న ఆయన ప్రయాణంలో ఆ తర్వాత కళ తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే నటుడ్ని తానే సృష్టించుకుంటుంది అనేలా అమితాబ్ యొక్క నట విన్యాసం ప్రారంభం అయ్యింది. 1970 వ సంవత్సరం.సినిమా ప్రరిశ్రమ ఎప్పటి లాగానే తన పని తాను చేసుకుంటూనే పోతుంది. కానీ పరిశ్రమకి తెలియదు ఈ సంవత్సరం నుంచి భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ సినీ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేతని సంతరించుకోబోతుందని . అమితాబ్ నటించిన ఆనంద్ ,జంజీర్,రోటి కపడ, దీవార్ అండ్ షోలే సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ సాధించడమే కాకుండా యావత్తు భరతదేశం మొత్తం ఒక్కసారిగా అమితాబ్ వైపు చూసేలా చేసాయి. వాటిల్లో వచ్చిన జంజీర్,షోలే సినిమాలు అయితే అప్పటివరకు ఉన్న హిందీ చిత్ర సీమ రికార్డులన్నిటిని తుడిచేసి ఎక్కడ పడ్డ సంవత్సరాలు సంవత్సరాలు ఆడాయి. అలాగే షోలే సినిమాలో అమితాబ్ చెప్పిన ఒక డైలాగ్ అయితే మానవ సంబంధాల మీద ఎంతో ప్రభావితం చూపించింది. ఆ సినిమాలో అమితాబ్ తన తోటి నటుడు తో నీ దగ్గర ఆస్థి ఉంటే నా దగ్గర అంత కంటే విలువైన నా తల్లి ఉంది అని అమితాబ్ చెప్పిన మాటకి ఎంతోమంది కొడుకులు, కూతుళ్లు ముసలోల్లుఅయ్యాక వదిలేసిన తమ తల్లి తండ్రుల్ని తీసుకొచ్చుకున్నారంటే అమితాబ్ నటన రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.

అలాగే ఆ సినిమా తో మొట్టమొదటి సారిగా యాంగ్రీ యంగ్ మాన్ అనే బిరుదుని కూడా అమితాబ్ పొందారు.ఆ తర్వాత 1978 వ సంవత్సరం లో రిలీజ్ అయిన డాన్ మూవీ వైభోగం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తనకి మాత్రమే సాధ్యమైన నటనతో థియేటర్స్ కి జనాలని రప్పించే అమితాబ్ ఆ సినిమాలోని ఓ కైకో పాన్ బనారస్ వాలా అనే పాట లో ఆయన పాన్ నములుతూ పాడుతుంటే ఆడియన్స్ కూడా పాన్ వేసుకొని మరి థియేటర్స్ లో పూనకం వచ్చిన వాళ్ళల్లా ఊగిపోయారు. ఆ సినిమా తర్వాతే ఇండియాలో పాన్ షాప్ లు పెరిగాయనే టాక్ కూడా ఉంది. అమితాబ్ అభిమానులే కాకుండా కొన్ని కోట్ల మంది ప్రజలు అమితాబ్ హెయిర్ స్టైల్ ని డ్రెస్ స్టైల్ ని మాట్లాడే విధానాన్ని ఫాలో అయ్యే వాళ్ళు. అలాగే ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగు లో రీమేక్ అయ్యి ఆయా హీరో లు అగ్రహీరో లు అవ్వడానికి కారణం అయ్యాయి

నటనకి సంబంధించి ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయి నటించడం అమితాబ్ స్పెషాలిటీ .అందుకే ఆయన మొట్టమొదటి ఇండియన్ సూపర్ స్టార్ అయ్యారు. అమర్ అక్బర్ ఆంటోనీ ,త్రిశూల్,సుహాగ్ ,దోస్తానా ,లావారీస్ ,నసీబ్,నమక్ హలాల్ ,కూలీ .ఇక్కడ కూలి సినిమా గురించి చెప్పుకోవాలంటే అప్పటివరకు రైల్వే స్టేషన్స్ ల తో పాటు రకరకాల ప్రదేశాల్లో కూలీలుగా పని చేసే వాళ్ళని జనం కొంత తక్కువ భావంతో చూసే వాళ్ళు అలాంటిది ఎప్పుడైతే అమితాబ్ కూలి సినిమా విడుదలయ్యిందో అప్పటినుంచి జనం కూలి లని గౌరవభావం తో చూసేవాళ్ళంటే అమితాబ్ నటనకి ఉన్న ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు .

అభిమానే ,చుప్ కె చుప్ కె ,కాల పత్తర్ ,షాన్ ,శక్తీ ,అగ్నిపధ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల సినిమా ల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ సినిమా కి కింగ్ గా అవతరించాడు.ఆయన క్రేజ్ ని చూసి ఓర్వలేని కొంత మంది ఆయన్నిచంపడానికి ఎన్నో సార్లు ప్రయత్నించినా వాటిన్నంటిని తట్టుకొని మేరు పర్వతంల నిలబడిన మేరునగధీరుడు అమితాబ్ ఎంతటి నటుడుకైనా గడ్డు కాలం సహజం .కెరీర్ అయిపోయిందని అనుకున్న తరుణంలో కుడా ఖుదాగవ సినిమా తో ఇండియన్ సినీ పరిశ్రమకి తన పవర్ ని చూపించాడు. అలాగే థర్డ్ ఇన్నింగ్స్ లో కూడా లాలాబాద్షా ,సూర్యవంశం,హమ్ కౌన్ ,దిల్ జో భాయ్ ఖహే,సర్కార్ లాంటి మూవీలు చేసారు. సర్కార్ మూవీ లో అమితాబ్ నటన చూడటానికి రెండు కళ్ళు చాలవు.

అలాగే లేటు వయసులో కూడా ప్రస్తుతం ఉన్న హీరోల సినిమా లో కూడా ముఖ్య పాత్రలు పోషించి ఆ సినిమాల ఘన విజయం లో తన వంతు పాత్ర పోషించారు.కభీ ఖుషి కబీ గమ్,వీర్ జార,మోహబాత్ ,పహేలీ ,భూతనాధ్ తదితర సినిమాల తో పాటు లేటెస్టుగా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా ల్లో నటించారు. తెలుగులో కూడా చిరంజీవి హీరో గా వచ్చిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా లో కూడా నటించిన ఆయన ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో నటిస్తూ తన నటనలో పదును తగ్గలేదని నిరూపిస్తున్నారు.అలాగే బహుశా ప్రపంచ సినీ పరిశ్రమలో ఏ ఇతర హీరో కి సాధ్యం కానీ విధంగా ఎక్కువ యాడ్స్ లో నటించింది నటిస్తుంది కూడా అమితాబే గారే కావచ్చు. తన సినీ జీవితం లో ఎన్నో అత్యున్నత పురస్కారాలని అందుకున్న అమితాబ్ నటవారసులుగా అభిషేక్ బచ్చన్,ఐశ్వర్యారాయ్ బచ్చన్ లు భారతీయ చిత్ర పరిశ్రమలో తమ సత్తా చాటుతున్నారు.అలాగే ఆయన ప్రముఖ పార్టీ తరుపున ఎం.పి గా కూడా పని చేసారు.

నేటితో 81 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అమితాబ్ బచ్చన్ గారు నిండు నూరేళ్లు పుట్టిన రోజులు జరుపుకొని తమ నటన తో భారతీయ సినీ ప్రేక్షకులని అలరించాలని మా తెలుగు వన్ తరుపున కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే అమితాబ్ సర్..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.