English | Telugu
'భగవంత్ కేసరి'లో బాలయ్య రెండో గెటప్.. థియేటర్లు తగలబడిపోతాయి!
Updated : Oct 11, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా, తండ్రీకూతుళ్ల తరహా బాండింగ్ తో రూపొందిన సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ట్రైలర్ లో బాలయ్య లుక్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ వావ్ అనిపించాయి. అయితే ట్రైలర్ లో చూపించింది కొంతే అని, సినిమాలో ఎంతో కంటెంట్ ఉందని అంటున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఈ సినిమా చాలా కొత్తగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా బాలయ్య రెండో గెటప్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని సమాచారం. రెండో గెటప్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ఆ గెటప్ తో వచ్చే సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఈ దసరాకు బాలయ్య థియేటర్ల దగ్గర మోత మోగించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.