English | Telugu
బర్త్ డే స్పెషల్: ప్రభాస్ కల్కి నుంచి అమితాబ్ లుక్
Updated : Oct 11, 2023
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వైజయంతి మూవీస్ బ్యానర్ కి ఎంతటి పేరు ఉందో అందరికి తెలుసు. తెలుగు చిత్ర సీమలో భారీ సినిమాలకి వైజయంతి వారు కేర్ ఆఫ్ అడ్రస్. హీరోలకి అభిమానులు ఎలా ఉంటారో వైజయంతి బ్యానర్ కి కూడా అలాగే అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరో వైజయంతి మూవీస్ లో నటించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అంతటి పేరు ని సంపాదించుకున్న వైజయంతి సంస్థ తాజాగా నిర్మిస్తున్న తమ కొత్త చిత్రం నుంచి బిగ్ బి అబితాబ్ బచ్చన్ కి సంబంధించిన పిక్ ఒకటి విడుదల చేసింది.
వైజయంతి మూవీస్ తాజాగా ప్రభాస్ హీరో గా కల్కి-2898 అనే సినిమాని నిర్మిస్తుంది.సుమారు 600 కోట్ల రూపాయిల వ్యయం తో నిర్మాణం అవుతున్న ఈ సినిమా ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే ఈ సినిమాలో భారతదేశం గర్వించదగ్గే మహా నటుడు అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ బిగ్ బి హ్యాపీ బర్త్ డే అంటూ సినిమాలో ఆయన క్యారక్టర్ కి సంబంధించిన పోస్టర్ ఒక దాన్ని రిలీజ్ చేసింది.
ఒళ్ళు మొత్తం శాలువా లాంటిది కప్పుకొని కొండల మధ్య ఉన్న ఒక ఖాళి గుహ లాంటి ప్లేస్ లో అమితాబ్ నుంచొని ఉన్నాడు.కేవలం అమితాబ్ కళ్ళు మాత్రమే కనపడుతున్న ఆ పిక్ లో నుదిటిన పసుపుతో అడ్డ బొట్టు పెట్టుకొని అమితాబ్ ఉన్నాడు. అమితాబ్ హైట్ కి ,శరీరతత్వానికి కొండలు కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ పిక్ విపరీతమైన ట్రెండింగ్ లో ఉంది. అలాగే సినిమా మీద అంచనాలని కూడా అమితాబ్ పిక్ రెట్టింపు చేసింది